Sri Vamana Mahapuranam    Chapters   

ఏడవ అధ్యాయము

లోమహర్షణ ఉవాచ :

ఏవం స్తుతోథ భగవాన్‌ వాసుదేవ ఉవాచతామ్‌ | అదృశ్యః సర్వభూతానాం తస్యాఃసదర్శనేస్థితః. 1

శ్రీభగవానువాచ :

మనోరథాం స్త్వమదితే యానిచ్చస్యభివాంఛితాన్‌ | తాంస్త్వం ప్రాస్స్యసిధర్మజ్ఞే మత్ర్పసాదాన్నసంశయః. 2

శృణుత్వంచ మహాభాగే వరోయస్తేహృదిస్థితః | మద్దర్శనంహివిఫలం నకదాచి ద్భవిష్యతి. 3

యశ్చేహత్వద్వనేస్థిత్వా త్రిరాత్రం వై కరిష్యతి | సర్వేకామాః సమృధ్యం తే మనసాయాని హేచ్ఛతి. 4

దూరస్థో7పివనంయస్తు అదిత్యాః స్మరతేనరః | సోపియాతిపరం స్థానం కింపునర్నివసన్‌ నరః. 5

యశ్చేహబ్రాహ్మణాన్‌ పంచత్రీన్‌ వా ద్వావేకమేవవా |

భోజయేచ్చ్రద్దయా యుక్తః సయాతి పరమాంగతిమ్‌. 6

అదితిరువాచ :

యదిదేవప్రసన్నస్త్వం భక్త్యామే భక్తవత్సల | త్త్రెలోక్యాధిపతిః పుత్ర స్తదస్తు మమవాసవః. 7

హృతంరాజ్యం హృతశ్చాస్య యజ్ఞభాగ ఇహాసురైః | త్వయిప్రసన్నే వరద తత్ర్పాప్నోతి సుతోమమ. 8

హృతంరాజ్యం నదుఃఖాయ మమపుత్రస్య కేశవ | ప్రపన్నదాయ విభ్రంశో బాధాంమే కురుతేహృది. 9

రోమహర్షణుడు యిలా అన్నాడు ! అదితికావించిన స్తోత్రంవిని భగవంతుడగు వాసుదేవుడితరులెవ్వరికి కనబడకుండా ఆమెకు మాత్రమే గోచరించి యిలా అన్నాడు. ఓ ధర్మజ్ఞురాలవగునదితీ ! నా అనుగ్రహంచేత నీ మనోరథాలనన్నీ నెరవేరగలవు. నా దర్శనం విఫలంకాజాలదు. అందువల్ల నీ మనస్సులోని వరం (కోరిక) తప్పక సిద్థిస్తుంది.ఈ ఆదితి వనం (కురుక్షేత్రం) లో మూడునిద్రలుచేసి సాధన చేయునో అతని మనోవాంఛలన్నీ సిద్ధించగలవు. దూరాన్నుంచి ఈ ఆదితివనాన్ని స్మరించినవారలకే పరమపదం ప్రాప్తించగలిగియుండగా, అక్కడ అవాసంచేయువారి విషయం చెప్పవలెనా : ఈ ప్రదేశాన భక్తి శ్రద్ధలతో ఐదుగురో, ముగ్గురకో, ఇద్దరికో లేక ఒకరి కైనాసరే భోజనం పెట్టి తృప్తిపరచువారల కక్షయ లోకప్రాప్తి కలుగును. శ్రీమన్నారాయణుని మాటలువిని ఆదితి ఇట్లనెను. భక్తవత్సలా ! దేవా ! నా భక్తికి సంతసించినచో నాపుత్రుడగు యింద్రుడు త్రిలోకాధిపతి అగుగాక. అతడు కోలుపోలున రాజ్యం యజ్ఞభోగాలు నీ అనుగ్రహంవల్ల మరల నాపుత్రునకు లభించుగాక. రాజ్యం పోయినందుకు నాకుమారునకు చింతలేదు. శరణాగతులకుదాయభాగ విభ్రంశం కలగడమే నన్ను వేధించుచున్నది.

శ్రీ భగవానువాచ :

కృతఃప్రసాదోహి మయా తవదేవి యథేప్సితమ్‌ | స్వాంశేన చైవతేగర్భే సంభవిష్యామి కశ్యపాత్‌. 10

తవగర్భేసముద్భూతః తతస్తే యేత్వరాతయః | తానహంచ హనిష్యామి నివృత్తాభవనందినీ. 11

అదితిరువాచ :

ప్రసీదదేవదేవేశ నమస్తే విశ్వభావన | నాహంత్వాముదరే వోఢు మీశ శక్ష్యామి కేవవ |

యస్మిన్‌ ప్రతిష్ఠితం సర్వం విశ్వయోని స్త్వమీశ్వరః. 12

శ్రీ భగవానువాచ :

అహంత్వాం చ వహిస్యామి ఆత్మానంచైవనందిని | నచపీడాంకరిష్యామి స్వస్తితేస్తు ప్రజామ్యహమ్‌. 13

ఇత్యుక్త్వాంతర్హితే దేవేదితిర్గర్భం సమాదధే | గర్భస్థితేతతః కృష్ణే చచాల సకలాక్షితిః

చకంపిరేమహా శైలా జగ్ముః క్షోభంమహాబ్ధయః. 14

యతోయతో7దితిర్యాతి దదాతి పరముత్తమమ్‌ | తతస్తతః క్షితిః ఖేదాన్ననామ ద్విజపుంగవాః. 15

దైత్యానామపి సర్వేషాం గర్భస్థే మధుసూదనే | బభూవతేజసోహాని ర్యథోక్తం పరమేష్ఠినా. 16

ఇతి శ్రీవామనమహాపురాణ సరోమాహాత్మ్యే సప్తమోధ్యాయః

భగవానుడిట్లనెను : దేవీ ! నీ మనోభీష్టముననుగ్రహించితిని. ఇంకనా అంశతో కశ్యపునిద్వారా నీ కడుపునపుట్టి శత్రులోకాన్నంటినీ సంహరింతును. నీవు ఆనందంతో తిరిగి వెళ్ళము. అందలకదితి యిలా బదులుచెప్పెను. ఓ దేవదేవ ! విశ్వభావన ! నన్ననుగ్రహించుము. సమస్తలోకాలను బొజ్జలోనుంచుకొన్న సర్వేశ్వరుడగు విశ్వగర్భునిని మోయలేనుతండ్రీ ! అందులకు భగవానుడిలా అన్నాడు. భయపడకుదేవీ! నేను నిన్నూ నన్నూకూడ మోయగలను. నీకెలాటిబాధయు కలుగ నివ్వను. నీకు మేలగుగాక. నేను వెళ్ళివస్తాను. అలా అభయమిచ్చి వాసుదేవుడతర్హితుడు కాగా అదితి గర్భంధరించినది. కృష్ఠుడామె గర్భస్థుడగుటతో భూమిఅంతయు కంపించినది. మహాపర్వతాలు కదలిపోయినవి. మహాసాగరాలు సంక్షుభితాలయినవి. ఓ

బ్రాహ్మణోత్తములారా ! ఆ మహాదేవి ఆదితి అడుగుపెట్టిన ప్రతిచోట భూమి బాధతో క్రుంగిపోయేది. మరొక వైపు, మథుసూదనుడు గర్భస్థుడు కావడంతో, పరమేష్ఠివచనానుసారం దైత్యులు తమతేజస్సు క్రమంగా కోలుపోసాగారు.

ఇది శ్రీ వామన మహా పురాణమందలి సరోమాహాత్మ్యంలోని ఏడవ అధ్యాయం సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters