Sri Vamana Mahapuranam    Chapters   

పదహారవ అధ్యాయము

లోమహర్షణ ఉవాచ:

పవనస్య హ్రదేస్నాత్వా దృష్ట్వాదేవం మహేశ్వరమ్‌ |

విముక్తః కలుషైః సర్వైః శైవం పదమానాప్నుయాత్‌. 1

పుత్రశోకేన పవనో మస్మింల్లీనో బభూవహ | తతః స బ్రహ్మకైర్దేవైః ప్రసాద్య ప్రకటీకృతః. 2

తతోగచ్ఛేత అమృతం స్థానం తచ్ఛూల పాణినః | యత్రదేవై స్సగంధర్వైః హనుమాన్‌ ప్రకటీకృతః. 3

తత్రతీర్థేనరః స్నాత్వా అమృతత్వ మవాప్నుయాత్‌ | కులోత్తారణ మాసాద్య తీర్థసేవీ ద్వజోత్తమః 4

కులానితారయే త్సర్వాన్‌ మాతామహా పితామహాన్‌ | శాలహోత్రస్య రాజర్షే స్తీర్థే త్రైలోక్య విశ్రుతమ్‌. 5

తత్రస్నాత్వా విముక్తస్తు కలుషైర్దేహసంభ వైః | శ్రీకుంజంతు సరస్వత్యా తీర్థం త్రైలోక్య విశ్రుతమ్‌.

తత్రస్నాత్వానరో భక్త్యా అగ్నిష్టోమ ఫలంలభేత్‌ | తతో నైమిషకుంజంతు సమాసాద్య నరః శుచిః. 7

నైమిషస్య చ స్నానేన యత్ఫుణ్యం తత్‌ సమాప్నుయాత్‌ | తత్రతీర్థం మహాఖ్యాతం వేదవత్యా నిషేవితమ్‌.

రావణన గృహీతాయాః కేశేషు ద్విజసత్తమాః | తద్వధాయ చ సాప్రాణాన్‌ ముముచే శోకకర్శితా. 9

తతోజాతాగృహేరాజ్ఞో జనకస్య మహాత్మనః | సీతానామేతి విఖ్యాతా రామపత్నీ పతివ్రతా, 10

సాహృతారావణ నేహ వినాశాయాత్మనః స్వయమ్‌ క్ష రామేణ రావణంహత్వా అభిషిచ్య విభీషణమ్‌. 11

సమానీతా గృహంసీతా కీర్తిరాత్మవతాయథా | తస్యాస్తీర్థేనరః స్నాత్వా కన్యాయజ్ఞఫలంలభేత్‌.

లోమహర్షణుడిట్లనెను : పవనకుండంలో స్నానంచేసి మహేశ్వరదర్శనం చేసుకున్నవాడు సర్వపాపాలు పోగొట్టుకొని శివపదవిని పొందుతాడు. పుత్రశోకంతోవాయువు అందులో లీనుడైపోగా బ్రహ్మాదిదేవతలు ప్రసన్నులై మరలప్రతిష్ఠింపజేశారు. అక్కడనుండి దేవగంధర్వులద్వారా హనుమంతుడెచ్చడ ప్రకటింపబడినాడో, ఆ పవిత్ర శివక్షేత్రం, అమృతక్షేత్రానికి వెళ్ళాలి. అక్కడస్నానంచేసినచో అమృతత్వం లభిస్తుంది. అంతట తైర్థికుడు కలోత్తారణ తీర్థాన్ని సేవించి తన మాతామహ పితామహాదులందరను తరింపచేస్తాడు. రాజర్షిశాలిహోత్రతీర్థం ముల్లోకాల్లో ప్రసిద్ధిచెందింది. అక్కడస్నానంచేసి దేహగతాలైన దోషాలన్నీ పోగొట్టుకోవచ్చు. సరస్వతీతటాన ముల్లోకవిఖ్యాతమైన శ్రీకుంజతీర్థం ఉంది. దానిలోభక్తితో స్నానంచేస్తే అగ్నిష్టోమ ఫలం కలుగుతుంది: అక్కడనుండి నైమిష కుంజాన్ని దర్శిస్తే నైమిషంలో స్నానంచేసిన ఫలకం కలుగుతుంది. అక్కడే మహిమోపేతమైన దేదవతి తీర్థముంది. అక్కడ రావణుడామె కేశాలు పట్టుకోగా శోకంతో ఆమె అతనివధార్థం శరీరత్యాగం చేసింది. సీత అనే పేరులో జనకునకుపుట్టి రామపత్నిగా విఖ్యాతివహించింది. ఆ పతివ్రతను రావణుడు ఆత్మనాశనానికై అపహరించికొనిపోగా రాముడాతనిని వధించి విభీషణుడినిలంకాధిపతిని చేశాడు. ఆ సాధ్విని మరల తనయింటికి గొనిపోయి నాడు. ఆలాంటి పవిత్రవేదవతి తీర్థంలో స్నానంచేస్తే సమస్తపాపాలుపోయి కన్యాయజ్ఞఫలం కలుగుతుంది. పరమపదం లభిస్తుంది.

విముక్తః కలుషైః సర్వైః ప్రాప్నోతి పరమంపదమ్‌ | తతో తచ్ఛేతసుమహద్‌ బ్రహ్మణః స్థానముత్తమమ్‌.

యత్రవర్ణావరః స్నాత్వా బ్రాహ్మణ్యం లభ##తేనరః | బ్రాహ్మణశ్చ విశుద్ధాత్మా పరంపద మవాప్నుతయాత్‌.

తతోగచ్ఛేత సోమస్య తీర్థం త్రైలోక్య దుర్లభమ్‌ | యత్రసోమస్తవస్తప్త్యా ద్విజరాజ్య మవాప్నుయాత్‌. 15

తత్ర స్నాత్వా7ర్చయిత్వా చ స్వపితౄన్‌ దైవతాని చ |

నిర్మలః స్వర్గమాయాతి కార్తిక్యాం చంద్రమాయథా. 16

సప్తసారస్వతం తీర్థం త్రైలోక్య స్యాపిదుర్లభమ్‌ | యత్ర సప్త సరస్వత్య ఏకీభూతావహంతి చ. 17

సుప్రభాకాం చ నాక్షీ చ విశాలామానస ప్రదా | సరస్వత్యోఘనామాచ సువేణుర్విమలోదకా. 18

పితామహస్య యజతః పుష్కరేషు స్థితస్యహా | అబ్రువన్‌ ఋషయస్సర్వే నాయం యజ్ఞో మహాఫలః. 19

నదృశ్యతే నరిచ్ఛ్రేష్ఠా యస్మాదిహసరస్వతీ | తచ్ఛ్రుత్వా భగవాన్‌ ప్రీతః న స్మారాథ సరస్వతీమ్‌. 20

పితామహేనయజతా ఆహుతాపుష్కరేషువై | సుప్రభానామ సా దేవీ యత్రఖ్యాతా సరస్వతీ. 21

తాందృష్ట్వా మునయః ప్రీతా వేగయుక్తాం సరస్వతీమ్‌ | పితామహం మానయంతీం తేతుతాం బహుమేనిరే.

ఏవమేషా సరిచ్ఛ్రేష్ఠా పుష్కరస్థా సరస్వతీ | సమానీతా కురుక్షేత్రే మంకణన మహాత్మనా. 23

అచటనుంచి బ్రహ్మకు ఉత్తమస్థానమైన క్షేత్రానికిపోవాలి. అక్కడస్నానంచేసినచో నిమ్నవర్ణాలవారు కూడ బ్రాహ్మణ్యంపొందుతారు. పరమపదం పొందుతారు. తర్వాత త్రైలోక్య దుర్లభ##మైన సోమతీర్థానికి వెళ్ళాలి. అక్కడ తపస్సు చేసి సోముడు ద్విజరాజ్యాన్ని పొందాడు.అక్కడ స్నానంచేసి దేవపితృ తర్పణములుచేస్తే పాపరహితుడై కార్తికపూర్ణిమా చంద్రుడిలాంటి స్వర్గాన్ని పొందుతాడు. సుప్రభ కాంచనాక్షి విశాల, మానసహ్రదా, సరస్వత్యోఘనామ సువేణా, విమలోదక అనే సప్తసరస్వతులు ఏకమై ప్రవహించే సప్తసారస్వత తీర్థం ముల్లోకాల్లో ఎన్నదగినది. పుష్కర క్షేత్రంలో యజ్ఞంచేస్తున్న బ్రహ్మనుచూచి ఋషులు, నదీ శిరోమణి అయిన సరస్వతిలేనిచోట తలపెట్టిన ఆ యజ్ఞం సత్పలం యివ్వదని వంచింపగా సంప్రీతుడై పితామహుడు సరస్వతిని స్మరించాడు. అలా బ్రహ్మచే పిలువబడి సుప్రభాదేవి సరస్వతిగా పుష్కరక్షేత్రానికి చేరుకుంది. బ్రహ్మమీది గౌరవంతో వడివడిగావచ్చిన. ఆ సరస్వతినిచూచి సంతోషించి ఋషులు గౌరవించారు. పుష్కర క్షేత్రంలో ఉన్న సరస్వతి మహాత్ముడగు మంకణునిద్వారా కురుక్షేత్రానికి కోనిరాబడినది.

నైమిషేమునయః ప్థిత్వా శౌనకాద్యాస్తపోధనాః | తేపృచ్ఛంతి మహాత్మానం పౌరాణంలోమహర్షణమ్‌. 24

కథంయజ్ఞఫలో7స్మాకం వర్తతాంసత్పథేభ##వేత్‌ః | తతో7బ్రవీన్మమహాభాగః ప్రణమ్యశిరసాఋషీన్‌. 25

సరస్వతీ స్థితాయత్ర తత్రయజ్ఞఫలంమహత్‌ | ఏతచ్ఛ్రుత్వాతుమునయో నానాస్వాధ్యాయవేదినః. 26

సమాగమ్యతతస్సర్వే సస్మరుస్తేసరప్వతీమ్‌ | సాతుద్యాతాతతస్తత్ర ఋషిభిఃసత్రయాజిభిః. 27

సమాగతా ప్లావనార్థం యజ్ఞేతేషాంమహాత్మనామ్‌ | నైమిషేకాంచనాక్షీతు స్వృతామంకణకేనసా. 28

సమాగతాకురుక్షేత్రం పుణ్యతోయాసరస్వతీ | గయస్యయజమానస్య

గయేష్వేవమహక్రతుమ్‌. 29

ఆహుతాచసరిచ్ఛ్రేష్ఠా గయయజ్ఞేసరస్వతీ | విశాలాంనామతాంప్రాహుః ఋషయః సంశితవ్రతాః. 30

సరిత్పాహిసమాహూతామంకణనమహాత్మనా | కురుక్షేత్రంసమాయాతా ప్రవిష్ఠాచమహానదీ. 31

శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో పౌరాణికోత్తముడైన లోమహర్షణుని అడిగాడు. ''మేము సన్మార్గాన నడుస్తూ యజ్ఞఫలం పొందేమార్గం తెలుపండి, అంతటనా మహానీయుడా ఋషులకు శిరసాప్రణామంచేసి అన్నాడు. సరస్వతీనది ఉన్న ప్రదేశం గొప్పయజ్ఞ ఫలాన్ని యిస్తుంది. అంతట స్వాధ్యాయపరులయిననా ఋషులు ఒకచోటచేరి సరస్వతిని స్మరించారు. సత్రయాగ నిష్ఠులగువారు ధ్యానించగానే వారల స్నానార్ధం సరస్వతీ వారయజ్ఞ స్థలాన్ని చేరుకుంది. మంకణ మహర్షి ధ్యానించగానే కాంచనాక్షియను సరస్వతి నైమిషంనుండి కురుక్షేత్రానికి వచ్చి చేరింది. గయుడను రాజు గయలో మహాక్రతువు ఆరంభించి అచటకు నదీశిరోమణి సరస్వతిని ఆహ్వానించాడు. అలాగయనుచేరిన సరస్వతిని విశాల అంటారు. ఆ సరస్వతే మంకణుని ప్రార్థన మన్నించి కురుక్షేత్రం చేరింది.

ఉత్తరేకోశలాభాగే పుణ్యదేవర్షసేవితే | ఉద్దాలకేనమునినా తత్రధ్యాతాసరస్వతీ. 32

అజగామనరిచ్ఛ్రేష్ఠాతం దేశంమునికారణాత్‌ | పూజ్యమానామునిగణౖర్వల్కలాజినసంవృతైః. 33

మనోహరేతి విఖ్యాతా సర్వపాపక్షయావహా | ఆహుతాసామంకణన కురుక్షేత్రేమహాత్మనా.

ఋషేఃసమాననార్థాయం ప్రవిష్టాతీర్థముత్తమమ్‌. 34

సువేణురితివిఖ్యాతా కేదారేసాసరస్వతీ సర్వపాపక్షయాజ్ఞేయా ఋషిసిద్దనిషేవితా. 35

సాపితేనేహమునినాఆరాధ్యపరమేశ్వరమ్‌ క్ష ఋషీణాముపకారార్థం కురుక్షేత్రంప్రవేశితా. 36

దక్షేణయజతాసాపి గంగాద్వారేసరస్వతీ | విమలోదాభగవతీ దక్షేణప్రకటీకృతా. 37

సమాహూతాయ¸° తత్ర మంకణనమహాత్మనా | కురుక్షేత్రేతు కురుణాయజితాచ సరస్వతీ. 38

నరోమధ్యేనమానీతా మార్కండేయేన ధీమతా | అభిష్టూయమహాభాగాం పుణ్యతోయాం సరస్వతీమ్‌. 39

యత్రమంకణకఃసిద్దః సప్తసారస్వతేస్థితః | నృత్యమానశ్చదేవేన శంకరేణ నివారితః. 40

ఇతి శ్రీవామనమహాపురాణ సరోమహాత్మ్యే షోడశో7ధ్యాయః.

దేవర్షిసేవితమైన ఉత్తరకోశల పుణ్యభూమికి ఉద్దాలకముని ధ్యానించగా సరస్వతివచ్చి చేరింది. అచటనాశ్రేష్ఠ తరంగిణిని వల్కలాజిన ధారులైన మునిసమూహం పూజించినది. సర్వపాపహారిణి అయిన ఆనది మనోహరగా పిలువబడినది. ఆ నది మంకణుని ప్రార్థన నంగీకరించి ఋషులపట్ల గౌరవంతో కురుక్షేత్రానికి వచ్చింది. కేదార తీర్థంలోఉన్న సరస్వతిని సువేణు అంటారు. ఋషులు సిద్ధులచే సేవించబడిన ఆమె సర్వపాపహారిణి. ఆ మునియే పరమేశ్వరుని ఆరాధించి ఆమెను కూడా ఋషుల ఉపకారార్థం పవిత్రక్షేత్రానికి రావించాడు. ఆ సరస్వతీ పుణ్యనదియే యజ్ఞదీక్షుతుడైన దక్షునిచేత గంగా ద్వారంలో విమలోదకరూపాన వెలువరింపబడింది. మహాత్ముడైన మంకణుని పిలుపునందుకొని ఆమె కూడా కురురాజు యజ్ఞ స్థలమైన కురుక్షేత్రం చేరుకొంది. మహానుభావుడైన మార్కండేయ మునిస్తోత్రానికి సంతోషించి ఆ పుణ్యోదక సరస్వతి సరోవర మధ్యస్థలానికివచ్చి చేరింది. మహాదేవునిచేత నివారింపబడిన సిద్ధుడు మంకణుడా సప్తసారస్వత క్షేత్రంలో ఆనంద నటనం చేస్తూ ఉన్నాడు.

ఇది శ్రీ వామన మహాపురాణంలోని సరోమహాత్మ్యంలో పదునారవ అధ్యయము సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters