Sri Vamana Mahapuranam    Chapters   

నాలుగవ అధ్యాయము

పులస్త్య ఉవాచ :

ఏవం కపాలీ సంజాతో దేవర్షే భగవాన్‌ హరః | అనేన కారణనాసౌ దక్షేణ న నిమంత్రితః. 1

కపాలిజాయేతి సతీ విజ్ఞాయాథ ప్రజాపతిః | యజ్ఞేచార్హాపి దుహితా దక్షేణ న నిమంత్రితా. 2

ఏతస్మిన్నంతరే దేవీం ద్రష్టుం గౌతమనందినీ | జయాజగామ శైలేంద్రం మందరం చారుకందరమ్‌. 3

తామాగతాం సతీ దృష్ట్వా జయా మేకా మువాచహ | కిమర్థం విజయా నాగా జ్జయంతీ చాపరాజితా. 4

సా దేవ్యా వచనం శ్రుత్వా ఉవాచ పరమేశ్వరీమ్‌ | గతానిమంత్రితాః సర్వా మఖే మాతామహస్య తాః. 5

సమం పిత్రా గౌతమేన మాత్రా చైవాప్యహల్యయా |

అహం సమాగతా ద్రష్టుం త్వాం తత్ర గమనోత్సుకా. 6

కింత్వంనవ్రజసే తత్ర తథా దేవో మహేశ్వరః | నామంత్రితాసి తాతేన ఉతాహోస్విద్‌ ప్రజిష్యసి. 7

గతాస్తు ఋషయస్సర్వే ఋషిపత్న్యః సురాస్తథా | మాతృష్వసః శశాంకశ్చ సపత్నీకో గతఃక్రతుమ్‌. 8

చతుర్దశసు లోకేషు జంతవో యే చరాచరాః | నిమంత్రితాః క్రతౌ సర్వే కింనాసి త్వం నిమంత్రితా. 9

పులస్త్య వచనము : దేవర్షీ! ఈ విధంగా భగవంతుడగు హరుడు కపాలియయ్యెను. అది కారణంగా దక్షుడాయనను ఆహ్వానించడాయెను. యజ్ఞంలో పాల్గనుట కర్హురాలై నను కపాలి భార్యయగుటచే తన కుమార్తె సతిని గూడ నాహ్వనించలేదు. ఈ లోపుగా గౌతమ దుహిత జయ అందమైన గుహలతో కూడిన మందర పర్వతమునకు వెళ్ళి సతీదేవిని దర్శించెను. ఒంటరిగా వచ్చిన జయను చూచి దాక్షాయణి, విజయ, జయంతీ, అపరాజితలేరీ ? నీ వొక్కతెవే ఏల వచ్చితివనెను. పరమేశ్వరితో జయ, ''వారందరు మనమాతామహుడొనరించుచున్న యజ్ఞమున కాహ్వానితులై వెళ్ళిరి. నేను నిన్ను చూడవలెనని మా తల్లిదండ్రులు అహల్యా గౌతములతో కలిసి వెళ్ళుచూ దారిలో యిటు వచ్చితిని. మరి నీవు మహేశ్వరునితో కలిసి వచ్చుట లేదా? మీ తండ్రి పిలువనంపలేదా? లేక తరువాత వచ్చెదవా? ఋషులు వారి భార్యలు, దేవతలు, సపత్నీకుడై చంద్రుడు, పదునాలుగు భువనాల్లో గల చరాచర ప్రాణులందరూ ఆహ్వానితులై యజ్ఞానికి వెళ్ళగా నీ వేల బయలుదేరకుంటివి పిన్నీ ? నిన్ను మీ తండ్రి పిలువ లేదా ?'' యనెను.

పులస్త్య ఉవాచ :

జయాయా స్తద్వచః శ్రుత్వా వజ్రపాతసమం సతీ | మన్యునా7భిప్లుతా బ్రహ్మన్‌ పంచత్వ మగమ త్తతః.

జయా మృతాం సతీం దృష్ట్వా క్రోధశోకపరిప్లుతా | ముంచతీ వారి నేత్రాభ్యాం సస్వరం విలలాపహ. 11

ఆక్రందితధ్వనిం శ్రుత్వా శూలపాణి స్త్రిలోచనః | ఆః కిమేతదితీత్యుక్త్వా జయాభ్యాశ ముపాగతః. 12

ఆగతో దదృశే దేవీం లతామివ వనస్పతేః | కృత్తాం పరశునా భూమౌ శ్లథాంగీం పతితాం సతీం. 13

దేవీం నిపతితాం దృష్ట్వా జయాం పప్రచ్ఛ శంకరః | కిమియం పతితా భూమౌ నికృత్తేవ లతా సతీ. 14

సా శంకరవచః శ్రుత్వా జయా వచన మబ్రవీత్‌ | శ్రుత్వా మఖస్థాదక్షస్య భగిన్యః పతిభిః సహ. 15

ఆదిత్యాద్యా స్త్రిలోకేశ సమం శక్రాదిభిః సురైః | మాతృష్వసా విపన్నేయ మంతర్దుఃఖేన దహ్యతీ. 16

పులస్త్యుడనెను : పిడుగుపాటు లాంటి ఆ మాటలు వినిన తోడనే సతీదేవి క్రోధాతిరేకంతో అక్కడకక్కడనే ప్రాణములు వదలెను. చనిపోయిన సతీదేవిని చూచి జయ దఃఖాతిరేకంతో కన్నీరు కార్చుచు విలపింపసాగెను. ఆక్రందన ధ్వని విని పరమేశ్వరుడదరిపడి, ''ఏమి జరిగిన'' దనుచూ జయను సమీపించెను. పరశుఘాతానికి తెగిపడిన తీగవలె నేల కొరగిపడియున్న సతిని జూచి, ''నరుకబడిన తీవ వలె ఈమె యేలపడి యున్న''దని జయనడిగెను. అప్పుడు జయ ప్రభూ ! తన తోబుట్టువు లెల్లరూ భర్తలతోనాహ్వానింపబడి దక్షయజ్ఞమునకు వెళ్ళిన సంగతియూ ఇంద్రాది సకల దేవతలు వెళ్ళిన విషయం విని, ఈ నాపిన తల్లి అంతర్దుఃఖాగ్నిలో మ్రగ్గి ఈ దశకు ప్రాప్తించిన''దనెను.

పులస్త్య ఉవాచ :

ఏవచ్ఛ్రుత్వా వచోరౌద్రం రుద్రః క్రోధాప్లుతో బభౌ | క్రుద్దస్య సర్వగాత్రేభ్యో నిశ్చేరుః సహసార్చిషః. 17

తతః క్రోధాత్‌ త్రినేత్రస్య గాత్రరోమెద్భవా మునే | గణాః సింహముఖా జాతా వీరభద్రపురోగమాః. 18

గణౖః పరివృత స్తస్మా న్మందరా ద్దిమసాహ్వయం |

గతః కనఖలం తస్మా ద్యత్ర దక్షో7యజత్‌ క్రతుమ్‌. 19

తతో గణానామధిపో వీరభద్రో మహాబలః | దిశి ప్రతీచ్యుత్తరాయం తస్థౌశూలధరో మునే. 20

జయా క్రోదాద్గదాం గృహ్య పూర్వదక్షిణతః స్థితా | మధ్యే త్రిశూలధృక్‌ శర్వస్తస్థౌ క్రోదాన్మహామునే. 21

మృగారివరనం దృష్ట్వా దేవాః శక్రపురోగమాః | ఋషయో యక్షగంధర్వాః కిమిదం త్విత్యచింతయన్‌. 22

తతస్తు దనురాదాయ శరాంశ్చా శీవిషోపమాన్‌ | ద్వారపాల స్తదా ధర్మో వీరభద్ర ముపాద్రవత్‌. 23

తమాపతంతం సహసా ధర్మం దృష్ట్వా గణశ్వరః | కరేణౖ కేన జగ్రాహ త్రిశూలం వహ్నిసన్నిభమ్‌. 24

కార్ముకంచ ద్వితీయేన తృతీయేచాథ మార్గణాన్‌ | చతుర్థేన గదాంగృహ్య ధర్మమభ్యద్రవద్‌ గణః. 25

తత శ్చతుర్భుజం దృష్ట్వా ధర్మరాజో గణశ్వరమ్‌ | తస్థౌ నష్టభుజో భూత్వా నానాయుధధరో7వ్యయః. 26

ఖడ్గచర్మగదాప్రాస పరశ్వథ వరాంకుశై | చాపమార్గణభృతస్తౌ హంతుకామో గణశ్వరమ్‌. 27

గణశ్వరో7పి సంక్రుద్దో హంతుం ధర్మం సనాతనమ్‌ | వవర్ష మార్గణాం స్తీక్‌ష్ణాన్‌

యథాప్రావృషి తోయదః.

తావన్యోన్యం మహాత్మానౌ శరచాపధరౌ మునే | రుధిరారుణ సిక్తాంగౌ కింశుకావివ రేజతుః. 29

తతో వరాసై#్త్ర ర్గణనాయ కేన జితఃసధర్మః తరసా ప్రసహ్య |

పరాజ్‌ ముఖో7భూ ద్విమనా మునీంద్ర! సవీరభద్రః ప్రవివేశ యజ్ఞమ్‌. 30

పులస్త్యవచనము : జయ మాటలు విన్నంతనే రుద్రుడు క్రోధతామ్రాక్షుడయ్యెను. ఆయన అంగ ప్రత్యంగముల నుండియు భయంకరమైన విస్పులింగములు బయలు వెడలెను. అట్లు క్రోధోన్మత్తుడైన త్రినేత్రుని రోమకూపాల నుంచి వీర భద్రుని పురస్కరించుకొని సింహముఖులైన రుద్రగణములు వెలువడి దక్షుడు యజ్ఞమొనర్చుచున్న కనఖల ప్రదేశానికి వెళ్ళిరి. గణాధ్యక్షుడైన వీరభద్రుడు భయంకరమైన శూలము ధరించి యజ్ఞశాలకు పశ్చిమ ఉత్మతర దిశల నాక్రమించి నిలచెను. క్రోధావేశంతో కంపించిపోతూ జయ గద చేతబట్టుకొని తూర్పు దక్షిణ దిక్కుల నిలబడినది. ఓ మునీ! మద్య భాగాన త్రిశూలధారియై శర్వుడు భయంకరాకృతితో నిలబడెను. ఇంద్ర పురోగములైన ఋషులు యక్ష గంధర్వులు భయంకరమైన సింహ ముఖము చూచి ఇదేమని చింతాకులితులైరి. అంతట ద్వారరక్షకుడగు ధర్ముడు ఆశీవిషోపమాలైన శరములు పూన్చిన విల్లు గ్రహించి వీరభద్రున కెదురుగా పరుగిడెను. ఆ విధంగా పైకివచ్చు ధర్ముని చూచి గణశ్వరుడు అగ్ని శిఖా సదృశ##మైన త్రిశూలమొక చేతబట్టెను. రెండవ చేత ధనుస్సు మూడు నాలుగు చేతులలో బాణములు గద ధరించి ధర్ముని తరుమజొచ్చెను. నాలుగు భుజములతో తన్నెదిర్చిన గణాధ్యక్షుని చూచి అవ్యయుడైన ధర్ముడు తత్‌ క్షణమే ఎనిమిది భుజములు ధరించి నానాయుధములతో నిలబడెను. ఖడ్గ చర్మ, గద ప్రాస పరశు అంకుశ చాపమారణములతో గణశ్వరుని జంపనుద్యుక్తుడయ్యెను. గణశ్వరుడు కూడ సనాతనుడగు ధర్ముని సంహరించు తలంపుతో, వర్షాకాలపు మేఘము వలె తీవ్రములగు బాణములనతనిపై ప్రయోగించెను. ఓ మునీ! అట్లమ్మహాత్ములగు వీరులిర్వురు శరచాపములతో నొకరి నొకరు ప్రహరించుకొని రక్తసిక్తాంగులై పూచిన మోదుగులవలె ప్రకాశించిరి. అంతట వీరభద్రుని తీవ్ర బాణవృష్టికి నోటువడిదీనుడై ధర్ముడు ముఖము వంచుకొని తొలగిపోగా వీరభద్రుడు యాగశాల బ్రవేశించెను.

యజ్ఞవాటం ప్రవిష్టంతం వీరభద్రం గణశ్వరమ్‌ | దృష్ట్వాతు సహసాదేవా ఉత్తస్థుః సాయుదాయునే. 31

వసవో7ష్టౌ మహాభాగా గ్రహా నవ సుధారుణాః | ఇంద్రాద్యా ద్వాదశాదిత్యా రుద్రా స్త్వేకాదశైవ హి. 32

విశ్వేదేవాశ్చ సాధ్యాశ్చ సిద్దగంధర్వపన్నగాః | యక్షాః కింపురుషాశ్చైవ ఖగాశ్చక్రదరాస్తథా. 33

రాజా వైవస్వతాద్వంశాద్‌ ధర్మకీర్తిస్తు విశ్రుతః | సోమవంశోద్భవ శ్చోగ్రో భోజకీర్తి ర్మహాభుజః. 34

దితిజా దానవాశ్చాన్యే యే7న్యే తత్రసమాగతాః | తేసర్వే7భ్యద్రవన్‌ రౌద్రం వీరభద్ర ముదాయుధాః. 35

తానాపతత ఏవాశు చాపబాణధరోగణః | అభిదుద్రావ వేగేన సర్వానేవ శరోత్కరైః. 36

తే శస్త్రవర్షమతులం గణశాయ సముత్సృజన్‌ | గణశో7పి వరాసై#్త్రస్తాన్‌ ప్రవిచ్చేద బిభేదచ. 37

శ##రైః శ##సై#్త్రశ్చ సతతం వధ్యమానా మహాత్మనా | వీరభ##ద్రేణ దేవాద్యా అవహారమకుర్వత. 38

తతో వివేశ గణపో యజ్ఞ మధ్యం సువిస్త్రుతమ్‌ | జుహ్వానా ఋషయే యత్ర హవీంషి ప్రవితన్వతే. 39

తతో మహర్షయో దృష్ట్వా మృగేంద్రవదనం గణమ్‌ | భీతా హోత్రం పరిత్యజ్య జగ్ముః శరణ మచ్యుతమ్‌.

తానార్తాం శ్చక్రభృద్ధృష్ట్వా మహర్షీం స్త్రస్తమానసాన్‌ | నభేతవ్య మితీత్యుక్త్వా సముత్తస్థౌ వరాయుధః. 41

సమానమ్య తతః శార్‌జ్గం శరా నగ్నిశిఖోపమాన్‌ | ముమోచ వీరభద్రాయ కాయావరణదారణాన్‌. 42

తే తస్యకాయ మాసాద్య అమోఘావై హరేఃశరాః | నిపేతు ర్భువి భగ్నాశా నాస్తికాదివ యాచకాః. 43

శరాంస్త్వమోఘా న్మోఘత్వ మాపన్నా న్వీక్ష్యవేశవః | దివ్యై రస్త్రెర్వీరభద్రం ప్రచ్ఛాదయితు ముద్యతః. 44

తా సస్త్రాన్వాసుదేవేన ప్రక్షిప్తా న్గణనాయకః | వారయామాస శూలేన గదయా మార్గణౖస్తథా. 45

దృష్ట్వా విపన్నాన్యస్త్రాణి గదాం చిక్షేప మాధవః | త్రిశూలేన సమాహత్య పాతయామాస భూతలే. 46

ముసలం వీరభద్రాయ ప్రచిక్షేప హలాయుధః | లాంగలంచ గణశో7పి గదాయా ప్రత్యవారయత్‌. 47

ముశలం సగదం దృష్ట్వా లాంగలంచ నివారితం | వీరభద్రాయ చిక్షేప చక్రం క్రోధాత్‌ ఖగధ్వజః. 48

తమాపతంతం శతసూర్యకల్పం సుదర్శనం వీక్ష్య గణశ్వరస్తు |

శూలం పరిత్యజ్య జగారచక్రం యథామధుం మీనవపుః సురేంద్రః. 49

చక్రేనిగీర్ణే గణనాయకేన క్రోధాతిరిక్తో7సితచారునేత్రః |

మురారిరభ్యేత్య గణాధిపేంద్ర ముతిక్షప్య వేగాద్‌ భువి నిష్పి పేష. 50

హారిబాహూరు వేగేన వినిష్పిష్టస్య భూతలే | సహితం రుధిరోద్గారై ర్ముఖా చ్చక్రం వినిర్గతమ్‌. 51

తతో నిఃసృత మాలోక్య చక్రం కైటభనాశనః | సమాదాయ హృషీకేశో వీరభద్రం ముమోచహ. 5 2

హృషీకుశేన ముక్తస్తు వీరభద్రో జటాధరమ్‌ | గత్వా నివేదయామాస వాసుదేవాత్పరాజయమ్‌. 53

తతో జటాధరో దృష్ట్వా గణశం శోణితాప్లుతమ్‌ | నిశ్వసంతం యథా నాగం క్రోధం చక్రే తదావ్యయః. 54

తతః క్రోధాభిభూతేన వీరభద్రో7థ శంభునా | పూర్వోద్ధిష్టే తదాస్థానే సాయుధస్తు నివేశితః. 55

వీరభద్ర మథాదిశ్య భద్రకాశీంచ శంకరః | వివేశ క్రోధతామ్రాక్షో యజ్ఞవాటం త్రిశూలభృత్‌. 56

తతస్తు దేప్రవరే జటాధరే త్రిశూలపాణౌ త్రిపురాంతకారిణి |

దక్షస్యయజ్ఞం విశతి క్షయంకరే జాతో ఋషీణాం ప్రవరోహి సాధ్వసః. 57

ఇతి శ్రీవామన మహాపురాణ చతుర్థో7ధ్యాయః.

యజ్ఞశాలలో ప్రవేశించిన వీరభద్రుని చూడగనే అందున్న దేవతలందరు - అష్టవసువులు, నవగ్రహాలూ, ఇంద్రాది ద్వాదశాదిత్యులు ఏకాదశరుద్రులు, వశ్వేదేవులు, సాధ్యులు, సిద్ధగంధర్వ కింపురుషులు పన్నగులు యక్షులు, ఖగములు చక్రధరులు మొదలగు వారెల్లరు లేని నిలబడిరి. వై వస్వత వంశానికి చెందిన లబ్ధ ప్రతిష్ఠుడగు ధర్మకీర్తి, ఉగ్రుడు మహాబాహువునగు సోమ వంశోద్భవుడు భోజకీర్తి, అక్కడ చేరిన దైత్యులు దానవులు తదితరు లెల్లరు తమతమ ఆయుధములతో రుద్రమూర్తియగు వీరభద్రు నెదుర్కొనిరి. అంతట వీరభద్రుడు తన తీవ్రశరపరంపరతో వారలందరను చెల్లాచెదరు కావించెను. వారందరు తమ అసమాన శస్త్రాలను వీరభద్రునిపై కుప్పింపగా నా గణాధిపుడు కూడ తన శ్రేష్టమైన ఆయుధాలతో వానినన్నింటిని తుత్తునియలుగావించెను. వీరభద్రుని అస్త్రములచే తీవ్రముగ నొప్పింపబడి చేయునది లేక నాదేవత లందరు నాతనికి లొంగిపోయిరి. అంతట వీరభద్రుడు మహర్షుల ఆజ్యాహుతులతో వెలుగుచున్న విశాలమగు యజ్ఞాశాలలో ప్రవేశించెను. భయంకరాకారులై వచ్చు నా సింహముఖ గణాలను చూచినంతనే హడలిపోయి ఋత్విక్కులందరూ తమతమ యజ్ఞ వేదికలు వదలిపారిపోయి నారాయణుని శరణు వేడిరి. భయకంపితులగు నామహర్షులకభయ మొసగి విష్ణువు తన ఉత్తమమగు శార్‌జ్గధనువు నెత్తికొని వీరభద్రునిపై అభేద్యకవచమును సైతము చించి చెండాడ గలిగిన అగ్ని బాణములను వర్షించెను. అమోఘాలయిన ఆబాణాలన్నీ వీరభద్రుని శరీరమును తాకి నాస్తికులను యాచించి విఫలమనోరథులయిన యాచకులవలె వ్యర్థములై నేలబడిపోయెను. తన బాణములట్లు వ్యర్థమములగుట చూచి కేశవుడు దివ్యాస్త్రాలతో వీరభద్రుని ముంచివైచుట కుద్యమించెను. శ్రీహరి ప్రయోగించిన అస్త్రాలన్నింటిని వీరభద్రుడు త్రిశూలంతో గదతో మార్గణాలతో నివారించెను. తన దివ్యాస్త్రములు వ్యర్థముకాగా మాధవుడాతనిపైకి గదవిసరెను. ఆగదను త్రిశూలముతో భూమిపై బడగొట్టెను. అంతట హరి వీరభద్రునిపై హలము ముసలము ప్రయోగింపగా వానిని గణశుడు గదతో నివారిత మొనర్చెను అంతట మహాక్రోథంతో ఖగధ్వజుడు వీరభద్రునిపై చక్రము ప్రయోగించెను. శత సూర్యుల కాంతితో వచ్చే ఆ సుదర్శనాన్ని చూచి వీరభద్రుడు తనశూలాన్ని వదలివైచి, మీన శరీరం ధరించి యింద్రుడు మధురాక్షసుని మ్రింగినట్లుగా, చక్రాన్ని మ్రింగివైచెను. అంతట క్రోధంతో నల్లబడిన సుందర నేత్రాలతో విష్ణువు వీరభద్రుని సమీపించి మెరుపు వేగంతో నతని భూమిపై బడగొట్టి బాహువులతో తీవ్రంగా మర్దించెను. అట్లు భయంకరంగా మర్దింపబడిన వీరభద్రుడు రక్తము గ్రక్కి పడిపోవుటతో నాతని శరీరము నుండి చక్రము వెలికివచ్చెను. అంతట తన చక్రాన్ని తాను తీసికొని విష్ణువు వీరభద్రుని వదలివైచెను. వాసుదేవునికి ఓడిపోయి వీరభద్రుడా విషయము శంకరుడు నివేదించెను. నెత్తట దోగిన వీరభద్రుని చూచి శివుడు క్రోధోన్మత్తుడై వీరభద్రుని భద్రకాళిని వారినిర్దిష్ట స్థానాల్లో నిలిపి తాను స్వయంగా త్రిశూలపాణియై దక్షుని యజ్ఞశాలలోనికి జొరబడెను. ఆ విధముగా వచ్చిన త్రిపురాంతకుడగు మహాదేవుని చూచి ఋషులందరు భయకంపితులయిరి.

ఇది శ్రీ వామన మహాపురాణమునందలి నాల్గవయధ్యాయము.

Sri Vamana Mahapuranam    Chapters