Sri Vamana Mahapuranam    Chapters   

ముప్పది నాలుగవ అధ్యాయము

నారద ఉవాచ :

క్వగతః శంకరోహ్యాసేద్యే నాంబానందినాసహ | అంధకం యోధయామాన ఏతన్మేవక్తుమర్హసి. 1

పులస్త్య ఉవాచ :

యదావర్ష సహస్రంతు మహాయోహేస్థితో7భవత్‌ | తదాప్రభృతి నిస్తేజాః క్షీణవీర్యాః ప్రదృశ్యతే. 2

స్వమాత్మనం నిరీక్ష్యాథ నిస్తేజోంగో మహేశ్వరః | తపోర్థాయతదాచక్రే మతింమతి మతాంవరః. 3

నమహావ్రతము త్పాద్య సమాశ్వాస్యాంబికాం విభుః | శైలాదింస్థాప్య గోప్తారం విచచారమహీతలమ్‌. 4

మహాముద్రార్పితగ్రీవో మహాహికృతకుండలః | ధారయానః కటీదేశే మహాశలలన్య మేఖలామ్‌. 5

కపాలం ధక్షిణహస్తే నవ్యేగృహ్యకమండలుమ్‌ | ఏకాహవాసీ వృక్షేహి శైలసానునదీష్వటన్‌. 6

స్థానం త్రైలోకప్యమాసాద్య మూలాజహారో7ంబుభోజనః | వాయ్వాహారస్తదాతస్థౌ నవవర్షశతం క్రమాత్‌. 7

తతోవీటాం మఖేక్షిప్య నిరుచ్చ్వా సో7భవద్యతిః | విస్తృతేహిమవత్‌ వృష్ఠే రమ్యేహిమశిలాతలే. 8

తతోవీటా విదార్యైవ కపాలం పరమేష్ఠినః | సార్చిష్మతీ జటామధ్యా న్నిషణ్ణాధరణీతలే. 9

వీటయాతుపతంత్యా7ద్రి ర్దారితః క్ష్మాసమో7భవత్‌ | జాతస్తీర్థవరః పుణ్యః కేదారితివిశ్రుతః. 10

తతోహరోవరం ప్రాదాత్‌ కేదారాయవృషధ్వజః |

పుణ్యవృద్ధికరం బ్రహ్మన్‌ పాపఘ్నం మోక్షసాధనమ్‌. 11

యేజలం తావకేతీర్థే పీత్వాసంయమినోనరాః | మధుమాంస నివృత్తాయే బ్రహ్మచారి వ్రతేస్థితాః. 12

షణ్మాసా ద్దారయిష్యంతి నివృత్తాః పరపాకతః | తేషాంహృత్పంకజేష్వేన మల్లింగం భవితాధ్రువమ్‌ 13

నచాస్య పాపాభిరతి ర్భవిష్యతి కదాచన | పితౄణా మక్షయంశ్రాద్దం భవిష్యతి నసంశయః 14

స్నానదానతపాంసీహ హోమజప్యాదికాః క్రియాః భవిష్యంత్యక్షయానౄణాం మృతానామపునర్భవః. 15

ఏతద్వరం హరాత్తీర్థం ప్రాప్యపుష్టాతి దేవతాః | పునాతిపుంసాంకేదార స్త్రినేత్రవచనంయథా. 16

నారదుడిట్లనియె : అంబిక నందీ, యిర్వురే అంధకాసురునితో నేలపోరాడిరి ? ఆ సమయాన శంకరుడెచట నుండెను. పులస్త్యుడిట్లు చెప్పెను. మునీ ! వెయ్యేండ్లు మోహంలో మునిగి నందున అప్పటినుండి శివుని వీర్యం క్షీణమై ఆయన తేజస్సును కోల్పోయాడు. తన శరీరంలోని అంగాలు అలా బలం కోల్పోవడం గమనించిన ఆ శివుడు లెస్సగా ఆలోచించి తపోచర్యకు పూనుకున్నాడు. అలా దీక్షబూని, పార్వతిని సమాధాన పరచి నందిని ఆమెకు కాపుగా నియమించి ఆ మహేశ్వరుడు భూమిమీద తిరుగసాగాడు. మహాముద్రాకృతిలో మెడను నిలిపి. మహాసర్పాల కుండలాలూ కంకణాలూ నడుముకు మానవాస్థికల మేఖల ధరించి కుడి చేతిలో కపాలం ఎడమ చేతిలో కమండలం పట్టుకొని ఎక్కడా ఒకరోజుకన్నా ఎక్కువ కాలం ఉండకుండా, చెట్లక్రిందా గిరులలో సానువులలో నదులవెంటా తిరుగ మొదలెట్టాడు. అలా గడ్డలు కాయలు నీరు వాయువు భక్షస్తూ ముల్లోకాల్లో తొమ్మిదివందలేండ్లు పర్యటించాడు. అనంతరం నోటిలో తాంబూల విడెము పెట్టుకొని ప్రాణవాయువును నిరోధించి రమణీయమైన హిమవంతంమీద నొక సమతల ప్రదేశంలో నాయతి నిలిచి పోయాడు. అంతట నా తమలపాకులనూ జటామండలాన్ని చీల్చకొని ఆవెలుగులు జిమ్మే పరమేష్టి కపాలం భూమ్మీద పడిపోయింది. విడెము క్రింద బడటంతో గిరి శిఖరం బ్రద్దలై అక్కడ సమతలభూమి ఏర్పడి పవిత్రమై కేదారమనే తీర్థం ఉద్భవించింది. మహర్షేఅంత నా వృషకేతనుడు ఆ తీర్థనికి పాపాలు పొగొట్టి పుణ్య వృద్ధి గావించ మోక్షసాధకమగునట్లుగా వరప్రదానం చేశాడు. ఓ తీర్థరాజమా! ఏ మనుజులు ఆరునెలలు కాలం నియమంతో మధుమాంసాదులు, ఇతరుల వండిన భోజనాదులు వర్జించి బ్రహ్మచర్యంతో, నీ పవిత్ర జలపానం చేస్తూ దీక్ష నెరపుదురో వారల హృదయ కమలాల్లో నాలింగం స్థిరంగా ఉంటుంది. ఇది సత్యము. తిరగి వారల బుద్ధి పాపకార్యాలకు పోదు. వారల పితృదేవతల కక్షయ శ్రాద్ధఫలం లభిస్తుంది. స్నాన దాన తప హోమ జపాదులొనరించు వారల కక్షయ ఫలము అభిస్తుంది. మృతులగు వారలకు తిరిగి పుట్టుక ఉండడు. అలా శివునిచేత వరం పొంది ఆ కేదారమతిపవిత్ర క్షేత్రమై ఆ త్రినేత్రుని వచనానుసారం మానవులను పవిత్రుల గావిస్తూ దేవతను తృప్తిపరుస్తూ విరజిల్లుతోంది.

కేదారాయవరందత్త్వా జగామత్వరితొహరః | స్నాతుం భానుసుతాందేవీం కాళిందీపం పాపనాశినీమ్‌. 17

తత్రస్నాత్వా శుచిర్భూత్వా జగామథసరస్వతీమ్‌ | వృతాంతీర్థశ##తైః పుణ్యౖః ప్లక్షజాం పాపనాశినీమ్‌. 18

అవతీర్ణస్తతః స్నాతుం నిమగ్నశ్చ మహాంభసి | దృపదాం నామగాయత్రీం జజాపాంతర్జలేహరః. 19

నిమగ్నే శంకరేదేహ్యం సరస్వత్యాం కలిప్రియ | సాగ్రః సంవత్సరోజాతో నచోన్మజ్ఞత ఈశ్వరః. 20

ఏతస్మిన్నంతరేబ్రహ్మన్‌ భువనాః సప్తసార్జవాః | చేలుః పేతుర్ధరణ్యాంచ నక్షత్రా స్తారకైస్సహ. 21

అసనేభ్యః ప్రచలితా దేవాః శక్రపురోగమాః | స్వస్త్యస్తులోకేభ్యితి జపంతః పరమర్షయః. 22

తతఃక్షుబ్దేషు లోకేషు దేవా బ్రహ్మాణమాగమన్‌ | దృష్ట్వోచుః కిమిదంలోకాః క్షుబ్దాః సంశయమాగతాః 23

తానాహ పద్మసంభూతో నైతద్‌వే ద్మిచకారణమ్‌ | తదాగచ్ఛతవోయుక్తం ద్రష్టుంచక్రగదాధరమ్‌. 24

పితామహేనైవముక్తా దేవాః శక్రపురోగమాః | పితామహం పురస్కృత్య మురారి సదనంగతాః. 25

నారద ఉవాచ :

కో7సౌ మురార్దేవర్షేః దేవోయక్షోను కిన్నరః | దైత్యోవారాక్షసోవాపి పార్థివపో వాతదుచ్యతామ్‌. 26

పులస్త్య ఉవాచ :

యో7సౌ రజస్సత్వమయో గుణవాంశ్చతమోమయః | నిర్గుణః, సరవగోవ్యాపీ మురారిర్మభుసూదనః. 27

నారద ఉవాచ :

యో7సౌమురితి ఖ్యాతః కస్యపుత్రః సగీయతే | కథంచనిహతః సంఖ్యే విష్ణునాతద్వదస్వమే. 28

కేదారానికి అలా వరాలిచ్చి హరుడు త్వరత్వరగా పాపరాశిని సూర్య కుమారియైన యమునానదిలో స్నానం చేయుటకు వెళ్ళాడు. అక్కడ స్నానం చేసి హరుడు శుచియై, నూరు తీర్థాల మధ్య వెలుగుతున్న పాపవిధ్వంసినీ, ప్లక్ష వృక్ష సంభవ అయిన సరస్వతీ నదికి వెళ్ళాడు. ఆ నదీ జలాల్లో ప్రవేశించి మునిగి కూర్చొని శివుడు 'దృపద గాయత్రీ' మహామంత్ర జపం చేస్తూ ఉండిపోయాడు. ఓ కలి ప్రియా ! సంవత్సరకాలం దాటినా శంకరుడా నీళ్ళలోనుంచి బయటకు రాలేదు. ఇంతలో సప్తలోకాలు సముద్రాలతో సహా చలించిపోయాయి. నక్షత్రాలతో సహా గ్రహాలు భూమ్మీద రాలి పోయయి. ఇంద్రాది దేవతల ఆసనాలు కదలిపోయినాయి. మహర్షులంతా లోకాలకు శుభమగుగాక అని జపిస్తూ స్వస్తి వాచనాలు చేయసాగారు. ఆ లోక సంక్షోభానిక అదరిపడి దేవతలు బ్రహ్మను సమీపించి ప్రభూ! ఏమిటీ సంక్షోభం? దీనికి కారణమేమని అడిగారు. అందుకా పద్మభవుడు తనకు గూడ కారణం తెలియదంటూ, చక్రగదాధరుడగు నచ్యుతుని చూడబోవుదమన్నాడు. బ్రహ్మ వచనానుసారం ఇంద్రాదులంతా బ్రహ్మను ముందిడుకొని మురారి నివాసానికి వెళ్ళారు. అదివిన నారదుడు ఓ మహర్షీ! ఆ మురారి ఎవరు? దేవా యక్షుడా కిన్నరుడా రాక్షసుడా లేక మానవుడా? వివరించమని అడగగా నా పులస్త్యుడు సత్త్వరజస్తమో గుణాలు కలిగి వాటికతీతుడై సర్వవ్యాపి అయిన మధుసూదనుడే ఆ మురహంత అని వివరించాడు. మరల నారదుడందుకొని, ఆమురరాక్షనుడెవని కుమారుడు? వానినేల యుద్ధంలో విష్ణువు వధించాడని ప్రశ్నించాడు.

పులస్త్య ఉవాచ :

శ్రూయుతాం కథయిష్యామి మరాసురనిబర్హణమ్‌ | విచిత్రమిదమాఖ్యానం పుణ్యం పానప్రణాశనమ్‌. 29

కశ్యపస్యౌరసః పుత్రో మురోనామదనూద్భవః | సదదర్శరణ శస్తాన్‌ దితిపుత్రాన్‌ సురోత్తమైః. 30

తతః సమరణాద్‌ భీత స్తస్త్వావర్ష గణాన్బహూన్‌ | ఆరాధయామానవిభుం బ్రహ్మాణ మనరాజితమ్‌. 31

తతో7న్య తుష్టోవరదః ప్రాహవత్సః పరంవృణు | నచవవ్రేమరం దైత్యో వరమేనం పితామహాత్‌. 32

యంయంకరతలేవాహం స్పృశేయం సమరేవిభో | సనమద్ధస్తం స్పృష్ట స్త్వమరో7పి మరత్వతః. 33

బాడామిత్యాహ భగవాన్‌ బ్రహ్మాలోకపితామహః | తతో7భ్యాగాన్మహాతేజా మురః సురగిరింబలీ. 34

సమేత్యాహ్వయతేదేవం యక్షం కిన్నరమేవవా | నకశ్చిద్యుయుధే తేన సమందైత్యేన నారద. 35

తతో7మరావతీం క్రుద్దః సగత్వాశక్రమాహ్వయత్‌ | నచాస్య సహయోద్దుంవై మతించ కేపురందరః. 36

తతః సకరముద్యమ్య ప్రవివేశామరావతీమ్‌ | ప్రవిశంతం నతంకశ్చిన్ని వారయితు ముత్సహేత్‌. 37

సగత్వాశక్రసదనం ప్రోవాచేంద్రం మురస్తదా | దేహియుద్దం సహస్రాక్ష నోచేత్‌ స్వర్గంపరిత్యజ. 38

ఇత్యేవ ముక్తోమురుణా బ్రహ్మన్‌ హరిహయస్తదా | స్వర్గరాజ్యం పరిత్యజ్య భూచరం సమజాయత. 38

తతోగజేంద్రకులిశౌ హతౌశక్రస్య శత్రుణా | సకలత్రో మహాతేజాః సహదేవైః సుతేనచ. 40

కాళింద్యాదక్షిణకులే నివేశ్యన్వపురంస్థితః | మురుశ్చాసి మహాభోగాన్‌ బుభుజేస్వర్గ సంస్థితః. 41

దానవాశ్చాపరే రౌద్రా మయతారపురోగమాః | మురమాసాద్యమోదంతే స్వర్గేను కృతినోయథా. 42

సకదాచిన్మ హిపృష్ఠం సమయాతోమహాసురః | ఏకాకీకుంజరారూఢః సరయూం నిమ్నగాంప్రతి. 43

వసరయ్వాస్తటేవీరం రాజానం సూర్యవంశజమ్‌ | దదృశేరఘునామనాం దీక్షితం యజ్ఞకర్మణి. 44

తముపేత్యా7బ్రవీద్దైత్యో యుద్దంమేదీయతామితి | నోచేన్నిర్వర్తతాం యజ్ఞో నేష్టవ్యాదేవతస్త్వయా. 45

తముపేత్య మహాతేజా మిత్రావరుణసంభవః | ప్రోవాచబుద్దిమాన్‌ బ్రహ్మన్‌ వసిష్ఠస్తపతాంవరః. 46

పులస్త్యుడిట్లనియె : నారదా ! పాపనాశనము పుణ్యావహము విచిత్రమూ నైన మురాసుర వధ వృత్తాంతం చెబుతున్నా వినుము. కశ్యప మహర్షికి దనువువల్ల మురాసురుడనే దానవుడు కలిగాడు. ప్రముఖులైన దేవతల చేతుల్లో దైత్యులందరు హతులుగావడంచూచి చావుకు భయపడి వాడనేక సంవత్సరాలు బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. వాని తపస్సుకు సంతోషించి పితామహుడు వత్సా! వరం కోరుకో అన్నాడు. అందుకు వాడు పితామహా! నేనెవరిని అర చేతితో తాకుదునో వారు అమరులైనా సరే ముద్ధంలో చనిపోవునట్లు వరమివ్వండి అని అర్థించాడు. బ్రహ్మ అట్లేయని అంతర్థానమై పోయాడు. అంతట నా దానవుడు దేవ నివాసమైన (మేరు) పర్వతానికి వెళ్ళి దేవ యక్ష కింనరాదులను యుద్ధానికాహ్వానిస్తే ఎవరూ యుద్ధానికి రాలేదు. అంతట కోపంతో వాడమరావతికి వెళ్ళి ఇంద్రుని యుద్ధానికి పిలవగా నతడా దానవునితో పోరాడుటకు సమ్మతించలేదు. అంతవాడు చేతిని పైకెత్తి అమరావతీ నగరంలోకి చొచ్చకొని పోగా ఎవ్మవరూ నిరోధించలేదు. నేరుగా యింద్రుని సదనానికి వెళ్ళి ఆమురుడు నాతో యుద్ధమైనా సాగించు లేదా అమరావతి వదలి వెళ్ళిపో అని నిలదీశాడు. నారదా ! వేరే మార్గం లేక దేవేంద్రుడమరావతి వదలి భూలోకానికి వెళ్ళిపోయాడు. దేవేంద్రుడి సింహాసనంతోబాటు ఐరావత గజాన్ని వజ్రాయుధాన్ని వాడపహరింపగా నా సురపతి భార్యబిడ్డలు దేవతలు తోడురాగా యమునానది దక్షిణతీరానికి వెళ్ళి తనకొక నగరాన్ని నిర్మించుకొన్నాడు. మురాసురుడు సకల భోగాలనుభవిస్తూ స్వర్గంలో ఉండి పోయాడు. మయుడు తరుడు మొదలయిన యితర దనుజులు గూడ మురాసురిని వద్దకు వెళ్ళి స్వర్గ సుఖాలనుభవించ సాగారు. ఆ దానవడొక పర్యాయం వంటరిగా భూసంచారం చేస్తూ, గజారూఢూడై సరయూనదికి వెళ్ళాడు. ఆ నదీతీరాన యజ్ఞదీక్షితుడై యున్న సూర్యవంశ నృపతి రఘుమహారాజును చూచి, నాతో యుద్ధం చేయాలి లేదా ఈ యజ్ఞాన్ని మానుకోవాలి. దేవతలను యిక ఎంత మాత్రం యజ్ఞాలతో ఆరాధించడం పనికిరాదని శాసించాడు. అది చూచి మిత్రావరులు తనయుడైన వశిష్ఠుడు మహాతపస్వి ఆ దానవుని సమీపించి యిలా అన్నాడు.

కింతేజితైర్నరైర్దైత్య అజితాననుశానయ |ప్రహర్తు మిచ్ఛసియది తల నివారయ చాంతకమ్‌. 47

సజలీశాననం తుభ్యం నకరోతిమహాసుర | తస్మింజితే హివిజితం సర్వం మన్నస్వభూతలమ్‌. 48

సతద్వసిష్ఠవచనం నిశమ్య దనుపుంగవః | జగామ ధర్మరాజానం విజేతుందండపాణినమ్‌. 49

తమాయాంతం యమః శ్రుత్వా మత్వా7వధ్యంచసంయుగేః

ససమారుహ్య మహిషం కేశవాంతికమాగమత్‌. 50

సమేత్య చాభివాద్యైనం ప్రోవాచమురచేష్టితమ్‌ | సచాహగచ్చ మామద్య ప్రేషయస్వమహాసురమ్‌. 51

సవాసుదేవచనం శ్రుత్వా7భ్యాగాత్‌ త్వరాన్వితః | ఏతస్మిన్నంతరే దైత్యః సంప్రోప్తో నగరీంమురః. 52

తమాగతం యమః ప్రాహ కిం మురోకర్తుమిచ్ఛపి? | వదస్వవచనం కర్తా త్వదీయం దానవేశ్వర. 53

మురు రువాచ :

యమః ప్రజానంయమనా న్నివృత్తిం కర్తుమర్హసి | నోచేత్‌ దవాద్యభిత్వా7హం మూర్దానంపాతయేభువి. 54

తమాహధర్మరాడ్‌ బ్రహ్మన్‌ః యదిమాంనంయమాద్భవాన్‌|

గోపాయతి మురోసత్యం కరిష్యే వచనంతవ. 55

మురస్తమాహ భవతః కః సంయంతా వదస్వమామ్‌ | అహమేనం పరాజిత్య వారయామి న సంశయః. 56

యమస్తం ప్రాహమావిష్ణు ర్దేవశ్చక్రగదాధరః | శ్వేతద్వీపనివాసీయః సమాంసంయమతే7వ్యయః. 57

తమాహదైత్య శార్దూలః క్వాసౌవసతి దుర్జయః | స్వయంతత్రగమిష్యామి తస్యసంయమనోద్యతః. 58

తమువాచయమో గచ్ఛ క్షీరోదం నామసాగరమ్‌ | తత్రాస్తే భగవాన్‌ విష్ణు ర్లోకనాథ జగన్మయః. 59

మురస్తద్వాక్య మూకర్ణ్య ప్రాహగచ్ఛామి కేశవమ్‌ | కింతుత్వయాన తావద్ధి సంయమ్యాధర్మ మానవాః. 60

సప్రాహగచ్ఛత్వం తావత్‌ ప్రవర్తిష్యే జయంప్రతి | సంయంతుర్వాయథాస్యాద్ది తతోయుద్ధంసమాచర. 61

ఇత్యేవముక్త్వా వచనం దుగ్దాభ్దిమగమన్మురః | యత్రాస్తే శేషపర్యంకే చతుర్మూర్తిర్జవార్దనః. 62

''దైత్యవీరా ! మానవుల జయించునందున ప్రయోజనమేమి ? అజేయులైన వారలను శాసించుము. నిజంగా యుద్ధం చేయాలనుకుంటే యమధర్మరాజును అదుపులో పెట్టు. అతడిని జయించావంటే భూలోకాన్నంతా జయించినట్లే అవుతుంది. అని పలికిన వసిష్ఠుని మాట విని దండపాణియైన ధర్మరాజును జయించేందుకు బయలుదేరాడు. మురుడవధ్యుడనీ తన మీదకెత్తి వస్తున్నాడని విని, యముడు మహిషాన్నధిరోహించి కేశవుని వద్దకు వెళ్ళి నమస్కరించి మురాసురుడి ఆగడాలు వివరించాడు. అందులకా జనార్దనుడు నీవు వెళ్ళి ఆ రక్కసుని నా వద్దకు పంపుమని ఆదేశించాడు. అంతట త్వరగా తిరిగి తన నగరానికి వచ్చేసరికి మురుడుకూడ వచ్చిచేరాడు. యముడు వానికెదురేగి, దానవేశ్వరా ! నీ యిష్టప్రకారం చేస్తాను. నేనేంచేయాలో చెప్పుమన్నాడు. అందులకా మురుడు యామా! ఈ క్షణంనుంచీ నీవు జీవుల ప్రాణాలనపహరించుట మానెయ్యాలి. లేదో నీతల నరికి పారేస్తానన్నాడు. అంతట ఓ నారదా ! ఆ యముడా దానవుడితో నీవునాపై అధికారినుంచి నన్ను కాపాడుచో నేను నా కర్తవ్యాన్ని వదిలేస్తా. నీ ఆదేశాన్ని శిరసావహిస్తా నన్నాడు. అందుకు వాడు, నీమీద అధికారం నెరపువాడెవడో తెలుపుము. నేను వానిని నిర్జించి తప్పక నిన్ను రక్షిస్తానన్నాడు. అందుకు యముడు శ్వేతద్వీపవాసి చక్రగదాధారి అయిన విష్ణువు అదుపాజ్ఞలలోనే నున్నానని చెప్పగా వాడు ఆ దుర్జయుడైన విష్ణువుండే చోటు చెప్పగనే స్వయంగా వెళ్ళగలనన్నాడు. యముడదివిని క్షీర సముద్రానికి వెళ్ళు. అక్కడ నీకు జగన్మయుడు లోకాధినేత అయిన భగవానుడు విష్ణువు కనిపిస్తాడన్నాడు. మురాసురుడిదిగో యిప్పుడే ఆ కేశవుడి దగ్గరకు వెళ్తున్నా. నేను తిరిగి వచ్చే వరకు నీవు నీ మానసంయమన కర్తవ్యాన్ని నెరవేర్చకూడదు సుమా. అనగా యముడు సరే నీయిష్ట ప్రకారమే చేస్తా కాని ఎలాగైనా ఆయనను నాపై నియంతను జయించేందుకు ప్రయత్నం చేయుము. గట్టిగా యుద్ధం చేయమన్నాడు. అలాగేనని బీరాలు పలుకుతూ ఆ మురుడు శేషపర్యంకం మీద నాలుగు రూపాలతో విరాజిల్లే జనార్దనుని నివాసం క్షీరసముద్రానికి ప్రయాణమై పోయాడు.

నారద ఉవాచ :

చతుర్మూర్తిః కథంవిష్ణు రేకఏవనిగద్యతే | సర్వగత్వాత్‌ కథమపి అవ్యక్తత్వాచ్చతద్వద. 63

పులస్త్య ఉవాచ :

అవ్యక్తః సర్వగో7పీహ ఏక ఏవమహామునే చతుర్మూర్తిర్జగన్నాథో యథాబ్రహ్మం స్తథాశృణు. 64

అప్రతర్క్యమనిర్దేశ్యం శుక్లం శాంతంపరంపదమ్‌ | వాసుదేవాఖ్య మవ్యక్తం స్మృతంద్వాదశపత్రకమ్‌. 65

నారద ఉవాచ :

కథంశుక్లం కథంశాత మప్రతర్క్యమ నిందితమ్‌ | కాన్యస్యద్వాదశైవోక్తా పత్రకానీతి మేవద. 66

పులస్త్య ఉవాచ :

ధర్మస్య భార్యా7హింసాఖ్యా తస్యాఃపుత్ర చతుష్టయమ్‌ |

సంజాతంముని శార్దూల యోగశాస్త్ర విచారకమ్‌. 67

జ్యేష్ఠః సనత్కుమారో7భూద్‌ ద్వితీయశ్చ సనాతనః | తృతీయః సనకోనామ చతుర్ధశ్ఛన నందనః. 68

సాంఖ్యవేత్తారమపరం కపిలంవోఢు మాసురిమ్‌ | దృష్ట్వా పంచశిఖంశ్రేష్ఠం యోగయుక్తం తపోనిధిమ్‌. 69

జ్ఞానయోగం నతేదద్యుర్జ్యాయాం సో7పికనీయసామ్‌ | మానముక్తం మహాయాగం కపిలాదీనుపానతః 70

సనత్కమారశ్చాభ్యేత్య బ్రహ్మాణం కమలోద్భవమ్‌ | అపృచ్చద్యోగ విజ్ఞానం తమువాచ ప్రజాపతిః. 71

బ్రహ్మో ఉవాచ :

కథయిష్యామితేసాధ్య యదిపుత్రత్వ మిచ్చసి | యస్యకస్యన వక్తవ్యం తత్సత్యం నాన్యథేతిహి. 72

సనత్కుమార ఉవాచ :

పుత్ర ఏవాస్మిదేవేశ యతః శిష్యో7స్మ్యహంవిభో | నవిశేషో7స్తి పుత్రస్య శిష్యస్యచ పితామహ. 73

బ్రహ్మోవాచ :

విశేషః శిష్యపుత్రాభ్యాం విద్యతేధర్మనందన | ధర్మకర్మ సమాయోగే తథాపిగదతః శృణు. 74

పున్నామ్నో నరకాత్త్రాతి పుత్రస్తేనేహగీయతే | శేషపాపహరః శిష్య ఇతీయం వైదికీశ్రుతిః. 75

సనత్కుమార ఉవాచ :

కో7యం పున్నామకోదేవ నరకాత్‌ త్రాతిపుత్రకః | కస్మాచ్చేషంతతః పాపం హరేచ్చష్యశ్చ తద్వద. 67

బ్రహ్మోవాచ :

ఏతత్సురాణం పరమంమహర్షే యోగాంగయుక్తంచ నదైవయచ్చః

తథైవచోగ్రంభయహారి మానవం వదామితే సాధ్యనిశామయైనమ్‌. 77

నారదుడిట్లనెను : ఒక్కడైన విష్ణువు నాలుగు రూపాలు గలవాడుగ నేల చెప్పబడినాడు? అందుకు కారణం ఆయన సర్వగుడగుటయా లేక అవ్యక్తుడగుటయా ? అందులకు పులస్త్యుడిట్లనియె. అవ్యక్తుడూ సర్వగుడూ ఒక్కడూ అయి ఉండియు నాజగన్నాథుడు చతుర్మూర్తి అయిన వివరం నారదా ! చెబుతున్నా వినుము. వాసుదేవుడుగా పేర్కొనబడే ఆ పరతత్వం తర్కానికి అతీతమైనది. ఇది అని నిర్దేశింపరానిది అవ్యక్తమైనది శుక్ల వర్ణం కలిగి శాంతియేరూపంగా కలిగినది. అది ద్వాదశ పత్రాలు గలిగినది. అంతట నారదుడో బ్రహ్మర్షే! ఏ విధంగా ఆ తత్వం శుక్లమైనది శాంతమైనది తర్కాతీతమైనది ఉత్తమమైనది. దానిలోగల ద్వాదశపత్రాలు ఏవియో వివరించండన్నాడు. పులస్త్యుడిలా చెప్పాడు. అత్యంతగూఢమైన ఈ తత్వాన్ని మొదట పరమేష్ఠి ప్రజాపతి సనత్కుమారునకు తెలుపగా నాయననుండి నేను విన్నాను. నారదుడంతట, బ్రహ్మ స్వయంగా వినిపించిన ఆ సనత్కుమారుడెవరు? వివరంగా చెప్పండని అర్థించగా పులస్త్యుడిలా చెప్పాడు. ధర్మునకు అహింస అనే భార్యవలన యోగశాస్త్ర విదులయిన కుమారులు నలుగురు కలిగారు. వారిలో పెద్దవాడు సనత్కుమారుడు రెండవవాడు సనాతనుడు, మూడవవాడు సనకుడు నాలవవాడు సనందనుడు. వీరుగాక సాంఖ్యవేత్తలు కపిల, వోడు, ఆసురి, యోగివరుడు తపోనిధి అయిన పంచశిఖుడు ఉన్నారు. వారు పెద్దవారైయుండియు చిన్నవారలకు జ్ఞానయోగం చెప్పలేదు. మహాయోగ ప్రమాణం మాత్రమే చెప్పారు. అంతట సనత్కుమారుడు కమలభవుడైన బ్రహ్మనుచేరి యోగవిజ్ఞానాన్ని ఆర్థిస్తే ఆయన యిలాఅన్నాడు. ఓ సాధ్యుడా ! నీవు నా పుత్రుడవగుటకంగీకరిస్తే ఆ శాస్త్రం నీకు చెప్పగలను. ఎవరికి పడితే వారలకు సత్యం చెప్పగూడదు. అందుకు తిరుగులేదు. అందుకు సనత్కుమారుడు ప్రభూ! నీకు శిష్యుడనుకనుక నేను పుత్రుడనేకదా. పుత్రునకు శిష్యునకుభేదమేమి గలదు? అని అనగా బ్రహ్మ అలాకాదు ధర్మపుత్రా, శిష్యునికన్నా పుత్రునిలో విశేషం ఉంటుంది. అది ధర్మకర్మ నిర్వహణకు సంబంధించినది. పుత్‌ అనే నరకంనుంచి రక్షించేవాడు పుత్రుడయితే శేషించిన పాపాన్ని హరించే వాడు శిష్యుడనబడును. ఇది శ్రుతివచనం. అని విశ్లేషించగా సనత్కుమారుడా పున్నామనరకం, శేషపాహరణం అంటే ఏమో విపులంగా చెప్పమని కోరాడు. అంతట కమలభవుడు ఓ సాధ్యా! యోగాంగయుక్తమైన నీ విజ్ఞానం చాలా పురాతనమైనది. ఉగ్రమైనది, భయాలు పోగొట్టేది. అది నీకు చెబుతున్నాను. వినవలసిందన్నాడు.

ఇది శ్రీ వామనమహాపురాణంలో ముప్పది నాల్గవ అధ్యాయము.

Sri Vamana Mahapuranam    Chapters