Sri Vamana Mahapuranam    Chapters   

ముప్పది అయిదవ అధ్యాయము

బ్రహ్మోవాచ :

పరదారాభిగమనం పాపీయాంసోపసేవనమ్‌ | పారుష్యం సర్వభూతానాం ప్రథమం నరకం స్మృతమ్‌. 1

ఫలస్తేయం మహాపాపం ఫలహీనంతథా7టనమ్‌ | ఛేదనం వృక్షజాతీనాం ద్వితీయం నరకం స్మృతమ్‌. 2

వర్జ్యాదానం తథాదుష్ట మవధ్యవధ బంధనమ్‌ | వివాదమర్ధహేతూత్థం తృతీయం నరకం స్మృతమ్‌. 3

భయదం సర్వసత్త్వానాం భవభూతి వినాశనమ్‌ | భ్రంశనం నిజధర్మాణాం చతుర్థం నరకం స్మృతమ్‌. 4

మారణం మిత్రకౌటిల్యం మిథ్యా7భి శపనంచయత్‌ | మిష్టైకాశనమిత్యుక్తం పంచమంతుస్వపాచనమ్‌. 5

యంత్రః ఫలాదిహరణం యమనం యోగనాశనమ్‌ | యానయుగ్మస్యహరణం షష్ఠముక్తం స్వపాచనమ్‌. 6

రాజభాగహరం మూఢం రాజజాయానిషేవణమ్‌ | రాజ్యేత్యహితకారిత్వం సప్తమం నిరయంస్మృతమ్‌. 7

లుబ్దత్వం లోలుపత్వంచ లుబ్దధర్మార్ధ నాశనమ్‌ | లాలాసంకీర్ణమేవోక్తం సప్తమం నరకం స్మృతమ్‌. 8

విప్రోష్యం బ్రహ్మహరణం బ్రాహ్మణానాం వినిందనమ్‌|

విరోధం బంధుభిశ్చోక్తం నవమంనరపాచనమ్‌. 9

శిష్టాచార వినాశంచ శిష్టద్వేషం శిశోర్వధమ్‌ | శాస్త్రస్తేయం ధర్మనాశం దశమం పరికీర్తితమ్‌. 10

షడంగనిధనం ఘోరం షాడ్గుణ్య ప్రతిషేదనమ్‌ | ఏకాదశమమేవోక్తం నరకం సద్భిరుత్తమమ్‌. 11

సత్సునిత్యుం సదావైర మనాచారమ సత్ర్కియా | సంస్కార పతిహీనత్వ మిదం ద్వాదశమంస్మృతమ్‌. 12

హానిర్‌ ధర్మార్థ కామానా మపవర్గస్య హారణమ్‌ | సంభేదః సంవిదామేత త్త్రయోదశమముచ్యతే. 13

కృపణం ధర్మహీనంచ యద్వర్జ్యంయచ్చ వహ్నిదమ్‌ | చతుర్దశమమేవోక్తం నరకం తద్విగర్హితమ్‌. 14

ఆజ్ఞానంచాప్యసూయత్వ మశౌచమశుభావహమ్‌ | స్మృతం తత్పంచదశమ మసత్యవచనానిచ. 15

ఆలస్యం వైషోడశమమాక్రోశంచ విశేషతః | సర్వస్య చాతతాయిత్వా మాడాసేష్వగ్ని దీపనమ్‌. 16

ఇచ్ఛాచ పరదారేషు నరకాయనిగద్యతే | ఈర్ష్యా భావశ్చసత్యేషు ఉద్దృతంతువిగర్హితమ్‌. 17

ఏతైస్తుపాపైః పురుషః పున్నామాద్యైర్న సంశయః | సంయుక్తః ప్రీణయేద్దేవం సంతత్యాజగతః పతిమ్‌. 18

ప్రీతః సృష్ట్యాతు శుభయా సపాపాద్యేన ముచ్యతే | పుంనామ నరకం ఘోరం వినాశయతి సర్వతః. 19

బ్రహ్మ యిలా అన్నాడు : పరభార్యలను కూడడం, పాపులను సేవించడం, ఇతర ప్రాణులపట్ల కఠినంగా వ్యవహరించడం మొదటి నరకం అని చెప్పబడతుంది. పండ్లు దొంగిలించడం, పనిపాటలు లేకుండా తిరగడం, వృక్షజాతులను నరకడం ఈ మహాపాపాలు రెండవ నరకం. నిషేధింపబడిన వస్తువులు గ్రహించడం, అవధ్యులను వధించడం, బంధించడం, డబ్బుకోసమై కలహించడం మూడవనరకం. సర్వప్రాణులకు భీతికలిగిస్తూ ప్రపంచంలోని వస్తువులు నాశనం చేయడం, తన విధులనుండి వైదొలగుట నాలుగవనరకం. ఇతర జీవులను చంపడం మిత్రులపట్ల కుటిలంగా ప్రవర్తించడం, తప్పుడు ప్రమాణాలు (ఒట్లు) చేయడం, మధుర పదార్ధాలను తాను వంటరిగా భుజించడం అయిదవ నరకం అంటారు. కుట్రలు చేయడం, పండ్లు మొదలైనవి దొంగిలించడం, యితరుల మార్గాన్ని అడ్డుకోవడం, కలిసినవారిని నాశనం చేయడం యానాలు (బండ్లు) అపహరించడం ఆరవ నరకం. రాజుకు చెందవలసినది హరించడం, రాజ భార్యలతో మూర్ఖంగా సంభోగించడం, రాజ్యానికి ద్రోహం చేయడం ఏడవ నరకంగా పరిగణిస్తారు. లోభితనం, అత్యాశ, లోభంతో ధర్మనీతినీ ధనాన్ని నాశనం చేయడం, నోట చొల్లుకార్చుతూ మాట్లాడడం (పేరాస), ఎనిమిదో నరకం. బ్రాహ్మణులను (తమ యిండ్ల నుండి) వెళ్ళగొట్టడం వారలను అపహరించుకుని పోవడం, ఆ బ్రాహ్మణులను నిందించడం, తన బంధువులతో విరోధం యివి తొమ్మితో నరకం క్రింది పరిగణించబడతాయి. శిష్టుల ఆచారాలు వదిలివేయడం, శిష్యులను ద్వేషించడం, శిశువుల హత్య చేయడం శాస్త్రాలు దొంగిలించడం, ధర్మాన్ని హత్య చేయడం (సన్మార్గాతి క్రమణం) పదవ నరకం. ఆరు అంగాలు ఖండించి హత్య చేయడం, ప్రభువు తనకు విహితాలయిన ఆరుగుణఆ (పను)లు ప్రదర్శించకుండా నిరోధించడం పదకొండవ నరమని సజ్జనుల మతం.సజ్జనులతో నెల్లప్పుడు శత్రుత్వం, ఆనాచారం, చెడుపనులు చేయడం, (విధ్యుక్తమైన) సంస్కారాలు గాలికి వదిలివేయడం. పన్నెండవ నరకం. పురుషార్థ సంపాదనంలో (ధర్మార్థ కామమోక్షసాధనం) అడ్డుపడడం, వాటి అపహరణం, మంచి వారలలో అభిప్రాయ భేదాలు సృష్టించడం. పదమూడవనరకం, కృపణత్వం, ధర్మరాహిత్యం, అలాగే నిషిద్ధమైన దహనకాండ జరపడం నిందనీయమైన పదునాలుగవ నరకం. అజ్ఞానం, అసూయ, పరిశుభ్రత, మొదలయిన అశుభకార్యాలు చేయడం, అబద్ధాలు చెప్పడం పదిహేనవ నరకం. సోమరితనం, అతిగా యితరుల మీద ఆక్రోశపడడం, అన్నివిధాల (తగలబెట్టడం, విషం పెట్టడం, శస్త్రలతో కొట్టడం, ధనాపహరణం, భూమిని భార్యను అపహరించడం) ఆతతాయిత్వం, అగ్నికాండ, పదహారవ నరకం. పరభార్యాభిలాష, సత్యంపట్ల వైముఖ్యం ద్వేషబుద్ధి నరకకారణాలు. యిలాంటి పాపాలలో చిక్కుకున్న మానవుడు ఈ పాపాల సమూహాన్ని 'పుత్‌' నరకమంటారు. వీటినుండి బయటపడుటకూ భగవంతుని ప్రసన్నుని చేసుకొనుటకూ, పుత్రుణ్ణి కని అతడి ద్వారా రక్షణ పొందాలి. భగవంతుడు ప్రసన్నుడై సత్పుత్రుని ప్రసాదిస్తాడు. అతడు పితరులను నరకముక్తుల చేప్తాడు. అందువలనననే ఓ సాధ్యా ! సుతునకు పుత్రుడని పేరుగలిగింది.

ఏతస్మాత్కారణాత్‌ సాధ్య సుతః పుత్రేతి గద్యతే | అతః వరం ప్రవక్ష్యామి శేషపాపస్య లక్షణమ్‌. 20

ఋణందేవర్షి భూతానాం మనుష్యాణాం విశేషతః | పితృణాంచ ద్విజశ్రేష్ఠ సర్వవర్ణేషుచైకతా. 21

ఓంకారాదపి నిర్వృత్తిః పావకార్యకృతశ్చయః | మత్స్యాదశ్చ మహాపాప మగమ్యాగ మనంతథా. 22

ఘృతాది విక్రయం ఘోరం చండాలాదివరిగ్రహః | స్వదోషాచ్చాదనం పాపం పరదోషప్రకాశనమ్‌. 23

మత్సరిత్వం వాగ్దుష్ణత్వం నిష్టురత్వం తథాపరమ్‌ |

టాకిత్వతాల వాదిత్వం నామ్నావాచ్యా7ప్య ధర్మజమ్‌. 24

దారుణత్వ మధార్మిక్యం నరకావహముచ్యతే | ఏతైశ్చపాపైః సంయుక్తః ప్రీణయేద్యది శంకరమ్‌. 25

జ్ఞానాదికమ శేషేణ శేషపాడం జయేత్‌ తతః | శారీరంవాచికం యత్తు మానసం కాయికంతథా. 26

పితృమాత్బకృతంయచ్చ కృతం యచ్చాశ్రితైర్నరైః|

భ్రాతృభిర్బాంద వైశ్చాపి తస్మిన్‌ జన్మని ధర్మజః. 27

తత్సర్వం విలయంయాతి సధర్మః సుతశిష్యయోః | విపరీతే భ##వేత్‌ సాధ్య విపరీతః పదక్రమః. 28

తస్మాత్‌ పుత్రశ్చ శిష్యశ్చ విధాతవ్యో విపశ్చితా | ఏతదర్ధ మభిధ్యాయ శిష్యాచ్ఛ్రేష్ఠతరః సుతః|

శేషాత్‌ తారయతే శిష్యః సర్వతో7పి హిపుత్రకః. 29

పులస్త్య ఉవాచ :

పితామహవచః శ్రుత్వా సాధ్యః ప్రాహతపోధనః | త్రిఃసత్యంతవపుత్రో7హం దేవః యోగంవదస్వమే. 30

తమునాచ మహాయోగీ త్వన్మాతాపితరౌయది | దాస్యేతేచతతః సూనుర్దాయాదోమే7పిపుత్రక. 31

సనత్కుమారః ప్రోవాచదాయాద పరికల్పనా | యేయం భగవతా ప్రోక్తాతాం మేవ్యాఖ్యాతు మర్హసి. 32

తదుక్తంసాధ్యముఖ్యేనవాక్యం శ్రుత్వా పితామహః | ప్రాహప్రహస్యభగవాన్‌ శృణువత్సేతి నారద. 33

ఇకశేషపాపాల లక్షణం చెబుతా విను. దేవతలకు ఋషులకు పితరులకు, విశేషించి మనుష్యులకు ఋణపడటం సర్వవర్ణ సాంకర్యం, ప్రణవ (ఓం) విసర్జనం, పాపకర్మిత్వం, మత్స భక్షణం, ఇతరులతో నిషిద్దమైన మైథునకర్మ, నేయి విక్రయించడం, చండాలుర పరిగ్రహణము, తన దోషాలు కప్పిపెట్టుకొనుట, యితరుల దోషాలు బయట పెట్టుట, మాత్సర్యం, దుష్టభూషణం, క్రూరత్వం, టాకిత్వం (దుష్టుల పేర్లు ఉచ్చరించుట), తాళవాదిత్వం (దుష్టులతోమాటాడినందున వచ్చేపాపం) యిలాంటి వాచాదోషాలు, అధార్మికత్వం దారుణత్వం, ఇవన్నీ నరకకారకాలయిన పాపాలు. ఈ పాపాలలో మునిగినవాడు శంకరుని ప్రసన్నుని చేసుకున్నచో శంకరుడు అశేషజ్ఞానమూర్తియగుటచే, ఓ ధర్మపుత్రా ! శారీరికనాచిన మానసికాలై, ఆ జన్మలో మాతాపితలు, సోదరబాంధవ ఆశ్రితులయిన వారెల్లదు కావించిన పాపాలుకూడా సర్వం, పుత్ర శిష్యుల ద్వారా పోగొట్టుకోవచ్చు. సుతులు శిష్యులు అందు సమర్థులు. అందుకు విపరీతంగా జరిగితే ఫలితాలు కూడ విపరీతంగా సంభవిస్తాయి. కాబట్టి ఓ సాధ్యా! జ్ఞాని అయినవాడు పుత్రులను శిష్యులను కలిగి ఉండాలి. దీని ఆంతర్యం గ్రహించినచో శిష్యునికన్న పుత్రుడే శ్రేష్ఠుడని తెలుసు. పుత్రుడు సర్వపాపాలనుండి రక్షిస్తే శిష్యుడు శేషించిన పాపాల నుండి మాత్రమే కాపాడతాడు. పులస్త్యుడిలా అన్నాడు నారదా! తపోధనుడైన అసాధ్యుడు పితామహుని మాటలకలరి ప్రభూ! నేను ముమ్మాటికీ మీకు పుత్రుణ్ణి. దయచేసి నాకు యోగం తెలియజేయండి. అన్నాడు. సనత్కుమారుని మాటలు విని పరమేష్ఠి - వత్సా ! నీ తల్లిదండ్రులు నిన్ను నా కొసగినచో నీవు నాకు పుత్రుడవు అవుతారనగా నా సాధ్యుడు దేవాదాయాదుడనగా నెవరో ఆ పద్ధతి నాకు తెలుపమని ఆర్థించాడు. అంతట ఓ నారదా ! పితామహుడు నవ్వి వత్సా! వినుమని అసాధ్యునితో ఇలా చెప్పాడు.

బ్రహ్మోవాచ :

ఔరసఃక్షేత్రజశ్చైవ దత్తః కృత్రిమఏవచ | గూఢోత్పన్నో7పవిద్దశ్చ దాయాబాంధవాస్తుషట్‌. 34

అమీషుషట్పు పుత్రేషు ఋణపిండధనక్రియాః | గోత్రసామ్యం కులేవృత్తిః ప్రతిష్ఠా శాశ్వతీతథా. 35

కానీనశ్చ సహోఢశ్చ క్రీతః పౌనర్భవస్తథా | స్వయందత్తః పారశవః షడదాయాడ బాంధవాః. 36

అమీభిః ఋణపిండాది కథావై నేహవిద్యతే | నామధారకా ఏవేహ న గోత్రకులసంమతాః. 37

తత్తస్య వచనంశ్రుత్వా బ్రహ్మణః సనకాగ్రజః | ఉవాచైషాం విశేషంమే బ్రహ్మన్‌ వ్యాఖ్యాతుమర్హసి. 38

తతో7బ్రవీత్సురపతిః విశేషం శృణుపుత్రక | ఔరసోయః స్వయంజాతః ప్రతిబింబ మివాత్మనః. 39

క్లీబోన్మత్తో వ్యసనిని పత్యౌ తస్యాజ్ఞయాతయా | భార్యాహ్య నాతురాపుత్రం జనయేత్‌ క్షేత్రజస్తుసః. 40

మాతాపితృభ్యాం యోదత్తః సదత్తఃపరిగీయతే | మిత్రపుత్రం మిత్రదత్తం కృత్రిమం ప్రాహురుత్తమాః. 41

కన్యాజాతస్తు కానీనః సగర్భోడః సహోఢకః | మూల్యైర్‌ గృహీతః క్రీతఃస్యా ద్వివిధః స్యాత్పునర్భవః. 42

దత్వైకస్యచయా కన్యా హృత్యా7న్యస్యప్రదీయతే |తజ్జాత స్తనయోజ్ఞేయో లోకేపౌనర్భవోమునే. 44

దుర్బిక్షేవ్యసనే చాపి యేనాత్మా వినివేదితః | సస్వయందత్త ఇత్యుక్త స్తథాన్యః కారణాంతరైః. 45

బ్రాహ్మణస్యసుతః శూద్రాం జాయతే యస్తుసువ్రతః|

ఊడాయాం వాప్యనూఢాయాం సపారశవఉచ్యతే. 46

ఏతస్మాత్‌ కారణాత్పుత్ర సస్వయం దాతుమర్హసి | స్వమాత్మానంగచ్ఛశీఘ్రం పితరౌసము పాహ్వయ. 47

తతఃసమాతాపితరౌ సస్మారవచ నాద్విభోః | తావాజగ్ముతు రీశానంద్రష్టుంవైదంపతీమునే. 48

ధర్మో7హింసాద దేవేశం ప్రణిపత్యన్యషీదతామ్‌ | ఉపసీష్టౌసుభావినౌ సాధ్యోవచనమబ్రవీత్‌. 49

ఔరసుడు క్షేత్రజుడు దత్తుడు కృత్రిముడు గూఢోత్పన్నుడు, అపవిద్ధుడు అని దాయాదులు ఆరు రకాలు. ఈ ఆరుగురకు ఋణ, పిండ, ధన, క్రియ, గోత్ర సామ్యం, కులవృత్తి, ప్రతిష్ఠలనేవి తలిదండ్రులనుంచి సహజంగా సంక్రమిస్తాయి. వీరుగాక కానీనుడు, సహోఢుడు, క్రీతుడు, పునర్భవుడు, స్వయం దత్తుడు పారశవుడనే ఆరురకాల దాయాదులున్నారు. అయితే వీరలకు మాత్రం ఋణ పిండ దానక్రియా గోత్ర, కులవృత్తి ప్రతిష్ఠలనేవి సంక్రమించవు. వీరు పేరుకు మాత్రం పుత్రులే కాని కులగోత్ర సంభవులు కారు. బ్రహ్మ మాటలు విని సనత్కుమారుడు భగవాన్‌ ! వీరల తారతమ్యం విశేషాదులు దయతో చెప్పమని అర్థించగా నా బ్రహ్మ యిలా చెప్పాడు. పుత్రా! తనవల్ల తన భార్యకు కలిగినవాడు ఔరసపుత్రుడు. అతడు తండ్రికి ప్రతిరూపమైనవాడు. నపుంసకుడు లేక వ్యసనాలకు లోనై దుర్బలుడౌన భర్త అనుమతితో భార్య మరొకరిద్వారా కనిన పుత్రుడు క్షేత్రజుడు. తలిదండ్రులచే దత్తుగా యివ్వబడిన వాడు దత్తుడు. మిత్రుడికిచ్చినవాడు కాని మిత్రుని పుత్రుడుగాని క్రీతులని పెద్దలు నిర్ణయించారు. ఏ యింట ఎవనికి పుట్టినవాడో తెలియని వాడు గూఢకుడనబడతాడు. లేక బయటనుంచి తెచ్చి పెంచుకోబడిన వాడు స్వయందత్తుడు. పెండ్లికి ముందు కన్యకు పుట్టిన వాడు కానీనుడు. వివాహానికి పూర్వమే గర్బవతి అయిన భార్యకు కలిగిన వాడు సహోఢుడు.మూల్యం చెల్లించి తెచ్చుకున్నచో వాడు క్రీతుడు. రెండు లక్షణాలు గలవాడు పునర్భవుడు అనగా ఒకరికిచ్చిన కన్యను బలాత్కారంగా అపహరించి తెచ్చి వివాహమాడిన తర్వాత పుట్టినవాడిని పునర్భవుడంటారు. కరువు కాటకాల్లో ఆకలితో అల్లాడుతూ కాని యితర విపరీత పరిస్థితుల్లో కాని వచ్చి తన్ను తాను ఆర్పించుకునేవాడు స్వయందత్తుడు. బ్రాహ్మణునకు శూద్రాంగనవల్ల కలిగిన వాడు పారశవుడు. ఈ కారణాలవల్లనో వత్సా ! నీ మాటమీద నిన్ను నేను పుత్రునిగా తీసుకోజాలను. కావున త్వరగా వెళ్ళి నీ తల్లిదండ్రులను పిలచికొని రమ్ము. నారదా ! వెంటనే నాసాధ్యుడు తన తల్లిదండ్రులను స్మరించిన మాత్రాన్నే వారలచ్చటకు వచ్చిచేరారు. అలావచ్చిన ధర్ముడు అహింసాదేవి పరమేష్ఠికి ప్రణామం చేసి కూర్చున్నారు. అలా సుఖాసీనులైన తల్లిదండ్రులను చూచి సనత్కుమారుడిలా అన్నాడు.

సనత్కుమార ఉవాచ :

యోగంజిగమిషుస్తాతః | బ్రహ్మాణం సమచూచుదమ్‌ |

సచోక్తవాన్‌ మాంపుత్రార్థే తస్మాత్త్వం దాతుమర్హసి. 50

తావేవముక్తౌ పుత్రేణ యోగాచార్యం పితామహమ్‌ | ఉక్తవంతౌ ప్రభో7యంహి ఆవయోస్తనయస్తవ. 51

ఆద్యప్రభృత్యయం పుత్ర స్తన బ్రహ్మన్‌ భవిష్యతి | ఇత్యుక్త్వా జగ్మతుస్తూర్ణం యేనై వాభ్యాగతౌ యథా. 52

పితామహో7పితం పుత్రం సాధ్యం సద్వినయాన్వితమ్‌|

సనత్కుమారం ప్రోవాచ యోగం ద్వాదశపత్రకమ్‌. 53

శిఖాసంస్థంత ఓంకారం మేషో7స్య శిరసిస్థితః | మాసోవైశాఖ నామాచ ప్రథమం పతకం స్మ్భతమ్‌. 54

సకారోముఖ సంస్థోహి వృష స్తత్రప్రకీర్తితః | జ్యేష్ఠమాసశ్చ తత్పత్రం ద్వితీయం పరికీర్తితమ్‌. 55

మోకారోభుజ యోర్యుగ్మం మిథునస్తత్రంసంస్థితః | మాసో ఆషాఢ నామాచ తృతీయం పత్రకంస్మృతమ్‌. 56

ఛకారం నేత్రయుగళం తత్రకర్కటకః స్థితః | మాసః శ్రావణ ఇత్యుక్త శ్చతుర్థం పత్రకంస్మృతమ్‌. 57

గకారం హృదయం పోక్తం సింహోవసతి తత్రచ |

మాసోభాద్రస్తథాప్రోక్తః పంచమం పత్రకంస్మృతమ్‌. 58

వకారం కవచంవిద్యాత్‌ కన్యాతత్ర ప్రతిష్ఠితా | మానశ్చాశ్వ యుజోనామ షష్ఠం తత్పత్రకంస్మృతమ్‌. 59

తేకారమస్త్రగామంచ తులారాశిః కృతాశ్రయః | మానశ్చకార్తికోనామ సప్తమం పత్రకం స్మృతమ్‌. 60

వాకారం నాభిసంయుక్తం స్థితస్తతతువృశ్చికః | మాసోమార్గశిరోనామ త్వష్టకం పత్రకంస్మృతమ్‌. 61

సుకారం జఘనంపోక్తం త తస్థశ్చధనుర్దరః | పౌషేతి గతితోమాసో నవమంపరికీ ర్తితమ్‌. 62

దేకారశ్చోరుయుగళం మకరో7ప్యత సంస్థితః | మోఘోనిగదితో మాసః పత్రకందిశమం స్మృతమ్‌. 63

వాకారోజాను యుగ్మంతు కుంభస్త తాపి సంస్థితః | పత్రకం ఫాల్గునంప్రోక్తం తదేకాదశముత్తమమ్‌. 64

పాదౌయకారోమీనో7పి సచైత్రేవసతేమునే | ఇదంద్వాదశ మంప్రోక్తం మపత్రంవై కేశవస్యహి. 65

ద్వాదశారం తదాచక్రం షణ్ణాభిద్వియుతంతధా | త్రివ్యూహమేక మూర్తిశ్చ తథోక్తః పరమేశ్వరః. 66

ఏతత్తవోక్తం ధేవస్య రూపం ద్వాదశపత్రకమ్‌ | యస్మిన్‌ జ్ఞాతేమునిశ్రేష్ఠ నభూయోమరణం భ##వేత్‌. 67

తండీ ! యోగవిద్యను గ్రహించాలని నేను పరమేష్ఠి బ్రహ్మను అర్థిస్తే ఆయన నన్ను తన పుత్రునికమ్మని నాడు. కనుక మీరలు నన్నాయనకు యివ్వగలరు. కుమారుని మాటలు విని ఆ ధర్మాహింసలు పితామహునితో భగవాన్‌! ఈనాటినుండీ మా యీ కుమారుడు నీపుత్రుడు కాగలడు. అని వెంటనే తాము వచ్చిన చోటికాదంపతులు వెళ్ళిపోయారు. అంత పితామహుడు విషయ భూషణుడైన ఆ సాధ్యపుత్రుడు సనత్కుమారునకు ద్వాదశపత్రక యోగం ఉపదేశించాడు. శిఖమీద ఓంకారం ఉంటుంది. దాని తలమీద మేషరాశి ఉంటుంది. దీనికి మాసం వైశాఖం. ఇది ప్రథమపత్రకం. ముఖం మీద 'స' కారం, వృషభరాశి జ్యేష్ఠ మాసంతో కూడినది రెండవ పత్రకం . రెండు భుజాలమీద 'మో' కారం, మిధునరాశి ఆషాడమాస యుక్తమైనది మూడవ పత్రకం. రెండు నేత్రాలమీద 'భ' కారం కర్కట రాశితో శ్రావణ మాసంతో కూడి ఉంటుంది. ఇది చతుర్థ పత్రకం హృదయ దేశాన 'గ' కారంతో సింహరాశితో భాద్రపద మాసంతో యుక్తమై ఉంటుంది. ఇది పంచమ పత్రకం. 'వ' కారం కవచ నిష్ఠమై కన్యారాశితో ఆశ్వయుజ మాసంతో కూడి ఉంటుంది. అది ఆరవ పత్రకం. బ్రహ్మ అస్త్ర సమూహాన్ని ఆశ్రయించి 'తే' కారంతో తులారాశితో ఉంటుంది. కార్తిక మాసం కలిగిన ఈవత్రకం ఏడవది. నాభితో కూడి 'వా'కారం ఉంటుంది. వృశ్చికరాశి మార్గశిర మాస సహితమైన ఈ పత్రకం ఎనిమిదవది. నడుమును ఆశ్రయించిన ధనూ రాశితో 'సు' కారం ఉంటుంది. మాసం పుష్యం ఇది నవమ పత్రకము. ఊరువుల మీద 'దే' కారం మకరరాశి ఉంటాయి. మాసం మాఘం . పదవ పత్రకం. మోకాళ్ళమీద 'వా' కారం కుంభరాశి పాల్గుణ మాసాలతో ఏకాదశ పత్రకంగా విలసిల్లుతుంది. ఇక పన్నెండవ పత్రకం పాదాల మీద మీనరాశితో చైత్ర మాసంలో ఉంటుంది. ఇలా ద్వాదశ పత్రాత్మకమైన కేశవ వాసుదేవ పరమాత్మ చక్రం పన్నెండు అరలు (అంచులు) రెండు నాభులు కలిగి ఉంటుంది. మూడు మూర్తులలో కనిపించినా ఆ పరమేశ్వరుడొక్కడే. ఆ సర్వేశ్వరుని రూపం ఈ విధంగా ద్వాదశాత్మకంగా ఉంటుంది. ఓ మునిశ్రేష్ఠా ! దీనిని తెలిసిన వారలకు మరల మరణం అంటూ ఉండదు.

ద్వితీయ ముక్తం సత్వాఢ్యం చతుర్వర్ణం చతుర్ముఖమ్‌|

చతుర్భాహుముదారాంగం శ్రీవత్సధరవమ్యయమ్‌. 68

తృతీయస్తమ సోనామ శేషమూర్తిః సహస్రపాత్‌ | సహస్రవదనః శ్రీమాన్‌ ప్రజాప్రలయకారకః. 69

చతుర్థో రాజసోనామ రక్తవర్ణశ్చతుర్ముఖః|

ద్విభుజోధారయన్‌ మాలాం సృష్టి కృచ్చాది పూరుషః. 70

అవ్యక్తాత్‌ సంభవంత్యేతే త్రయోవ్యక్తా మహామునేః |అతోమరీచి ప్రముఖా స్తథాన్య7పి సహస్రశః. 71

ఏతత్తవోక్తం మునివర్యరూపం విభోః పురాణం మతిపుష్టివర్దనమ్‌ |

చతుర్భుజం తంసమురుర్దురాత్మా కృతాంత వాక్యాత్పున తాససాద. 72

తమాగతం ప్రాహమునేః | మధుఘ్నః ప్రాప్తో7సికేనాసురకారణన?

సప్రాహయోద్దుం సహవైత్వయా7ద్య తం ప్రాహభూయః సురశత్రుహంతా. 73

యదీహమాం యోద్దుముపాగతో7సి తత్కంపతేతే హృదయంకి మర్థమ్‌?

జ్వరాతురస్వేవ ముహుర్ముహుర్వై తన్నాస్మియోత్స్యే సహకాతరేణ. 74

ఇత్యేవముక్తో మధుసూదనేన మురుస్తదాస్వే హృదయేస్వహస్తమ్‌|

కథంక్వక స్యేతిముహుస్త థోక్త్వా నిపాతయామాస విపన్న బుద్ధిః| 75

హరిశ్చచక్రం మృదులాఘవేన ముమోచతద్దృత్‌ కమలస్యశత్రోః|

చిచ్ఛేదదేవాస్తు గతవ్యథాభవన్‌ దేవం ప్రశంసంతిచ పద్మనాభమ్‌. 76

ఏతత్తోవోక్తం మురదైత్య నాశనమ్‌ కృతం హియుక్త్వా శితచక్రపాణినా|

అతః ప్రసిద్ధిం సముపాజగామ మురాదిరిత్యేవవిభుర్నృసింహ. 77

ఆ బ్రహ్మ రెండవ రూపం సత్వగుణ సంపన్నం. నాలుగు రంగుల్లో నాలుగు ముఖాలు నాలుగు బాహువులు చక్కని అంగ ప్రత్యంగాలతో పీతాంబరం ధరించి నయనానందకరంగా ఉంటుంది. మూడవది తమో ప్రధానమైన శేషమూర్తి. ఆ లక్ష్మీ వరుడు సహస్రముఖాలు సహస్ర పాదాలతో ప్రజాప్రలయం చేస్తాడు. రజోగుణ సమ్మితమైన నాలుగవ రూపం ఎర్రటి రంగులో నాలుగు ముఖాలు రెండు చేతులతో నొప్పు నాయాదిపురుషుడు మాలాధరుడై సృష్టి కార్యం నెరవేర్చుతుంటాడు.అవ్యక్త బ్రహ్మనుండి నిర్గమించిన ఈ మూడు వ్యక్త (ప్రత్యక్ష) రూపాలు. అంతనా ప్రభువునుండి మరీచి మొదలయిన ఋషులు వేల సంఖ్యలో జన్మించారు. ఓ మునిశ్రేష్ఠా ! ఈ విధంగా నీకు మతిపుష్టివర్థకమైన పరమాత్మ పురాణ రూపాన్ని వివరించి చెప్పాను. అలాంటి చతుర్భుజ ప్రభువును ఆ దురాత్ముడగు మురుడు యముని మాట ప్రకారం సమీపించాడు. ఆ వచ్చిన వాడిని చూచి మధుసూదనుడు రాక్షసా ! నీవెవరవు ? ఎందులకు వచ్చావని అడుగగా వాడు నీతో యుద్ధానికి వచ్చానన్నాడు. అంతట నా రాక్షసాంతకుడు నాతో పోరాటానికి వచ్చినవాడివైతే నీగుండె భయంతో అలా దడదడ కొట్టుకుంటున్న దెందులకు ? జ్వరార్తుల్లాగా వణికిపోయే పిరికివారలతో నేను యుద్ధం చేయను సుమా ! అన్నాడు. అంతట వాడు, తన గుండెమీద చెయ్యి పెట్టుకొని, ఆఁ! ఆఁః ఎవరి గుండె? ఎక్కడ ఎందుకు కొట్టుకుంటున్నది ? అంటూ ఉండగా నా హరి అతి లాఘవంతో మృదువుగా తన చక్రాన్ని ప్రయోగించి చేతితో సహా వాడి వక్షఃస్థలాన్ని చీల్చి సంహరించాడు. దేవతలందరు తమ బాధలు తొలగి ఆ కమల నాభుని జయజయధ్వానాలతో కీర్తించారు. నారదా! ఈ విధంగా చక్రధరుడు యుక్తితో గావించిన మురదానవ సంహారకథ నీకు వివరించాను. ఇందువలనే ఆ నృహింహ విభుడు మురారిగా ఖ్యాతివహించాడు.

ఇది శ్రీ వామనమహాపురాణంలోముప్పది యైదవ అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters