Sri Vamana Mahapuranam    Chapters   

నలుబదవ అధ్యాయము

అరజా ఉవాచ :

నాత్మానంతవదాస్యామి బహునోక్తేచ కింతవ | రక్షంతీభవతః శాపా దాత్మానంచ మహీపతే. 1

ప్రహ్లాద ఉవాచ :

ఇత్థంవివదమానం తాం భార్గవేంద్రసుతాం బలాత్‌ | కామోపహత చిత్తాత్మ వ్యధ్వంసంయతమందధీః. 2

తాంకృత్వా చ్యుతచారిత్రాం మందాంధః పృథివీపతిః నిశ్చక్రామాశ్రమాత్తస్మా ద్గతశ్చనగరం నిజమ్‌. 3

సా7పిశక్రసుతా తన్వీ అరజారజసాప్లుతా | ఆశ్రమాదథ నిర్జత్య బహిస్తస్థావధోముఖీ. 4

చింతయంతీ స్వపితరం రుదతీచ ముహూర్ముహూః | మహాగ్రహోపతప్తేవ రోహిణీశశినః ప్రియా. 5

తతోబహుతిథే కాలే సమాప్తేయజ్ఞ కర్మణి | పాతాళా దాగమచ్ఛుక్రః స్వమాశ్రమపదం మునిః 6

ఆశ్రమాంతేచ దదృశే సుతాందైత్యరజస్వలామ్‌ | మేఘలేఖామివాకాశే సంఢ్యారాగేణ రంజితామ్‌. 7

తాందృష్ట్వా పరిపప్రచ్ఛ పుత్రికేనాసి ధర్షితా | కః క్రీడతి సరోషేణ సమమాశీవిషేజహి?. 8

కో7ద్యైవ యామ్యాంనగరీం గమిష్యతి సుదుర్మతిః |

యస్త్వాంశుద్ధసమాచారాం విధ్వంసయతి పాపకృత్‌. 9

తతః స్వపితరం దృష్ట్వా కంపమానా పునః పునః రుదంతీ వ్రీడయో పేతా మందం మందమువాచహ. 10

తవశిష్యేన దండేన వార్యమాణన చాసకృత్‌ | బలాదనాథారుదతీ నీతా7హం వచనీయతామ్‌. 11

ఏతత్‌ పుత్య్రావచః శ్రుత్వా క్రోంధసంరక్తలోచనః | ఉపన్పృశ్య శుచిర్భూత్వా ఇదంవచన మబ్రవీత్‌. 12

యస్మాత్‌ తేనావినీతేన మత్తోహ్యభయ ముత్తమమ్‌ | గౌరవంచ తిరస్కృత్య చ్యుతధర్మా7రజాకృతా. 13

తస్మాత్‌ నరాష్ట్రః సబలః సభృత్యోవాహనైః సహ | సప్తకాత్రాంతరాద్‌ భస్మ గ్రావవృష్ట్యా భవిష్యతి. 14

ఇత్యేవముక్త్వా మునిపుంగవో7సౌ శప్త్వాసదండం స్వసుతామువాచ |

త్వం సాపమోక్షార్థమిహైవపుత్రి | తిష్ఠస్వ కల్యాణితపశ్చరంతీ. 15

అరజ ఇలా అన్నది : ఓ రాజా నీవు ఎన్నిచెప్పినా ఇటు శీలాన్ని, అటు శాపానలాన్నుంచి నన్ను కాపాడుటకై నేను నీకు లోబడజాలను. తర్వాత ప్రహ్లాదుడు (అంధకునితో) ఇలా అన్నాడు. అలా వాదులాడుతున్న ఆ శుక్రకుమారి తను కామాంధుడైన ఆ బుద్ధిహీనుడు బలాత్కరించి, ఆమె శీలాన్ని ధ్వంసం గావించాడు. అంతట నా ఆశ్రమాన్ని వదలి ఆ నీతిహీనుడు క్రూరుడునైన పృథివీపతి తన నగరానికి వెళ్ళిపోయాడు. పాప మాదీనురాలు అరజ, రజస్రావంతో తడిసి ఆశ్రమ కుటీరంవదలి బయట, తల వంచుకుని, తండ్రి తలచుకొని, వెక్కివెక్కి ఏడుస్తూ రాహువు గ్రసించిన చంద్రుని ప్రియురాలు రోహిణివలె కూర్చున్నది. అనంతరం బహుకాలానికి పాతాళంలో యజ్ఞం పూర్తిచేసుకుని తిరిగివచ్చి శుక్రాచార్యు డాశ్రమం బయట ఋతుస్రావపు మరకలతో నల్లటి మేఘ శకలంతోకూడిన సాయంసంధ్యలాగా పడియున్న ప్రియ పుత్రికను చూచాడు. అంతట కోపంతో అదిరిపడి గర్జిస్తూ, బిడ్డా ! ఎవడమ్మా నిన్ను చెరచిన దుర్మార్గుడు? బుసలుకొట్టే కొండత్రాచుతో ఆడే ఆ దైర్భాగ్యుడు, యమపురికి వెళ్ళేందుకు ఉబలాటపడే ఆ నికృష్టుడెవరమ్మా, అని అడిగాడు, అందులకా బాలిక తండ్రినిచూచి విలపిస్తూ లజ్జాభారంతో కంపిచిపోతూ మెల్లమెల్లగా - తండ్రీ ! నీ శిష్యుడైన దండుడు, నేను విలపిస్తూ ఎంతగా వారించినా లక్ష్యపెట్టక బలవంతంగా నన్ను నాశనంగావిచాడు. అని చెప్పింది. అంతట కోపంతో కళ్ళెర్రజేసి భార్గవుడు ఆచమనంచేసి శుచియై, నాచేత అభయం పొందియు కృతజ్ఞత వదలి గురువనే గౌరవం కూడా లేక, పవిత్రురాలైన అరజకు నా కుమార్తెకు ధర్మచ్యుతి కలిగించిన ఆ దుర్వినీతుడు (దండుడు) ఏడు రాత్రులలోపల తన బల పరివార వాహనాదులతో కూడి రాష్ట్రసమేతంగా శిలావృష్టికి గురియై భస్మీపటలం కాగలడ''ని భయంకరంగా శపించాడు. అనంతరం తన కుమార్తెనుచూచి, కల్యాణీ ! నీవింక పాపవిమోచనానికై తపంచేస్తూ ఉండమని పలికాడు.

శ##ప్త్వేత్థం భగవాన్‌ శుక్రో దండమిక్ష్వాకు నందనమ్‌ | జగామ శిష్యసహితః పాతాళం దానవాలయమ్‌. 16

దండో7పి భస్మసాద్భూతః సరాష్గ్ర బలవాహనః | మహతాగ్రావవర్షేణ సప్తరాత్రాంతరేతదా. 17

ఏవంతద్దండకారణ్యం పరిత్యజ్యంతి దేవతాః | ఆలయం రాక్షసానాంతు కృతం దేవేన శంభునా . 18

ఏవంపరకళత్రాణి నయంతి సుకృతీనపి | భన్మభూతాన్‌ ప్రాకృతాంస్తు మహాంతంచ పరాభవమ్‌. 19

తస్మాదంధక దుర్బుద్ధిః నకార్య భవతాత్వియమ్‌ | ప్రాకృతా7పి దహేన్నారీ కిముతాహో7ద్రి నందినీ. 20

శంకరో7పిన దైత్యేశ శక్యోజేతుం సుశాసురైః | ద్రష్టుమవ్యమితౌజస్కః కిముమోదయితుంరణ. 21

పులస్త్య ఉవాచ :

ఇత్యేవముక్తే వచనే క్రుద్ధస్తామ్రేక్షణః శ్వసన్‌ | వాక్యమాహ మహాతేజాః ప్రహ్లాదం చాంధకాసురః. 22

కింమమాసౌరణయోద్ధుం శక్తస్త్రినయనో7సుర | ఏకాకీధర్మ రహితో భస్మారుణిత విగ్రహః?. 23

నాంధకో బిభియాదింద్రా న్నామరేభ్యః కథంచన | సకథం వృషపత్రాక్షాద్‌ బిభేతిస్త్రీముఖేక్షకాత్‌. 24

తచ్ఛ్రుత్వాస్య వచో ఘోరం ప్రహ్లాదః ప్రాహ నారద | నసమ్యగుక్తం భవతా విరుద్ధం ధర్మతో7ర్థతః. 25

హుతాశనపతంగాభ్యాం సింహక్రోష్టుకయోరివ | గజేంద్ర మశకాభ్యాంచ రుక్మపాషాణయోరివ. 26

ఏతేషామేభి రుదితం యావదంతరమందకః | తావదేవాంతరం చాస్తి భవతో వా హరస్యచ 27

వారితో7సి మయావీర భూయో భూయశ్చవార్యసే | శృణుష్వవాక్యం దేవర్షే రసితశ్చ మహాత్మనః. 28

యోధర్మశీలో జితమానరోషో విద్యావినీతోన పరోపతాపీ |

స్వదారతుష్టః పరదారవర్జీ నతస్యలోకే భయమస్తి కించిత్‌. 29

యోధర్మహీనః కలహప్రియః సదా వరోపతాపీ శ్రుతిశాస్త్రవర్జితః |

పరార్ధదారేప్సురవర్ణనంగమీ సుఖం నవిందేత పరత్రచేహ. 30

ధర్మాన్వితో7భూద్భగవాన్‌ ప్రభాకరః సంత్యక్తరోషశ్చమునిః సవారుణిః

విద్యా7న్వితో7భూన్మను రర్కపుత్రః స్వదారసంతుష్ట మనాస్త్వగస్త్యః. 31

ఏతానిపుణ్యాని కృతాన్యమీభి ర్మయానిబద్దాని కులక్రమోక్త్వా |

తేజో7న్వితాః శాపవరక్షమాశ్చ జాతాశ్చసర్వే సురసిద్ద పూజ్యాః. 32

అధర్మయుక్తో7ంగ సుతోబభూవ విభుశ్చనిత్యం కలహప్రియో7భూత్‌.

పరోపతాపీనముచిర్దురాత్మా పరాబలేప్సుర్నహుషశ్ఛరాజా. 33

పరార్ధలిప్సుర్దితిజో హిరణ్యదృన్‌ మూర్ఖస్తు తస్యాప్యనుజః సుదుర్మతిః |

అవర్ణసంగీయదురుత్తమౌజా ఏతేవినష్టాస్త్వనయాత్‌పురాహి. 34

ఇక్ష్వాకు తనయుడైన దండుని అలా శపించి శుక్రాచార్యుడు శిష్యులతోకూడి దానవుల నెలవైన పాతాళానికి వెళ్ళాడు. ఏడురాత్రులెడతెరిపి లేకుండా కురిసిన శిలావృష్టికి నలిగి చూర్ణమై. రాష్ట్రసైన్య వాహనాదులతోసహా ఆ దండుడు సర్వనాశనమైనాడు. అప్పటినుంచీ దండకారణ్యం (అరణ్యంగా మారిన దండుని రాజ్యం) దేవతలు వర్జించారు. శివుడు దానిని రాక్షసులకు నివాసంగా చేశాడు. ఈ విధంగా పరకాంతలు, సుకృతం చేసిన వారలనుగూడా భస్మం చేయగలిగి యుండగా నిక యితరుల విషయం చెప్పవలెనా? కాబట్టి ఓ అంధకా! దుర్బుద్ధితోగూడిన ఈ ప్రయత్నం విరమించుకో ప్రాకృత (సాధారణ) స్త్రీయే తన స్పర్శతో దహింపగలిగియుండగా నిక ఆ జగజ్జనని పార్వతి విషయం చెప్పడమెందులకు? దేవ దానవులంతా ఏకమైనా శంకరుని జయింపజాలరు. కళ్ళు చెదరగొట్టే ఆయన తేజస్సునే వారు చూడజాలరనినచో ఆయనతో యుద్ధం చేసే ప్రశ్నే ఉండదని ప్రహ్లాదుడనగా క్రుద్ధుడై బుసలు కొడుతూ ఆ తేజస్వి అంధకుడు ప్రహ్లాదునితో - ఏమేమి! ఒంటరివాడు బూడిదరాయుడూ ధర్మదూరుడూ ఆయిన ఆ శివుని నాతో పోరాడగలడా? ఇంద్రాది దేవతలనే లెక్కచేయని ఈ అంధకుడు ఆకులు మెక్కుతూ ఆ డంగులము ఖాలు చూస్తూండే దిగంబరుడికి భయపడటమా? అని అపహసించాడు. ఆ కఠోరవచనాలకు చలించి, ఓ నారదా! ఆ ప్రహ్లాదుడు యిలా అన్నాడు. ''నీవు చెప్పునది ధర్మదృష్టితో చూచినా వ్యావహారికంగా చూచినా చాలా అనుచితం. అంధకేశ్వరా! అగ్నికి శలభాలకు, సింహశృగాలాలకు, ఏనుగుకూ దోమకూ, బంగారానికి, చిల్ల పెంకుకూ ఎంత తేడా ఉందో నీకూ ఆ పార్వతీపతికి అంత అంతరం సుమా. ఎంత ఎంత దూరమో ఈ సాహసం చేయవద్దని చెప్పాను. ఇంకా ఇంకా చెబుతున్నాను విను. మహాత్ముడగు దేవర్షి అసితుని హితవచనాలు వినుము. ధర్మశీలుడు, అభిమానం క్రోధం జయించినవాడు, విద్యా వినయవంతుడు, ఇతరులకు హాని కలిగించని వాడు, తన భార్యతోనే తృప్తిపడి పరకాంతలను గోరనివాడు యీ లోకంలో ఎవనికీ భయపడడు. అతనికి ఎక్కడా భయమంటూ ఉండదు. ఇక ధర్మదూరునికి, కలహప్రియుడికి, ఇతరుల బాధించేవానికీ, వేదశాస్త్రాలను వదలినవానికీ, ఇతరుల ధనాన్ని దారలను హరించేవానికీ, ఇతర వర్ణాలవారితో కలిసే వానికి (వర్ణ సంకరునకు) ఇహపరాల్లో ఎక్కడా సుఖమంటూ కలగదు. భాస్కరుడు ధర్మాన్వితుడు, వశిష్ఠుడు క్రోధం వదలినవాడు, సూర్య తనయుడు మనువు విద్యాన్వితుడు అగస్త్యుడు తన భార్యతోనే తృప్తినందినవాడు. వీరందరు నేను చెప్పిన పుణ్యాలు చేశారు. కనుకనే కులక్రమాన్ని తప్పని ఈ మహనీయులంతా తేజోన్వితులై శాపానుగ్రహ సామర్థ్యంకలిగి దేవతలకు సిద్ధులకూ పూజనీయులయ్యారు. ఇక అంగసుతుడు (వేనుడు) ధర్మదూరుడు, విభువనువాడు సదా కలహప్రియుడు, దురాత్ముడగు నముచిపరపీడకుడు, నహుషుడు పరస్త్రీలాలసుడు, హిరణ్యాక్షుడికి పరధనాలమీదనే కన్ను, వానితమ్ముడు (హిరణ్యకశిపుడు) కూడ మూర్ఖుడు దుర్భుద్ధి, ఇతర వర్ణాలవారిని భోగించిన వాడు ప్రతాపి అయిన యదురాజు, ఏరంతా గొప్ప రాజులయినా నామరూపాలు లేకుడా నశించి పోయారు గతంలో.

తస్మాద్దర్మోన సంత్యజ్యో ధర్మోహి పరమాగతిః | ధర్మహీనా నరాయాంతి రౌరవం నకంమహత్‌. 35

ధర్మస్తుగదితః పుంభి స్తారణ దివి చేహచ | పతనాయ తథా7ధర్మ ఇహలోకే వరత్రచ. 36

త్యాజ్యం ధర్మాన్వితైర్నిత్యం పరదారో పనేవనమ్‌ | నయంతి పరదారాహి నరకానేకవింశతిమ్‌|

సర్వేషా మపివర్ణానా మేషధర్మో ధ్రువో7ధక. 37

పరార్థ పరదారేషు యదా వాంఛాం కరిష్యతి | సయాతినరకం ఘోరం రౌరవం బహులాః నమాః. 38

ఏవంపురా7 సురపతే దేవర్షి రసితో7వ్యయః | ప్రాహధర్మ వ్యవస్థానం ఖగేంద్రాయా రుణాయహి. 39

తస్మాత్సు దూరతోవర్జేత్‌ పరదారాన్‌ విచక్షణః | నయంతి నికృతిప్రజ్ఞం పరదారాః పరాభవమ్‌. 40

పులస్త్య ఉవాచ :

ఇత్యేవముక్తే వచనే ప్రహ్లాదం ప్రాహచాంధకః | భవాన్‌ ధర్మపర స్త్వేకో నాహం ధర్మం సమాచరే. 41

ఇత్యేవముక్త్వా ప్రహ్లాద మంధకః ప్రాహశంబరమ్‌ | గచ్ఛశంబర శైలేంద్రం మందరం వదశంకరమ్‌. 42

భిక్షోకిమర్థం శైలేంద్రం స్వర్గౌపమ్యం సకందరమ్‌ | పరిభుంజసి కేనాద్య తవదత్తోవదస్వమామ్‌. 43

తిష్ఠంతి శాసనేమహ్యం దేవాః శక్రపురోగమాః | తత్కిమర్థం నివససే మామనాదృత్య మందరే. 44

యదీష్ట స్తవశైలేంద్ర క్రియతాం వచనంమమ | యేయం హిభవతః పత్నీ సామేశీఘ్రం ప్రదీయతామ్‌. 45

ఇత్యుక్తః సతదాతేన శంబరోమందరం ద్రుతమ్‌ | జగామతత్ర యత్రాస్తే సహదేవ్యాపినాకధృక్‌. 45

ఇత్యుక్తః సతదాతేన శంబరోమందరం ద్రుతమ్‌ | జగామతత్ర యత్రాస్తే సహదేవ్యాపినాకధృక్‌. 46

గత్వోవాచాందకవచో యాథాతథ్యందనోః సుతః | తముత్తరం హరః ప్రాహ శృణ్వత్యాగిరి కన్యయా. 47

మయాయం మందరోదత్తః సహస్రాక్షేణ ధీమతః | తన్నశక్నోమ్యహంత్యక్తుం వినాజ్ఞాం వృత్రవైరిణః. 48

వా. మ. పు. (39)

యచ్చా7బ్రవీద్ధీ యతాంమే గిరిపుత్రీతి దానవః | తదేషాయాతు స్వంకామం నాహం బారయితుంక్షమః. 49

తతో7బ్రవీద్గిరి సుతా శంబరం మునిసత్తమ | బ్రూహిగత్వా7ధంకవీర షుమవాక్యం వినిశ్చితమ్‌. 50

కాబట్టి పరమగతిఅయిన ధర్మాన్ని ఎన్నడూ వదలరాదు. ధర్మహీనుడు భయంకరమైన రౌరవనరకానికి పోతాడు. మానవులకు స్వర్గమర్త్యాలలో ధర్మమే తరణోపాయము. ఆధర్మమే ఇహపరాల్లో పతనహేతువు. ధర్మాన్వితులగు వారు సదా పరస్త్రీలకు దూరంగా ఉండాలి. పరదారయే ఇరవై యొక్క నరకాలలో పడేస్తుంది. అంధకా ! పరధనదారలను వాంఛించినవాడు అనేక సంవత్పరాలు రౌరవయాతన లనుభవిస్తాడు. ఓ రాక్షసేశ్వరా! ఈ ధర్మవ్యవస్థను పూర్వకాలాన దేవర్షియైన ఆసితుడు గరుత్మంతునకు అరుణునకు వివరించాడు. కాబట్టి విద్వాంసులగు వారు పరస్త్రీలను దూరాన్నుంచే వర్జించాలి. పరస్త్రీలు ప్రజ్ఞాహీనులను వారిని పరాభవానికి గురిచేస్తారు''. పులస్త్యుడు యిలా అన్నాడు. ఇంతదూరం ప్రహ్లాదుడు చెప్పిన నీతివాక్యాలు విని ఆ అంధకుడు ''నీవొక్కడవే ధర్మాన్ని పట్టుకొని వ్రేలాడుము. నాకు ధర్మాచరణం సమ్మతంకాదు.'' అంటూ శంబరాసురుడితో, శంబరా! వెంటనే మందరగిరికి వెళ్ళి శంకరునితో నామాటగా చెప్పుము. ఓ బిచ్చగాడా! అందమైన కందరాలతో స్వర్గంలా ఉండే సుందరశైలం నీకెందులకు? ఎవరిచ్చినారని యింకా దానిని అనుభవిస్తున్నావు? ఇంద్రాది దేవతలంతా నా శాసనాన్ని శిరసావహిస్తుండగా, నన్ను లెక్కచేయకుండా యింకా ఎందుకు అచట ఉన్నావు. అంతగా మందరం నీకు ప్రీతిపాత్రమైతే నేను చెప్పినట్లు చేయుము. నీ భార్యను వెంటనే గొనివచ్చి నాకర్పించుము'' అదివిని ఆ శంబరుడు పరమేశ్వరునితో పినాకపాణి ఉన్న మందరగిరికి త్వరగావెళ్ళాడు. అంధకుడు చెప్పినది తుచతప్పకుండా శివునకు చెప్పాడు అందుకు పార్వతి వినునట్లుగా హరుడిలా జవాబు చెప్పాడు. ''మందరగిరి నాకు ధీమంతుడైన యింద్రుడిచ్చాడు. కనుక ఆయన అనుమతి లేనిదే నేను దానినెవరికీ యివ్వను. ఇక పార్వతి. పార్వతి విషయమో, అది ఆమెకే వదిలేస్తున్నా. ఆమె వెళ్ళితే నేను కాదనను''. అంతనోమునీంద్రా! ఆ గిరితనయ శంబరునితో ఇలా చెప్పిది. 'ఓ వీరా! తెలివిగలవాడైన అంధకునితో యిలా చెప్పుము.'

అహంవతాకా సంగ్రామే భవానీశశ్చ దేవినౌ | ప్రాణద్యూతం పరిస్తీర్య యోజేష్యతి సలప్స్యతే. 51

ఇత్యేవముక్తో మతిమాన్‌ శంబరో7ధ మాగమత్‌ |

సమాగమ్యా బ్రవీద్వాక్యం శర్వగౌర్యోశ్చ బాషితమ్‌. 52

తచ్ఛ్రుత్వా దానవపతిః క్రోధదీప్తేక్షణః శ్వసన్‌ | సమాహూయా బ్రవీద్వాక్యం దుర్యోధసమిదం వచః. 53

గచ్ఛశీఘ్రం మహాబాహో భేరీం సాన్నాహీకీం దృఢామ్‌ | తాడయస్వసు విశ్రబ్ధం దుఃశీలామివ యోషితమ్‌. 54

సమాదిష్టోంధ కేనాథ భేరీం దుర్యోధనోబలాత్‌ | తాడయామాస వేగేన యథాప్రాణన భూయసా. 55

సాతాడితా బలవతా భేరీ దుర్యోధనేనహి | సత్వరం భైరవారావం రురావసురభీయథా. 56

తస్యాస్తం స్వరమాకర్ణ్య సర్వ ఏవమహాసురాః | సమాయాతాః సభాంతూర్ణం కిమేతదితి వాదినః . 57

యాథాతథ్యం చతాన్‌ సర్వా నాహసేనాపతిర్బలీ | తేచాపిబలినాం శ్రేష్ఠాః సన్నద్ధాయుద్ద కాంక్షిణః. 58

సహాంధకానిర్యయుస్తే గజైరు ష్ట్రైర్హయైరథైః | అంధకోరథమా స్థాయ పంచనల్వ ప్రమాణతః. 59

త్ర్యంబకం సపరాజేతుం కృతబుద్దిర్వి నిర్య¸° | జంభః కుజంభోహుండశ్చ తుహుండః శంబరోబలిః. 60

బాణః కార్తస్వరోహస్తీ సూర్యశత్రుర్మహోడరః | అయఃశంకుఃశిబిః శాల్వో వృషపర్వావిరోచనః. 61

హయగ్రీవః కాలనేమిః సంహ్లాదః కాలనాశనః | శరభః శలభ##శ్చైవ విప్రచిత్తిశ్చ వీర్యవాన్‌. 62

దుర్యోధనశ్చ పాకశ్చ విపాకః కాలశంబరౌ | ఏతేచాన్యేచ బహవో మహావీర్యా మహాబలాః.

ప్రజగ్మురుత్సుకా యోద్దుం నానాయుధధరా రణ. 63

ఇత్థందురాత్మా దనుసైన్యపాల స్తదాంధకో యోద్దుమనాహరేణ |

మహాచలం మందరమభ్యుపేయివాన్‌ సకాలపాశావసితోహిమందధీః. 64

ఇతి శ్రీ వామన మహాపురాణ చత్వారింశో7ధ్యాయః.

నేను సంగ్రామంలో జయపతాకను. నీవూ ఈశ్వరుడు యిద్దరూ జూదరులు. ఈ జీవన ద్యూతంలో ఎవరు గెలుతురో వారే నన్ను పొందగలరు''. అంత నా మతిమంతుడైన శంబరుడు తిరిగి వెళ్ళి శివ పార్వతుల సందేశాలను అక్షరశః వినిపించగానే ఆ దానవపతి కోపంతో బుసలుకొడుతూ దుర్యోధనుని పిలచి - ఓ మహావీరా! వెంటనే, కులట స్త్రీని మోదినట్లు యుద్ధభేరిని మోగించమని ఆదేశించాడు. అంత నా దుర్యోధను డా భేరిని తన శక్తికొలదీ త్వరగా కొట్టసాగాడు. దుర్యోధనుని దెబ్బల కా భేరి భయంకరమైన స్వరంతో సురభివలె అరిచింది. ఆ భేరీ స్వరాన్ని విని మహాదైత్యులందరూ ఈ పుసద్రవమేమని ఆలోచిస్తూ వెంటనే సభాస్థలికి చేరుకున్నారు. అంతట మహాసైన్యాధ్యక్షుడు విషయాన్నంతా నివేదించగా వారంతా యుద్ధానికి ఉబలాటపడసాగారు. అంధకుడితో కలిసి అందరూ ఏనుగులు ఒంటెలు, గుర్రాలు, రథాలు ఎక్కి బయలుదేరారు. అయిదు ఫర్లాంగులు ప్రమాణంగల రథంమీదనెక్కి అంధకుడు ఫాలాక్షుని పరాభవించడానికి పయనమయ్యాడు. జంభుడు, కుంజభుడు, హుండతుహుండులు. శంబరుడు, బాణకార్తస్వరులు, హస్తి, సూర్యశత్రువు, మహోదరుడు, అయశ్శంకువు, శిబి, సాళ్వులు, వృషపర్వవిరోచనులు, హయగ్రీవుడు, కాలనేమి, సంహ్లాద కాలనాశనులు, శరభ, శలభ, విప్రచిత్తి, దుర్యోధన, పాక, విపాక, కాల, శంబరుడాదిగాగల యితర మహాబలులెందరో నానా ఆయుధాలతో రణభూమికి నడిచారు. ఈ విధంగా సన్నద్ధుడై దురాత్ముడైన, ఆ అంధకదానవుడు హరునితో పోరాడుటకై కాలచోదితుడై, బుద్ధిగోల్పోయి, మందరగిరికి పోయి చేరాడు.

ఇది శ్రీవామన మహాపురాణంలో నలభైయవ అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters