Sri Vamana Mahapuranam    Chapters   

శ్రీ వామన పురాణ పంచోశో%ధ్యాయః (50)

పులస్త్య ఉవాచ :

గతే త్రైలోక్య రాజ్యే తు దానవేషు పురందరః, జగామ బ్రహ్మ సదనం సహదేవైః శచీపతిః|| 1

తత్రాపశ్య త్స దేవేశం బ్రహ్మాణం కమలోద్భవమ్‌, ఋషిభి స్సార్థ మాసీనం పితరం స్వంచ కశ్యపమ్‌|| 2

తతో ననామ శిరసా శక్రః సురగణౖ స్సహ, బ్రహ్మాణం కశ్యపం చైవ తాంశ్చ సర్వాం స్తపోధనాన్‌|| 3

ప్రోవాచేంద్రఃసురైఃసార్థం దేవనాథం పితామహమ్‌, పితామహ! హృతం రాజ్యం బలినా బలినా మమ|| 4

బ్రహ్మాప్రోవాచ శ##క్త్రైత ద్భుజ్యతే స్వకృతం ఫలమ్‌, శక్రని పప్రచ్ఛభో! బ్రూహి కింమయా దుష్కృతం కృతమ్‌|| 5

కశ్యపో%ప్యాహదేవేశం భ్రూణ హత్యా కృతా త్వయా, దిత్యుదరాత్‌ త్వయా గర్భః కృత్తో వై బహుధా బలాత్‌|| 6

పితరం ప్రోహదేవేంద్రః సా మాతు ర్దోషతో విభో! కృంతనం ప్రాప్తవాన్‌ గర్భో అశోచా హి సా భవత్‌|| 7

తతోబబ్రవీ త్కశ్యపస్తు| మాతదోషః సదానతామ్‌, గతస్తతో వినిహతో దాసోపి కులిశేన భోః| 8

తఛ్రుత్వా కశ్యప వచః ప్రాహ శక్రః పితామహమ్‌, వినాశం పాప్మనోబ్రూహి ప్రాయశ్చిత్తం విభో మమ|| 9

బ్రహ్మప్రోవాచ దేదేశం వశిష్ఠః కశ్యప స్తథా, హితం పర్వస్యజగతః శక్రస్యాపి విశేషతః|| 10

శంఖ చక్ర గదా పాణి ర్మాధవః పురుషోత్తమః, తం ప్రపద్యస్వ శరణం సతే శ్రేయో విధాస్యత|| 11

సహస్రాక్షోపి వచనం గురూణాం స నిశమ్య వై, ప్రోవాచ స్వల్ప కాలేన కస్మిన్‌ ప్రాప్యో బహూదయః||

త మూచు ర్దేవతా మర్త్యే స్వల్పకాలే మహూదయః|| 12

ఇత్యేవ ముక్తః సురా డ్విరించినా, మరీచి పుత్రేణ చ కశ్చపేన,

తథైవ మిత్రావరుణా త్మజేన, పేగా న్మహీపృష్ఠ మవాప్య తస్థౌ|| 13

కాలింజర స్యోత్తరతః సుపుణ్య, స్తథా హిమాద్రే రపి దక్షిణస్థః,

కుశస్థలే పూర్వత ఏవ విశ్రుతా, వసోః పురాత్‌ పశ్చిమతోవతస్థే|| 14

పూర్వం గయేన నృవరేణ యత్ర, యష్టోశ్వమేథః శతకృత్‌ సదక్షిణః

మనుష్యమేధః శకతృత్సహస్సకృ న్నరేంద్ర సూయశ్చ సహస్రకృచ్చ వై|| 15

శ్రీ వామ పురాణంలో ఏబదవ అధ్యాయము (50)

పులస్త్యు డిట్లనేను -

నారాదా| తన త్రిలోకాధిపత్యం రాక్షసు పాలైపోగా మొగము వ్రేల వేసికొని దేవతలతో కలిసి యింద్రుడు బ్రహ్మసదనాని వెళ్లాడు, అక్కడ పద్మోద్భవుడైన బ్రహ్మను, ఋషి సమూహాన్ని తన తండ్రి అయిన కశ్యప మహర్షినీ, చూచి వారలందరకు తలవంచి ప్రణామాలు గావించి యిలా విన్నవించాడు. "పితామహా| నా రాజ్యాన్నంతనూ బలిదైత్యుడు బలపూర్వంగా అపహరించాడు. 'అది విని చతుర్ముఖుడు 'అది అంతా నీ స్వయంకృతాపరాధ ఫలితమే' ననగా శక్రుడు - భగవాన్‌ నేను చేసిన దోషమేమో సెల వియ్యండి' అనగా నచటనే యున్న కశ్యపుడు - 'అది భ్రూణహత్త్యా పాపం దితి గర్భస్థ పిండాన్ని నీవు ముక్కలు గావించిన పాప ఫలం' అని మందలించగా నా పురందరుఢు - ప్రభూ| ఆమో అశుచిగా ఉన్నందుననే గర్భనాశం సంభవించిందని బదులు చెప్పగా కశ్యపుడు అశౌచం వల్ల గర్భానికి దాసత్వం కలిగింది. అయితే నీ వా దాసుణ్ణి కూడా వజ్రంతో సంహరించావు గా' అనగా ఖన్నుడై బ్రహ్మతో యింద్రుడు యిలా మొరపెట్టాడు. ప్రభో| అపరాధం జరిగింది. ఆ పాపానికి పరిహారం ప్రాయశ్చిత్తం సెలవియ్యండి.' ఇంద్రుని ప్రార్థన విని బ్రహ్మ, కశ్యపుడు, వసిష్ఠుడు, యింద్రునకూ అతనితో బాటు జగత్తుకూ మేలు కలుగునట్లు హితం చెప్పారు. 'సహస్రాక్షా| శంఖ చక్ర గాధరుడూ పురుషోత్తముడు నగు మాధవుని శరణు వేడుకొనుము ఆయన నీ శ్రేయస్సుకై తగిన ఉపాయం చెప్పగలడు|' గురు జనుల ఆ హితవచనం విని యింద్రుడు స్వల్వకాలంలో అధిక అభ్యుదయం సాధించుట ఎక్కడ వలను పడునో తెలుప మనగా నా మహర్షులు అది మర్త్యలోకంలోనే సాధ్యమని చెప్పారు. అలా బ్రహ్మ, కశ్యప, వశిష్ఠులు చెప్పన సలహా వినిన తక్షణమే యింద్రుడు భూలోకానికి చేరుకున్నడు. కాలింజర క్షేత్రానికి ఉత్తరాన పవిత్ర హిమవ త్పర్వతానకి దక్షణాన, కుశస్థలికి తూర్పున వసుపురానికి పశ్చిమాన గల ఆ పవిత్ర క్షేత్రంలో పూర్వరాజవరుడైన గయుడు సదక్షిణాకంగా నూరు అశ్వమేధ యజ్ఞాలు, నరమేధ యజ్ఞాలు నూరు వేయి, రాజసూయ యాగలు వేయిగావించాడు.

తథా పురా దుర్యజనః సురాసురైః, ఖ్యాతో మహామేధ ఇతి ప్రసిద్ధః

యత్రాస్య చక్రే భగవాన్‌ మురారిః వాస్తవ్య మవ్యక్త తనుః ఖమూర్తిమత్‌|| 16

ఖ్యాతిం జగామాథ గదాధరేతి, మహాఘవృక్షస్య శితః కుఠారః

యస్మిన్‌ ద్విజేంద్రాః శ్రుతి శాస్త్రవర్జితాః సమత్వ మాయాతి పితామహేన|| 17

పకృత్‌ పతృన్‌ యత్ర చ సంప్రపూజ్య| భక్త్వా త్వనన్యేన హి చేతసైవ|

ఫలం మహామేథ మఖస్య మానవా| లభంత్యనన్యం భగవ త్ర్పసాదాత్‌|. 18

మహాసదీ యత్ర సురర్షికన్యా జలాపదేశా ద్ధిమశైల మేత్య, చక్రే జగత్పాప వినష్టి మగ్ర్యాం సందర్శన ప్రాశన మజ్జనేన|| 19

తత్ర శక్రః సమఖ్యేత్య మహానత్యాస్తటేద్భుతే, ఆరాధనాయ దేవస్య కృత్వాశ్రమ మవస్థఇతః|| 20

ప్రాతఃస్నాయీ త్వధః శాయీ ఏకభక్త స్త్వయాచితః, తప స్తేపే సహస్రాక్షః స్తువన్‌ దేవం గదా ధరమ్‌|| 21

తసై#్యవం తప్యతః సమ్యక్‌ జిత సరేంద్రియస్య హి, కామ క్రోధ విహీనస్య సాగ్రః సంవత్సరో గతః|| 22

తతో గదాధరో ప్రీతో వాసవం ప్రాహ నారద| గచ్ఛ ప్రీతోస్మి భవతో ముక్త పాపోసి సాంప్రతమ్‌|| 23

నిజం రాజ్యం చ దేవేశ| ప్రాస్స్యసే న చిరాదివ, యతిష్యామి తథా శక్ర భావిశ్రేయో యథా తవ|| 24

ఇత్యేవ ముక్తోథ గదాధరేణ, విసర్జితః స్నాప్య మనోహరాయామ్‌ స్నాతస్య

దేవస్య తదైవతేననరాస్తం ప్రోచు రస్మా ననుశాసయస్వ|| 25

ప్రోవాచ తాన్‌ భీషణ కర్మకారాన్‌ నామ్నా పులిందాన్‌ మమ పాప సంభవాః|| వసధ్వ

మేఘాంతర మద్రియుఖ్యయో, ర్హిమాద్రి కాలింజరయోః పులిందాః|| 26

ఇత్యేవ ముక్త్వా సురారాట్‌ పులిందాన్‌, విముక్తపాపోమరసిద్ధ యక్షైః

సంపూజ్యమానా నునుజగామ చా శ్రమం మాతు స్తదా ధర్మ నివాస మీడ్యమ్‌|| 27

దృష్ట్వాదితిం మూర్ధ్ని కృతాంజలిస్తు వినమ్రమౌళిః సముపాజగామ||

ప్రణమ్య పదౌ కమలో దరాభౌ నివేదయామాస తప స్తదాత్మనః|| 28

పప్రచ్ఛ సా కారణ మీశ్వరంతం, ఆఘ్రాయ చాలింగ్య సహాశ్రు దృష్ట్యా,

స చాచచక్షే బలినా రణ జయం, తదాత్మనో దేవగణౖశ్చ సార్థమ్‌|| 29

శుత్వైవ సా శోకపరిప్లుతాంగీ జ్ఞాత్వాజితం దైత్యనుతై ః సుతం తమ్‌

దుఃఖాన్వితా దేవ మనాద్య మీడ్యం, జగామ విష్ఠుం శరణం వరేణ్యమ్‌|| 30

నారద ఉవాచ -

కస్మిన్‌ జనిత్రీ సురసత్తమానాం స్థానే హృషీకేశ మనంత మాద్యమ్‌

చరాచరస్య ప్రభవం పురాణ మారాధయామాస శుభా వద త్వమ్‌|| 31

పులస్త్య ఉవాచ -

సురారణిః శక్ర మవేక్ష్యదీనం, పరాజితం దానవ నాయకేన,

సితేథ పక్షే మకరంగతేర్కే ఘృతార్చిషః స్యా దథ సప్తమేహ్ని|| 32

దృష్ట్వైవ దేవం త్రిదశాధిపం తం మహూదయే శక్ర దిశాధిరూఢమ్‌

నిరాశనా సంయత వాక్సుచిత్తా, తదోపతస్థే శరణం సురేంద్రమ్‌|| 33

అంతే కాదు ఆ గయు డాప్రదేశాన దేవతలకు అసురులకు దుష్కరమైన మహామేధ మనే జజ్ఞం చేశాడు. ఆకాశ రూపి, మురమర్దనుడు నైన అవ్యక్త రూపి విష్ణు వాప్రదేశాన గధాధరుడుగా వెలశాడు. ఆ ప్రదేశం భయంకరమైన పాప వృక్షాలను కూలేచ కుఠారంగా ప్రసిద్ధి గాంచింది. వేద శాస్త్ర వర్జితులైన ద్వజులు గూడ ఆ ప్రదేశాన్ని సేవించి బ్రహ్మతో సమాను లౌతారు,. ఒక్క పర్యాయమైనా అక్కడ శ్రద్ధగా పిండదానంతో పితృ పూజ చేస్తే అది మానవులకు అక్షయమైన మహామేధ యజ్ఞ ఫలా న్నిస్తుంది. దేవ ఋషి కన్య అయిన మహానది, జలరూపంలో హిమగిరి వైపు ప్రవహిస్తూ ఆ ప్రదేశాన, తన దర్శన స్నాన జల ప్రాశనాదులచే జగత్తులోని పాపాలన్నింటినీ క్షాళనం చేస్తూంటుంది. ఆ ప్రదేశానికి వెళ్లి ఇంద్రుడు మహానది అద్భుత తీరాన గదాధరుని ఆరాధించుటకై ఆశ్రమ మేర్పరచుకుని నిలచి పోయాడు. ప్రతిదినం ఉదయాన్నే నదిలో స్నానం చేస నేల మీద శయనీస్తూ అయాచితంగా లభించిన దేదైనా ఉంటే రోజు కొకపర్యాయం భుజిస్తూ ఆ సహస్రాక్షుడు, గదాధరుని ఆరాధనలో తపించాడు. ఇంద్రయాలనన్నింటిని అదుపులో నుంచుకొని, కామ క్రోథాలు విడచి అలా ఒక సంవత్సర కాలం తనస్సు చేయగా ఓ నారదా| గదాధర దేవుడు సంతోషించి వాసవునితో యలా అన్నాడు - ఇంద్రా| నేను ప్రీతుడనైనాను. నీ పాపాలన్నీ యిప్పటికి తొలగి పోయాయి. వైళ్ళుము. త్వరలోనే పోగొట్టుకొన్న రాజ్యాన్ని తిరిగ పొందగలవు. నీకు శ్రేయస్సు కలుగు నట్లుగా ప్రయత్నం చేస్తాను." ఇలా వర మిచ్చి గదాధరుడు వెళ్లిన తర్వాత ఇంద్రుడు ఆ మనోహరమైననదిలో స్నానం చేసిన తర్వాత, ఆయన పాపలతో పుట్టిన మానవులలో కొందరాయనను సమీపంచి, మాకు హితోపదేశం చేయుమని అర్ధించారు. అలా వచ్చిన క్రూర కర్ములైన పుళిందు లనే ఆ కిరాతులను చూచి శక్రుడిలా అన్నాడు. 'మీరు నా పాపఫలంగ జన్మించారు. ఓ పుళిందులారా| ఈ హిమాద్రి కాళింజరాలనే ప్రముఖ పర్వతాల మధ్య దేశాన్ని నివాసంగా చేసుకుని జీవించండి| అలా పులిందుల నాదేశించి పాపముక్తుడైన ఆ వాసపుడు సుర సిద్ధ యక్షాదుల పూజ లందుకుని ధర్మభూమి అయిన తన తల్లి ఆశ్రమానికి వెళ్లాడు. తల్లి అయిన అదితిని చూచి శిరసాప్రణాం చేసి తామర పూలలో భాగానికి వలె మృదువుగా ఎర్రగా ఉన్న ఆమె పాదాలను కన్నుల కద్దుకుని తన తపస్సు విషయాన్ని నివేదించాడు. ఆమె ఆశ్రు పూరిత నయనాలతో కుమారుని కౌగలించుకుని శిరస్సు మూర్కాని తపస్సుకు కారణ మేమని ప్రశ్నించగా నా శక్రుడు బలి దైత్యునితో యుద్దంతో ఓడిపోయి రాజ్యం కోలుపోవడ మంతా వివరించాడు. దితి కుమారులచేత పరాభవించ బడిన తన సుతుని దుర్దశకు ఆ సాధ్వి దుఃఖంతో క్రుంగిపోయి అద్యంత రహితుడు, వరేణ్యుడు నైన ఆ విష్ణుని ఆశ్రయించి శరణు పొందింది. అద విని నారదు డోమహర్షీష ఆ దోవ మాత ఏ ప్రదేశంలో చరాచర సృష్టికర్తా పురాణ పురుషుడూ, అనంతుడు నైన ఆ హృషీకేశుని ఆరాధించినది చెప్పండని అర్ధించాడు. అందుకు పులస్త్యుడిలా చెప్పాడు. నారదా| తన పుత్రుడావిధంగా బలి చేతిలో ఓడిపోయి దీనుడై యుండుట చూచి ఆ అదితి మాఘ శుద్ధ సప్తమీ పవిత్ర దినాన తూర్పున ఉదయించిన త్రిదశాధిపతిని దర్శించి మౌనం పాటించి నిరాహారయై తపో దీక్ష వహించింది. ఆ జగచ్ఛక్షువును ప్రసన్నురాలై యిలా ప్రార్ధించింది - 33.

అదితి రువచ -

జయస్వ దివ్యాంబుజ కోశ చోర| జయస్వ సంసార తరోః కుఠార!

జయస్వ పాపేంధన జాతవేద| స్తమౌఘ సంరోధ! నమో నమస్తే|| 34

నమెస్తుతే భాస్కర దివ్యూర్తే! త్రైలోక్య లక్ష్మీ తిలకాయ తే నమః||

త్వం కారణం సర్వచరాచరస్య నాధోసి మాంపాలయ విశ్వమూర్తే!|| 35

త్వయా జగన్నాథ! జగన్మయేన నాథేన శక్రో నిజ రాజ్య హానిమ్‌||

అవాప్తవాన్‌ శత్రు పరాభవం చ, తతో భవంతం శరణం ప్రపన్నా!! 36

ఇత్యేవ ముక్త్వా సురపూజితం సా ఆలిఖ్య రక్తేన హి చందనేనీ,

సంపూజయిత్వా కరవీర పుషై#్పః సంధూప్య ధూపైః కణ మర్క భోజ్యమ్‌|| 37

నివద్య చైవా జ్యయుతం మహార్హ మన్నం మహేంద్రస్య హితాయ దేవీ||

స్తవేన పుణ్యన చ సంస్తువంతీ స్థితా నిరాహార మథోపవాసమ్‌||

తతో ద్వితీయేహ్ని కృతప్రణామా స్నాత్వా విధానేన చ పూజయిత్వ||

దత్వ ద్విజేభ్యః కణకం తిలాజ్యం తతోతా సా ప్రయతా బభూవ|| 39

తతః ప్రీతోభవద్భానుః ఘృతార్చిః సూర్యమండలాత్‌, వినిః సృతో గ్రతః స్థిత్వా ఇదంవచన మబ్రవీత్‌|| 40

వ్రతే నానేన సుప్రీత!హం దక్షనందినీ! ప్రాప్స్యసే దుర్లభం కామం మత్ర్పసాదా న్నసంశయమ్‌|. 41

రాజ్యం త్వత్తనయానాం వై దాస్యే దేవీ! సురారణి! దానవాన్‌ ధ్వంసయిషఅయామీ సంభూయై వోదరే తవ|| 42

తద్వాక్యం వాసుదేవస్య శ్రుత్వా బ్రహ్మన్‌! సురారణిః ప్రోవాచ జగతాం యోనిం వేపమానా పునః పునః|| 43

కథం త్వా ముదరేణాహం వోఢుం శక్ష్యామి దుర్ధరమ్‌, యస్యోవరే జగ త్సర్వం వసతే స్థాణు జంగమమ్‌|| 44

కస్త్వాం ధారయితుం నాథ! శక్తః త్రైలోక్య ధార్యసి, యస్య సప్తార్ణవాః కుక్షౌ నివసంతి సహాద్రిభిః|| 45

తస్మా ద్యధా సురవతిః శక్రః స్యాత్సురరా డిహ, యథా చ న మమ క్లేశస్తథా జనార్దవ!|| 46

విష్ణు రువాచ -

సత్య మేత స్మహాభాగే! దుర్ధరోస్మి సురాసురైః, తథాపి సంభవిష్యామి అహం దేవ్యుదరే తవ|| 47

ఆత్మానం భువనాన్‌ శైలాం స్త్వాం చదేవి! సకశ్యపామ్‌, ధారయష్యామి యోగేన మావిషాదం కృథాంబికే!|| 48

తవోదరేహం దాక్షేయ సంభవిష్యామి వై యదా, తదా నిస్తేజసో దైత్యాః సంభవిష్యం త్య సంశయమ్‌|| 49

ఇత్యేవ ముక్త్వా భగవాన్‌ వివేశ తస్యాశ్చ భుయోరి గణ ప్రమర్దీ

స్వతేజసాంశేన వివేశ దేవ్యాః తదోదరేశక్ర హితాయ విప్ర!|| 50

ఇతి శ్రీ వామన పురాణ పంచాశోధ్యయః సమాప్తః

దితి యిలా స్తోత్రం చేసింది - 'దివ్య కమలాల గర్భస్థ శోభను పరిహసించు సౌందర్య నిధీ! నీకు జయ మగు గాక! సంసారతరువును ఛేదించు కుఠారమా నీకు జయ మగుగాక! పాపాలనే కట్టెల ప్రోవును భస్మం గావించు అగ్నిదేవా! నీకు జయ మగుగాక! పాపసంఘాలను నిరోధించు ప్రభూ నీకు జయము జయము! దివ్య విగ్రహుడ వగునో భాస్కరా! సూర్యమండలాంతర్వర్తి నారాయణా నీకు నమస్సులు! త్రిలోక ఐశ్వర్య నిధీ! నీకు ప్రణామం! ఈ చరాచర జగత్తు కంతకూ నీవే మూలం. సర్వేశ్వరుడవు. ఓ విశఅవమూర్తీ! నన్నుకాపాడుము. జగన్మయుడవూ, జగత్పతివీ అయిన నీవల్లనే యింద్రుడు సర్వస్వం కోలుపోయి శత్రువులచే పరాభవం పొందాడు. అందుచేత నేను నీ మరుగున చేరాను. నన్ను రక్షించుము. ఇలా స్తోత్రం చేసి ఆదేవమాత శ్రీమన్నారాయణుని ప్రతిమను రక్తచందనములతో నలంకరించి కరవీర మాలతో పూజించి ధూపదీపాదులచే నర్చించి ఆజ్యసంమిశ్రితమైన శౌన్యన్నం నైవేద్యం చేసింది. ఇంద్రుని క్షేమానికై ప్రభువును స్తుతిస్తూ ఆ దేవజనని నిర్జలోపవాసం గావించింది. రెండవ రోజు విధి విహితంగా స్నాన పూజాదికాలు నిర్వరించి బ్రాహ్మణులకు స్వర్ణం తిలలు అమృతం దానం చేసి ప్రణామం గావించింది. అంతట సంప్రీతుడై ఘృతార్చి అయిన ఆ స్యూనారాయణుడు సూర్యమండలాన్నుంచి వలువడి ఆ దక్షకుమారి ఎదుట నిలచి యిలా అన్నాడు - 'ఓ దాక్షాయణి! నీవు గావించిన వ్రతానికి సంతోషించాను. నా ప్రసాదం వల్ల నీ కోరిక నెరవేరుతుంది. ఓ దేవజననీ! నీ పుత్రులకు వారల రాజ్యం ఇచ్చెదను. సందేహించవద్దు. నీ కడుపున పుట్టిదైత్యులను నిర్మూలిస్తాను" వాసుదేవుని మాటలకు గడ గడ వడకుచు నా అదితి, ఓ నారదా! ఆ జన్మూర్తితో యిలా అన్నది. 'ప్రభో! స్థావర జంగమ సృష్టిని ఉదరంలో పెట్టుకొని దుర్ధరుడవుగా నుండే నిన్ను నే నెలా కుక్షిలో ధరించగలను? తండ్రి! జగన్నాథా! ముల్లోకాలూ ధరిస్తూ పర్వత సమూహ సహితమైన సాగర సప్తకాన్ని పొట్టలో నింపుకున్న నిన్నెవరు భరించగలరు? కాబట్టి ఓ జనార్దనా! నాకు కష్టం కలగని విధంగా ప్రయత్నించు. శక్రుని మరల నీ వన్నట్లు నేను దేవతలకూ అసురులకూ దుర్ధరుడనే అయినప్పటికీ నీ కడుపుననే పుడతానమ్మా! యోగబలంతో నన్నూ యీలోకాలనూ పర్వతాలనూ కశ్యపునితో సహా నిన్నూ కూడా కలుపుకెని నీ కడుపులో నుండి జన్మిస్తాను. దిగులు పడవద్దు. నీకెలాటి కష్టమూ కలుగ నీయ నమ్మా! నేను నీ గర్భాన జనించుటతోనే రాక్షసలోకం అంతా నిర్జీవమై పోతుంది. సందేహింపకుము. అలా నా దేవమాత నూరడించి ఆ శత్రుమర్దను డామో గర్భంలోతన సమస్తతేజము యొక్క సూక్ష్మాంశంతో, ఇంద్రుని హితర్థమై ప్రవేశించాడు - 50

ఇది శ్రీ వామన పురాణంలో ఏబదవ అధ్యాయం సమాప్తమైంది.

Sri Vamana Mahapuranam    Chapters