Sri Vamana Mahapuranam    Chapters   

ఎనిమిదవ అధ్యాయము

పులస్త్య ఉవాచ :

శార్‌ఙ్గపాణిన మాయాంతం దృష్ట్వా7గ్రే దానవేశ్వరః |

పరిభ్రామ్య గదాంవేగాత్‌ మూర్ద్ని సాధ్య మతాడయత్‌. 1

తాడితస్యాథగదయా ధర్మపుత్రస్య నారద | నేత్రాభ్యా మపతద్వారి వహ్నివర్షనిభం భువి. 2

మూర్ద్ని నారాయణస్యా పి సాగదాదానవార్పితా | జగామ శతధాబ్రహ్మన్‌ శైలశృంగేయథా7శనిః. 3

తతో నివృత్యదైత్యేంద్రః సమాస్థాయరథం ద్రుతమ్‌ | ఆదాయ కార్ముకం వీరస్తూణాద్‌ బాణంసమాదదే. 4

ఆనమ్య చాపంవేగేన గార్ధపత్రాన్‌ శిలీముఖాన్‌ | ముమోచ సాధ్యాయ తదా క్రోధాంధకారితాననః. 5

పులస్త్యుడిట్లనెను: శార్‌జ్గధనువును ధరించి తనవైపు వచ్చుచున్న నారాయణుని చూచి, దానవేశ్వరుడు, తన గదను గిరగిర త్రిప్పి ఆసాధ్యుని నెత్తిపై బలముగా మోదెను. నారదా ! అట్లు గదచే ప్రహరించబడిన ఆ ధర్మపుత్రుని నేత్రాల నుండి అగ్నివృష్టివలె జలధారలు భూమిపై రాలెను. నారాయణుని నెత్తిమీదపడిన ఆ గదాదండం, కొండ శిఖరం మీదపడిన పిడుగునకు వలె నూరు ప్రక్కలుగా పగిలిపోయెను. అంతట వెనుదిరిగి, ఆదానవ వీరుడు త్వరగా తన రథముపై నెక్కి కార్ముకము చేతగొని అమ్ముల పొదినుండి బాణమును తీసికొనెను. క్రోధంతో నల్లబడిన మోముగల ఆ దానవేశ్వరుడు, గృధ్రపత్రాలతో నలంకరింపబడిన బాణాలను వింట సంధించి ఆ సాధ్యునిపై గుప్పించెను.

తానాపతతఏవాశు బాణాన్‌ చంద్రర్థసన్నిభాన్‌| చిచ్ఛేదబాణౖ రపరై ర్నిర్బిభేదచ దానవమ్‌. 6

తతోనారాయణందైత్యో దైత్యం నారాయణఃశ##రైః | ఆవిధ్యేతాం తదా7న్యోన్యం మర్మభిద్భిరజిహ్మగైః . 7

తతోం7బరే సన్నిహితో దేవానా మభవన్మునే | దిదృక్షూణాం తదా యుద్దం లఘు చిత్రంచ సుష్ఠుచ. 8

తతఃసురాణాందుందుభ్యస్‌ త్వవాద్యంత మహాస్వనాః | పుష్పవర్ష మనౌపమ్యం ముముచుః సాధ్యదైత్యయోః.

తతః పశ్యత్సు దేవేషు గగనస్థేషు తావుభౌ | ఆయుధ్యేతాం మహేష్వాసౌ ప్రేక్షకప్రీతివర్ధనమ్‌. 10

బబంధతు స్తదాకాశం తావుభౌ శరవృష్టిభిః | దిశశ్చవిదిశ##శ్చైవ ఛాదయేతాం శరోత్కరైః . 11

తతో నారాయణశ్చాపం సమాకృష్య మహామునే | బిభేద మార్గణౖస్తీక్ష్నైః ప్రహ్లాదం సర్వమర్మసు. 12

తథా దైత్యేశ్వరః క్రుద్ద శ్చాపమానమ్య వేగవాన్‌ | బిభేద హృదయేబాహ్వో ర్వదనేచ నరోత్తమమ్‌. 13

ఇలాతనపైకి వచ్చుచున్న అర్ధ చంద్రబాణాలను తన శరపరంపరతో మధ్య మార్గాన్నే ఖండించి నారాయణుడా దానవుని నిశితమార్గణాలతో గాయపరచెను. ఆ విధంగా ఆ వీరులిరువురు ఒకరినొకరు తీవ్రములగు బాణములతో భేదించుకొనిరి. సాధ్య దైత్యుల ఆభీకర సంగ్రామాన్ని తిలకించిన దేవతలు గగనతలాన నిలబడి దుందుభులు మ్రోగించుచూ ఆ వీరులపై పుష్పవృష్టి కురిపించిరి. ఆ విధంగా ఆకాశాన్నుంచి తిలకించుచున్న దేవతలకు ప్రీతివర్ధకంగా ఆ వీరులు అద్భుతసంగ్రామం గావించిరి. వారి బాణాసనాలనుంచి వెడలిన, అసంఖ్యాక శరాలతో భూమ్యాకాశాలు అష్టదిక్కులు కప్పబడినాయి. బ్రహ్మవర్షే ! అంతట నారాయణుడు తన ధనుస్సును బాగుగా వంచి అతి తీవ్రమైన బాణముతో ప్రహ్లాదుని మర్మ స్థానమున గొట్టెను. అలా సర్వమర్మ స్థానములందు ప్రహరింపబడిన ప్రహ్లాదుడు ప్రచండమైనకోపంతో, నారాయణుని వక్షస్థలమును బాహువులను ముఖమును బాణాలతో నింపివైచెను.

తతో7స్యతోదైత్యపతేః కార్ముకం ముష్టిబంధనాత్‌ | చిచ్ఛేదైకేనబాణన చంద్రార్ధకారవర్చసా. 14

ఆపాస్యతధనుఃఛిన్నం చాపమాదాయచాపరమ్‌ | అధిజ్యంలాఘవాత్కృత్వా వవర్షనిశితాన్‌ శరామ్‌. 15

తానప్యస్యశరాన్‌ సాధ్య శ్ఛిత్వా బాణౖరవారయత్‌ | కార్ముకంచ క్షురప్రేణ చిచ్ఛేద పురుషోత్తమః . 16

ఛిన్నం ఛిన్నందనుర్దైత్య స్త్వన్య దన్యత్సమాదదే | సమాదత్తం తదా సాధ్యోమునేచిచ్ఛేద లాఘవాత్‌. 17

సంఛిన్నేష్వథ చాపేషు జగ్రాహ దితిజేశ్వరః | పరిఘం దారుణందీర్ఘం సర్వలోహమయం దృఢమ్‌. 18

పరిగృహ్యాథ పరిఘాం భ్రామయామాస దానవః | భ్రామ్యమాణం సచిచ్ఛేద నారాచేన మహామునిః. 19

ఛిన్నేతు పరిఘే శ్రీమాన్‌ ప్రహ్లాదో దానవేశ్వరః | ముద్గరం భ్రామ్యవేగేన ప్రచిక్షేప నరాగ్రజే. 20

తమాపతంతం బలవాన్‌ మర్గణౖ ర్దశభిర్మునే | చిచ్ఛేద దశాధాసాధ్యః సచ్ఛిన్నో న్యపతద్‌ భుమి. 21

ముద్గరేవితథేజాతే ప్రాసమావిధ్య వేగవాన్‌ | ప్రచిక్షేప నరాగ్రాయ తంచచిచ్ఛే ధర్మజః. 22

ప్రాసేచ్ఛిన్నేతతోదైత్యః శక్తిమాదాయ చిక్షిపే | తాంచ చిచ్ఛేద బలవాన్‌ క్షురప్రేణ మహాతపాః. 23

అంతట నారాయణుడొక అర్ధ చంద్ర బాణంతో దైత్యేశ్వరుని చేతిలోని వింటిని ఖండించివైచెను. అంతట దైత్యుడు వేరొక ధనుస్సుగైకొని అతిలాఘవంతో నారాయణునిపై బాణవృష్టి గురియించెను. సాధ్యుడగు నారాయణుడా బాణములను ఖండించి ఒక తీవ్రమైన శరంతో శత్రువు వింటిని రెండు తునుకలు గావించెను. వెంటనే దైత్యుడు వేరొక ధనుస్సు గైకొనినంతనే దానిని గూడ నా పురుషోత్తముడు రెప్పపాటులో త్రుంచివైచెను ఈ విధంగా రాక్షస రాజు బాణాసనాలనెన్నింటినో ఖండించివైచెను. తన కార్ముకాలన్నీ యీ విధంగా ఖండింపబడుట చూచి క్రోధతామ్రాక్షుడై దైత్యపతి, అతి భయంకరం సుదీర్ఘం సర్వలోహమయమైన పరిఘ (గురియ) ను గైకొనెను. ఆ ప్రచండమైన పరిఘనాతడు భయంకరంగా త్రిప్పుతుండగా దానిని నారాయణుడొక బాణముతో ముక్కలుగావించెను. పరిఘతునుకలుకాగా శ్రీ మంతుడైన ప్రహ్లాదుడొక ముద్గరమును చేకొని అతివేగంగా త్రిప్పి నారాయణునిపై విసరెను. మహామునీ ! ఆ వచ్చుచున్న ముద్గరాన్ని నారాయణుడు పది బాణములతో శతధాభిన్నము గావించెను. ముద్గరం వ్యర్థంకాగా దైత్యుడు ప్రాసమును ప్రయోగింపగా దానిని కూడ ధర్మపుత్రుడు ఖండించి వైచెను. అంతట దైత్యపతి శక్తిని ప్రయోగించగా నద్దానినిగూడ తీవ్రబాణాలతో ఆ తపస్వి వారించెను.

ఛిన్నేషుతేషుశ##స్త్రేషు దానవో7న్యన్మహద్దనుః | సమాదాయ తతోబాణౖ రవతస్తార నారద. 24

తతోనారాయణోదేవో దైత్యనాథం జగద్గురుః | నారాచేన జఘానాథ హృదయే సురతాపసః. 25

సంభిన్నహృదయో బ్రహ్మన్‌ దేవేనాద్‌ భుతకర్మణా | నిపపాత రథోపస్థే తమపోవాహ సారథి. 26

ససంజ్ఞాం సుచిరేణౖవ ప్రతిలభ్య దితీశ్వరః | సుదృఢం చాపమాదాయ భూయో యోద్దుముపాగతః . 27

తమాగతం సంనిరీక్ష్య ప్రత్యువాచ నరాగ్రజః | గచ్ఛ దైత్యేంద్ర యోత్స్యామః ప్రాతస్త్వాహ్నిక మాచర.

ఏవముక్తో దితీశస్తు సాధ్యేనాద్భుతకర్మణా | జగామ నైమిషారణ్యం క్రియాం చక్రే తదా77హ్నికీమ్‌. 29

నారదా ! ఆశస్త్రాలట్లు వ్యర్థంకాగా నాదానవుడు వేరొక మహా ధనుస్సును గైకొని నలువైపులా బాణముల గురి పించెను. అంతట జగద్గురువగు నారాయణుడొక బాణమున తానా దైత్యుని వక్షమును భేదించెను. బ్రహ్మర్షే ! అద్భుత కర్ముడగు నాతపోధనునిచే వక్షము విదీర్ణము కాగా నాదైత్యుడు రథముపై నొరగిపోయెను, వెంటనే సారథి అతనిని అచ్చట నుండి దూరముగా గొనిపోయెను. అచిరకాలంలోనే మూర్ఛనుండి తేరుకొని దానవపతి వేరొక దృఢచాపాన్ని తీసికొని మరల యుద్ధమునకు దలపడెను. అంతట నరాగ్రజుడతని జూచి - ఓ దైత్యేంద్రా ! రేపు ప్రాతఃకాలమున మరల యుద్ధము చేయుదము. ఇంతట వెళ్లి నిత్యాహ్నికములు నెరవేర్చుకొమ్మనెను. నారాయణుని మాటలు విని దైత్యనాధుడు నైమిషారణ్యమునకు వెళ్లి ఆహ్నికకృత్యములు నెరవేర్చుకొనెను.

ఏవంయుద్ద్యతి దేవేచ ప్రహ్లాదో హ్యసురోమునే | రాత్రౌ చింతయతే యుద్దే కథంజేష్యామిదాంభికమ్‌. 30

ఏవంనారాయణనా7సౌ సహాయుద్ధ్యతనారద | దివ్యంవర్షసహస్రంతు దైత్యోదేవం నచాజయత్‌. 31

తతోవర్షసహస్రాంతే హ్యజితే పురుషోత్తమే | పీతవాససమభ్యేత్య దానవో వాక్యమబ్రవీత్‌. 32

కిమర్థందేవదేవేశ సాధ్యం నారాయణం హరిమ్‌ | విజేతుంనా7ద్యశక్నోమి ఏతన్మే కారణం వద. 33

పీతవాసా ఉవాచ:

దుర్జయో7సౌ మహాబాహు స్త్వయా ప్రహ్లాదధర్మజః | సాధ్యో విప్రవరో ధీమాన్‌ మృథేదేవాసురైరపి. 34

ప్రహ్లాద ఉవాచ :

యద్యసౌ దుర్జయోదేవః మయా సాధ్యో రణాజిరే | తత్కథం యత్ర్పతిజ్ఞాతం తదసత్యం భవిష్యతి. 35

హీనప్రతిజ్ఞో దేవేశ కథంజీవేత మాదృశః | తస్మాత్తవాగ్రతోవిష్ణో కరిష్యే కాయశోధనమ్‌. 36

పులస్త్య ఉవాచ :

ఇత్యేవముక్త్వా వచనం దేవాగ్రే దానవేశ్వరః | శిరఃస్నాతస్తదాతస్థౌ గృణన్‌బ్రహ్మ సనాతనమ్‌. 37

తతోదైత్యపతిం విష్ణుః పీతవాసా7బ్రవీద్వచః | గచ్ఛ జేష్యసి భక్త్యా తం న యుద్దేన కథంచన. 38

ప్రహ్లాద ఉవాచ :

మయాజితం దేవదేవ త్రైలోక్యమపి సువ్రతః | జితోయంత్వత్ర్పసాదేవ శక్రఃకిముత ధర్మజః. 39

అసౌయద్యజయోదేవ త్రైలోక్యేనాపి సువ్రతః | నస్థాతుంత్వత్ర్పసాదేన శక్యంకిముకరోమ్యజ. 40

పీతవాసా ఉవాచ :

సో7హం దానవశార్దూల లోకానాం హితకామ్యయా | ధర్మంప్రవర్తాపయితుం తపశ్చర్యాం సమాస్థితః. 41

తస్మా ద్యదీచ్ఛసి జయం తమారాధయ దానవ | తంపరాజేష్య సే భక్త్యా తస్మా చ్ఛుశ్రూష ధర్మజమ్‌. 42

పులస్త్య ఉవాచ :

ఇత్యుక్తః పీతవాసేన దానవేంద్రో మహాత్మనా | అబ్రవీద్వచనం హృష్టః సమాహూయా7ంధకం మునే. 43

మునీ ! నారాయణుడు గావించు సంగ్రామమును చూచి ప్రహ్లాదుడా రాత్రి, ' ఈ కపట మునిని నిర్జించుటెట్లా యని ఆలోచనలో బడెను నారదా ! వారిర్వురావిధంగా వేయి దివ్యవత్సరములు పోరాడిరి. అయితే దైత్యరాజా తపస్వినిజయింపజాలడయ్యెను. దానితో విసిగిపోయి ప్రహ్లాదుడు పీతవాసుడగు విష్ణుదేవుని సమీపించి యిట్లనెను-'ఓదేవ దేవేశ్వరా! యింతకాలం యుద్ధ మొనరించినను, ఈ సాధ్యుడగు నారాయణుని జయింపలేకపోతిని. యిందులకు కారణమేమి ?'

అంతట విష్ణువు యిట్లనెను: ప్రహ్లాదా ! మహాబాహువగు నీ ధర్మపుత్రుని నీవు జయింపజాలవు. ధీనమంతుడగు నీసాధ్యవిప్రోత్తముని దేవతలు రాక్షసులు సైతము నిర్జింపలేరు సుమా !

ప్రహ్లాదుడిట్లనెను : ''ప్రభూ! ఆతడజేయుడగుచో నేను చేసి ప్రతిజ్ఞ నెరవేరుటెట్లు? నావంటివాడు హీనప్రతిజ్ఞుడై ఎట్లు జీవింపగలడు ? కాబట్టి ఓవిష్ణూ ! నీ ఎదుటనే ఈ శరీర శోధనము కావించుకొందును.''

పులస్త్యుడిట్లనెను : విష్ణునితో నిట్లు పలికి ప్రహ్లాదుడు శిరస్నానము గావించి ఆసీనుడై బ్రహ్మానుసంధానమున కుపక్రమించెను. అంతట నతనితో విష్ణుడిట్లనెను. ''నీ వాయనను భక్తి ప్రపత్తులతోనే జయింపగలవు. యుద్ధమున నెన్నటికీ జయింపజాలవు. పొమ్ముః''

ప్రహ్లాదుడనెను: ఓ దేవదేవా ! నీ దయవల్లనేను ముల్లోకాలనూ జయించాను. యింద్రుని సైతం గెలిచాను. ఈ యిర్వురు మూడులోకాలకూ అజేయులగుచో, ఓ అభవా ! నేనెట్లు జీవింతును ? నాకు దారి ఏది ?

పీతవాసుడిట్లనెను: ఓ దానవేశ్వరా ! లోకకల్యాణ కాంక్షతో ధర్మ ప్రవర్తనార్థమై నేనే కఠోరతపశ్చర్యకు పూనుకొంటిని. కాబట్టి నీవు జియింపగోరుచో వారలనారాధింపుము. వారిని భక్తితో జయింపుము. వెళ్లి ధర్మసుతునకు శుశ్రూషగావింపుము.

ప్రహ్లాద ఉవాచ :

దైత్యాశ్చ దానవాశ్చైవ పరిపాల్య స్త్వయాంధక | మయోత్సృష్టమిదం రాజ్యం ప్రతీచ్ఛస్వ మహాభుజ.

ఇత్యేవముక్తో జగ్రాహ రాజ్యం హైరణ్యలోచనిః | ప్రహ్లాదో7పితదా7గచ్ఛత్‌ పుణ్యం బదరికాశ్రమమ్‌. 45

పులస్త్యుడిట్లనెను. ఓమునీ ! శ్రీ విష్ణుడిట్లు చెప్పగా దానవేంద్రుడు సంతోషించిన వాడై అంధకుని బిలిచి యిట్లనెను. ''మహా బలశాలివైన అంధకా ! దైత్యదానవులను నేటి నుండియు నీవు పరిపాలించుము. నేనీ రాజ్యము పరిత్యజిస్తున్నాను. దీనిని నీవు గైకొనుము.'' హిరణ్యాక్ష పుత్రుడైన అంధకుడు ప్రహ్లాదుని కోరిక ప్రకారము రాజ్యము తీసికొనగా ప్రహ్లాదుడచ్చట నుండి పవిత్రమైన బదరికా వనమునకు బోయెను.

దృష్ట్వా నారాయణందేవం నరంచ దితిజేశ్వరః | కృతాంజలిపుటో భూత్వా వవందే చరణౌ తయోః . 46

తమువాచ మహాతేజా వాక్యం నారాయణో7వ్యయః | కిమర్థంప్రణతో7సీహ మామజిత్వా మహాసుర. 47

ప్రహ్లాద ఉవాచ :

కస్త్వాంజేతుంప్రభో శక్తః కస్త్వత్తః పురుషో7ధికః |త్వంహి నారాయణో7నంతః పీతవాసా జనార్దనః.

త్వందేవః పుండరీకాక్షః త్వంవిష్ణుః శార్‌ఙ్గచాపధృక్‌ | త్వమవ్యయోమహేశానః శాశ్వతః పురుషోత్తమః.

త్వాంయోగినశ్చింతయంతి చార్చ యంతి మనీషిణః | జపంతి స్నాతకాస్త్వాంచ యజంతి త్వాం చ యాజ్ఞికాః.

త్వమచ్యుతో హృషీకేశ శ్చక్రపాణి ర్థరాధరః | మహామీనో హయశిరా స్త్వమేవ వరకచ్ఛపః. 51

హిరణ్యాక్షరిపుః శ్రీమాన్‌ భగవానథ సూకరః | మత్పితుర్నాశనకరో భవానపి నృకేసరీ. 52

బ్రహ్మా త్రినేత్రో7మరరాడ్‌ హుతాశః ప్రేతాధిపో నీరపతిః సమీరః |

సూర్యో మృగాంకో7చల జంగమాద్యో భవాన్విభో నాథ ఖగేంద్రకేతో. 53

త్వం పృథ్వీ జ్యోతి రాకాశం జలం భూత్వా సహస్రశః |

త్వయావ్యాప్తం జగత్సర్వం కస్త్వాం జేష్యతి మాధవః 54

భక్త్యాయది హృషీకేశ తోషమేషి జగద్గురో | నాన్యథా త్వం ప్రశక్యో7సి జేతుం సర్వగతావ్యయ. 55

భగవానువాచ :

పరితుష్టో7స్మి తే దైత్య స్తవేనానేన సువ్రత | భక్త్యా త్వనన్యయా చాహం త్వయాదైత్య పరాజితః . 56

పరాజితశ్చ పురుషో దైత్యఃదండం ప్రయచ్ఛతి | దండార్థం తే ప్రదాస్యామి వరం వృణు యమిచ్ఛసి. 57

ప్రహ్లాద ఉవాచ :

నారాయణ వరం యాచే యం త్వం మే దాతు మర్హసి |

తన్మేపాపం లయం యాతు శారీరం మానసం తథా. 58

వాచికం చ జగన్నాథ యత్త్వయా సహ యుధ్యతః | నరేణ యద్యప్యభవద్‌ వరమే తత్ర్పయచ్ఛమే. 59

నారాయణ ఉవాచ :

ఏవం భవతు దైత్యేంద్ర పాపం తేయాతు సంక్షయమ్‌|

ద్వితీయం ప్రార్థయ వరం తం దదామి తవాసుర. 60

ప్రహ్లాద ఉవాచ :

యా యా జాయేత మే బుద్ధిః సా సా విష్ణోత్వదాశ్రితా | దేవార్చనే చ నిరతా త్వచ్చిత్తా త్వత్పరాయణా.

నారాయణ ఉవాచ :

ఏవం భవిష్యత్యసుర వరమన్యం య మిచ్ఛసి | తం వృణీష్వ మహాబాహో ప్రదాస్యా మ్యవిచారయన్‌. 62

ప్రహ్లాద ఉవాచ :

సర్వమేవ మయా లబ్దం త్వత్ర్పసాదా దధోక్షజ | త్వత్పాదపంక జాభ్యాం హి ఖ్యాతిరస్తు సదా మమ. 63

నారాయణ ఉవాచ :

ఏవమస్త్వపరం చాస్తు నిత్యమేవాక్ష యో7వ్యయః | అజర శ్చామరశ్చాపి మత్ర్పసాదా ద్భవిష్యసి. 64

గచ్ఛస్వ దైత్యశార్దూల స్వమావాసం క్రియారతః | నకర్మబంధో భవతో మచ్చిత్తస్య భవిష్యతి. 65

వ్రశాసయదమూన్‌ దైత్యాన్‌ రాజ్యం పాలయ శాశ్వతమ్‌|

స్వజాతిసదృశం దైత్య కురు ధర్మ మనుత్తమమ్‌. 66

అచట నరనారాయణులను చూచి చేతులు జోడించి నమస్కరించెను. అతనిని చూచి మహాతేజస్వి అయిన నారాయణుడిట్లనెను. ''అసురోత్తమాః ఇదేమి, మమ్ము జయింపక ఈ నమస్కరించుటేల?''

ప్రహ్లాదుడిట్లనెను. ''ప్రభో ! మిమ్ము జయింప గల వారెవ్వరు? మీ కంటె అధికులెవ్వరు? నీవు సాక్షాత్తు నారాయణుడవు, అనంతుడవు, పీతాంబరుడ వగు జానార్దనుడవు. దేవా ! నీవే పుండరీకాక్షుడవు ! శార్‌జ్గపాణి యగు విష్ణుడవు! అవ్యయుడవు మహేశానుడవు. పురుషోత్తముడవు శాశ్వతుడవు: యోగులు నిన్నే ధ్యానింతురు, మనీషులు నిన్నర్చింతురు. స్నాతకులు నీ నామాన్ని జపిస్తారు. యాజ్ఞికులు యజ్ఞేశ్వరునిగా యజిస్తారు. నిన్ను హృషీకేశుడనీ చక్రధరుడనీ, ధరాధరుడనీ, మత్స్యమూర్తివనీ, హయగ్రీవుడవనీ, కూర్మ మూర్తివనీ కీర్తిస్తారు. హిరణ్యాక్షుని సంహరించిన భగవంతుడవగు శ్రీ వరాహమూర్తివి నీవే! నా తండ్రిని వధించిన నృకేసరివి గూడ నీవే స్వామీ! హే గరుడధ్వజా! విభో! బ్రహ్మ, శివుడు యింద్రుడు, అగ్ని, యముడు వరుణుడు, వాయువు, సూర్యచంద్రులు, జంగమస్థావరాత్మకమైన ఈ సర్వము నీవే. హే! లక్ష్మీ పతీ! భూమి జ్యోతి రాకాశ జల రూపాన వేవేల మూర్తులతో జగత్తునంతటా వ్యాపించియున్న నిన్నెవడు జయింపగలడు? జగద్గురోః సర్వగతుడవు అవ్యయుడవునగు నిన్ను భక్తిచేతనే జయింపనగును. మరే విధంగానైననూ నిన్ను జయింపలేరు!

అంతట భగవానుడిట్లనెను: సువ్రతుడవగు దైత్యపతీః నీ స్తోత్రమునకు సంతోషించితిని. అనన్యమైన నీ భక్తి చేతనేనోడింపబడితిని. ఓడిపోయిన వారు పరిహారం చెల్లించుకోవలెను. పరిహారరూపాన నీకొక వరం ప్రసాదిస్తున్నాను. కోరుము.

ప్రహ్లాదుడనెను. వరదేశ్వరా ! ప్రభో ! నిన్ను శత్రువుగా నెంచి నేను (యుద్ధము చేసి) చేసిన మానసిక వాచిక శారీరక పాపములన్నింటిని నశింపజేయుము. మహాత్ముడగు నరుని యెడ గావించిన అపరాధము క్షమింపుము. జగత్ర్పభో!

నారాయణుడనెను. దైత్యేంద్రా! అట్లే అగుగాక, నీ పాప సంక్షయమగు గాక. యింకొక వరము కోరుకొనుము.

ప్రహ్లాదుడనెను. విష్ణో ! నా బుద్ధులన్నియు నెల్లవేళలందునూ నిన్నా శ్రయించుకొని యుండుగాక. నీపూజ అర్చన ఉపాసనలందే లగ్నమై యుండుగాక.

నారాయణ వచనము. తథాస్తు. మహావీరా ! మరొక వరము కోరుకొనుము. కాదనక నిచ్చెద.

ప్రహ్లాదుడనెను. అధోక్షజా! ప్రభూ! నీ దయతో నా కన్నియు లభించినవి. ఎల్లపుడు నీ పాదముల భక్తి నాకనుగ్రహింపుము.

నారాయణుడనెను. అట్లెయగు గాక. అంతే కాదు. నా ప్రసాదం వల్ల నీవు అజరామరుడవై చిరకాలం వర్థిల్ల గలవు. రాక్షస శార్దూలా ! వెంటనే నిజావాసమునకు వెళ్ళి కర్మరతుడవుకమ్ము. మత్పరాయణుడవైన నిన్ను కర్మబంధములంటవు. శాశ్వతంగా దైత్యరాజ్యానికధిపతివై స్వకులోచితమైన ధర్మాచరణము గావింపుము.

పులస్త్య ఉవాచ :

ఇత్యుక్తో లోకనాథేన ప్రహ్లాదో దేవ మబ్రవీత్‌ | కథం రాజ్యం సమాదాస్యే పరిత్యక్తం జగద్గురో. 67

తమువాచ జగత్‌స్వామీ గచ్ఛ త్వం నిజమాశ్రయమ్‌ | హితోపదేష్టా దైత్యానాం దానవానాం తథా భవ. 68

నారాయణ నైవముక్తః స తదా దైత్యనాయకః | ప్రణిపత్య విభుం తుష్టో జగామ నగరం నిజమ్‌ 69

దృష్టః సభాజితశ్చాపి దానవైరంధకేన చ | నిమంత్రితశ్చ రాజ్యాయ న ప్రత్యైచ్ఛత్స నారద. 70

రాజ్యం పరిత్యజ్య మహా7సురేంద్రో నియోజయన్‌ సత్పథి దానవేంద్రాన్‌ |

ధ్యాయన్స్మరన్‌ కేశవ మప్రమేయం తస్థౌతదా యోగవిశుద్దదేహః. 71

ఏవం పురా నారద దానవేంద్రో నారాయణ నోత్తమపూరుషేణ |

పరాజితశ్చాపి విముచ్య రాజ్యం తస్థే మనో ధాతరి సన్నివేశ్య. 72

ఇతి శ్రీ వామన మహాపురాణ అష్టమో7ధ్యాయః.

పులస్త్యుడనెను. జగన్నాథుని మాటలు విని ప్రహ్లాదుడిట్లనెను. ''ప్రభో! ఒక పర్యాయము వదలిన రాజ్యాన్ని మరలనెట్లు గ్రహించగలను? ధర్మమూర్తీ!'' అందులకు భగవంతుడు ''అట్లగుచో రాక్షస జాతికంతకు హితోపదేశకుడవుగా నుండి దైత్య దానవులను కాపాడుము'' అనెను. నారాయణునిచే ననుజ్ఞాతుడై ఆదైత్యేశ్వరుడు స్వామికి మ్రొక్కి సంతోషముతో నిజ మందిరమున కరిగెను. తిరిగి వచ్చిన ప్రహ్లాదుని దైత్యదానవులు ఆంధకుడు సంభావించి రాజ్యమును మరల స్వీకరించమనిరి. కాని ఆ మహా జ్ఞాని అందులకంగీకరింపడయ్యెను. నారదా ! గడ్డిపోచవలె సకల దానవ రాజ్యాన్నీ పరిత్యజించి అంధకుని సన్మార్గమున నడపుచు రాక్షసులకు మార్గదర్శియై, ఆ మహనీయుడు, నిరంతరము అప్రమేయుడగు శ్రీహరిని ఆరాధించుచు మహాయోగియై వర్ధిల్లెను.

నారదా ! ఈ విధంగా పురాసమయాన దానవేంద్రుడగు ప్రహ్లాదుడు పురుషోత్తముడగు నారాయణునిచే పరాజితుడయ్యు, రాజ్యత్యాగం కావించి తన చిత్తవృత్తులన్నియు నా భగవంతునిపై నుంచి ధన్యుడాయెను.

శ్రీ వామన మహాపురాణములోని ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters