Sri Vamana Mahapuranam    Chapters   

శ్రీ వామన పురాణ ఏక షష్ఠితమో%ధ్యాయః

పులస్త్య ఉవాచ :-

ద్వితీయం పాప శమనం స్తవం వక్ష్యామి తే మునే ! | యేన సమ్య గధీతేన పాపం నాశం తు గచ్చతి || 1

మత్స్యం నమస్యే దేవేశం కూర్మం గోవింద మే వ చ | హయశీర్షం నమస్యే%హం భవం విష్ణుం త్రివిక్రమమ్‌ || 2

నమస్యే మాధవేశానౌ హృషీ కేశ కుమారిణౌ | నారాయణం నమస్యే%హం నమస్యే గరుడాసనమ్‌ || 3

ఊర్ద్వకేశం నృసింహం చ రూపధారం కురుధ్వజమ్‌ | కామపాల మఖండ చ నమస్తే బ్రాహ్మణ ప్రియమ్‌ || 4

అజితం విశ్వ కర్మాణం పుండరీకం ద్విజ ప్రియమ్‌ | హంసం శంభుం నమస్యే చ బ్రహ్మాణం సప్రజాపతి మ్‌ || 5

నమస్యే శూల బాహుం చ దేవం చక్రధరం తథా | శివం విష్ణుం సువర్ణాక్షం గోపతిం పీత వాససమ్‌ || 6

నమస్యే చ గదా పాణిం నమస్యే చ కుశేశయమ్‌ | అర్థనారీశ్వరం దేవం నమస్యే పాప నాశనమ్‌ || 7

గోపాలం చ సవైకుఠం నమస్తే చా%పరాజితమ్‌ | నమస్యే విశ్వరూపంచ సౌగంధిం సర్వదా శివమ్‌ || 8

పాంచాలికం హయగ్రీవం స్వయంభు మమరేశ్వరమ్‌ | నమస్యే పుష్కరాక్షం చ పయోగంధిం చ కేసవమ్‌ || 9

అవిముక్తం చ లోలం చ జ్యేష్ఠేశం మధ్యమం తథా | ఉపశాంతం నమస్యే%హం మార్కండేయం సజంబుకమ్‌ || 10

నమస్యే పద్మకిరణం నమస్యే బడవా ముఖమ్‌ | కార్తికేయం నమస్యే%హం బాహ్లీకం శిఖినం తథా || 11

నమస్యే స్థాణు మనఘం నమస్యే వనమాలినమ్‌ | నమస్యే లాంగలీశం చ నమస్యే%హం శ్రియః పతిమ్‌ || 12

నమస్యే చ త్రినయనం నమస్యే హవ్య వాహనమ్‌ | నమస్యేచ త్రిసౌవర్ణం నమస్యే ధరణీధరమ్‌ || 13

త్రిణాచికేతం బ్రహ్మేశం నమ స్యే శశి భూషణమ్‌ | కపర్తినం నమస్యే చ సర్వామయ వినాశనమ్‌ || 14

శ్రీ వామన పురాణంలో అరువది యొకటవ అధ్యాయము

పాప శమన స్తోత్రము

పులస్త్యుడు రెండవ పాప శమన స్తోత్రం నారదున కిలా వివరించాడు నారదా రెండవ పాపశమన స్తోత్రం వినుము దీనిని చక్కగా అధ్యయనం చేసినచో సర్వ పాపాలు నశించి పోతాయి.

ఓం! మత్స్య మూర్తికి నమస్కారము. దేవేశ్వరు డగు కూర్మదేవునకు, గోవిందునకు, హయగ్రీవునకు, నమస్కరిస్తున్నాను. త్రివిక్రముడు భవుడు నగు విష్ణునకు ప్రణామాలు. శివ కేశవులకు, హృషీ కేశ కార్తి కేయులకు, ప్రణామాలు. నారాయణునకు గరుడాసనునకు కైమోడ్పులు. ఊర్ద్వకేశి, నృసింహుడు, రూపధారి కురుధ్వజుడు, కామపాలుడు, అఖండుడు నగు బ్రాహ్మణ ప్రియునకు నమస్కరిస్తున్నాను. అజితునకు, విశ్వకర్మకు, పుండరీకునకు, ద్విజప్రియునకు, హంసునకు, శంభునకు, ప్రజాపతి సహేతు డగు విరించికి నమస్సులు. శూలపాణి చక్రధరులకు, జోహారులు. శివ విష్ణు హిరణ్య నేత్ర గోపతులకు, పీతాంబరునకు ప్రణామములు. గదాధ రునకు, కుశేశయునకు, పాపనాశకునకు, ఆర్దనారీశ్వరునకు నమోవచనములు. గోపాలునకు, వైకుఠునకు, అపరాజితునకు, విశ్వరూపునకు, సౌగంధికి, సదాశివునకు ప్రణామాలు చేయుచున్నాను. పాంచాలికునకు, హయగ్రీవునకు, స్వయంభువునకు, అమరేశునకు, పుష్కరాక్షునకు, పయోగంధికి కేశవునకు నమస్కారములు. అవిముక్త ప్రభువునకు, లోలునకు, జ్యేష్ఠేశ్వరునకు, మధ్యమునకు, ఉపశాంతునకు, మార్కండేయ జంబుకులకు, ప్రణామములు. పద్మ కిరణునకు నమస్సులు. బడవా ముఖునకు జోతలు. కార్తికేయ బాహ్లీక శఖి రూపు డగు ప్రభువుకు ప్రణామాలు. స్థాణువునకు, అనఘనకు, వనమాలాధరునకు, లాంగవీశునకు, శ్రియః పతికి, నమస్కరించెదను. త్రినేత్రునకు, హవ్యవాహనునకు, త్రిసౌవర్లునకు, ధరణీ ధరునకు ప్రణామములు. త్రిణాచికేతునకు, బ్రహ్మేశునకు, శశి భూషణునకు, కపర్దీశునకు, సర్వామయ వినాశునకు ప్రణమిల్లుతున్నాను.

నమస్యే శశినం సూర్యం ధ్రువం రౌద్రం మహౌజసమ్‌ | పద్మనాభం హిరణ్యాక్షం నమస్యే స్కంద మవ్యయమ్‌ || 15

నమస్యే భీమ హం సౌ చ నమస్యే హాటకేశ్వరమ్‌ | సదా హంసం నమస్యే చ నమస్యే ప్రాణ తర్పణమ్‌ || 16

నమస్యే రుక్మ కవచం మహాయోగిన మీశ్వరమ్‌ | నమస్యే శ్రీనివాసం చ నమస్యే పురుషోత్తమమ్‌ || 17

నమస్యే చ చతుర్భాహుం నమస్యే వసుధాధిపమ్‌ | వనస్పతిం పశుపతిం నమస్యే ప్రభు మవ్యయమ్‌ || 18

శ్రీ కంఠం వాసుదేవంచ నీల కంఠం సదండినమ్‌ | నమస్యే సర్వ మనఘం గౌరీశం నకులీశ్వరమ్‌ || 19

మనోహరం కృష్ణ కేశం నమస్యే చక్ర పాణినమ్‌ | యశోధరం మహాబాహుం నమ్సయే చ కుశప్రియమ్‌ || 20

భూధరం ఛాదితగదం సునేత్రం శూల శంఖినమ్‌ | భద్రాక్షం వీరభద్రం చ నమస్యే శంకు కర్ణికమ్‌ || 21

వృషధ్వజం మహేశం చ విశ్వామిత్రం శశిప్రభమ్‌ | ఉపేంద్రం చైవ గోవిందం నమస్యే పంకజప్రియమ్‌ || 22

సహస్రశిరసం దేవం నమస్యే కుంద మాలినమ్‌ | కాలాగ్నిం రుద్ర దేవేశం నమస్యే కృత్తివాససమ్‌ || 23

నమస్యే భాగలేశం చ నమస్యే పంకజాసనమ్‌ | సహస్రాక్షం కోకనదం నమస్యే హరిశంకరమ్‌ || 24

అగస్త్యం గరుడం విష్ణుం కపిలం బ్రహ్మవాజ్‌ మయమ్‌ | సనాతనం చ బ్రహ్మణం నమస్తే బ్రహ్మత త్పరమ్‌ || 25

అప్రతర్క్యం చతుర్బాహుం సహస్రాంశు తపో మయమ్‌ | నమస్యే ధర్మరాజానం దేవం గరుడ వాహనమ్‌ || 26

సర్వ భూతగతం శాంతం నిర్మలం సర్వ లక్షణమ్‌ | మహాయోగిన మవ్యక్తం నమస్యే పాప నాశనమ్‌ || 27

నిరంజనం నిరాకారం నిర్గుణం నిర్మలం పదమ్‌ | నమస్యే పాప హంతారం శరణ్యం శరణం వ్రజే || 28

ఏత త్ప విత్రం పరమం పురాణం | ప్రోక్తం త్వగస్త్యేన మహర్షిణా చ | ధన్యం యశస్యం బహు పాప నాశనం |

సంకీర్తనా త్స్మరణా త్సంశ్రవాచ్చ || 29

ఇతి శ్రీవా మన పురాణ ఏక షష్టి తమో ధ్యాయః సమాప్తము.

చంద్రసూర్యులకు, ధ్రువునకు, మహాఓజస్వియగు రుద్రునకు, పద్మనాభునకు, హిరణ్య, నేత్రునకు, అవ్యయుడగు స్కందునకు, నమస్కరించెదను. భీమ హంస దేవులకు, హాటకేశ్వరునకు, ప్రాణ తర్పణునకు, సదా నమస్కార మొనరింతును. బంగారు కవచంతో వెలిగే మహా యోగీశ్వరునకు, శ్రీనివాసునకు, పురుషోత్తమునకు, ప్రణామములు. చతుర్భుజునకు, వసుధావల్లభునకు, వనస్పతికి, పశుపతికి, అవ్యయడగు ప్రభువుకు జోతలు. శ్రీకంఠునకు, వాసుదేవునకు, నీలకంఠ సదండినులకు నమస్కారములు. శర్వునకు, అనఘనకు, గౌరీశునకు, వీశునకు, ప్రణమిల్లెదను. మనోహరుడగు కృష్ణ కేశునకు, చక్ర పాణి, యశోధరునకు, మహాభుజుడగు కుశప్రియునకు, ప్రణామములు. భూధరునకు, ఛాదిత గదునకు, సునేత్రునకు, శూల శంఖునకు, భద్రాక్షునకు, వీరభద్రునకు, శంకుకర్ణునకు నమస్కారములు. వృషధ్వజ, మహేశ్వర, విశ్వామిత్ర, శశిప్రభులకు, ఉపేంద్ర, గోవింద, పంకజ ప్రియులకు నమస్సులు. సహస్ర శిరసు డగు స్వామికి, కుంద మాలా ధరునకు, రుద్ర దేవాధిపతికి, కాలాగ్నికి, కృత్తివాసునకు నమస్కృతులు. ఛాగలేశునకు, పంకజాసనునకు, సహస్రాక్షునకు, కోకనదునకు, హరి శంకరునకు, ప్రణామములు. అగస్త్యునకు, గరుడునకు, విష్ణునికి, కపటునకు, వాగ్రూపియగు బ్రహ్మకు, సనాతనునకు, బ్రహ్మకు, బ్రహ్మతత్పపరునకు, నమోవాకములు. అప్రతర్క్యునకు, చతుర్భాహునకు, సహస్రాంశునకు, తపోమయునకు, ధర్మరాజుకు, గరుడవాహనునకు నతులొనర్తును. సర్వభూతాంతర్గతుడు, శాంతుడు, నిర్మలుడు, సర్వలక్షణుడు, మహాయోగికి, అవ్యక్తునకు, పాప నాశనునకు వందనము లొనర్తును. నిరంజనుడు, నిరాకారుడు, నిర్గుణుడు, నిర్మల పద వాచ్యునకు, పాప హంతకు, శరణ్యుడగు సర్వేశ్వరునకు శరణాగతుడ నగుచున్నాను!

ఓ నారదా ! ఈ స్తోత్రం పవిత్రమైనది బహు పురాతనమైనది. అగస్త్య మహర్షి చెప్పినది. దీనిని కీర్తించినా స్మరించినా శ్రవణం గావించినా అనేక పాపాలు నశించియశస్సు ధన్యత లభించును.

ఇది శ్రీవామన పురాణంలో అరువది యొకటవ అధ్యాయము ముగిసినది.

Sri Vamana Mahapuranam    Chapters