Sri Vamana Mahapuranam    Chapters   

శ్రీ వామన పురాణ సప్త షష్టి తమో%ధ్యాయః

పులస్త్య ఉవాచ :-

గత్వా రసాతలం దైత్యో మహార్హ మణి చిత్రితమ్‌ | శుద్ద స్పటిక సోపానం కారయామాస వైపురమ్‌ || 1

తత్ర మధ్యే సువిస్తీర్ణః ప్రాసాదో వజ్రవేదికః | ముక్తా జాలాంతర ద్వారో నిర్మితో విశ్వ కర్మణా || 2

తత సై#్తర్వివిధాన్‌ భోగాన్‌ భుజన్‌ దివ్యాన్‌ సమానుషాన్‌ | నామ్నా వింధ్యావళీ త్యేవం భార్యా%స్య దయితా%భవత్‌ || 3

యువతీనాం సహస్రస్య ప్రధానా శీల మండితా | తయా సహ మహీ తేజా రేమే వైరోచని ర్మునే! || 4

భోగా సక్తస్య దైత్యస్య వసతః సుతలే తదా | దైత్య తేజో హరః ప్రాప్తః పాతాళే వై సుదర్శనః || 5

చక్ర ప్రవిష్టే పాతాళం దానవానాం పురో మహత్‌ | బబౌహలం హలా శబ్దః క్షుభితార్ణవ సంనిభః || 6

తం చశ్రుత్వా మహా శబ్దం బలిః ఖడ్గం సమాదదే | ఆః కిమేత దితీత్థం చ పప్ర చ్ఛాసుర పుంగవః || 7

తతో వింధ్యా వళీ ప్రాహ సాంత్వయంతీ నిజం పతిమ్‌ | కోశే ఖడ్గం సమావేశ్య ధర్మ పత్నీ శుచి వ్రతా || 8

ఏత ద్భగవతః శ్చక్రం దైత్య చక్ర క్షయం కరమ్‌ | సంపూజనీయం దైత్యేంద్ర! వామనస్య మహాత్మనః| ఇత్యేవ ముక్త్వా చార్వంగీ సార్ఘ్యపాత్రా వినిర్య¸° || 9

అథాభ్యాగాత్‌ సహస్రారం విష్ణోశ్చక్రం సుదర్శనమ్‌ | తతో%సురపతిః ప్రహ్వః కృతాంజలి పుటో మునే | సంపూజ్య విధివ చ్చక్ర మిదం స్తోత్ర ముదీరయత్‌ || 10

బలిరువాచ :-

నమస్యామి హరేశ్చక్రం దైత్య చక్ర విదారణమ్‌ | సహస్రాంశుం సహస్రాభం సహస్రారం సునిర్మలమ్‌ || 11

నమస్యామి హరే శ్చక్రం యస్య నాభ్యాం పితామహః | తుండే త్రి శూల ధృక్‌ శర్వ ఆరా మూలే మహాద్రయః || 12

ఆరేషు సంస్థితా దేవాః సేంద్రాః సార్కాః సపావకాః | జవే యస్య స్థితో వాయు రాపో%గ్నిః పృధీవీ నభః || 13

ఆర ప్రాంతేషు జీమూతాః సౌదామి నృక్ష తారకాః | బాహ్యతో మున యో యస్య వాలఖిల్యా%దయస్తథా || 14

తమాయుధ వరం వందే వాసుదేవస్య భక్తి తః | యన్మే పాపం శరీరోత్థం వాగ్జం మాన స మేవ చ || 15

తన్మే దహస్వ దీప్తాం శో! విష్ణో! శ్చక్ర సుదర్శన! | యన్మే కులోద్భవం పాపం పైతృకం మాతృకం తథా || 16

తన్మే హరస్వ తరసా నమస్తే అచ్యుతాయుధ! | ఆధయో మమ నశ్యం తు వ్యాధయో యాంతు సంక్షయమ్‌ కీర్తనాచ్చక్ర! దురితం యాతు సంక్షయమ్‌ త్వన్నామ || 17

శ్రీ వామన పురాణం లో అరువది ఏడవ అధ్యాయము

పులస్త్యుడిలా అన్నాడు. రసాతలానికి వెళ్లిన దైత్యేశ్వరుడు బలి శుద్ధ స్పటి కమణి సోపానాలతో వివిధమణులతో చక్కని నగరం నిర్మించు కున్నాడు. ఆ నగరం మధ్యన వజ్రాల అరుగులతో, ముత్యాల తోరణాల ద్వారాలతో, విశ్వకర్మ నిర్మించిన విశాలమైన భవనంలో నివాసం చేస్తూ వివిధాలైన దేవ మానుష భోగాలను వింధ్యావళి యను ధర్మ పత్నితో కలిసి అనుభవించాడు. ఆయన వేయిమంది బార్యలలో నా వింధ్యావళి ప్రధానురాలు. సద్గుణ రాశి, శీలవతి. ఆమెతో కలిసి అలా ఆ విరోచన సుతుడు సుతలంలో సకల భోగాలు అనుభవిస్తూండగా నొకపరి ఆ పాతాళానికి రాక్షస తేజో హారి అయిన సుదర్శన చక్రం వచ్చింది. ఆ రాక్షసనగరంలో చక్రం ప్రవేశించ గానే సముద్ర క్షోభకు సమానమైన గొప్ప తుముల ధ్వని వ్యాపించింది. అది విన్నంతనే ఆ బలి దైత్యుడదరి పడి ఖడ్గం దూసి ఏమిటీ ఉపద్రవమని ప్రశ్నించాడు. అతని భార్య వెంటనే అతనిని శాంతింప జేస్తూ ఖడ్గం కోశంలో పెట్టండి. ఈ ధ్వని దైత్య చక్ర సంహారి యగు విష్ణుదేవుని చక్రానిది. మహాత్ముడగు వామనదేవుని ఈ దివ్యాయుధం మనకు పూజనీయం. అని కర్తవ్యమెరిగించి, చేతిలో అర్ఘ్య పాత్ర తీసికొని భర్తతో బయలు దేరింది. ఇంతలో వేయి అంచులతో వెలిగి పోతూ విష్ణు చక్రం వారలను సమీపించగా నా దైత్య నాథుడు అంజలి ఘటించి భక్తి యుక్తుడై సుదర్శనుని పూజించి ఇలా స్తోత్రం చేశాడు.

శ్రీ సుదర్శన చక్ర స్తవము

దైత్య చక్రనాశకమగు శ్రీహరి చక్రానికి నమస్కరిస్తున్నాను. వేయి కిరణాల దీప్తితో వేయి అంచుల తో వెలిగే పవిత్ర మగు విష్ణు చక్రానికి నమస్సులు. ఈ సుదర్శన దేవునకు నాభి యందు బ్రహ్మ, ముఖ భాగాన శూలపాణి శంకరుడు, అంచుల మొదళ్లలో ఇంద్రాదిత్య అగ్నుల తో కూడిన దేవ సమూహం, నిలచి యున్నారు. ఈ ప్రభువు వేగం వాయు, జల, అనల, పృధివీ, గగన, సమన్వితము. అప్రతిహతము! అర(ఆకు)ల కిరువైపులా మేఘాలు, విద్యుత్తులు, గ్రహ తారకలు, పరివేష్టించి ఉన్నవి. బాహ్య ప్రాంతాన వాలఖిల్యాది తపోధనులు సేవిస్తూ ఉన్నారు. అలాంటి శ్రేష్ఠమైన వాసుదేవుని ఆయుధానికి ప్రణమిల్లు తున్నాను. ఓ ప్రభూ! సుదర్శన దేవా! విష్ణు చక్ర రాజా! నేను దేహంతో, వాణితో, మనస్సుతో చేసిన పాప సమూహాన్నంతా నీ అగ్ని శిఖలతో దహించి వేయుము. నా వంశంలో తల్లి వైపున గానీ, తండ్రి వైపున గాని సంభవించిన పాపా లన్నింటినీ తక్షణమే హరించుము. ఓ అచ్యుతుని ఆయుధమా! నీకు నమస్సులు. నా మానసికాలయిన ఆధులు (బాధలు) శరీర సంబంధితాలయి వ్యాధులు (రోగాలు) నశించును గాక! ఓ చక్రేశ్వరా! నీ పవిత్ర నామ స్మరణం చే నా దురితా లన్నీ క్షయమగు గాక! నీకు శతశః నమస్సులు!

ఇత్యేవ ముక్త్వా మతిమాన్‌ సమభ్యర్చ్యా ధ భక్తితః| సంస్మరన్‌ పుండరీకాక్షం సర్వ పాప ప్రణాశనమ్‌ || 18

పూజితం బలినా చక్రం కృత్వా నిస్తేజసో%సురాన్‌ | నిశ్చక్రామా థ పాతాళా ద్విషువే దక్షిణ మునే! || 19

సుదర్శనే నిర్గతే తు బలి ర్విక్లబతాం గతః | పరమా మాపదం ప్రాప్య సస్మార స్వపితామహమ్‌ || 20

స చా పి సంస్మృతః ప్రాప్తః సుతలం దానవేశ్వరః | దృష్ట్వా తస్థౌ మహాతేజాః సార్ఘ్య పాత్రో బలి స్తదా || 21

తమర్చ్య విధినా బ్రహ్మన్‌! పితుః పితర మీశ్వరమ్‌ | కృతాంజలి పుటో భూత్వా ఇదం వచన మబ్రవీత్‌ || 22

సంస్మృతో %సి మయా తాత! సువిషణ్ణన చేతసా! | తన్మే హితం చ పథ్యం చ శ్రేయోగ్య్రం వద తాతమే || 23

కిం కార్యం తాత! సంసారే వసతా పురుషేణ హి | కృతేన యేనవై నా%స్య బంధః సముపజాయతే || 24

సంసారార్ణవ మగ్నానాం నరాణా మల్ప చేతసామ్‌ | తరణ యో భ##వేత్‌ పోతః తన్మే వ్యాఖ్యాతు మర్హసి || 25

పులస్త్య ఉవాచ :-

ఏత ద్వచన మా కర్ణ్య తత్‌ పౌత్రా ద్దానవేశ్వరః | విచింత్య ప్రాహ వచనం సంసారే యద్ధితం పరమ్‌ || 26

ప్రహ్లాద ఉవాచ :-

సాధు దానవ శార్దూల! యత్తే జాతా మతి స్త్వియమ్‌ | ప్రవక్ష్యామి హితం తే%ద్య తథా%న్యేషాం హితం బలే || 27

భవ జలధి గ తానాం ద్వంద్వ వాతా హతానాం | సుత దుహిత్ప కళత్ర త్రాణ భారా ర్థితానామ్‌ || 28

విషమ విషయ తోయే మజ్జతా మస్లవానాం | భవతి శరణ మేకో విష్ణు పాతో న రాణామ్‌ || 29

యే సంశ్రితా హరి మనంత మనాది మధ్యం | నారాయణం సుర గురుం శుభదం వరేణ్యమ్‌ || 30

శుద్దం ఖగేంద్ర గమనం కమలాలయేశం | తే ధర్మ రాజ శరణం న విశంతి ధీరాః|| 31

స్వపురష మఖివీక్ష్య పాశ హస్తం వదతి యమః కిల తస్య కర్ణమూలే | పరిహర మధుసూదన ప్రపన్నాన్‌ |

ప్రభు రహ మన్య నృణాం న వైష్ణవానామ్‌ || 32

తథా%న్య దుక్తం నర సత్తమేన ఇక్ష్వాకుణా భక్తి యుతేన నూనమ్‌ | యేవిష్ణు భక్తాః పురుషాః పృధివ్యాం |

యమస్యతే | నిర్విషయా భవంతి || 33

సా జిహ్వా యా హరి స్తౌతి తచ్చిత్తం య త్తదర్పితమ్‌ | తావేవ కేవలం శ్లాఫ°్య ¸° తత్పూజా కరౌ కరౌ || 34

నూనం న తౌ కరౌ ప్రోక్తౌ వృక్ష శా ఖాగ్ర పల్లవౌ | న ¸° పూజయతుం శక్తౌహరిపాదాంబుజ ద్వయమ్‌ || 35

అలా స్తుతించి, ఆ బుద్ధి మంతు డా సుదర్సన భగవానుని భక్తితో నర్చించి పాప ప్రణాశకు డగు పుండరీకాక్షుని స్మరించాడు. ఆ చక్రం బలి పూజనందుకొని అసురలందరను తేజో హీనుల గావించి దక్షిణ విషువ త్కాలాన (దక్షిణాయనం) పాతాళం వదలి వెళ్లి పోయింది. నారదా ! సుదర్శనం వెళ్లగా వ్యాకుల మైన ఘోర మగు నా పదకు లోనై ఆ బలిరాజేంద్రుడు తన తాత యగు ప్రహ్లాదుని స్మరించాడు. వెంటనే ఆ పరమ భాగవతుడు సుతలాన్ని చేరుకుని ఎదురుగా అర్ఘ్య పాత్రతో నిలబడిన మనుమను చూచాడు. ఓ బ్రహ్మన్‌ పితామహుడూ, ఈశ్వరుడు నైన ప్రహ్లాదుని విధి పూర్వకంగా అర్చించి రెండు చేతులు జోడించుకుని బలి అతనికి ఇలా విన్నవించాడు. వ్యాకుల చిత్తుడనై నేను స్మరించినంత నే తమరు దయ చేశారు. ఓ తాత పాదా! నాకీ సమయాన హిత మూ, పథ్యము, శ్రేయస్కరమూ నైన కర్తవ్యమేదో సెలవిండు! సంసారంలో ఉంటూ దాని బంధాల్లో పడకుండా ఉండుటకు ఆచరించ దగిన దేమి? సంసార సముద్రంలో పడి కొట్టుకునే అల్ప బుద్ధులగు మానవులకు దానిని దాటించ గల నావ ఏది || ఏమి చేస్తే నరుడీ సంసార సాగారాన్ని దాటగలడు? నారదాబలి చేసిన ప్రశ్నకు ఆ దైత్య భాగవతుడు బాగా ఆలోచించి, ప్రపంచ జీవులకు మేలుకలుగ జేసే ఉపాయాన్ని యిలా వివరించాడు. సాధు!సాధు!దానవేశ్వరా? చక్కని ప్రశ్న అడిగావు. చక్కగా వినుము. నీకునూ సంసార కూపంలో బడిన వార లందరకూ హితమేదో చెబుతున్నాను. వత్సా! బలీ! ఈ సంసారం ఒక సముద్రం, అది ద్వంద్వాలు - సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, మంచిచెడ్డలు లనే పరస్పర ప్రతికూల పవనాల తాకిడికి ఎప్పుడూ అల్ల కల్లోలంగా ఉంటుంది. భయంకర మైన విషయ వాసనలే అందులోని నీరు. అలాంటి సముద్రం లోనికి మానవులు ఎలాంటి నావ లేకుండా దూకు తారు. పైపెచ్చు భార్యా బిడ్డల పోషణ రక్షణ లనే బరువు నెత్తిన వేసుకొని దిగుతారు. అటువంటి దుఃఖార్తులకు ఒకే ఒక ఆధారం, నావ గలదు. ఆ నావయే విష్ణు భగవానుడు. ఆది మధ్యాంతరహితు డగునా శ్రీహరి నారాయణుని, కళ్యాణప్రదాతను, వరేణ్యుడగుదేవ దేవుని, గరుడ వాహనుడగు శ్రీయఃపతిని, ఆశ్రయించిన ధీరులకు యమ ధర్మరాజు వీటికి వెళ్ల వలసిన అవసరం ఉండదు. ఎందుకనగా నా యముడు పాశహసస్తులయిన తన భటులకు చెవిలో యిలా ఆదేశిస్తాడు. దూతలారా! భగవంతుడగు విష్ణు నాశ్రయించిన వారి పొంతకు పోకుడు. వైష్ణవులు కాని వారల పైననే అధికారము కలదు సుమా. విష్ణు భక్తులపైన కాదు. నరశ్రేష్ఠు డగు ఇక్ష్వాకు ప్రభువు పరమ భక్తుడిలా శాసనం గావించాడు. విష్ణు భక్తులగు వారిపై యమున కెలాంటి అధికారమూ లేదు. హరిని కీర్తుంచిన నాలుకయే నాలుక, ఆయన కర్పితమైనదే నిజమైన చిత్తము, ఆ ప్రభువును పూజించు చేతులే శ్లాఘాపాత్రాలు, శ్రీహరి , పాద కమలాలను అర్చించని చేతులు చెట్ల కొమ్మలకు సమానములు.

నూనం తత్కంఠ శాలూక మథవా ప్రతిజిహ్వికా | రోగో వా%న్యో న సా జిహ్వా యా న వక్తి హరే ర్గుణాన్‌ || 36

శోచనీయః స బంధూనాం జీవన్న పి మృతో నరః | యో పాద పంకజం విష్ణో ర్న పూజయతి భక్తితః || 37

యే నరా వాసుదేవస్య సతతం పూజనే రతాః | మృతా అపి నశోచ్యా స్తే సత్యం సత్యం మయోదితమ్‌ || 38

శారీరం మానసం వాగ్జంమూర్తా మూర్తం చరాచరమ్‌ | దృశ్యం స్పృశ్య మదృశ్యం చ తత్సర్వం కేశవాత్మకమ్‌ || 39

యేనా ర్చితో హి భగవాన్‌ చతుర్థావై త్రివిక్రమః | తేనా ర్చితా న సందేహో లోకాః సమర దానవాః || 40

యధా రత్నాని జలధే రసంఖ్యేయాని పుత్రక! | తధా గుణా హి దేవస్య త్వసంఖ్యాతాస్తు చక్రిణః ||

యే శంఖ చక్రాబ్జ కరం సశార్జ్‌ | ఖగేంద్ర కేతుం వరదం శ్రియః పతిమ్‌,

సమాశ్రయం తే భవ భీతి నాశనమ్‌ | సంసార గర్తే న పతంతి తే పునః || 42

యేషాం మనసి గోవిందో నివాసీ సతతం బలే! | న తే పరిభవం యాంతి నమృత్యో రుద్విజంతి చ || 43

దేవం శార్‌ఙ్గధరం విష్ణుం యే ప్రపసన్నాః పరాయణం | న తేషాం యమ సాలోక్యం న చ తే నరకౌకసః || 44

స తాం గతిం ప్రాప్నువంతి శ్రుతి శాస్త్ర విశారదాః | విప్రా దాన వ శార్తూల విష్ణు భక్తా వ్రజంతి యామ్‌ || 45

యా గతి ర్దైత్య శార్దూల హతానాం తు మాహహవే | తతో%ధికాం గతిం యాంతి విష్ణు భక్తా నరోత్తమాః || 46

యా గతి ర్దర్మ శీలానాం సాత్వికానాం మహాత్మనాం | సా గతి ర్గదితా దైత్య భగవ త్సేవినా మపి || 47

సర్వావాసం వాసుదేవం సూక్ష్మ మవ్యక్త విత్రహమ్‌ | ప్రవిశంతి మహాత్మాన స్తద్భక్తా నాన్య చేతసః || 48

అనన్య మనసో భక్త్యా యే నమస్యంతి కేశవమ్‌ | శుచయ స్తే మహాత్మాన స్తీర్థ భూతా భవంతి తే || 49

గచ్ఛన్‌ తిష్ఠన్‌ స్వపన్‌ జాగ్రత్‌ పిబ న్నశ్న న్న భీక్షణశః | ధ్యాయన్‌ నారాయణం యస్తున తతో %స్యో%స్తి పుణ్య భాక్‌ |

వైకుంఠం ఖడ్గ పరశుం భవ బంధ సముచ్ఛిదమ్‌ || 50

ప్రణిపత్య యధాన్యాయం సంసారే న పున ర్భవేత్‌! | క్షేత్రేషు వసతే నిత్యం క్రీడన్నాస్తే%మిత ద్యుతిః || 51

ఆసీనః సర్వ దేహేషు కర్మభి ర్న సబధ్యతే | యేషాం విష్ణుః ప్రియో నిత్యం తే విష్ణోః సతతం ప్రియాః || 52

శ్రీహరి గుణ గానం చేయని నాలుక కప్ప గొంతుతో సమానం, కొండ నాలుకతో సమానం. రోగిష్టి నాలుక. విష్ణు పాద కమలాలను పూజింపని వాడు జీవించినా చచ్చిన వానితో సమానం. వానిని చూచి బంధువు లంతా విలపించాలి. ఎల్లపుడు వాసుడేవుని పూజలో మునిగి యుండే వారు మరణించినను వారలకోసం చింతింపగూడదు. యిది సత్యం. నిజం చెబుతున్నాను. శరీరం కలవీ, మానసిక (కాల్పనిక) మైనవీ, నోట ఉచ్చరించేవి, ఆకారం కలవీ, లేనివీ, కనిపించేవీ, కనపడనివి, స్పర్శకు అందేవి, కదిలేవీ, కదలనివీ-- సమస్త వస్తువులు కేశవాత్మకాలే! భగవంతుడగు వామనుని నాలుగు విధాల అర్చించేవారు, దేవ దానవ సహితము లగు లోకాలన్నంటినీ అర్చించినట్లే అగును. బిడ్డా! బలీ! సముద్రంలో రత్నాలు ఎలా అసంఖ్యాకాలుగా ఉంటాయో, అలాగే ఆ చక్ర ధరుని కళ్యాణ గుణాలు కూడ అనంతాలు, లెక్కింపరానివి. బాబూ! శంఖ చక్ర గధా శార్‌ జ్ఞ ధరుడు, గరుడధ్వజుడు, లక్ష్మీపతి, వరదుడు, భవ భయ నాశకుడు నగు విష్ణుని ఆశ్రయించిన వారలు తిరిగి సంసార కూపంలో పడరు. ఎవరి చిత్తంలో సదా గోవిందుడు ఉంటాడో వారికి పరాభవమంటూ ఎన్నడూ ఉండదు, వారు చావుకు భయపడరు. భక్త పరాయణుడగు విష్ణు దేవుని శరణొందిన వారలకు యమ దర్మనం కాని, నరకవాసం గాని ఉండదు. విష్ణు భక్తునకు కలిగే ఉత్తమ గతులు కేవల శ్రుతి శాస్త్ర పండితులైన విప్రులకు లభించవు. యుద్దంలో శత్రువు నెదిరించి మరణించినవారలకు లభించు పదవి కన్న అధికమైన పదవిని విష్ణు భక్తులగు నర శ్రేష్ఠులు పొందుదురు. ధర్మశీలురు సత్వ గుణ సంపన్నులు నగు మహాత్ములకు లభించు నట్టి ఉత్తమ గతులు భగవత్సేవకులు అనుభవిస్తారు. ఓ దైత్య శార్దూలా! అనన్య చిత్తంతో వాసుదేవుని భజించు వారు సర్వ భూత నివాసి, సూక్ష్ముడు, అవ్యక్తుడు నగు నా ప్రభువు శ్రీ విగ్రహంలో లీన మౌతారు. అనన్య మనస్కులై భక్తి పూర్వకంగా కేశవున కు నమస్కరించువారు పవిత్ర తీర్థాల వలె. శుచి మంతులౌతారు. నడుస్తూ, లేస్తూ, నిద్రిస్తూ, మేలుకుంటూ, తింటూ, త్రాగుతూ, సర్వకాల సర్వావస్థలలోను నారాయణ ధ్యానమగ్నులగు వారలను మించిన పుణ్య భాజన లుండబోరు. భవ బంధచ్ఛేది, ఖడ్గ పరిశుధారియగు వైకుంఠునకు విధి విధానంగా ప్రణామాలు చేసినచో పునర్భవం ఉండదు. ఆ ప్రభువు సర్వక్షేత్రాల్లో ఎల్లపుడు క్రీడిస్తూంటాడు, ఆ మహాతేజస్వి అందర దేహాలలో ఆసీనుడై ఉంటాడు. అయితే ఆయన వారక కర్మలచే బంధించ బడడు. విష్ణువును ప్రేమించే వారలను ఆయన కూడ ప్రేమిస్తాడు.

న తే పునః సంభవంతి తద్భక్తా స్తత్నరాయణాః | ధ్యాయే ద్దామోదరం యస్తు భక్తి నమో%ర్చయేత వా || 53

న స సంసార పంకే%స్మిన్‌ మజ్జతే దానవేశ్వర! | కల్య ముత్థాయ యే భక్తా స్మరంతి మధుసూదనమ్‌

స్తువం త్య ప్యభి శ్రుణ్వం తి దుర్గా ణ్యతితరంతి తే || 54

హరి వాక్యామృతం పీత్వా విమలైః శ్రోత్ర భాజనైః | ప్రహృష్యతి మనో యేషాందుర్గా ణ్యతి తరంతి తే || 55

యేషాం చక్ర గదా పాణౌ భక్తి రవ్యభిచారిణీ | తే యాంతి నియతం స్థానం యత్ర యోగేశ్వరో హరిః || 56

విష్ణు కర్మ ప్రసక్తానాం భక్తానాం యా పరాగతిః | సా తు జన్మ సహస్రేణ న తపోభి రవాప్యతే || 57

కిం జపై#్య స్తస్య మంత్రై ర్వా కిం తపోభి శి కిమాశ్రమైః | యస్య నాస్తి పరాభక్తిః సతతం మధుసూదనే || 58

వృథా యజ్ఞా వృధా వేదా వృథా దానం వృథా శ్రుతమ్‌ | వృథా తపశ్చ కీర్తిశ్చ యో ద్వేష్టి మధుసూదనమ్‌ || 59

కిం తస్య బహుభి ర్మం త్రైః భక్తి ర్యస్య జనార్దనే | నమో నారాయణాయేతి మంత్రః సర్వార్థ సాథకః || 60

విష్ణు రేవ గతి ర్యేషాం కుత స్తేషాం పరాజయః | యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్దనః || 61

సర్వ మంగళ మాంగల్య వరేణ్యం వరదం ప్రభుమ్‌ | నారాయణం నమస్కృత్య సర్వ కర్మాణి కారయేత్‌ || 62

విష్టయో వ్యతిపాతాశ్చ యే%న్యే దుర్నీతి సంభవాః | తే నామ స్మరణా ద్విష్ణో ర్నాశం యాంతి మహాసుర ! || 63

తీర్థ కోటి సహస్రాణి తీర్థ కోటి శతాని చ | నారాయణ ప్రణామస్య కలాం నార్హంతి షోడశీమ్‌ || 64

పృథివ్యాం యాని తీర్థాని పుణ్యా న్యాయతనాని చ | తాని సర్వా ణ్య వాప్నోతి విష్ణో ర్నామాను కీర్తనాత్‌ || 65

ప్రాప్నువంతి న తాన్‌ లోకాన్‌ ప్రతినో వా తపస్వినః | ప్రా ప్యంతే యే తు కృష్ణ స్య నమస్కారపరైర్నరై || 66

ఓ బలీ ! భక్తితో సదా వినమితులై దామోదరుని ధ్యానార్చలు గావించు భగవత్పరాయణులకు పునర్జన్మ ఉండదు. ప్రాతః కాలాననే మేల్కొని మధుసూదనుని భక్తితో స్మరించు వారలు సంసార మనే రొంపిలో పడరు. ఉదయం లేచి విష్ణుని కళ్యాణ గాథలు వినువారలు, స్తుతించు వారలు, సమస్త ఆపదలను అధిగమించెదరు. శ్రీహరి వాక్యామృతాన్ని తమ నిర్మలాలైన కర్ణ పాత్రల తో గ్రోలి తృప్తి చెందు వారు అన్ని కష్టాలనూ అధిగమించెదరు. చక్ర గదా ధరునిపై అవ్యభిచారిణి యగు భక్తి నెరపు వారలు యోగేశ్వరు డగు శ్రీహరి శాశ్వత పదాన్ని పొందు తారు. శ్రీ విష్ణుని అద్భుత కార్యాలను సదా మానసించు భక్తులు పొందే పరమ పదాన్ని వేయి జన్మల కాలం తపస్సు చేసినా పొంద లేరు. నిరంతరం పరా భక్తి తో విష్ణుని మానసించని వాడు ఎంత జపం చేసినా, ఎన్ని మంత్రాలను ష్ఠించినా, ఎన్నాళ్ళు తపస్సు చేసినా, ఎన్ని ఆశ్రమాలు సేవించినా, ఏమి ప్రయోజనం? మధుసూదను ని ద్వేషించువారలు చేసే యజ్ఞాలు వృథా. వేదాధ్యయనం వృధా. దాన వ్రతాలు వృధా. తపస్సు వృధా. కీర్తి ప్రతిష్ఠలు వృధా. జనార్దనుని భక్తునకు బహు మంత్రాల వల్ల లాభ##మేమి? ఓం నమోనారాయణాయ అనే ఒక్క మంత్రమే సర్వార్థాలను సిద్దింప జేస్తుంది. విష్ణువునే దిక్కని నమ్మువారలకు పరాజయ మెక్కడిది? ఇందీవర శ్యాము డగు జనార్దనుని హృదయంలో ప్రతిష్ఠించు కొను వారలకు పరాభవమెక్కడ? కనుక సర్వ మంగళకరుడు, వరదాయకుడు, వరేణ్యుడు, సర్వలోక, ప్రబువు నగు నారాయణునకు నమస్కరించి సర్వ కార్యాలు చేసు కోవాలి. దురాచారం వల్ల సంభవించే విష్టి వ్యతి పాతం మొదలయిన ఘోర విపత్తులు ఓ మహా దైత్యా ! విష్ణు నామ స్మరణ మాత్రాన నశించి పోతాయి. వేయి కోట్ల తీర్దాల సేవనం, నూరు కోట్ల తీర్ద స్నానం శ్రీ మన్నారాయణనకు చేసే ఒక్క నమస్కారంలో పదహారవ భాగానికి గూడ సమానం కాజాలవు! విష్ణు నామ సంకీర్తనం వల్ల పృథివిలో గల సర్వ తీర్థాల ఫలం సర్వ దేవాలయాలను చూచిన పుణ్యం లభిస్తుంది శ్రీ కృష్ణ నమస్కార పరాయణులగు వారలకు లభించే ఉత్తమ లోకాలు ఎన్నెన్నో వ్రతాలు చేసిన వారికీ ఎంతో కఠోర తపస్సులో మ్రగ్గిన వారలకూ లభించవు.

యో%ప్యన్య దేవతా భక్తో మిథ్యా%ర్చయతి కేశవమ్‌ | సో%పి గచ్చతి సాధూనాం స్థానం పుణ్య కృతాం మహత్‌ || 67

సాతత్యే హృషీకేశం పూజయిత్వా తు యత్పలమ్‌ | సుచీర్ణ తపసాం నృణాం తత్పలం న కదాచన || 68

త్రిసంధ్యం పద్మనాభం తు యే స్మరంతి సుమేధ సః తే | లభం తుపనవాసస్య ఫలం నాస్త్యత్ర సంశయః || 69

సతతం శాస్త్ర దృష్టేన కర్మణా హరి మర్చయ! | తత్ర్ప సాదాత్‌ పరాం సిద్ది బలే! ప్రాప్స్యసి శాశ్వతీమ్‌ || 70

తన్మనా భవ తద్భక్త స్తద్యాజీ తం నమస్కురు! | తమే వాశ్రిత్య దేవేశం సుఖం ప్రాప్స్యసి పుత్రక || 71

ఆద్యం హ్యనంత మజరం హరి మవ్యయం చ | యే వై స్మరంత్య హ రహర్‌ నృవరా భువిస్థాః |

సర్వత్రగం శుభదం బ్రహ్మ మయం పురాణమ్‌ | తే యాంతి వైష్ణవ పదం ద్రువ మక్షయం చ || 72

యే మానవా విగత రాగ పరా పరజ్ఞా | నారాయణం సుర గురుం సతతం స్మ రంతి |

తే ధౌ త పాండుర పుటా ఇవ రాజ హంసాః సంసార సాగర జలస్య తరంతి పారమ్‌ || 73

ధ్యాయంతి యే సతత మచ్యుత మీశితారం | నిష్కల్మషం ప్రవర పద్మ దళాయ తాక్షమ్‌ | ధ్యానేన తేన హత కిల్చిష వేద నాస్తే |

మాతుః పయోధర రసం న పునః పిబంతి || 74

యే కీర్తయంతి వరదం వర పద్మ నాభం | శంఖా బ్జ చక్ర వర చాప గదాసి హస్తమ్‌ | పద్మాలయా వదన పంకజ షట్పదాఖ్యం

నూనం ప్రయాంతి సదనం మధు ఘాతిన స్తే || 75

శృణ్వంతి యే భక్తి పరాః మనుష్యాః | సంకీర్త్య మానం భగవంత మాద్యమ్‌ | తే యుక్త పాపాః సుఖినో భవంతి | యథా%మృత

ప్రాశన తర్పితాస్తు || 76

తస్మాద్‌ ధ్యానం స్మరణం కీర్తనం | వా నామ్నాం శ్రవణం పఠతాం సజ్జనానామ్‌ | కార్యం విష్ణోః శ్రద్ద ధానై ర్మనుషై#్యః

పూజాతుల్యం తత్‌ ప్రశంసంతి దేవాః || 77

బాహ్యైస్తథా%ంతః కరణౖ రవిక్లబైరేనార్చయేత్‌ కేశవ మీశితారమ్‌ | పుషై#్పశ్చ పత్రై ర్జల పల్లవాదిఖిః|

నూనం స ముష్టోవిధి తస్కరేణ|| 78

ఇతి శ్రీ వామన పురాణ సప్త షష్ఠితమో%ధ్యాయః సమాప్తం

ఇతర దేవతలను ఆర్చిస్తూ కృష్ణుని మీద కపట భక్తి నటించే నరుడు కూడా సాధు మహాత్ములు పొందే ఉత్తమ గతిని పొందుతాడు. నిరంతరాయంగా హృషకేశుని పూజించు వారలకు గలిగే ఫలం శాస్త్రోక్త విధిగా తపస్సు చేసిన వారలకు గూడ దొరకదు. త్రి సంధ్యల యందు పద్మ నాభుని స్మరించే మేధావులు ఉపవాస ఫలాన్ని పొందుతారు. సందేహం లేదు. కనుక నో బలీ! శాస్త్రోక్త విధి గా కర్మాచరణం చేస్తూ శ్రీవారిని ఆదాధించుము, ఆ ప్రభువు అనుగ్రహం వల్ల శాశ్వతమైన పరమ సిద్ది పొందుతావు. మనస్సా ప్రభువు మీదనే ఉంచుము. ఆయనకు భక్తుడవు కమ్ము. ఆయనకు ప్రీతిగా యజ్ఞాదులు (కర్మలు) గావింపుము. ఆయనకే నమస్కరించు చుండుము. ఆ దేవుని ఆశ్రయించినచో పుత్రా ! సకల సుఖాలు పొందుతావు. ఆది పురుషుడు, అనంతుడు, అజరుడు, అవ్యయుడు నగు హరిని ఎవరు రాత్రిం బవళ్లు ప్రతి దినం స్మరిస్తారో, ఆ మానవులు మంగళ మయము, సర్వత్రా వ్యాపించినదీ, బ్రహ్మమయము, ప్రాచీన తమము, తరుగనిదీ స్థిరమైనదీ నగు విష్ణు పదాన్ని పొందుతారు. రాగ ద్వేషాలు లేక పర అపర జ్ఞానం కలిగి ఏ మానవులు సుర గురుడగు నారాయణుని నిరంతరం స్మరిస్తారో, వారలు చక్కగా కడుగబడి తెల్లని మబ్బు పొర తొలగి రాజహంసల వలె సంసార ముద్ర జలాన్ని తరించి తీరానికి చెరుకుంటారు. అచ్యుతుడు, ఈశ్వరుడు, కల్మష దూరుడు, పద్మనేత్రుడు, శ్రేష్ఠుడు నగు ప్రభువును నిరంతరం ధ్యానించే వార లా ధ్యాన ప్రభావం వల్ల తమ కి ల్చిషాలు బాధలు తొలగి పోగా తిరిగి మాతృస్తన్య పానం అంటూ చేయరు (వారలకు మళ్లీ జన్మ ఉండదు). పద్మనాధుడు, పరుడు, వరదుడు, శంఖ చక్ర గదా పద్మ ఖడ్గ ధరుడు, పద్మాలయ (లక్ష్మి)ము, పద్మ, భ్రమరము నగు దేవుని స్మరించి వారలామధుసూదనుని స్థానానికి చేరుకుంటారు. ఏ నరులు భక్తి పరులై సంకీర్తనీయుడగు భగవల్లీలలు వింటారో, వార సకల పాపాల నుండి ముక్తులై అమృతం త్రాగిన వారి వలె సుఖంగా తృప్తితో జీవిస్తారు. కాబట్టి వత్సా! సజ్జనులగు వారలు శ్రద్దతో భగవన్నామ ధ్యానము, స్మరణం, కీర్తనము, శ్రవణం, పఠనం చేస్తూ ఉండాలి. దానినే దేవతలు పూజతో సమానంగా పరిగణించి ప్రశంసిస్తారు. బాహ్యభ్యంతరాలైన భయాలు విడిచి ఈ శ్వరు డగు నా కేశవుని పుష్ప పత్ర జల పల్ల వాదుల తో పూజించని వాడు విధి (బ్రహ్మ) అనే తస్కరుని చేత సర్వం దొంగిలించ బడినవాడు అవుతాడు ఇది తథ్యం.

ఇది శ్రీ వామన పురాణంలో అరువది యేడవ అధ్యాయము ముగిసినది

Sri Vamana Mahapuranam    Chapters