Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

పదవ యధ్యాయము

సప్తగిరులందు పుట్టిన నదుల వర్ణనము

వజ్ర ఉవాచ :

నివిష్టాన్‌ సాగరే ద్వీపే సప్తాహంకుల పర్వతాన్‌ | నామతశ్శ్రోతు మిచ్ఛామి తత్ప్రసూతాశ్చ | నిమ్నగాః || 1

మార్కండేయ ఉవాచ -

మహేంద్రో మలయ స్సహ్యశ్శుక్తిమా నృక్షపర్వతః | వింధ్యశ్చ పారియాత్రశ్చ సప్తా7స్మిన్‌ కులపర్వతాః || 2

త్రిసామా ఋషికుల్యాశ్చ ఇక్షుగా త్రిదివాలయా లాంగులినీ వంశధరా నద్యస్త్వేతా మహేంద్రజాః || 3

కృతమాలా తామ్రపర్ణీ పుష్పజా చోత్పలావతీ | శీతోదకా గిరివహా నద్యో మలయ సంభవాః || 4

తుంగభద్రా సుప్రకారా వాహ్యా కావేరికా తథా | దక్షిణా పథమధ్య స్థా సహ్యపాద వినిస్సృతాః || 5

ఋషికా సుకుమారీ చ మందగా మందవాసనీ | నృపమాలా శిరీచైవ శుక్తిమ త్పాద నిస్సృతాః || 6

మందాకినీ దశార్ణాచ శోణోదేవీచ నర్మదా | తమసా పిప్పలా నేతి ఋక్షవత్పాద నిస్సృతాః || 7

వేణా వైతరణీ చైవ నర్మదా చ కుముద్వతీ | తోయాసేతు శిలాచైవ వింధ్య పాదవిని స్సృతాః || 8

పారా చర్మణ్వతీ పాదా విదిశా వేణు వత్యపి | సిప్రా హ్యవంతీ కుంతీ చ పారియాత్ర వినిస్సృతాః || 9

నద్యః ప్రధానాః కథితాః తవైతాః పుణ్యాః పవిత్రా ఋషిసేవితాశ్చ |

సన్తీహ నద్యశ్చ సహస్రశో న్యా వక్తుం నశక్యా యదు బృందనాథ || 10

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే-ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే సప్తగిర్యుద్భవ నదీవర్ణనంనామ దశమో7ధ్యాయః

సాగరమందు ద్వీపమునందు చొచ్చుకొనిపోయిన కులపర్వతములను నేడింటిని అందుపుట్టిన నదులునుగూర్చి వినగోరెదనన మార్కండేయుడిట్లనియె. మహేంద్రము మలయము సహ్యము శక్తిమంతము ఋక్షము వింధ్యము పారియాత్రము ననునవీభారత మందు కుల పర్వతములు. త్రిసామ ఋషికుల్య ఇక్షుగ త్రిదివాలయ లాంగూలి వంశధర యనునదులు మహేంద్రపర్వతమునందు బుట్టినవి. కృతమాల తామ్రపర్ణి పుష్పజ ఉత్పలావతి శీతోదక గిరివహాయనునవి మలయపర్వతమందు జనించిననదులు. తుంగభద్ర ప్రకార వాహ్య కావేరి దక్షిణాపథ మధ్యస్థము లయిన నదులు. ఇవి సహ్య పర్వత ప్రత్యంతపర్వత జాతములు. ఋషిక సుకుమారి మందగ మందవాసిని నృపమాల శీరి, శుక్తిమత్పర్వతపాదమున బుట్టినవి. మందాకిని దశార్ణ శోణ దేవి నర్మద తమస పిప్పలయనునవి ఋక్షవత్పర్వతపాదమున వెడలినవి. వేణ వైతరణి నర్మద కుముద్వతి తోయ, సేతుశిల యనునవి వింధ్య పాదోద్భవములు. పారా, చర్మణ్వతి, పాదవిదిశ వేణువతి సిప్రా అవంతి కుంతియు పారియాత్రపాదమునుండి జాలువారినవి. ఋషి సేవితములయి పవిత్రములైన ప్రధాన పుణ్యనదులం దెల్పితిని. ఓ యదునందన! ఇంకను వేలకొలది నదులున్నవి. చెప్పుటకు శక్యముగాదు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున మార్కండేయ వజ్రసంవాదమున సప్తగిరి సంజాత నదీ వర్ణనమను పదియవయధ్యాయము

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters