Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటఆరవ అధ్యాయము - గ్రహసంభవము

వజ్ర ఉవాచ :

ధ్రుస్యాహం ద్విజశ్రేష్ఠ! బ్రాహ్మణానాం పృథక్‌ పృథక్‌ | సంభవం శ్రోతు మిచ్ఛామి నక్షత్రాణాం చ మానద |

మార్కండేయః - బ్రహణా సృష్టికామేన పూర్వమేవ నరాధిప | ఆదిత్య స్తమసాం హన్తా తేజసాం గోలకః కృతః 2

తమోమయో గోలకశ్చ రాహుస్తేన తధాకృతః | అమ్మయాని తధాన్యాని గోలకాని నరాధిప! || 3

కృతాని తేన ధర్మజ్ఞ! గ్రహర్షాణాం పృథక్‌ పృథక్‌ | ధ్రువస్థాన నివిష్టా శ్చతారాకాశ్చ చతుర్దశ || 4

తేషాం నామవిభాగం మే గతతః శృణు పార్థివ! | ఉత్తాన పాద స్తస్యాధ విజ్ఞేయఃశోత్తరో హనుః || 5

యజ్ఞోధరస్తు విజ్ఞేయో ధర్మోమూర్థానమాగః | హృది నారాయణః సాధ్యా వశ్వినౌ పూర్వపాదయోః || 6

వరుణ శ్చార్యమా తస్య పశ్చిమే చైవ సక్థినీ | శిశ్నః సంవత్సర స్తస్య మిత్రోపానం సమాశ్రితః || 7

పుచ్ఛోగ్నిశ్య మహేంద్రశ్ప మారీచః కశ్యపో ధ్రువః |

ధ్రువః స్థాస్ను ర్గ్రహ ర్షాణాం మేధీ భూతః ప్రకీర్తితః || 8

ధ్రువేణ భ్రామ్యతే సర్వ మాయత్తం త్రిదివం ధ్రువే | ధ్రువోహి భగవాన్‌ విష్ణుః కాలో లోక ప్రకాలనం || 9

వజ్రుడు విప్రోత్తమ ! ధ్రువుని యొక్క బ్రాహణుల యొక్కయు నక్షత్రముల యొక్కము పుట్టుక వినగోరెదనన మార్కండేయుడనియె. సృస్టిసంకల్పమందు బ్రహ్మ చీకటుల హరించు తేజో గోళమును ఆదిత్యుడను పేర సృజించెను. కేవలము చీకటి గోళము రాహువును నతడే సృజించెను. తదితరగోళము లాపోమయములు. వానిని అతడే చేసెను. గ్రహములు నక్షత్రములు వేర్వేరధ్రువస్థానమందుండు తారకలు పదునాల్గును నాతనిసృష్టియే. ధ్రువమండలమందలి వానిపేరులు. ఆ ధ్రువునికుత్తరపు (మీద) హనువు. (చెక్కిలి) ఉత్తానపాదుడు. యజ్ఞము క్రిందిదౌడ. ధర్మము మూర్ధము-హృదయము నారాయణుడు, సాధ్యులు అశ్వినులు నాతని పూర్వపాదములందు. వరుణుడు అర్యముడు పశ్చిమ మందలి సక్థులు=పడ మటసంవత్సరము శిశ్నము. మిత్రుడపానము. పుచ్ఛమందగ్ని మహేంద్రుడు మారీచుడు కశ్యపుడు ధ్రువుడు గ్రహనక్షత్రములకు (స్థాస్నుః =కదలికలేనివాడై మేధిమైయున్నాడు. ధ్రుపునియందాధారపడియున్న త్రిదినము జ్యతిర్మండలము) ధ్రువునిచే ద్రిప్పబడుచున్నది. అతడు ఈజ్యోతిశ్చక్రమునకు నడుమ మేధియైయున్నాడు. గానుగ చుట్టు నెగ్దుతిఱుగునట్లు మేదీభూతుడైన ధ్రువునిచుట్టు గ్రహతారకాదులు తిఱుగుచున్న వన్నమాట. ధ్రువుడు సాక్షాద్విష్ణుభగవానుడే. లోక ప్రకాలనుడు కాలుడునతడే.

శింశుమార నిబద్ధానాం తారకాణాం పృథక్‌ పృథక్‌ | నామధేయాని విజ్ఞాయ దృష్ట్వాచ విమలేఅంబరే || 10

ఆయురభ్యధికంజీవే ద్వర్షాణి తు చతుర్దశ | అహోరాత్రకృతా త్పాపాత్‌ తత్షణా రేవ ముచ్యతే || 11

అమ్మయానాం గ్రహర్షాణాం మూర్చితాః సూర్యరశ్మయః | జనయన్తి ప్రకాశత్వం నాత్ర కార్యా విచారణా || 12

స్ఫాటికాని విమానాని తధా సుకృతినాం నృప | నాకే తారక బద్ధాని అమ్మయాని యాదవ || 13

గ్రహర్షాణి సమస్తాని ధ్రువశ్య భగవాం స్తధా | కల్పస్థాయీని రాజేంన్ద్రః నాత్ర కార్యా విచిరణా || 14

తేషాం తదభి మానిన్యో దేవతా యదునందన | మన్వంతరాదౌ జాయన్తేన భవన్తి పునః పునః || 15

ఔత్తానపాది ర్ధర్మాత్మా ధ్రుప స్తేష్వపి యాదవ | స్వాయం భువేంతరే జాత స్తిష్ఠ త్యాభూత సంప్లవమ్‌ || 16

శిశుమారచక్ర మందనుబద్ధములైయున్న తారకల పేర్లను వేర్వేర తెలిసి యాకసమందు వానింజూచియున్నాతడు పదునాల్గేండ్లెక్కువ జీవించును. అహోరాత్ర కృతపాపమును తక్షణమ పాయును. అమ్మయములు (జలమయములు) అయిన గ్రహనక్షత్రములందు మూర్ఛితములయిన (పడిన) సూర్యరశ్ములు వెలుగును జనింపజేయుచుండును. ఇందాలోచింపవలసినదిలేదు. సత్యమన్నమాట. పుణ్యాత్ముల స్ఫాటికములయిన విమానములు అమ్మయములైన ధ్రువుడును కల్పాంత స్థాయిలు. సందేహము లేదు. వానివాని అభిమానదేవతలు మన్వంతరము మొదటనే యేర్పడుదురు. పునఃపునర్జననము వారికి లేదు. ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు స్వాయంభువ మన్వంతరమందు పుట్టినవాడు భూతప్రలయముదాక నతడుండును. సర్వపాపనాశనమయిన యా ధ్రువజన్మ వృత్తాంతము చెపుచున్నాను.

తస్యతే జన్మ వక్ష్యామి సర్వ కల్మష నాశనమ్‌ | పూర్వం బ్రహ్మా మహీపాల ! సిసృక్షుర్వివిధాః ప్రజాః || 17

ద్విధా కృత్వాత్మనో దేహమర్ధేన పురుషో భవత్‌ | అర్ధేన నారీ తస్యాసీత్‌ విరాజ మసృజత్‌ ప్రభుః || 18

విరాడనృజత్‌ పురుషం పురుషో మను రుద్యతే | యసై#్యవ సప్తతిగుణం మన్వంతర మిహోచ్యతే || 19

ప్రియవ్రతోత్తాన పాదౌ మనోః పుత్రా పుభౌ స్మృతౌ | క్షత్రప్రవర్తకౌ తౌ తు పూర్వే మన్వంతరే స్మృతౌ || 20

ఉత్తానపాద పుత్రస్తు ధ్రువో విష్ణుః ప్రకీర్తితః | విబద్ధోభ్రామ్యతే యత్ర మరుతాం జ్యోతిషాం గణః || 21

సప్తర్షి మండలం నిత్యం తస్యాధస్తాత్‌ ప్రకీర్తితః | మరీచిశ్చ వసిష్టశ్చ అంగిరాశ్చాత్రిరేవ చ || 22

పులన్త్యః పులహశ్చైవ క్రతు స్సప్తర్షయోమలాః | వసిష్ఠ మాశ్రితా సాధ్వీ తేషాం మధ్యా దరుంధతీ || 23

తస్యాధస్తాత్‌ భచక్రంచ తస్యాధస్తాత్‌ శ##నైశ్చరః | తస్యాధస్తా త్తధా జీవః తస్యా ధస్తా త్కుజః స్మృతః || 24

తస్యాధస్తా ద్దినేశశ్చ తస్యాధస్తా చ్చభార్గవః | తస్యాధస్తా ద్బుధః ప్రోక్తః తస్యాధస్తాచ్చ చంద్రమాః || 25

ప్రాగ్దక్షిణగతిశ్చైవ జ్యోతిషాం చక్ర ముచ్యతే | సర్వే గ్రహాః ప్రాగ్గతయః తుల్యవేగాః ప్రకీర్తితాః || 26

శీఘ్రత్వేచరన్తే యధా సన్నం మహిపతేః | యధాయధా విశిష్టశ్చ తధా మందాః ప్రకీర్తితాః || 27

తేషాంతే సంభవం వతేప్రాప్తే వైవస్వతేంతరే | తేషాంజనన సామసై#్రః అతీతైః కిం ప్రయోజనమ్‌ || 28

మున్ను బ్రహ్మ ప్రజల సృష్టింపగోరి తన దేహమున సగముచే పురుషుడు సగముచే స్త్రీయునై విరాజుని (విరాట్పురుషుని) సృష్టించెను. ఆ విరాట్టు పురుషుం గనెను. అతడే మనువు డెబ్బదియొక్క మహాయుగములాయన కాలము-మన్వంతర మనబడును. అమనువు కొడుకులు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడుననువారు. వారు మునుపటి మన్వంతరమున క్షత్ర (వంశ) ప్రవర్తకులు ఉత్తానపాదకుమారుడు ధ్రువుడు. విష్ణువని కీర్తింపబడెను. ఆయన ధ్రువమండలమందు నిబద్ధుడైయున్నాడు. అధికారికపురుష స్థానమందు (పదవి యందు) ఉన్నాడన్నమాట. అతని నాధారము సేసికొని (ఆ రక్షణశక్తిచే) మరుద్గణము (వాయువులు జ్యోతిర్గణము అంతరిక్షమున దిఱుగుచున్నది. ఆ ధ్రువునికి గ్రిందుగనే సప్తర్షిమండలమున్నది. అందధికారపురుషులుగా నీమన్వతరమందున్న వారు మరీచి వశిష్ఠుడు అంగిరసుడు అత్రి పులస్త్యుడు పులహుడు క్రతువునను పుణ్యజీవులు. వారిలో వశిష్ఠు వెంటనున్న యావిడ సాధ్వి (పతి వ్రత) అరుంధతి. అతనికి క్రిందుగ భచక్రము, దానికి క్రిందుగ శనియున్నాడు. ఆయనకు క్రిందుగ గురుడు అటక్రిందుగ కుజుడు అక్రింద సూర్యుడు అక్రింద శక్రుడు అక్రింది బుధుడు ఆక్రింద చంద్రుడు నున్నారు. తూర్పునుండి దక్షిణముగ (ప్రదక్షిణముగ) జ్యోతిశ్చక్రము తిరుగుచున్నది. అన్నిగ్రహములు ప్రాగ్గతులు తూర్పునకు తిరుగునవే. వాని వేగముకూడ సమానమే. వారి గమన దూరము దగ్గరయైనపుడు వారు శీఘ్రవేగులనబడుదురు. అది దూరమైనపుడు మంద వేగులనబడుదురు. అతీతమన్వంతరములందును వారు పుట్టి యా యా యధికారస్థానములనధిష్టించి తిఱుగుచునే యుందురు. వారందరి కథవలన ప్రయోజనమేమి. వైవస్వతమన్వంతరమందు వారి సంభవ వృత్తాంతమునందు చెప్పచున్నాను.

అనాదినిధనః శ్రీమాన్‌ విష్ణుర్నారాయణః ప్రభుః | సఏవ దేవకార్యార్థం భూత్వా ద్వాదశతా పురా|| 29

ఆదితేర్జనయామాస హ్యాత్మానం కశ్యపాత్‌ ప్రభుః | తేషాంతు మధ్యే సవితా ఆదిత్యస్యచ దేవతా || 30

ప్రోక్తంతే సవితుర్జన్మ శృణు చంద్రమసస్తతః | దశభ్యశ్చ దిసాభ్యస్తు తధాత్రే స్సుమహాత్మనః || 31

విష్ణురేవాభవద్రాజన్‌ : పుత్రస్స మృగలాంఛనం | దాక్షాయణీ వసోర్నామ పత్నీ ధర్మస్య నిశ్రుతా || 32

జనయామాస ధర్మజ్ఞం వసుమధ్యే నిశాకరమ్‌ | శ్రీ సహాయ స్తధా జాతః సోమ శ్చామృతమంథనాత్‌ 33

విష్ణుదాదిఅంతములేనిప్రభువు. ఆయనయే దేవకార్యనిమిత్తము పండ్రెండు రూపులయి కశ్యపునివలన యదితియందు తనను తానే పుట్టించుకొనెను. (స్వయంభువు అయ్యెనన్నమాట) ఆ పండ్రెండుగురలో సవిత ( ఆదిత్యుడు) దేవత యొకడు. అదేరీతిగ అత్రికి పది దిక్కులనుండి విష్ణువే యుదయించెను. ఆయనయే మృగలాంఛనుడు (శశాంకుడు) చంద్రుడు. వసువులలో నొకడైన ధర్ముని భార్య దాక్షాయణి వసువులనడుమ ధర్మజ్ఞుడయిన నిశాంకరుని గన్నది. ఆతడే యమృత మథనము వేళ సోముడై లక్ష్మీదేవితోగూడ యుదయించినాడు.

ప్రాకామ్యేనర శశాంకస్య జన్మ తేభిహితం త్రిథా! అతఃపరం ప్రవక్ష్యామి తవ భౌమస్య సంభవమ్‌ || 34

అసీ ద్దైత్యో హిరణ్యాక్షో మహాబలపరాక్రమః | సవై కన్యా మజనయద్వికేశిం నామ నామతః || 35

సా లేభే తపసా కేశాన్‌ తాంవై స్ధాణు రకామయత్‌ 7 తస్యాం మైధునసక్తస్య దేవేశస్య పినాకినః || 36

వహ్నిసంభవభీతేన కృతో విఘ్నెహ్యధాగ్నినా | ప్రవిష్టం మైథునాగారం వహ్నిం దృష్టవత స్తథా || 37

క్రోధాయాసోద్భవః స్వేదో హరస్య సమపద్యత | అననస్వేదజో బిందుః దేవస్యా మిత్రఘాతినః || 38

తస్యాః పపాతః వదనే సా వపౌ తత్ర్పయత్నత | అంతర్వర్త్న్యపి తేనాసీ స్సశశాక చ తేజసా || 39

మోహితా తస్య బాలస్య గర్భంధారయితుం తదా | ఉత్ససర్జాథ తం గర్భం దీప్తానలసమ స్రభం || 40

తం దధార మహీపాల ధరా దేవీస్వరూపిణీ | సంస్కార మకరోచ్చాస్య స్వయమేవచ కశ్యవః || 41

అంగారనికటస్థత్వాన్నామ్నా చాంగారకః కృతః | ఉక్తం తేజన్మ భౌమస్య, బుధస్యాతః పరం శృణు! || 42

ప్రాకామ్యమణిమాదివిభూతులలో నొకటి దానిప్రభావముచే నేనీచంద్రజన్మ వృత్తాంతము మూడురకములుగదెల్పితిని. ఒకేవ్యక్తి ముగ్గురు దంపతులకు మూడుపేర్ల జనించినట్లున్న యీకథ లోకదృష్టికి వికృతముగా దోచును. గాని యిది జ్యోతిర్మండల ములో జరిగిన అద్భుతస్వాభావిక పరిణామముగాన దీనికి జన్యజనకభావము గల్పించిచెప్పుట సామాన్యజనసుబోధమగుటకే. ఈ ప్రాకృతత్త్వము విజ్ఞానరహస్యము అతీంద్రియేంద్రియక ముగావున దానిని ఋషులు ప్రాకామ్యమను విభూతివైభవముచే గుర్తించి మరియొకరీతిం గాదని యిక్కడ వ్యాసహృదయ మించుకవెల్లడింపబడినది.

ఇక భౌమ (కుజ) జన్మకథ తెల్పెద, హిరణ్యాక్షుడను దైత్యుడు మహాపరాక్రముడు. వాని కూతురు వికేశి. (జుట్టులేనిది) ఆమె తపస్సుచేసి జుట్టుసంపాదించుకొనెను. ఆమెను స్థాణువు (శివుడు) కామించెను. ఆమెతో పినాకిరత్యాసక్తుడైయున్న పుడు, నిప్పు పుట్టునని భయపడి దానికగ్ని విఘ్నముకావించెను. అత్తఱినగ్ని యేకాంత గృహమందుండగా హరుడు కని కుపితుడైనంత నాతని మోమున బొడమిన చెమటచుక్క దేవి మోమునంబడెను. దాని నామెత్రావెను. దాన గౌరి గర్భవతియయ్యె. అగర్భతేజస్సు మోయ లేక ప్రజ్వలించునగ్ని ప్రభవలెనున్న యాగర్భము నామె జారవిడిచెను. దేవీస్వరూపిణియైన ధరణి యాగర్భముంధరించెను. అశిశువునకు కశ్యవుడు స్వయముగా జాతకర్మాదిసంస్కారములు సేసెను. బొగ్గుల సమీపమున నుండుటచే నాబాలుని కంగాంకుడను పేరు పెట్టబడెను. కుజునియొక్క జన్మవృత్తాంతమిది. ఇక బుధజన్మవృత్తాంతము వినుము.

కశ్యపస్య దనుర్నామ పత్నీ త్రైలోక్య విశ్రుతా| జనయామాస తనయం రజోనామేతి విశ్రుతమ్‌ || 43

సోకామయతవై కన్యాం వరుణస్య మహాత్మనః | వారుణీ నామ విఖ్యాతాం త్రైలోక్య సై#్యక సుందరీం || 44

తతస్తపశ్చ తేజశ్చ బలం వీర్యం తధైవచ | శుల్రార్థం సదదౌ తసై#్య తా నాదాయ వరాంగనా || 45

అవ్సులీనా తదా జాతా తప సోగ్రేణ దానవః | తామప్సు లీనాం విజ్ఞాయ ప్రవివేశోదకం తదా || 46

తస్యాః స్పర్శోపలంభేన ద్రవీభూత స్సదానవః | ద్రవతాం సమను ప్రాప్తాం తాం విజ్ఞాయ నిశాకరః || 47

మమన్థ సహసా తోయం పుత్రార్థీ మనుజేశ్వరః | మద్యమానే జతే తేన తదాసోమేన పార్థివ: || 48

వివేశ తేజసి పయో విష్ణు ర్దేవ నమస్కృతః | తతః కుమారస్సంజాతో బుధస్తు గ్రహబోధనః || 49

తద్ధధార తదా తారా గురుపత్నీ యశస్వినీ | యదా ధారయితుం శక్తాన బాలం తేజసాన్వితం || 50

దాక్షాయణీ చోత్ససర్జ చంద్రపత్నీ సుతం తదా | ఏవం జన్మ బధస్సోక్తం జీవస్యాతః పరం శృణు || 51

కశ్యవునికి దనువను పత్ని. ఆమెత్రిలోక ప్రసిద్ధురాలు. ఆమె రజుడను కుమారుంగనెను. ఆతడు వరుణునికూతురగు వారుణిని గామించెను. ఆమె త్రిలోకసుందరి. ఆమెకు తన తపస్సును తేజస్సును బలమును వీర్యమును శుల్కముగానిచ్చెను. అరమణి వానింగొని యుదకములందు లీనమయ్యెను. ఉగ్రతపస్సుచే దనుకుమారుడైన రజుడలనీట లీనమైనట్లామో గ్రహించి చంద్రుడా యుదకమును పుత్రార్తియై మథించెను. సోముడట్లుమధించుచున్నతరి లోకసమస్కృతుండగు విష్ణువాతేజస్సునందు ప్రవేశించెను. అంతట బుధుడు పుట్టెను. గ్రహములయందొకడుగా దెలియు బుధుడాతడే. ఆ తేజస్సును బృహస్పతిభార్య తార తాను ధరించెను. ధరింపలేక దక్షకన్యయగునామె (చంద్రునిభార్య) యామెయు నాబాలుని గర్భచ్యుతుంగావించెను. ఇది బుధుని జన్మవృత్తాంతము. ఇక గురుని జన్మము వినుము.

సురూపా నామ దుహితా మరీచేస్తు ప్రజాపతేః | దత్తా త్వంగిరసే సాతు రూప¸°వనశాలినీ || 52

తస్యాం స జనయామాస దేవాచార్యం బృహస్పతిమ్‌ | బృహద్వాచం మహాబుద్ధిం వేదవేదాంగపారగమ్‌ || 53

ఉక్తంతే జన్మ జీవస్య శుక్రస్యాతః పరం శృణు || ఉషానామ తధా కన్యా హిరణ్యకశిపోస్సుతా || 54

భృగుపత్నీ విశాలాక్షీ సర్వలోకైకసుందరీ | జనయామాస ధర్మజ్ఞం ఖ్యాతమౌశననం ప్రభుమ్‌ || 55

స జహారాథ యోగాత్మా ధనం వైశ్రవణస్యతు | హృతే విత్తే తు యక్షేశో జగామ శరణం హరమ్‌ || 56

తతః క్రుద్ధో మహాదేవో భార్గవం హంతు ముద్యతః | భార్గవోపిచ యోగేన ప్రవివేశ హరం తదా || 57

హరోదరస్థ స్తుష్టావ దేవీం పర్వత నంద్రినీం | తయోక్తస్తంతు తత్యాజ తదా శిశ్నేన శంకరః || 58

శుక్రస్తు నామ చైవాస్య తదా చక్రే జగద్గురుః | ధనేశత్వం దదౌ చాస్య ధనేశేన సహాఘ || 59

మైత్ర్యం చాస్య ధనేశేన తధా చక్రే త్రిలోచనః | శ##నైశ్చరస్య పక్ష్యామి జన్మాతస్తే నరేశ్వరః || 60

గురుజననము

మరీచి ప్రజాపతి కూతురు సురూప, రూప ¸°వనశాలిని. ఆమెనతడంగిరసునకిచ్చెను. ఆయన యామెయందు బృహస్పతిని దేవగురుంగనెను. ఆయన మంచివక్త. మహాబుద్ధిశాలి, వేద వేదాంతపారంగతుడు. ఇక శుక్రజన్మవృత్తాంతము వినుము.

శుక్రజననము

హిరణ్యకశివుని కూతురు ఉష. ఆవిశాలాక్షి త్రిలోకసుందరి. భృగుమహర్షి భార్య. ఆమెజౌశనసుని (ఉశనుడను భృగుమహర్షి కుమారుని శుక్రునింగనెను. ఆయన ధర్మజ్ఞుడు. యోగశక్తిచే నతడు కుభేరునిధనమును హరించెను. విత్తముగోల్పడి కుబేరుడు హరుని శరణందెను. దాన శివుడు కోపముగొని భార్గవుని జంపమద్యమించెను. భార్గవుడు యోగశక్తిచేత హరునిలోనే ప్రవేశించెను. ఆదేవదేవు సుదరమందుండి స్తుతించెను పార్వతీ దేవింగూడ కొనియాడెను. శంకరుడంతట వానిని శిశ్నము ద్వారమున విడిచెను. జగద్గురువు శంభు లీతనికి శుక్రుడను పేరు పెట్టెను. ధనేశునితో బాటీతనికి గూడ ధనాధిపత్యము మెసంగెను. మరియు కుబేరునితో నితనికి మైత్రిని గూడ గూర్చెను. ఇక శని జన్మ వృత్తాంతము తెలిపెద.

బ్రహ్మణోమానసః పుత్రః త్వష్టానామ ప్రజాపతిః | సంజ్ఞాంతు జనయామాస కన్యాం త్రైలోక్య సుందరీమ్‌ || 61

తాం దదౌ సవితుః పత్నీం తస్యాం సూర్యో మహాతపాః | జనయామాస ధర్మజ్ఞం మనుం వైవస్వతం ప్రభుమ్‌ ||

యమం చ యమునాం చైతత్రైలోక్యసై#్యకపాలినీమ్‌ | తేషుజాతేషు పుత్రేషు సంజ్ఞాసా చారులోచనా || 63

భర్తుస్తేజోతి దుర్ధర్ష మసహన్తీ వరాంగనా | సాతుఛాయాం సమాహూయ ఇదం వచన మబ్రవీత్‌ || 64

మద్రూపేణ త్వయా భ##ద్రే వస్తవ్య మవికారయా | పాలనీ¸° చ మేపుత్రౌ త్వమేమౌ దుహితాచ మే || 65

ఏవముక్త్వాయ¸° దేవ పితరం వరవర్జనీ | పిత్రా నిరస్తా భర్తారం గచ్చ గచ్చేతి భాషితా | 66

ఉత్తరాంస్తు కురూన్‌ గత్వా బడబారూపధారిణీ | చచార శాద్వలాన్‌ శుభ్రాన్‌ వనేషూవవనేషు చ || 67

ఛాయాయాంచ తధార్కోపి సంజ్ఞేయ మితి చింతయన్‌ | ద్రౌపుత్రౌ జనయామాస సావర్ణంతు శ##నైశ్చరం || 68

వజ్ర :-

కథం తా మాప్తవాన్‌ సంజ్ఞాం భూయ ఏవ దివాకరః | ఏతన్మే సంశయం బ్రూహి భృగువంశ వివర్ద || 69

శని జననము - అశ్విని జననము

బ్రహ్మ మానస పుత్రుడు త్వష్ట ప్రజాపతి. త్రిలోక సుందరియగు సంజ్ఞయను కూతురుంగని సూర్యుని కిచ్చెను. సూర్యుడామెయందు వైవస్వతమనుపుంగనెను. యముని యమునను గనెను. యమునానది త్రైలోక్యపావని. సంతానము గల్గిన తర్వాత నా సుందరి సంజ్ఞాదేవి సుకుమారి భర్తతేజమును సైపలేక ఛాయం బిలిచి కల్యాణి నా రూపుగోని యెట్టి వికృతి దోపనీక యిట సూర్యభగవానునిదర్గర నుండుము. నా కొడుకులను నా కూతురును గాపాడుచుండుము. అని పలికి యా సంజ్ఞాదేవి తండ్రి దరికేగెను. అతడు నీ మగని దగ్గరకుచో పొమ్మన నుత్తరకురుభూముల కేగి బడబారూపమున నచ్చట పచ్చికబయళ్లతోడి యచటివనంబునందు దిఱుగుచుండెను. సూర్యుడును ఛాయయం దీమే సంజ్ఞమేయని భావించుచు నిద్దరుకొడుకులంగనెను. వారు సావర్ణుడు, శ##నైశ్చరుడు. అన వజ్రుండు రవి తరిగి యాసంజ్ఞ నెట్లుపొందెను? నాసంశయమిది నివారింపుమన మార్కండేయుడనియె.

మార్కండేయః ---

పుత్రయో స్సూతపుత్రాంస్తు యధా ఛాయాసువర్తతే | న తధా వర్తతే దేవీ సంజ్ఞాసూతేషు భామినీ || 70

తతః కదాచి త్తాం క్రుద్ధః సంతతర్జ తదా యమః | తం శశాప తదా ఛాయా పాదస్తే పతతా మయం || 71

యమ శ్శశంస తత్సర్వం పితుః పరబలార్దనః | శ్రుత్వా యమస్య వచనం యమం ప్రోవాచ భాస్కరః || 72

కృమయో మాంసమాదాయ తధా యాస్యన్తి భూతలం | ఏవం శామ్యేచ్చ శాపస్తే త్వం చ త్రాతో భవిష్యసి || 73

ఏతఛ్ఛ్రుత్వా పితుర్వాక్యం చకార సుమహత్తపః | ఆరాధయామాస తదా దేవ దేవం జనార్దనం || 74

తస్మా త్స లేభే ధర్మాత్మా ధర్మరాజత్వ మంజసా | సూర్యోప్యవిందన్‌ తత్వేన పుత్రశాపస్య కారణం || 75

క్రోధావిష్ట స్తదా ఛాయాం పప్రచ్ఛామిత్రఘాతనః | శశంస తస్య సా సర్వం యధా వృత్త మనిందితా || 76

శ్రుత్వాతు వచనం తస్యాస్త్వష్టు ర్వేశ్మాగమద్రవిః | న దదర్శచ తత్రస్థాం తాం భార్యాం శుభచారిణీం || 77

త్వష్ట్రా చాశంసితం తస్య బడబారూపధారిణీ | అసహన్తీ తు తేజస్తే కురూ నావసతే శుభా || 78

భ్రమి మావేశ్య దేవేశం త్వష్టా-పి జగతాం పతిం || తేజసః వాతనం చక్రే దేవస్య సవితు స్తదా || 79

కీర్ణే తేజసి తద్రూపం భృశం కాంతతరం స్థితం | చీర్ణేన తపసా చక్రం త్వష్టా చక్రే జగద్గురోః || 80

సుదర్శన మితి ఖ్యాతం దేవస్య హరిమేధసః | కాన్తరూపస్తు సవితా హయరూపధర స్తదా || 81

ఉత్తరాంస్తు కురూన్‌ గత్వా బడబారూపధారిణీం | స్వాం దదర్శ తదా భార్యాం శీతలద్రవ్య సంయుతాం || 82

మైధునార్థీతు దాం దేవో జగామ త్వరిత స్తదా | వేగవంతంతు సంప్రాప్తం దృష్ట్వా తురగముత్తమం || 83

వ్యచేష్టత చ సా దేవీ వర పుంసోవ శంకయా | ముఖే చ భావయామాస తాంసూర్యో దీప్తదీధితిః || 84

తస్యా నాసాపుటౌ పూర్ణౌ తదా శుక్రేణ పార్థివః | తధా తస్యా స్తదా జాతౌ నాసత్యా వశ్వినా వుభౌ || 85

భూమౌచ పతితం యచ్చ తాభ్యాం శుక్రం విమర్దితం |

తస్మా త్సోశ్వాత్‌ సముత్పన్నః కుమార స్సూర్య సన్నిభః || 86

తతస్స్వరూప మాస్థాయ దేవదేవోపి భాస్కరః | స్వరూపిణీ మధాదాయ సంజ్ఞాంతాం స్వగృహం య¸° || 87

నా సత్యౌ దేవభిషజౌ కృతవానశ్వినా వుభౌ | తతో విమర్దనా జ్జాతం పుత్రం దృష్ట్వా దివాకరః || 88

రేవంతేతి తదా తస్య నామ చక్రే జగద్గురుః | తంచపుత్ర మువాచాథ సూర్యోగ్రహగణశ్వరః || 89

యస్మాత్సోశ్వాత్‌ సముత్పన్నో మత్త స్త్వంద్దీ ప్తదీధితి | పూజా మాప్స్యసి సోశ్వేభ్య స్తస్మాన్నిత్యం జగత్ర్పియః

యేచత్వాం పూజయిష్యన్తి తేషాం వృద్ధి ర్భవిష్యతి | శ##నైశ్చరస్య తే జన్మ మయోక్తం నృపసత్తమః 91

అశ్వినీ దేవతల జననము

సంజ్ఞ కన్నకొడుకుల యెడ, తాను కన్న కొడుకుల యందట్లు ఛాయాదేవి ప్రవర్తింప దయ్యెను. అంతట నొకతఱి కోపముగొని యముడామె బెదరించెను. ఆమె నీ కాలు పడిపోవుగాకయని శపించెను. యముడది తండ్రికి జెప్పెను. భాస్కరుడది విని కృపములు నీ పాదముం దొలిచి యామాంసముంగోని భూతలమునకు పోగలవు. ఈ విధముగా నీ శాపము శమించును. నీవు రక్షింపబడుదు వనెను. ఇది విని యముడు తీవ్ర తపముసేసి విష్ణునారాధించి యాయన వలన ధర్మరాజత్వమును బడసెను. సూర్యుడును పుత్రుని శాప కారణము తెలిసికొని క్రోధావేశమున ఛాయ నడిగెను. ఆ సాధ్వి జరిగినదెల్ల వివరించి చెప్పెను. అది విని భానుడు త్వష్ట యింటికేగి యచజ సంజ్ఞాదేవిం గానక యా మామ గారి వలననామె బడబా రూపమున (గుఱ్ఱమురూపున) నున్నది. నీ తేజ మోర్వలేక కురుభూములందిఱుగు చున్నదని తెలిపి, అల్లుని జగత్ర్పభుని సూర్యుని భ్రమియను యంత్రమున కెక్కించి తేజశ్శాతన మొనరించెను. అతని తేజస్సులు తరణి బట్టెనన్నమాట. అట్లు తేజస్సు చిమ్మబడ నా ప్రభాకరుని తేజస్సు మిగుల మనోహరముయితోచెను. ఆ తరణి బట్టిన తఱి రాలిన పొడితో త్వష్టచాక్రాయుధమును జేసెను. అదే హరిమేధసునకు విస్ణువునకు సుదర్శనమను పేరనాయుధమయ్యెను. అట్లు సవిత కాంత రూపుడై హయరూతము మూని యుత్తర కురు దేశములకేగి బడబా రూపమున నున్న తన భార్యం చల్లని వస్తువులతోనున్న దానిం గాంచెను. ఆ సూర్య దేవుండప్పుడు తొందర గొని మైధునార్థియై యామెందరిసెను. బహువేగమున వచ్చునా తురగోత్తమముంగని పరపురుషుడను శంకగొని నిశ్చేష్టురాలయ్యె. సూర్యుడామె ముఖమునందుభావింపజేసెను. ఆమె ముక్కుపుటము వీర్యముతో నిండినవి. అపుడామెకు అశ్వినులు నాసత్యులని పేర వారు పుట్టిరి. వారిద్దరి సమర్దము నంది భూమి మీద పడిన ఆ అశ్వములయొక్క శుక్రమునుండి సూర్యునితో సముడగు కుమారుడుదయించెను. అప్పుడు దేవదేవుడు సూర్యుండును నిజరూపముననున్న సంజ్ఞాదేవిజేకొని స్వగృహమునకేగెను. ఆయిద్దరు నాసత్యులను అశ్వినీ దేవవతలకు వైద్యులనుగావించెను. సమ్మర్దమువలనపుట్టిన కొడుకునుగని దివాకరుడు జగద్గురువువానికి రేవంతుడని నామకరణముచేసెను. గహగణాధీశ్వరుడు కొడుకునుంగని నీవు అశ్వములనుండి నిత్యము పూజనందెదవు. జగత్ర్పియుడవయ్యెదవు. నిన్నెవరుపూజింతురు వారి వృద్ధికల్గుననెను. ఇటుపై రాహువు జన్మ వృత్తాంతము తెలిపెద వినుమని మార్కండేయు డనియె.

- రాహుకే జననము -

అతః పరం ప్రవక్ష్యామి రాహోర్జన్మ తధానషు | దాక్షాయణీ సింహిఖ్యా భార్యావై కశ్యపస్యతు || 92

అకాలే వరమామాస భర్తారం తపసాన్వితం | భగవన్‌! పుత్రకామాహం తం ప్రయచ్చ మమానఘ! || 93

ఆకాలయాచ్నాసంక్రుద్ధ స్తాంజగాద స కశ్యపః | దైత్యదానవ సంకాశం పుత్రం త్వం జనయిష్యసి || 94

రాహుం సాజనయామాస వరదానా న్మహోత్మనః | అతఃపరం ప్రవక్ష్యామి కేతోస్తే జన్మ పార్థివః || 95

ప్రజానాం మహతీం వృద్ధిం దృష్ట్వా దేవః పితామహః | క్షయేతాసాం తదాచక్రే వృద్ధిం బుద్ధిమతాం వరః 96

క్షయం చిన్తయత స్తస్య ప్రజానాం మనుజేశ్వర! | ప్రాదుర్భూతా తతః కన్యా మృత్యు ర్నామేతి విశ్రుతా || 97

తాంజగాద తదా బ్రహ్మా ప్రజాః సంహర శోభ##నే! | సా తధోక్తా తదా తేన దురోద వరవర్ణినీ || 98

తదా శ్రుబిందుబి ర్జాతా వ్యాధయోథ సహస్రశః | దృష్ట్వా వ్యాధీన్‌ సముత్పన్నాన్‌ సంహృత్యా శ్రుణిఛామినీ ||

సుదుస్తరం తపస్తేపే పుష్కరారణ్యమాశ్రితా | స్థానేషుచ తధాన్యేషు బహూన్‌ వర్షగణాన్‌ శుభా || 100

భూయో జగాద తాం బ్రహ్మాప్రజాః సంహర శోభ##నే | మయోక్తం యత్పురా భ##ద్రే తత్తథాన తదస్యధా || 101

తపసా తే వరం గ్రాహ్యం తదాచక్ష్వ సుశోభ##నే! | నృణాం నిమిత్తం మరణ లోకేయాస్యతి దోషతః || 102

నకశ్చి ద్దోషతో మన్తా త్వాం కదాబిదపిధ్రువే | ఏవముక్తా తదాతేన బ్రహ్మణా సాసుశోభనా || 103

దీర్ఘముష్టంచ నిఃశ్వాసం ముమోచ వర వర్ణినీ | కృష్ణసర్పసమాకార స్తస్మాత్కేతు రజాయత || 104

శిభిదీప్తశిభో రాజన్‌! కాలానల సమప్రభః | ధూమప్రభస్య తస్యాధ కేతురూపస్య పార్థివ! || 105

సంజ్ఞాం చకార సర్వాత్మా దేవ దేవః పితామహః | ధూమకేతురయం నామ్నా భవిష్యతి జగత్త్రయే || 106

సంస్థానరూపై సుబహుప్రకారైఃశుభాశుభం దర్శయన్‌ మానుషాణాం || 107

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే గ్రహసంభవోనామ షడుత్తర శతతమోధ్యాయః.

రాహుకేతువుల జననము : - కశ్యపప్రజాపతి భార్య సింహిక. ఆమె దక్షుని కూతురు. తపస్సుననున్న భర్తనుజేరి భగవంతుడా! నేను బుత్రుని గావలెనని కోరికతో నున్నా ననుగ్రహింపు మనియె. ఆ సమయమందడుగుటకు కోపించి యా ప్రజాపతి దైత్య దానవుల పోలిన వానిని గుమారుని నీవు గనెద వనెను. ఆ మహాత్ముని వరదానమున నామె రాహువుం గనెను.

ఇకకేతువుజన్మకథ : బ్రహ్మ ప్రజలూరకపెరిగిపోవుటచూచి యాబుద్ధిశాలి ప్రజలుక్షయించుటకనువైన యాలోచనసేసెను. ఆ ఆలోచన మృత్యువనుకన్య యాయనకు గల్గెను. ఆమెను జూచి ''ఓ కల్యాణి! నీవు ప్రజాసంహారము చేయు'' మని విధి పల్కెను. అదివిని యామె ఏడ్చెను. ఆ కన్నీళ్ళనుండి వ్యాధులు వేలకొలది పుట్టెను. ఆమె వారింగని కన్నీళ్ళు ఆపుకొని (తుడిచికొని) ఉష్కరారణ్యముం జొచ్చి దుశ్చర తపము సేసెను. అక్కడనే కాదు పెక్కుచోట్ల పెక్కు సంవత్సరములు తపస్సు చేసెను - బ్రహ్మ మరల యామెంగని ప్రజాసంహారము సేయుము. మున్ను నేజెప్పితినిగదా అది యట్లే కావలయును. మఱొకలాగున కాదు. అదివిని యాసుందరి వేడి నిట్టూర్పపుచ్చెను. ఆ యూర్పు నుండి కేతువు పుట్టెను. అగ్నివలె జ్వలించు శిఖ(జుట్టు) కాలాగ్నివంటి కాంతియు కల్గి పొగలు గ్రమ్ముచు కేతరూపుడై (జెండా వలెనుండి) యున్నవానిని దేవదేవుడు బ్రహ్మ ధుమకేతువను పేరందెదవు. లోకములకు శుభాశుభములం జూపింతువనెను. దినమున నంతరిక్షమున భూమియం దీకేతువొక్కడే ధూమకేతువయి బహువిధముల రూపములతో గానిపించును. మనుష్యులకు శుభాశుభ ఫలమును జూపుచుండును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర పురాణమున ప్రథమఖండమున గ్రహసంభవమను నూలయాఱవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters