Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటయేడవ అధ్యాయము - గ్రహనక్షత్రాది సంభవము

మార్కండేయః :

పూర్వం బ్రహ్మా మహీపాల సిసృక్షు ర్వివిధాః ప్రజాః | అభ్యయుంక్త తదాత్మానం తస్యయుక్తస్య పార్థివ || 1

తతోస్య జఘనా త్పూర్వం మసురాన్‌ జజ్ఞిరే సుతాన్‌ | అసుః ప్రాణః స్మృతోవిపై#్రః తజ్ఞన్మానన్తతోసురాః || 2

యధానృష్టాః సురా స్తన్వా తాంతనుం సవ్యపోహిత |

అవ్యం క్తం తత్త్వబహుళం తతస్తాన్‌ సోతాభ్యయుంజత || 2

తతస్తాన్‌ యుంజమానస్య ప్రియ మాసీత్‌ ప్రభోఃకిల | తతో ముఖాత్‌ సముత్పన్నా దివ్యతస్తస్య దే||తాః || 4

ఉత్పన్నా దీవ్యత స్తస్యదేవాస్తేన తతః స్మృతాః | ధాతుర్దేవీతి యత్‌పోక్తం క్రీడార్ధం సంవిభావ్యతే || 5

తస్మా ద్దేవాన్తు తనాయేం జజ్ఞరే తస్య దేవతాం | దేవాన్‌ దృష్ట్వా తతస్సో వైతను మన్యాం ప్రపద్యత || 6

సత్వమాత్రాత్మికా మేవ తనుంతాం సోభ్యయుంజత | పితేవ మన్యమాస్తాన్‌ సుతాన్‌ వివ్యాధ స ప్రభుః || 7

పితరోహ్యుప పక్షాభ్యాం మధ్యే రాత్ర్యహ్నయోః పురా |

తస్మాత్తే పితరో దేవాః పితృత్వం తేషు తత్‌ స్మృతమ్‌ || 8

యయా సృష్టాస్తు పితర స్తనుం తాంస వ్యపోహాత సాపవిద్ధా తను స్తేన సద్యః సంధ్యా వ్యజాయత || 9

తస్మాదహ ర్దేవతానాం రాత్రిస్స్యా దాసురీ మతా | తయోర్మధ్యేతు పితరః సా తనుస్తు గరీయసీ || 10

తస్మా ద్దేవాసురాశ్చైవ ఋషయో మానవా స్తధా | యుక్తాస్తే తా ముపాసన్తే తధా విష్ణోర్యద న్తరమ్‌ || 11

తస్మా ద్రాత్ర్యహ్నయోః సంధా పుపాస న్తే ద్విజాస్తుతామ్‌ ||

తతోన్యస్యాం పునర్ర్బహ్మా స తన్వా ముపపద్యత || 12

రాజసత్వాత్మికాయాం తు మనసా సోసృజత్‌ ప్రభుః | మనసాతు తతస్తస్య ప్రజానాం జజ్ఞిరే ప్రజాః 13

మనసా చ మనుష్యా న్తే జననాత్‌ ప్రథితాం ప్రజాః |

సృష్ట్వా పునః ప్రజాస్సౌమ్య ! స్వాంతనుం సో వ్యపోహత || 14

సాపవిద్ధా తనుస్తేన జ్యోత్స్నా సద్యః ప్రజాయత |

తస్మాద్భవన్తి సంహృష్టాః జ్యోత్స్నాయాః ఉద్భవే ప్రజాః || 15

తా ముత్సృజ్య తతో జ్యోత్స్నాం తతోన్యాం ప్రావిశత్పునః |

మూర్తిం రిజస్తమాసక్తాం తతస్తాం సోభ్యయుంజత || 16

తతోన్న భవన్ధకారేతు క్షుధా೭೭విష్టాః ప్రజాః నృప |

తాః సృష్ట్వాతు క్షుధా విష్టాః అంగుళ్యా ధాతు ముద్యతాః || 17

అంభాంస్యేతాని రక్షామ ఉక్తవ న్తస్తు తేషుయే | రాక్షసాస్తేన్మృతాస్తస్మాత్‌ క్షుధాత్మానో నిశాచరాః 18

ధ్రువం క్షిణోమి యేమ్భాంసి తేషు దృష్ట్వా పరస్పరమ్‌ | తేన తేకర్మణా యక్షా గుహ్యకాః క్రూరకర్మిణః | 19

రక్షణ పాలనే చాపి ధాతురేవని భావ్యతే | యక్ష ఇత్యేషధాతుర్వైక్షేపణ సన్నిరుచ్యతే || 20

రక్షణ ద్రక్ష ఇత్యుక్తాః క్షపణా ద్యక్ష ఉచ్యతే | తాన్‌ దృష్ట్వా తత్‌క్షణ నాస్య కేశా శ్శీర్యన్తధీమతః || 21

తేశీర్ణా ప్యుత్థితా హ్యూర్ధ్వ మారోహస్త తతః పునః | సర్పణాత్తు స్మృతాస్సర్పాః పన్నత్వా త్పన్నగాః స్మృతాః || 22

బాలాత్మానః స్మృతా వ్యాళాః హీనత్వా చ్చాహయః స్మృతాః |

పన్నత్వా త్పన్నగా శ్చాపి సర్పాసేపాయసర్పణాత్‌ || 23

తేషాం లయాః పృధివ్యాపః సూర్యాచంద్రమసౌ ఘనాః | తస్య క్రోధోభవత్‌ ధూమ మగ్నిగర్భోః సుదారుణః ||

సతాన్‌ సర్పాన్‌ సముత్పన్నా నావికేశ విషాత్మకాన్‌ |

సర్పాన్‌ దృష్ట్వా తతః క్రోధాత్‌ క్రోధాత్మకాన్‌ వినిర్మమే || 25

గాంధయన్త స్తతో దృష్ట్వా గంధర్వా అగ్నిరేతసః | ధయ ఇత్యేష ధాతుర్వై పానే హ్యేష నిరుచ్యతే || 26

పిబన్తో జజ్ఞిరే వాచా గంధర్వాస్తేన తే స్మృతాః | కర్ణేన కపిశా భూత్వా పిశాచాః కపిశా హ్యలమ్‌ || 27

భూతత్వాత్తే స్మృతా భూతాః పిశాచాః పిశితాశినః | అష్టాసు తాసు సృష్టాసు దేవయోనిషు స ప్రభుః || 28

తతః స్వచ్చందతోన్యాని వయాంసి వయసా సృజన్‌ | పక్షిణః సతు దృష్ట్వావై తతః పశుగణాన్‌ సృజన్‌ || 29

మార్కండేయిడనియె : బ్రహ్మ సృష్టిచేయదలచి తననుందుకొఱకు నియోగించుకొనెను. అప్పుడాతని జఘనములనుండి పిఱిది భాగమునుండి యసురులు. అసుః ప్రాణము దానినుండి జన్మమందిన వారు అసురులని విప్రులు నిర్వచించిరి. తనువు నుండి సురలు సృష్టింప బడిరి. అతడాతనువును =శరిరమును అవ్యక్తము తత్త్వబహుళమునైన దానిని దానికై వినియోగపరచెను. దానినుండి సురలను సృష్టించినందున నాతనికి ప్రీతి గల్గెను. ఆయన తేజోమయమైన ముఖమునుండి దేవతలు పుట్టిరి. కావున వారికి దేవతలను పేరుగల్గెను. ధాత యొక్క దేవిగ (పత్ని) కీడానిమిత్తముగా సంభావితయైనట్లు చెప్పబడినయాయన శరీరమునందు దేవతలు జనించిరి. వారిని జూచి యాతడింకొక శరీరము స్వీకరించెను. అది కేవల సత్త్వగుణమాత్రము. దానిని సృష్టియందు వినియోగించెను. ఆ సమయములో తన నాతడు పితగా (తండ్రిగా) భావించెను. కావున నంధుభయ వక్షముల నుండి పితరులు రాత్రింబవళ్ళకు నడుమ జనించిరి. అందుచే వారు పితరులనబడిరి. పితృత్వము దానివలన వచ్చినది. పితరులు జనించిన యా తనువు నాతడు వదలిపెట్టెను. ఆ విడిచిన శరిరమే సంధ్యయయ్యెను. కావుననే పగలు దేవతలది దైవి రాత్రి అసురులది. (అసురి) యనబడినది. ఆ రెండింటి నడుమనున్నవారు పితరులు. ఆ శరీరము గొప్పది కావున దేవతలు, అసురులు ఋషులు, మానవులు నందఱు గలసి విష్ణువుయొక్క యా శరీరమునుపాసింతురు. రాత్రింబవళ్ళు నడిమి సంధ్యారూపవిష్ణుశరీరమును ద్విజు లుపాసింతురు. అటుపై బ్రహ్మ మఱియొక దాని నుండి పుట్టిన ప్రజలకు ప్రజలు (సంతానము) గల్గిరి. మనసుచే పుట్టినందున వారు మనుష్యులనబడిరి. ఆవిధముగా ప్రజలను సృష్టిచేసి తన యాశరీరమును విడిచెను. ఆ విడువబడిన శరీరము వెన్నెలయ్యెను. దాని పుట్టినప్పుడు ప్రజలానందభరితులైరి. అతడది విడిచి యింకొక తనువునంబ్రవేశించెను. అది రసజ్తమోగుణసమష్టి రూపము. అంధకారరూపమైనదాని నుండి యాకలితోగూడిన ప్రజల సృజించెను. ఆ ప్రజ యాకలితో వ్రేళ్లుగుడిచికొనుచు యీ అంభస్సులను రాక్షామ=రక్షించుకొందుమనిరట. అందుచే వారు రాక్షసులనుపేర కేవలము నాకలియే స్వరూపముగాగల నిశాచరులయిరి వారొండురలలజూచి యీ నీళ్ళను థ్రువునిగూర్చి చల్లెదమని (క్షణోమి) యొకరిపైనొకరు చల్లుకొనినందున యక్షులు పేరొందిరి. వారే గుహ్యకులు క్రూరకర్ములు. యక్ష అనుధాతువు రక్షణమందు పాలనము నందు క్షపణము =విసరుట (చల్లుట) యందు నిర్వచింపబడును. కావున రక్షణాత్‌ రక్షః =రక్షించుటచే రాక్షసులనబడిరి. యక్షణాడ్‌ క్షేపణమువలన యక్షులనబడిరి. బ్రహ్మ వారిని జూచిన యాక్షణమే కేశములూడిపోయెను. యూడిపోయినవే తిరిగి యూర్ధ్వము మొలచి పైకెగబ్రాకినవి. సర్పణమువలన (ప్రాకుట వలన సర్పములనబడినవి. పన్నత్యాత్‌ పడిపోయినందువల్ల పన్నగములనబడినవి. అవే వాలరూపములుగుట వలన (అహయః) హీనములకానందున సహులుఆనబడెను. వానికి లయవ్యాలములును స్థానములు దాగేస్థానములు. (లీనములగు తావులు) భూమి నీరు సూర్యుడు చంద్రుడు మేఘములును - ఆ బ్రహ్మయొక్క కోపమే పొగయైనది దాని గర్భమందగ్ని దారుణముగనుండును. ఆ బ్రహ్మ విషరూపములయిన యా సర్పములందావేశించెను. వానిని కోపముతో జూచి క్రోధస్వరూవములుగా మొనరించెను. ఆ మీద గాం వాక్కును ధత్‌యనా కుడిచికొనిరి అను నిర్వచనము ప్రకారము అగ్నిరేతసులగు గంధర్వులు పుట్టిరి. ఆయనచెవినుండి కపిశ వర్ణముగల పిశాచుల పిశాచులు కపిశవర్ణమువారు పుట్టిరి. (కపిశవర్ణ=జేగురురంగు) వారు భూతత్వమువలన పుట్టుట వల్ల భూతములని, పిశిత+అశినః=మాంసమును దినుట వలన పిశాచులునని నిర్వచింపబడిరి. ఇట్లు ఎనిమిదిరకాలు దేవయోనులు సృజింపబడగా నా బ్రహ్మ స్వచ్ఛందముగా (తన యిచ్ఛాను సారముగ) వయస్సుచేత (ప్రాయముచేత) వయసములను (పక్షులను) సృజించెను. అందుచే పక్షులకు వయస్సు ఎక్కువ యన్న మాట. అవి పక్షులగుట చూచి రెక్కలు గలవగుటగని యవ్వల పశువులం సృష్టించెను.

ముఖతోజాః సృజన్‌ సోవై పక్షసః చాపయోసృజత్‌ |

గాస్తథైవోదరా ద్ర్బహ్మా పున న్యాంశ్చ నిర్మమే || 30

పాదతోశ్వాంస్తురంగాంశ్చ రాసభాన్‌ గవయాన్‌ | మృగాన్‌ న్రుం శ్చైవ వరాహాంశ్చ శ్వానా సన్యాంశ్చ జాతయః ||

ఓషధ్యః ఫలమూలిన్యో రోమభి స్తస్య జజ్ఞిరే | ఏవం విధౌ షధీః సృష్ట్వా న్యయుజత్‌ సోధ్వరేషు తాః || 32

ముఖము నుండి అజములను (మేకలను) పక్షము నుండి (అవి) గొఱ్ఱలను ఉదరము నుండి గోవులను సృజించి మఱి పెక్కు జాతులను పుట్టించెను. పాదములనుండి అశ్వములను తురంగములను రాసభములను (కంచర గాడిదలను) గవయమృగములను ఒంటెలను పందులు కుక్కులు మఱి పెక్కు జాతులను సృజింపజేసెను. ఓషధులను పలమూలములను రోమములనుండి పుట్టించెను. ఇట్టి వెల్ల పుట్టించి వానిని యజ్ఞములు యందు వినియుక్తములు గావించెను.

అస్యత్వాదౌతు త్రేతాయుగముఖే పురా | గోరజః పురుషోధావి రధాశ్వతర గర్దభాః || 33

ఏతే గ్రామ్యాః స్మృతాః సప్త అరణ్యా స్సప్తచాపరే | మహిషో గవయోష్ట్రాస్తు ద్విఖురశ్శరభో ద్విపః || 34

మర్కట న్యప్తమస్తే షామారణ్యాః వశవస్తు తే | గాయత్రం చ ఋచం చెవ త్రివృత్త్సోమం రథన్తరమ్‌ || 35

అగ్నిష్టోమం చ యజ్ఞానాం నిర్మయే ప్రథమా న్ముఖాత్‌ | యజ్ఞోపి త్రైష్టుభం ఛందః స్తోమం పంచదశ స్తథా || 36

బ్పహత్‌ సామ తధో క్తంచ దక్షిణాత్‌ సోసృసాన్ముఖాత్‌ | నామాని జగతీం చైవ స్తోమం స ప్తదశం తధా || 37

వైరూప్య మతి రాత్రంచ పశ్చిమాత్సో సృజన్ముఖాత్‌ | అధర్వ మేక వింశంచ త్రిష్టుబ్వైరాజ మేవచ | 38

అప్తోర్యాయం చయజ్ఞానాం చోత్తరా త్సోస్పజన్ముఖాత్‌ | విద్యుతోశని మేఘాంశ్చ రోహితేంద్ర ధనూంషిచ ||

సృష్ట్వా చతుష్టయం పూర్వం దేవర్షిపితృమానవాన్‌ | తతోసృజత్సర్వభూతాని స్థావరాణి చరాణి చ || 40

సృష్ట్వా యక్షపిశాచాంశ్చ గంధర్వాప్సరస స్తధా | నరకింనర రాక్షాంసి వయః పశుమృగోరణాన్‌ || 41

అవ్యయం చ వ్యయం చైవ ద్వయం స్థాపరజంగమమ్‌ | జరాయుజం చాండజంచ స స్వేదజ మధోద్భిజమ్‌ || 42

భూతగ్రామం సకృతవాన్‌ దేవ దేవ శ్చతుర్విధమ్‌ | పశపశ్చమృ గాశ్చైవ వ్యాళా శ్చోభయతోదతః || 43

రక్షాంసి చ పిశాచాంశ్చ మనుష్యాంశ్చ జరాయుజాన్‌ | అండజాన్‌ పక్షిణ స్సర్ప్నానక్రాన్‌ మత్స్యాంశ్చ కచ్ఛపాన్‌ ||

యానిచైవం ప్రకారాణి స్థావరాణి చరాణిచ | స్వేదజం దంశమశక యూకా మక్షిక మత్కుణమ్‌ || 45

ఊష్మణ శ్చోపజాయన్తే యచ్చాన్యత్కించి దీదృశమ్‌ | ఉద్భిజా స్తరవ స్సర్వే బీజకాండప్రరోహిణః || 46

ఓషధ్యః ఫల పాకాన్తా బహుపుష్ప ఫలోపగాః | అపుష్పాః ఫలవంతో యేతే వనస్పతయః స్మృతాః || 47

పుష్పిణః ఫలినశ్చైవ వృక్షా శ్చోభయతః శుభాః | ప్రతానా శ్చైవ వల్ల్యశ్చ వీరుధః పరికీర్తితాః || 48

గుచ్ఛగుల్మంతు వివిధం తధైవ తృణజాతయః | బీజకాండ రుహాణ్యవ వ్రతానా వల్ల్య ఏవచ || 49

తమసా బహురూపేణ వేష్టితాః కర్మహేతునా | అనుసంజ్ఞా భవన్త్యేతే సుఖదుఃఖ సమన్వితాః || 50

ఏకదన్తాస్తుగతయో బ్రహ్మాద్యా స్సముదాహృతాః | ఘోరేస్మిన్‌ భూత సంసారే నిత్యే సతతయాయిని || 51

ఈయన తొలి కల్పము యొక్క త్రేతాయుగము మొట్టమొదట గోవు ఆజము పురుషుడు గొఱ్ఱ అశ్వతరము. గాడిద అను నీయేడును గ్రామ్యములు దున్నపోతు గవయము ఒంటె రెండు రెక్కలుగల శరభము ద్పిపము (ఏనుగు) మర్కటము ననునివి యారణ్య పశువులు ననబడెను. గాయత్రి ఋక్కు త్రివృత్‌ స్తోమము రథంతరము అగ్నిష్టోమమునను వానిని యజ్ఞములయొక్క మొదటి భాగములను సృష్టీంచెను. యజ్ఞము త్రెష్టుభ ఛందస్సు, స్తోమము వందశ ఛంధస్సు, బృహత్సామను కుండిముఖమునుండి సృజించెను. సామములు జగతీ ఛందస్సు స్తోమము సప్తదశము వైరూప్యము అతిరాత్గమునను వానిని పశ్చిమముఖము ఘండిసృజించెను. అధర్వము ఏకవింశము త్రిష్టుప్పు వైరాజము అప్తోర్యామమునను యజ్ఞభాగములను ఉత్తరముఖము నుండి నృష్టించెను. విద్యుత్తు అశని=పిడుగు మేఘములు రోహితము =ఇంద్రధనుస్సు, ననునాల్గును దేవర్షిపితరులను మానవులను పూర్వము సృజించి అటుపై స్థాపర జంగమ భూతములను సృష్టించి మృగములకు అవ్యయము వ్యయమున స్థావరజంగమములకు యక్షపిశాచ గంధర్వ అప్సరసలకు నరకిన్నర రక్షసులను పక్షులను పశువులను వాముల జారాయుజమను (మావివలన పుట్టు పశువులను) అండజములను = గ్రుడ్డు నుండిపుట్టు పక్షులను స్వేదజములను (చెమటవలన పుట్టు క్రిములను) ఉద్భిజ్జములను (విత్తునుండిపుట్టు మొక్కలు మొదలయినవానిని) భూతగ్రామములను నాల్గురకములనుసంస్కరించెను. పశువులు మృగములు వ్యాళములు రెండువైపుల దంతములు గలవి (ఉభయ దంతమలు) రాక్షసులు పిశాచములు మనుష్యులు జరాయుజములు అండజములు పక్షులు. సర్పములు, మొసళ్ళు, చేపలు, తాబేళ్ళు ననువాని చరాచరములను స్వేదజములను దంశ (కరచేవి) మశక=యూక=పేలు మక్షిక=ఈగలు మాత్కుణ ములను నల్లులు మొదలయిన వానిని ఉద్భిజములు విత్తునుండి కాడనుండి మొలచునని ఔషధాలు ఫలింపగానే నశించునని బహుపుష్పఫల భరితములయిన వానిని పువ్వులులేకుండనే ఫలించు వనసృతులు పుష్పించుట ఫలించుటయను రెండు విధములగల శుభజాతులు ప్రతానములు వల్లులు=తీగలు వీరుథములు ననబడునవి. గుచ్ఛములు గుత్తులుగలవి గుల్మములు (పొదలుగా పెరుగునవి) తృణజాతులు సృజించెను. ప్రతానములనగా విత్తునుండి మొలచు తీగలు వల్లులు అనగా కాండము. కాడకొమ్మ పాతినచో మొలచు తీగలుననువానిని సృజించెను.

పెక్కుతీరుల కర్మవలన నేర్పడిన తమస్సు (తమోగుణముచే) నివి చుట్టుకొని యుండును. వీనికి సుఖదుఃఖము లుండును. అనుసంజ్ఞములు (అంతర్వివిధములు అనగా వీనికి చైతన్యములో వీలుగానుండును. అత్తపత్తి మొదలైనవి మనము తాక గానే యాకులు ముడిచి కొనును. దానినిబట్టి వేదన, సంజ్ఞ=తెలివిలోపల నుండును. ఏకదంతులు గతులు అని చెప్పబడు నిత్వ సంసరణ శీలమయిన యీ ఘోర సంసారమునందు బ్రహ్మాదులు నిందు నిమగ్నులై యున్నవారే.

యంతు కర్మణి యస్మిన్స న్యయుంక్త ప్రథమం ప్రభుః | తత్తదేవ స్వయం తేజో యుజ్యమానః పునః పునః ||

హింస్రాహింస్రే మృదుక్రూరే ధర్మాధర్మే ఋతానృతే | తద్భావితాః ప్రపద్యన్తే తస్మా త్తత్తస్య రోచతే ||

యద్యస్య సోదదా త్సర్గే సత త్తత్‌స్వయ మావిశత్‌ | యథర్తు లింగా న్యతవః స్వయమేవతు పర్యయే || 54

స్వాని స్వాన్యభి పద్యన్తే తథా కర్మాణి దేహినామ్‌ | లోకానాంతు విశుద్ధ్యర్థం ముఖ బాహూరుపాదతః || 55

బ్రాహ్మణం క్షత్రియం వైశ్యం శూద్రంచ నిరవర్తయత్‌ | అస్యాద్వై బ్రాహ్మణాజాతా బాహుభ్యాం క్షత్రియాః ||

ఊరుభ్యాంచ విశ స్సృష్టాః శూద్రః పద్భ్యా మాజాయత | వర్ణానా మాశ్రమాణాంచ ధర్మంచక్రే పృధక్‌ పృధక్‌ ||

స్వధర్మేచ నివిష్టానాం స్థానాని వ్యదధా త్ర్పుభుః | బ్రహ్మలోకం బ్రాహ్మణానాం శాక్రం క్షత్రియ జన్మనామ్‌ || 58

మారుతంచ విశాంస్థానం గాంధర్వం శూద్ర జన్మనామ్‌ | బ్రహ్మ చారివ్రతస్థానాం బ్రహ్మలోకం ప్రజాపతిః || 59

ప్రజాపత్యం గృహస్థానాం యధా విహిత కారిణామ్‌ | స్థానం సప్తఋషీణాంచ తథైవ వన వాసినామ్‌ || 60

యతీనా మకృతం స్థానం యత్రేచ్ఛా గామినాం సదా | కృత్వాస సూత్ర సంస్థానం ప్రజాగర్భంతు మానసమ్‌ ||

అథాసృతజత్‌ ప్రజా కర్తౄన్‌ మానసాన్‌ తనయాన్‌ ప్రభుః | ధర్మం రుద్రం మమంచైవ సనకంచ సనందనమ్‌ ||

భృగుం సనత్కుమారంచ రుచిం శ్రద్ధాం తథైవచ | మరీచి మత్ర్యంగిరసౌ పులస్త్యం పులహం క్రమమ్‌ || 63

వసిష్ఠించ మహాబాగం నారదంచ మహామునిమ్‌ | స్వభాస్కరాన్‌ బర్షిషః అగ్నిష్వాత్వాం స్తధైవచ || 64

క్రవ్యాదాం శ్చోపహూతాంశ్చ ఆజ్యపాంశ్చ సుకాలినః | ఆద్యా మూర్తి విహీనాశ్చ త్రయసేషాం గణా స్మృతాః ||

చరమాస్తే గణాస్తేషాం కధితాస్తు సమూర్తయః | మహాభూత శరీరాణి సృష్టవాన్స తథైవచ || 66

ఎవనినేకర్మమందు మొదట ప్రభువు నియోగించునో దానినా జీవుడు మాటిమాటికా తేజస్సునే సంయోజనము చేసికొనుచు హింస అహింస మార్దవము క్రూరత్వము ఋతము అన్రుతమునను నాయాస్వభావములను ఆయా గుణముల భావనచే సంస్కార రూపమున బొందుచుందురు. ప్రాక్తన సంస్కారము ననుసరించి యాయాగణములాయా జీవులకు ఇష్టమగుచుండును. ఆ సృష్టి కర్త సర్గమందు సృష్టియారంభమందే గుణమెవ్వని కిచ్చెనను ఆయాగుణములు తమంతనే వానియందావేశించును.

ఋతుప్రారంభ మందు ఋతుచిహ్నములట్లు తమతమ సమయమందు తమ కుతమకు సంక్రమించు చుండునో యట్లే జీవులకు ప్రార్మబ్ధకరమయి సంక్రమించును. లోకముల విశుద్ధిచేయుటకు బ్రహ్మ ముఖభాహుఊరు పాదముల నుండి వరుసగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులను ప్రవర్తింపజేసెను. వర్ణములకు ఆశ్రమములకు వేర్వేరు ధర్మము నేర్పరచెను. సధర్మని విష్ణువుల కా ప్రభువు స్థానములను (పదవులను) ఏర్పరచెను. బ్రాహ్మణులకు బ్రహ్మలోకము క్షత్రియులకు శాక్రము ఇంద్రలోకము స్వర్గము. వైశ్యులకు మరుల్లోకము శూద్రులకు గాంధర్వలోకమును నిర్దేశించెను. ఆ ప్రజాపతి బ్రహ్మ చారి ప్రతనిష్ఠులకు బ్రహ్మలోకము, యథావిధిగా కర్మాచరణము సేసిన గృహస్థులకు ప్రాజామత్స్యలోకము వాన ప్రస్థులకు సప్తర్షి మండలము. యతులకు అకృత స్థానము (అనగా తమయిచ్ఛాను సారము పోగల వారికి తానేర్పరచిన స్థానము గాక అన్ని పుణ్యలోకములందు వారికి గతి సంచారముండునన్న మాట) నేర్పరచెను.

మానసికమయిన ప్రజాగర్భమును సూత్రస్థాలమొనరించి (యొక హద్దు నేర్పరచి) ఆమీద ప్రజా కర్తలను మానస పుత్రులను సృష్టించెను. వారు ధర్ముడు. రుద్రుడు కునుపుసనమేదుసనందనుడు భృగువు సనత్కుమారుడు రుబిశ్రద్ద మారీచి అత్రి అంగిరస్సుపులస్త్యుడు పులహుడు క్రతువు వశిష్ఠుడు మహానుభావుడు నారదుడుమహాముని స్వబాస్కరులు బర్హిషదలు అగ్నిష్వాత్తులు క్రవ్యాదులు ఉపహూతులు అజ్యువులు సుకాలు సృజించిన వారి మొదటి గణముల వారు ముగ్గురు మూర్తిలేనివారు. వారిచరమ గణములవారు. (చివరిగణములవారు మూర్తిగలవారు. అటుపై మహాభూత శరీరమును అకాశాదులను సృష్టించెను. 66

ఏ వం కృత్వా ప్రజాసర్గం చాంగుష్ఠా దక్షిణా త్తతః | ససర్జ దక్షం భగవాన్‌ వామాంగుష్ఠా స్తథైవచ || 67

ససర్జ భార్యాం తసై#్యవ దేవదేవః పితామహః | తస్యాంతు జనయామాస దక్షో దుహితర శ్శుభాః || 68

దదౌ తాశ్చ స ధర్మాత్మా బ్రహ్మ పుత్రేభ్య ఏవచ | సతీం దదౌ సరుద్రాయ రుద్రా యస్యాః సుతాః స్మృతాః ||

అసంఖ్యేయా మహావీర్యాః హరతుల్య పరాక్రమాః | యైర్ప్యాప్తం భువనం సర్వం సూర్యస్యేన గభస్తిభిః || 70

భృగవే చ దదౌ ఖ్యాతిం రూపేణాప్రతిమాం శుభామ్‌ | భృగుర్దాతా విధాతారౌ జనయామాస సాయుధౌ || 71

శ్రియంచ జనయామాస సచరాంశ్చ తురంగమాన్‌ | భృగుః ప్రాదా చ్ఛ్రియందేవీం రాజన్‌ ! నారాయణస్య చ || 72

తస్యాం సుంజనయా మాస బలోన్మాదౌ మదోత్కటౌ | మేరోః పర్వత రాజస్య ద్వే కన్యే భువిం శ్రుతే || 73

ధాతుర్విధాతు ర్ద్వే దత్తే ఆయతి ర్నియతి స్తథా | ఆయతి ర్జనయామాస ప్రాణం యదుకులో ద్వహ ! || 74

నియతి ర్జనయామాస మృకండుం తపసాం నిధిమ్‌ | వ్యతీతే స ప్తమే కల్పే మృకండోః సుమహాత్మనః || 75

అహం పుత్ర స్సముత్సన్నో మనస్విన్యాం నరాధిప | పత్నీ మరీచే స్సంభూతి ర్దక్షస్య తనయా శుభా || 76

ప్రజా పతిం పూర్ణమాసం జనయామాస ఛామినీ | పూర్ణమాసస్య విరజాః సుదామా తు తదాత్మజః || 77

లోకాలోక నివిష్టస్తు లోకపాలో మయేరితః | పుత్రశ్చ పౌర్ణమాసస్య సర్వేశో నామ చాపరః || 78

జనయామాస పుత్రౌ ద్వౌ స్తంబః కశ్యప ఏవచ | తయోర్గోత్ర కరౌ పుత్రౌ జ్ఞేయా సంన్యాస నిశ్చ¸° || 79

స్మృతి మంగిరసం ప్రాదా ద్దక్షః పూర్వం ప్రజాపతిః | సినీవాలీ కుహూరాకా తధైవానుమతిః శుభా || 80

తస్యాం సంజనయా మాస ఆగ్నించ భరతం తధా | భరతస్య తధా పుత్రః పర్జన్య ఇతి విశ్రుతః || 81

హిరణ్య రోమా వర్జన్య ఉదీచీం దిశ మాశ్రితః | లోకా లోకేవతిష్ఠన్తే లోకపాలో మయేరితః | 82

ఇట్లు ప్రజాసృష్టిచేసి కుడి యంగుష్ఠమునుండి దక్షుని ఎడమ అంగుష్ఠమునుండి యాతని భార్యను సృజించెను. ఆమె యందు దక్షుడు కల్యాణులయిన కన్యలం గనెను. వారి నాతడు బ్రహ్మకొడుకున కిచ్చెను. సతీదేవిని రుద్రునికిచ్చెను. ఆమెసంతానమే రుద్రులు. ఆరుద్రు లసంఖ్యాకులు మహావీర్యులు హరతుల్య పక్రరాములు. సర్వభువనము సూర్యుని కిరణములచేతంబోలె వారి చేత వ్యాప్తమైయున్నది. స్వాతియను కన్యను భృగున కిచ్చెను. ఆమె యప్రతిమాన సౌందర్యవతి. భృగువు ధాత విధాత యణు సాయుధులను ఇద్థఱింగనెను. శ్రీదేవింగూడ గనెను. ఆకాశచరములయిన గుఱ్ఱములనాతడు గనెను. భృగువు లక్ష్మీదేవిని (భార్గవిని) నారాయణుణ కిచ్చెను. అతడామెయందు మదోత్కటులలున బలోన్మాదులయిన కొడుకులం గాంచెను. ఆ యిద్దరకు పర్వత రాజగు మేరువు కూతుండ్రు జగత్ర్పసిద్ధలయిన ఆయతినియతియణు వారినిచ్చెను. ఆయతి ప్రాణుడను కొడుకుంగనెను. నియతి మృకండుడను తపోనిధింగనెను. బ్రహ్మయొక్క సప్తమకల్పముగనడువ మహామహుడైన మృకండునకు మనస్విని యను సాధ్వియందు నేను బుట్టితిని. (మార్కండేయుడన్నమాట) మరీచి యొక్క భార్య సంభూతి దక్షుని కూతురు. ఆమె పూర్ణమాసుడను ప్రజాపతిం గనెను పూర్ణమాసునికి విదజుడుకొడుకు, వానిసుతుడుసుదాముడు. అతడులోకాలోక పర్వతమందున్నాడు. లోకపాలుడు. పౌర్ణమానుని కొడుకు సర్వేశుడను మరియొకడు స్తంబుడు కశ్యపుడునను నిద్దరు కొడుకులం గనెను. వారికి కొడుకులిద్దఱు గోత్రకర్తలు సన్యాసుబొకడు. మరియొకడు నిశ్చయతనువారు దక్షప్రజాపతి అంగిరస్సునకు స్మృతియను కన్యనిచ్చెను. అంగిరస్సు ఆమెయందు సినీవాలి కుహువు రాక అనుమతి అనునాడుపిల్లలను అగ్నిభరతుడునను మగపిల్లలను గనెను. భరతుని కొడుకు పర్జన్యుడు. పర్జన్యుడు హిరణ్యరోముడు (బంగారు రోమములు గలవాడు) ఉత్తర దిశయందు లోకపాలుడుగా లోకాలోక పర్వత మందున్నాడు.

అనసూయాం దదౌ దక్షః తధాత్రేః సుమహాత్మనః | తస్యాం స జనయామాస తపోరాశి కరం పరమ్‌ || 83

ప్రీతిం దక్షః పులస్త్యాయ దత్తోర్ణాం జననీం దదౌ | పులస్త్యాయ క్షమాం ప్రాదాత్‌ కర్దమస్యతు మాతరమ్‌ || 84

కార్దమిః శంఖ పాద శ్చ దక్షినా మాశ్రితో దిశమ్‌ | లోకాలోక నివిష్టస్తే లోకపాలో మయేరితః || 85

దక్షశ్చ సన్నతిం ప్రాదాత్‌ క్రతవే భూరితేజసే | షష్టిః పుత్ర సహస్రాణి వాలఖిత్యా ఇతి స్మృతాః || 86

జనయామాస ధర్మజ్ఞాన్‌ సర్వాం స్తామార్ధ్వరేతసః | దక్షః ప్రాదా దధై వోర్ణాం వసిష్ఠాయ మహాత్మనే || 87

తస్యా మస్య సుతా జాతాః సప్త సప్తాశ్వ వర్చసః | రజోబాహు శ్చోర్ధ బాహుః వవన శ్చానఘశ్చయః || 88

సుతపాః శర్తి రిత్యేతే వాసిష్ఠాః సప్త కీర్తితాః | కేతుమాన్‌ సునుహా తేజా రాజసశ్చ తధా సుతః || 89

లోకాలోక నివాసీ తే ప్రతీచ్యాం స మయేరితః | స్వాహాం ప్రాదా త్స దక్షోపి సశరీరాయ వహ్నయే || 90

దివ్యాంతరిక్షభొమనా మగ్నీనాం జననీం ప్రభుః | స్వధాం ప్రాదాత్‌ పితృభ్యస్తు మేనాయాః జననీం శుభామ్‌ || 91

హిమాచలాయ మేనాపి పితృభిః ప్రతి పాదితా | చతుర్దశేమాః కన్యాశ్చ దక్షో ధర్మాయ వై దదౌ || 92

కీర్తి ర్లక్ష్మీ ర్ధృతి ర్మేధా పుష్టిః శ్రద్ధా క్రియా మతిః | బుద్ధిర్లజ్జా వపుః శాన్తిః తుష్టిః సిద్ది శ్చతుర్ధశ || 93

కీర్తి పువ్రో యశోదేవో దర్పో లక్ష్మీ సుతః స్మృతః | నిశ్చయశ్చ ధృతేః పుత్రో మేధా పుత్ర స్తధా శ్రుతః || 94

పుష్టే ర్లాభ స్సుతశ్చైవ కామః శ్రద్ధా సుతః స్మృతః | క్రియాయా స్తనయో దేవో మతి పుత్ర స్తథా దమః || 95

బుద్ధే ర్బోధ స్సుతః ప్రోక్తో లజ్జాయా వినయః స్మృతః | వపుషో వ్యవసాయస్తు క్షేమః శాన్తి సుత స్తధా || 96

తుష్టేః పుత్రస్తు సంతోషః సుఖః సిద్ధేశ్చ భాస్వరః | కామస్యచ రతి ర్భార్యా తత్పుత్రో హర్ష ఉచ్యతే || 97

దక్షుడత్రికి అనసూయ నిచ్చెను. అతడు మహామహుడు. అనసూయ యందు పరమత పోరాశిని గనెను. ఆయనయే దత్తా త్రేయుడు. దక్షుడు ప్రీతి యనుకన్యను పులస్త్యునకిచ్చెను. ఆమెదత్తోర్ణుడను కొడుకుం గన్న తల్లి. పులస్త్యునకు క్షమ యను కన్యం గూడ నిచ్చెను. ఆమె కర్దమునిగన్న తల్లి. కర్దముని కొడుకు శమఖపాదుడు. దక్షిణ దిక్కునందు లోకపాలుడై లోకాలోక మందున్నాడు. దక్షుడు సన్నతిని భూరితేజ శ్మాలియైన క్రతువున కిచ్చెను. ఆమె వాలఖిల్యులను నరువది లేలమంది ధర్మజ్ఞులను ఊర్ధ్వ రేతస్కులం గొడుకులం గన్నది. ధక్షుడూర్ణను మహాత్ముడను వశిష్ఠున కొసగెను. ఆయన యామెయందు సూర్యపర్బస్వులగు నేడు గురు కొడుకులం గనెను. రజోదాహువు ఊర్ధ్వబాహువు పవనుడు సుతవుడు శక్తికేతుమంతుడు రాజసుడు వశిష్ఠుడులోకాలోక నివాసి. పడమటి దెసనున్నాడు. దక్షుడు స్వాహాదేవుని సశలీరుడైన మహ్నికిచ్చెను. ఆయన కామెయందుది వ్యాంత రిక్షభౌములయిన యగులుదయించిరి. దక్షుడు స్వధరు పితలరుకిచ్చెను. ఆమె మేనయను కన్యం గన్నది. పితరులామెను హిమాలలున చిచ్చి. దక్షుడు పదునల్గురు కూతుండ్రను ధర్గు కిచ్చెను. వారు కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ, పుష్టి, శ్రద్ధ, క్రియ, మతి, బుద్ధి, లజ్జ, వపువు, శాంతి. తుష్టి, సిద్ధి అనువారు, కీర్తి కొడుకు యశోదేవుడు. లక్ష్మి కొడుకు దర్పుడు. ధృతి కొడుకు నిశ్చయుడు. మేధ కొడుకు శ్రుకుడు. పుష్టి కొడుకు లాభుడు శ్రద్దకొడుకు కాముడు క్రియకొడుకు దేవుడుమతి బిడ్డదముడు వృద్దిపుత్రుడు బోధుడు లజ్జ కన్నవాడు వినయుడు వపుపు కొడుకు వ్యవసాయుడు. శాంతి కొడుకు క్షేముడు తుష్టి కన్నవాడు సంతోషుడు సిద్ధి వలన కల్గిన వాడు తెజుస్వియైన సుఖుడు. కాముని భార్య రతి. కొడుకు హర్షుడు.

ఏవం ప్రజా వివృద్ల్యర్థం దక్షో దత్వాధ కన్యకాః | ఈజే కదాచి ర్యజ్ఞేన హయ మేధేన పార్థివ ! || 98

తస్య జామాతర స్సర్వే గతా యజ్ఞ నిమంత్రితాః | భార్యాభి స్సహితా స్సర్వే రుద్రం దేవీం సతీం వినా || 99

రుద్రోసతిం స కురుతే భావ్యర్థ వినిచోదితః | కదాచిదపి దక్షశ్చ తేనాసౌ న నిమంత్రితః || 100

అనాహూతాపిచ గతా పశ్చా త్తత్ర సతీ శుభా | దక్షాన్న తేభే పూజాం సా తతః క్రుద్ధా శుభాననా || 101

తత్యాజ దక్ష సంభూతాం తాం తనుం హిమకందరే | వినష్టాంతు సతీంశ్రు త్ర్వా దేవ దేవః పినాకధృక్‌ || 102

శశాప దక్షం దర్మజ్ఞం మనుష్యస్త్వం భవిష్యసి | ధ్రువస్యాన్వయ సంభూతో రాజా త్రైలోక్య విశ్రుతః || 103

తత్రాపి విఘ్నం కర్తాస్మి యజ్ఞ కర్మ ణ్యువస్థితే | భృగుం మరీచిమత్రించ పులస్త్యంపులహం క్రతుమ్‌ || 104

శశాప చైవాం గిరసం వసిష్ఠంచ మహా మునిమ్‌ | సతీ మను ప్రవృత్తస్య దక్షిస్యాస్య ప్రజాఫతేః || 105

అను వృత్తిః కృతా యస్మా ద్భవద్భి ర్థర్మో కోవిదైః | తస్మా ద్వైవస్వతే ప్రాప్తే శుభే మన్వంతరే ద్విజాః || 106

దక్ష ప్రజాపతి ప్రజావృద్ధికై యిట్లు కన్యాదానములు సేసి యొకపుడు అశ్వమేధ యాగమును గావించెను. అందల్లుండ్రందరు నాహూతులై భార్యలతో సతీదేవి రుద్రుడుం దక్క అంగరు వచ్చిరి. రుద్రుడు భావ్యర్ధ ప్రబోధననుసరించి మామగారి కెన్నడును నమస్కరింప డయ్యెను. అందు వలన దక్షుడాతనిని పివలుడాయెను.

అనాహూంతయయ్యు కల్యాణి సతీదేవీ యటకేగి దక్షుని వలన నాదరము వడయక కుపితయై దక్షుని వలన వచ్చిన తనువును హిమగిరి కందరము నందు త్యజించెను. దేవదేవుడు పినాకదారి యదివిని ధర్మజ్ఞుని దక్షుని నీవు మనుష్యుడగుదువు పొమ్ము. ధ్రువుని వంశ మందు త్రైలోక్య విఖ్యాతుడవై జనింతువు. అక్కడ గూడ యజ్ఞమునందు నీకేను విఘ్నము గావింతునని శపించెను. సతీదేవి కనుకూలముగా ప్రవర్తింపని దక్ష ప్రజాపతిని ధర్మకోవిదులయ్యు మీరను వర్తించినారు గావున వైవస్వత మన్వంతరము రాగానే యందు యజమానుడైన యీ బ్రహ్మ యొక్క క్రూరమైన జన్మము పొందుడని భృగు మరీచి అత్రిపులస్త్య పులహక్రత్వం గిరో వశిష్ఠలను శపించెను.

బ్రహ్మణో యజమానన్మ జన్వ క్రూర మావాప్యథ ! | దేహ త్యాగే కృతే రాజన్‌ ! సతీ తేవీ మహాబలా! || 107

ఉమేతి విశ్రుతా లోకే మేనాయాః సమపద్యత | హిమాచలోపి తాం దేవీం దదౌ శర్వాయ పార్థివః || 108

తయా వియుజ్యతే నాసౌ కదాచి దపి విశ్రుతః | తస్యాంతు జనయామాస దేవ దేవోపి శంకరః || 109

వినాయకం కుమారంచ భృంగేశం సుమహాబలమ్‌ | విఘ్నూనాంచ గణానాంచ పుత్రం రాజ్యేభ్యషేచయత్‌ || 110

వినాయకం మహాదేవో గజ వక్త్రం మనస్వినమ్‌ | దేవసేనాపతిం శక్రః కుమారం కృతవాంస్తదా || 111

న తత్యాజ సమీపాచ్చ భృంగేశం శంకర స్తదా | వైవస్వతేంతరే ప్రాప్తే రాజా దక్షో వ్యజాయత || 112

ధ్రువ స్యాన్వయ సంభూతో మహాబల పరాక్రమః | తత్రా శ్వమేధే వితతే అనాహూతేన శూలినా || 113

యజ్ఞో విధ్వంసిత స్తస్య వీరభ##ద్రేణ పార్థివ | స దక్షో జనయా మాస కన్యాః పార్థివ సత్తమ || 114

తాసాంచ మధ్యాత్‌ ప్రదదా దష్టా వింశతి మిందవే | దేవతా స్త్వభి మానిన్యో నక్షత్రాణాం పృథక్‌ పృథక్‌ || 115

ఉక్తం హీతే ఋక్ష గణస్య జవ్మ శుభావహం పాప భయా పహంచ |

అతః పరం కిం కథయామి తుభ్యం తత్త్వంవదస్వా యత లోహితాక్ష ! || 116

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే హోమద్రవ్య గ్రహర్ఱాది సంభవా ధ్యాయో నామ సప్తోత్తర శత తమోధ్యాయః

సతీదేవి దేహము విడిచి ఉమయను పేర మేనకకు జనించెను. హిమాలయ మాదేవిని శివున కిచ్చెను. ఈయనయాశక్తితో నెన్నడు నెడఐడి యుండదు. శంకరు డామె యందు వినాయకుని కుమారస్వామిని భృంగీశుని కుమారుని గనెను. వినాయకుని విఘ్నములకు ప్రమథ గణములకు రాజ్యమందు బ్రభువుగా పట్టాభిషేకించెను. ఆ వినాయకస్వామి గజవక్త్రండు మనస్వి యను ఇంద్రుడు కుమారుని దేవసేనాపతింగావించెను. శంకరుడు భృంగేశుని మాత్రమెన్నడో తనదగ్గర నుండి పోనీయ లేదు. వైవస్తత మన్వంతరము రాగానే దక్షుడు ధ్రువుని వంశమందు రాజై పుట్టెను. అప్పుడశ్వమేధ మందనాహూతుడైన శూలిచే (వీరభద్రునచే) నయజ్ఞము ధ్వంసము చేయబడినది. ఆ దక్షుడు కన్యలంగని వాది నిరువది యెనమండుగురను నక్షత్రాభిమాన దేవతలను చంద్రుని కిచ్చెను. నక్షత్ర సంభవము సెప్పితి మఱమి సెప్పెద సెప్పుమనియె.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర పురాణమున ప్రధమఖండమున గ్రహనక్షత్ర సంభవము. నూట యేడవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters