Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటపదవ అధ్యాయము - దక్షవంశవర్ణనము మార్కండేయః : - అంతర్ధానః పృధోః పుత్రో హవిర్ధానః తదాత్మజః | ప్రాచీన బర్హిస్తత్పుత్రః పృధివ్యా మేకరాట్ బభౌ || ఉపయేమే సముద్రస్య లవణస్య స వై సుతామ్ | సువర్ణాయాం తు సాముద్ర్యాం దశ ప్రాచీనబర్హిషః ||
2 సర్వేప్రాచేతసో నామ ధనుర్వేదస్య పారంగాః | అపృథక్ ధర్మ చరణా స్తే೭తప్యన్త మహత్తపః ||
3 దశవర్ష సహస్రాణి సముద్ర సలిలేశయాః | సముద్రగేషు దశసు తపస్యత్సు మహీరుహాః ||
4 అరక్షమాణాం గాం వప్రుర్బభూవేత్థం ప్రజాక్షయః | న శక్యో మారుతో వాతుం వృత్తం సమభవద్ద్రుమై ||
5 తదుపశ్రుత్య రాజానః సర్వేయుక్తాః ప్రచేతసః | ముఖేభ్యోవాయు మగ్నించ ససృజుర్జాతమన్యవః ||
6 నిర్మూలానథ వృక్షాంస్తాన్ కృత్వావాయు రశోషయత్ | తానగ్ని రదహత్ క్రుద్ధ ఏవమాసీత్ ద్రుమక్షయః ||
7 ద్రుమక్షయ మథో దృష్ట్వా కించిద్థగ్దేషు శాభిషు || ఉపగమ్యా೭బ్రవీ దేతాన్ సోమో రాజా ప్రచేతసః || 8 మార్కండేయుడనియె. పృథుకుమారుడు అన్తర్ధానుడు. వానిపుత్రుడుహవిర్దానుడు వాని కుమారుడు ప్రాచీనబర్హి. ఇతడు భూమండల ముదకేకైక ఛత్రాఫిపత్యమువహించినవాడు. లవణుడను సముద్రుని కూతురును సువర్ణను బెండ్లాడెను. ఆమెయందు ప్రాచీనబర్హిషునకు పది మంది కుమారులు గల్గిరి. వీరికి ప్రాచేతనులను పేరు గలదు. ధనుర్వేద పారగులు. అందరు నొకే ధర్మాచరణ పరులై మహాతపస్సు జేసిరి. పదివేలేండ్లు సముద్ర జలములందే యుండి వారు తపస్సు సేయుచుండగా చెట్లు రక్షణలేని భూదేవిని ఆవరించెను. ఇట్లు ప్రజాక్షయమైనది. వాయువు వీచుట కెడము లేకున్నది. చెట్లు క్రిక్కిరిసి పోయినవి. ప్రాచీన బర్హిషులు రాజులది విని కోపించి ముఖములనుండి వాయువును అగ్నిని సృజించిరి. చెట్ల నగ్ని దహించెను. సర్వ వృక్షక్షయమయ్యెను. అదిచూచి చెట్లించుక కాలగా సోమరాజేతెంచి ప్రచేతసులంగని యిట్లనియె. కోపం త్యజత రాజానః | సర్వే ప్రాచీన బర్షిషః | కృతా మహీ వృక్షశూన్యా శాస్యేతా మగ్ని మాదుతౌ || 9 రత్న భూతాచ కన్యేయం వృక్షాణాం వరవర్ణినీ | భవిష్యం జానతా హ్యేషా ధృతా గర్భేణవైమయా || 10 మారిషా నామ చవతాం పత్న్యర్థే ప్రదదా మ్యహమ్ | తతస్సోమస్య వచనా జ్జగృహు స్తే ప్రచేతసః || 11 సంహృత్య కోపం వృక్షేభ్యః పత్నీధర్మేణ మారిషాం | మనసా చదధు స్తస్యాం గర్భం సర్వే ప్రచేతసః || 12 దశభ్యస్తు ప్రచేతోభ్యో మారిషాయాం ప్రజాపతిః | భవశాపేన సంభూతో భూయో దక్ష ప్రజాపతిః || 13 అసృజన్మనసా దక్షః ప్రజాః పూర్వం చతుర్విధాః || నోత్పద్యన్తేచ తాస్తస్య అపధ్యాతా హరేణ తు || 14 మైథునేన తతః సృష్టిం కర్తుమిచ్ఛన్ ప్రజాపతిః | అసిక్నీ మవహ ద్భార్యాం వీరణస్య ప్రజా పతేః || 15 సుతాం సుమహతీం యుక్తాం తపసా లోకధారిణీమ్ | తస్యా పుత్ర సహస్రంతు వీరిణ్యాం సమపద్యత || 16 రాజులారా! కోపము విడుపుడు. మహి వృక్ష శూన్యమయ్యెను. అగ్ని వాయువులను శమింపజేయుడు. ఇదిగో వృక్షముల యొక్క కన్యారత్న మీమె చక్కనిది. భవిష్య మెరిగి నేనీమెను గర్భమందు ధరించితిని. మారిష యను పేరు గలది. మీకు పత్నిగా నిత్తును. అనవిని వారామెను పరిగ్రహించిరి. వృక్షముల యెడ కోప ముడిపికొని పత్నీ ధర్మమున మారిషను మనస్సుచే సమావేశమంది ఆమెయందు గర్భము ధరించిరి. దక్షప్రజాపతి ముందటి శివ శాపముచే నా పదిమంది వలన మరల జన్మించెను. అతడు మనస్సుచే నాల్గు విధముల ప్రజలను తొలుత గనెను. వారు శివునిచే నవధ్యాతులయి (వ్యతిరేక భావన చేయబడిన వారై) ప్రజాపతి కనుకూల ముగ సృష్టికి సహకరింపరైరి. అంతట దక్ష ప్రజాపతి మిథున ధర్మమున సృష్టి గావింప నెంచి వీరణ ప్రజాపతి కుమార్తెను అసిక్నిని బెండ్లాడెను. ఆమె చాల గొప్పది. తపస్విని లోకధారిణి. ఆ ధక్షుని కామెయందు వేయిమంది పుత్రులు కల్గిరి. తాంన్తు దృష్ట్వా మహాతేజాః వివర్ధయిషవః ప్రజాః | తా సువాచ మణాతేజాః బ్రహ్మపుత్రః స నారదః 17 కింప్రమాణం తు మేదిన్యాం స్రష్టవ్యస్య తదైవచ | అజ్ఞానాత్తు కథంసర్గం భవన్తః కర్తుముద్యతాః || 18 మహీమాన మథాన్వేష్టుం గతా దక్షసుతాస్తతః | లోకా లోకస్య వరతో గర్బోదస్య తథోపరి || 19 వాయు మండల మాసాద్య భ్రమణా న్నాశమాగతాః | దక్షో೭పి తేషు నష్టేషు వీరిణ్యా మేవ ధర్మవిత్ || 20 సహస్రం జనయామాస పుత్రాణా మపరం తతః | వివర్ధయిషవస్తేతు శబలాశ్వాః పునః ప్రజాః || 21 పూర్వ ముక్తంవచ స్తద్వై శ్రావితా నారదేనతు అన్యోన్య మూచుస్తే సర్వే సమ్యగాహ మహాసృషిః || 22 భ్రాతౄణాం పదవీచైవ గంతవ్యా నాత్ర సంశయః | తే೭పి హర్యశ్వమార్గేణ ప్రయాతాః పృథివీ మిమామ్ || 23 తమేవ వాయు మాసాద్య వినష్టాః శాశ్వతీ స్సమాః | తదా ప్రభృతి వైభ్రాంతాః భ్రాతు రన్వేషణ రతాః 24 ప్రయాతో నశ్యతి విభో! తన్నః కార్యం విజానతా || అధ తేషు వినష్జేషు దక్షః కోపసమన్వితః || 25 శశాప నారదం క్రుద్ధః తుల్యం జన్మ న చాప్స్యసి || దేహం త్యక్త్వా స శాపేన తేన దక్షస్య నారదః || 26 భూయో మునిసుతో జాతః కుశ్యపస్య మహాత్మనః | అశ్వమేథం చ వితతం దక్షస్యాద్భుత కర్మణః || 27 విధ్వంసయామాస హరః పూర్వవైరేణ భావితః | దక్షో೭పి శప్తవాన్ రుద్రం శప్తాస్తే బ్రాహ్మణోత్తమాః || 28 అద్య ప్రభృతి యక్ష్యన్తి నత్వా సార్ధం దివౌకసైః | జన్మాంతరే೭పి వైరాణి వినశ్యన్తి న పార్థివ! || 29 తస్మాద్వైరం న కర్తవ్యం కదాచిదపి కేన చిత్ | హర్యశ్వేష్వపి నష్టేషు మహాత్మసు పురా తదా || 30 అసిక్న్యాం జనయామాస దక్షో దుహితర స్తదా | షష్టిః కన్యా రూప యుక్తాః తపసా మహతా యుతాః || 31 ద్వే దదౌ బాహుపుత్రాయ చతస్రో೭రిష్ట నేమినే | ద్వే ప్రాదా త్స కృశాశ్వాయ దశ ధర్మాయ చాప్యథ || 32 చతుర్దశ కశ్యపాయ చాష్టావింశతి మిందవే | ప్రదదౌ బాహుపుత్రాయ సుప్రభాం భామినీం తదా || 33 మనోరమాం భానుమతీం విశాలాం బాహుదా మథ | దక్షః ప్రాదా న్మహా భాగ శ్చతస్రో೭రిష్టనేమినే || 34 స కృశాశ్వాయ చ ప్రాదాత్ సుప్రభాంచ తధా జయామ్ | అరుంధతీం వసుం జామిం లంబాం భాను మిరావతీమ్ || సంకల్పాంచ ముహూర్తాంచ సాధ్యాం విశ్వాం తధైవచ | దదౌ స దశ ధర్మాయ మహాత్మా లోక విశ్రుతః || 36 అదితి ర్దితి ర్దనుః కాలా దనాయుః సింహికా మునిః | కద్రూః క్రోధా ఇరా ప్రాధా వినతా సురభిః ఖగా || 37 చతుర్దశైతాః ప్రదదౌ కశ్యపాయ ప్రజాపతిః | నామభిః పూర్వ విఖ్యాతాః కృత్తి కాద్యాన్తధైవచ || 38 దదౌ నక్షత్ర యోగిన్య అష్టామింశతి మిందవే | దేవతా స్త్వభిమానిన్యో నక్షత్రాణాం మహీపతే! || 39 ఏతావ దుక్తం తవ దక్షవంశ మృక్షోద్భవం చాప్యధ భూమిపాల! | అతః పరం కిం కథయామి తుభ్యంతన్మే వదస్వాయత లోహితాక్ష || 40 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే దక్షవంశవర్ణనం నామ దశోత్తర శతతమో೭ధ్యాయః వారు ప్రజాభివృద్ధి సేయుటకిచ్చగించగా వారింగని బ్రహ్మ పుత్రుండగు నారదుడు ఇట్లనియె. సృష్టింప వలసిన వస్తువునకు (గమునకు) ప్రమాణమేమి? ఈ సంగతి నెరుంగక తాము సృష్టినెట్లుసేయ యత్నించుచున్నారు. అతవిని యా దక్షసుతులు లోకాలోక పర్వత మవ్వలను గర్భోదకమునకు మీద నున్న వాయు మండలము చేరి భూమియొక్క ప్రమాణమును వెదుక వలెనని యేగి ఇట్టట్టు దిరిగి చివరకు నశించిరి. దక్షుడది యెరిగి వీరిణి యందు మరి వేయిమంది కొడుకులం గనెను. వారు శబలాశ్వులు. ప్రజావృద్ధి సేయగోరి ముందటియట్ల నారదుడు పలుక విని మహర్షి చక్కగా జెప్పినాడు. అన్నల దారిని మనమును బోవుదమని యొండొరులు కూడ బలికికొని వారును హర్యశ్వ మార్గమున (సూర్య మార్గములో) నీ పృథివికి వచ్చిరి. చిరకాలము వారటునిటు నన్నల జూడం బరిభ్రమించి యదేవాయువును (వాయుమండలమును) బొంది నశించరి. అది మొదలు మన పని విన్నవాడు అన్నను వెదకబోవు నాతడు నశించునని యొక తీర్మానము గావించిరి. వారట్లు నశింప దక్షుడు కుపితుడై నారదుని నీవీజన్మముతో సమమైన జన్మము పొందవని శపించెను. అశాపముచే నారదుడు దేహము వాసి కశ్యపమునికి కొడుకై పుట్టెను. అద్భుతములెన్నోచేసిన దక్షుడుచేసిన యశ్వమేధమును హరుడు ముందటిపగ గొని ధ్వంసము సేసెను. దక్షుడు ఇంతనుండి దేవతలతో బాటు నన్నెవరు యజింపరు (నీకు హవిర్భాగమీయ) అని శంకరుని శపించెను. రాజా! జన్మాంతరములందు గూడ వైరములు పోవు. కావున నెప్పుడేని యెవనితోనైన పగ గొనరాదు. హర్యశ్వులు (సూర్య మార్గమంటి వెళ్ళిన దక్ష సంతానము) అట్లు నశింప, దక్షుడాపై అశిక్నియందు చక్కనినాని తపశ్శాలినుల నరువదిమంది కూతుండ్రం గనెను. బాహువు కొడుకున కిద్దరను అరిష్టనేమికి నల్గురను, కృశాశ్వుండను వానికిత్దరిని ధర్మునికి బదిమందిని కశ్యపునకు బదునల్గురను చంద్రుని కిరువది మెనమండుగురును నిచ్చెను. బాహుమన కిచ్చిన కన్యలు సుప్రభ భామిని యనువారు. ఆరిష్టనీమికిచ్చిన నల్గుర పేర్లు అరుంధతి వసువు, జామి లంబ భానువు ఇరావతి సంకల్ప ముహూర్త సాధ్య విశ్వ యనునవి పది. అదితి దితి దనువు కాల దనాయువు సింహిక ముని, కద్రుపు, క్రౌధ, ఇర, ప్రాధ, వినత, సురభి, ఖగ అను నీ పదునల్గురను కశ్యపున కిచ్చెను. ఇదివరకే పేర్కొన్న బడినవారు ప్రఖ్యాతులు కృత్తికాదులు నక్షత్ర యోగినులిరువదియెనిమిది మందిని దక్షప్రజాపతి చంద్రునికిచ్చెను. వీరు నక్షత్రాభిమాని దేవతలు. ఇందనుక నీకు దక్ష వంశము నక్షత్ర వంశమును దెలిపితిని. మరియేమి సెప్పవలయుం దెలుపుము. ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణము ప్రథమ ఖండమున దక్షవంశ వర్ణనమను నూట పదియవ అధ్యాయము.