Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటపదునైదవ అధ్యాయము - కశ్యపవంశాను కీర్తనము మరీచేః కశ్యపః పుత్రః కశ్యపస్య తధా కులే | గోత్రకారవృన్వషీక్ష్యే తేషాం నామా ని మేశృణు ||
1 ఆగ్రాయణా ఝషగణా మేష కౌరీటికాయనాః | గురువ్రజీ మాఠరశ్చ గోజావిరథలక్ష్మణః ||
2 శాలాహలేయాః కారిజ్యా శ్చౌకన్యాశ్చాసురాయణాః | మందాన్యావై మృగయనో శ్రౌతసో భైసతాయనాః ||
3 దేవయాతా గోపయాతా అథోచ్ఛాయతయశ్చయే | తాకయానాశ్చి త్రహయా అభిర్యోగా గదాయనాః ||
4 కాతువందిర్మహాచక్రిర్దాక్షపాణయ ఏవచ | గ్రీవాయణా హర్కిరయో హాస్తి దాసా స్తధైవచ ||
5 వాత్స్యా వాలిన్య కృతహా హాస్త లాయనిస స్తధా | ఆగ్రాయణః పేలు మూలీ రాశ్వతాతాయన స్తధా ||
6 కౌశీత కాశ్చపాకాంతా అగ్నిశర్మాయణాశ్బయే | మైషయః కైవమేయాశ్చ తధాచైవ సుబభ్రవః || 7 ప్రాచీథయో జ్ఞానగయా ఆగ్రావ మధఏవతు | శ్యామోచరా నైమిషం తత్థ్సాయే శాద్వాలాయానాః || 8 కాష్టహాయన మారీచా డౌజి హాయన హాస్తికాః | వైకర్ణేయాః కాశ్యపాశ్చ శామి శా హారితాయనాః || 9 మాతంగినో బభ్రసవః త్యార్షేయాః పరికీర్తితాః | వత్సరః కశ్యపశ్చైవనిధ్రువశ్చ మహాతపాః || 10 పరస్పరమవై వాహ్యా ఋషయః పరికీర్తితాః | రైహాశ్చ సాంఖ్యమిత్రాశ్చ త్ర్యార్షే యాః పరికీర్తితాః || 11 వత్సారః కశ్యపశైవ రైహాశ్చైవ మహాతపాః | పరస్పరమవై వాహ్యౌ గోత్రౌద్వౌ పరికీర్తితౌ || 12 మరీచి కుమారుడు కశ్యపుడు. అతని వంశమందలి గోత్ర కర్తల నెరింగింతు నిదె వినుము. ఆగ్రాయణులు ఝుష గణులు మేష కౌరీటి కాయనులు గురువ్రజీ మాఠరుడు గోజావి లక్ష్మణుడు శాలాహలేయులు కోరిజ్యులు చౌకన్యులు అసురాయణులు మందాన్యులు మృగయనుడు శ్రోతస్కలు భౌసతాయనులు దేవ యాతులు గోపయాతులు ఉచ్చాయతులు తాక యానులు చిత్రహయులు అభిర్యోగులు గదాయనులు కౌతుపంది మహాచక్రి దాక్షాయనుడు గ్రీవావణులు హర్కిరయుడు హాస్తిదాపుడు వాత్స్యులు వాలిన్యులు కృతహులు హస్తలాయనులు అగ్రాయణుడు పేలుమాలి రాశ్వ తాతాయనుడు కౌశీతకులు పాకాంతులు అగ్నిశర్మాణులు మైషయుడు కైవమేయులు ఆగ్రావమథుడు. శ్యామోచరులు నైమిషులు తక్థ్సులు శాద్వలాయనులు కాష్ట హాయనులు మారీచులు డౌజిహాయనులు హాస్తికులు వైకర్ణేయులు కాశ్యపుఉ శామిశులు హారితాయనులు మాతంగులు బభ్రసులునను వీరు త్ర్యార్షేయులు. వత్సరుడు కశ్యపుడు నిధ్రుపుడు ననువారు పరస్పర వివాహ మాడరాదు. రైహూలు సాంఖ్య మిత్రులు త్ర్యార్షేయిలు వత్సారుడు కశ్యపుడు రైహుడు నను గోత్రములు రెండు పరస్పర వివాహానర్హులు. అతః పరం ప్రవక్ష్యామి హ్యాముష్యాయణ గోత్రజాన్ | అనుష్టుభోభాక్తరయఃస్వా తయోరాజవల్లయః || 13 శై రేశిరోదేవహిశ్చ సైరఃధీ రౌప సీవకిః | సాలులిః కాటు వింగాక్షిః శత శంభి స్తధైవచ || 14 దివా వసిష్ఠా జత్యేతే నక్తం జ్ఞేయాశ్చ కాశ్యపాః | త్ర్యార్షేయావ్చ తధాతేషాం సర్వేషాం ప్రవరాః శుభాః || 15 వత్సారః కశ్యపశ్చైవ వసిష్ఠశ్చ మహాతపాః | పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః || 16 సా మాతా బలి పుత్త్రశ్చ భౌప్యలో೭థ జలత్వరః | ముంజామయూరః పర్యశ్చసో೭ష్టమో గర్దభీముఖః || 17 హిరణ్య బాహుః కై రాతః ఉభౌ కాశ్యప గోభితా | ఆహలో వృషకండశ్చ సుకేతుశ్చ తథోత్తరః || 18 ఉదకేభస్తృణో వత్స్యో మహాకేరలయశ్చయే | శాండీలవైశానవసౌ ద్రావోలే వలయాతవః || 19 పైప్పలాదిః పూర్వపరిర్వారివిత్థావరీనికః | త్ర్యార్షేయా೭పిమతశ్చైషాం సర్వేషాం ప్రవరః శుభః || 20 అసితోదేవలశ్చైవ కశ్యపశ్చ మహాతపాః | పరస్పరమవైహ్యా ఋషయః పరికీర్తితాః || ఋషిప్రదానస్యతు కశ్యపస్య దాక్షాయణాభ్యః సకలం ప్రసూతమ్ | జగత్సమగ్రం యదుసింభముఖ్య! తత్తేచ పక్ష్యామ్యహముత్తరత్ర || 22 ఇది శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయవజ్రసంవాదే కశ్యపవంశానుకీర్తనంనామ పంచదశాధిక శతతమో೭ధ్యాయ్ః ఈమీద ఆయుష్యాయణ గోత్రజుల నెరింగించెదను. అనుష్టుభులు భాక్తరులు స్వాతులు రాజవల్లులు శైరేశిరుడు దేవహి సైకంధి రౌపసేవకి సాలువిక కాటువింగాక్షి శత శంభి అను వీరిని పగలు వశిష్ఠులుగా రాత్రి రౌశ్యపులుగా నెరుంగవలెను. వారిప్రవరలు త్ర్యార్షేయములు. వత్సారుడు కశ్యపుడు వశిష్ఠుడు ననుఋషులు పరస్పరము వివాహమాడరాదు. ఆ తల్లి బలి పుత్రుడు భౌప్యలుడు జలత్వరుడు ముంజామయూరుడు పర్యుడు గంభీరముఖుడు హిరణ్యభాహువు, కైరాతుడు, కాశ్యపుడు, గోభిలుడు, అహలుడు వృషకండుడు సుకేతువు ఉత్తరుడు ఉదకేభుడు తృణుడు వత్స్యుడు మహాకేరలులు శాడీలుడు వైశ్వానవసుడు ద్రాపుడు లేవలుడు, యాతువు, పైప్పలాదుడు పూర్వపరి వారి విత్థుడు పరీనికుటునను వీరి త్ర్యార్షేయము. అసితుడు దేవలుడు కశ్యపుడు నను ఋషులు పరస్పర వివాహము సేసికొన దగురు. ఋషి ప్రకుడగు శపునను దాక్షాయణుల (దక్ష కన్యల) వలన సమగ్ర జగత్తునుసంభవించినది. ఓ యదువంశ శ్రేష్ఠ ! ఆ వంశము సమగ్రముగ తరువాత దెలిపెదను. ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము ప్రథమ ఖండమున కశ్యప కీర్తనమను నూట పదునైదవ అధ్యాయము.