Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటపదునెనిమిదవ అధ్యాయము - అతస్త్యవంశాను కీర్తనము అతః పర మగస్త స్యవక్ష్యే వంశోధ్బవాన్ ద్విజాన్ | అతస్త్యేయః కరంభోయః కౌసల్యాకులజా స్తధా ||
1 స్వమేధసో మయెభువ స్తధా గాంధారకాయనిః | పౌలస్తాః పులహాశ్చైవ క్రతువంశభవా స్తధా ||
2 వార్ణేయో೭పి మతశ్చైషాం సర్వేషాం ప్రవరాః శుభాః | అగస్త్యశ్చమహేంద్రశ్చఋషివ మయోభువః ||
3 పరస్పరమవై వాహ్యాః ఋషయః పరికీర్తితాః | పౌర్ణమాసాః పారణాశ్చ త్ర్యార్షేయాః పరికీర్తితాః ||
4 అగస్త్యః పౌర్ణమాసశ్చ పారణశ్చ మహాతపాః | పరస్పమనై వాహ్యాః పౌర్ణమాసాశ్చ పారణమ్ ||
5 ఏతదు క్త మృషీణాంతే వంశము త్తమ పూరుషమ్ | అతఃపరం ప్రవక్ష్యామికింతవానఘ ! కథ్యతామ్ ||
6 వజ్రఉవాచ:- పులహస్త్య పుల స్త్యస్య క్రతోశ్చైవ మహాత్మనః | అగస్త్యస్య తధాచైకం కథం వంశం తదుచ్యతే ||
7 మార్కండేయఉవాచ:- క్రతుః ఖల్వనపత్యో೭స్తి రాజన్వైవస్వతేంతరే | ఇధ్మవాహంపు పుత్రత్వే జగ్రాహనృపసత్తమ || అగస్త్య పుత్రం ధర్మజ్ఞ! అగస్యా త్ర్క తవస్తధా | పులహస్యతధా పుత్ర స్తిరశ్చః పృధివీ పతే! ||
9 తేషాంతే జన్మవక్ష్యామి ఉత్తరత్రయధావిధి | పులహస్త్వ ప్రజాందృష్ట్వా నాతిప్రీతమనా హ్యభూత్ ||
10 అగస్త్యజం ద్రుఢస్యుం తం పుత్రత్వేకృతవాం స్తదా | పౌలహాశ్చతథారా జన్నాగస్త్యాః పరికీర్తితాః || 11 ఏతేతవోక్తాః ప్రవరా ద్విజానామ్ మహానుభావా నృప గోత్రకారాః | యేషాంచనామ్నాం పరికీర్తనేన పాపం సమగ్రం పురుషోజహాతి || 12 ఇతి శ్రీవిష్ణోధర్మోత్తరే ప్రధమఖండే మార్కండేయ వజ్రసంవాదే అగస్త్య వంశానుకీర్తనం నామ అష్టాదశోత్తర శతతమో೭ధ్యాయః ఈ మీద నగస్త్య వంశ సంకీర్తన మొనరింతును. కరంభు డగస్త్య కుమారుడు. కౌసల్యాకులజులు స్వమేధసులు మయోభుపులు. క్రతువం శజులు గాంధారకాయని పౌలస్త్యులు పులహులు వార్షేయుడు నను వీరి ప్రవరులు శుభకరములు అగస్త్యుడు మహేంద్రుడు మయోభుపుడు నను వారు వీర ముగ్గురు ఋషులు పరస్పరము వివాహము సేసికొనరాదు. అగస్త్యుడు పౌర్ణమాసులు పారాణులు ననువారొండొరులు పెండ్లి చసికొనరాదు. ఇంతవరకు ఋషుల అపూరుష వంశముం దెలిపితిని. (అపౌరుషమనగా ఆర్షనునిసామాన్యమని యర్థముచెప్పికొనవలెను.) ఇకనేమి చెప్పుదును. వజ్రుడు పులహుడు పులస్త్యుడు క్రతువు అగస్త్యుడు నను వీరివంశమంతయు యొక్కటేయని యలచెప్పబడినదనగా మార్కండేయుడనియెః క్రకువు వైవస్వతమన్వంతరమందు సంతానములేని వాడై యుండెను. అందుచ ఇద్మవాహు నతడు కుమారునిగా గ్రహించెను. ఆయిధ్మవాహుడగస్త్యుని కుమారులు అగస్త్యుని వలన నిట్లు క్రతు పరంపర వారేర్పడినారు. పులహుని కొడుకు తిరశ్ఛుడు (పశుపక్షులు-) వారి జన్మవృత్తాంతము (మనుష్య) యీ మీద యథావిధిగా తెల్పెదను. పులహ్యుడు సంతానము గలుగకుండుట జూచి యప్రియ మంది అగస్త్య కుమారుని దృఢస్యుని పుత్రునిగా గైకొనెను. ఆ విధముగా పౌలహుడు సంతానము గలుగకుండుట జూచి యప్రియ మంది అగస్త్య కుమారుని దృఢస్యుని పుత్రునిగా గైకొనెను. ఆ విధముగా పౌలహులు అగస్త్యులుగా పేర్కొన బడిరి. గోత్రకర్తలు మహాను బావులునైన యీ ద్విజుల ప్రవరులను నీక దెల్పితిని. వీరి నామ పరికీర్తనముచే మానవు డెల్ల పాపముం బాయును. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమున ప్రథమఖండమునందు అగస్త్య వంశాను కీర్తనమను నూటపదునెనిమిదవ అధ్యాయము.