Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
పండ్రెండవ అధ్యాయము కోసల వర్ణనము వజ్ర ఉవాచ : భారతస్యా స్యవర్షస్య భేదే7స్మి న్నవమే ప్రభో ! | కిమర్థం సాగరః ఖాతః స కృతస్సగరైస్తథా ||
1 మార్కండేయ ఉవాచ : భారతస్యా స్య వర్షస్య భేదే7స్మి న్నవమే నృప! | నవమే చ దిశాం భాగే పూర్వస్యాందిశి యాదవ!
2 కోసలోనామ విషయః ప్రభూత ధనధాన్యవా& | స్ఫీతగ్రామ గుణా77ఢ్యో7స్తి నిత్యం ముదితమానవః || 3 పయస్విన్యః పయస్విన్యో యత్ర సస్యధరా ధరా | మనోభిరామా రామాశ్చ పురుషాః పౌరుషాగ్రగాః || 4 విదగ్ధ జనభూయిష్ఠా సర్వపుణ్య సమాకులా | నగరైర్న విశిష్యన్తే యత్రగ్రామా మనోహరాః || 5 గవాంప్రవేశే సాయాహ్నా యత్రగ్రామేషు భాస్కరః | ధూళిపుంజ పరిక్షిప్తో వనసాను విరాజితః || 6 పశ్చిమేప్రథమేచైవ యత్రయామే విరాజితః | రాత్రౌబ్రహ్మ ధ్వనిస్తత్ర తిష్ఠతీవ నభస్తలమ్ || 7 ఫలావనత శాఖాఢ్యా శ్ఛాయాద్రుమ సమాకులాః | ప్రపాకూప తడాగాఢ్యాః పంథానో యత్రయాదవ ! 8 వ్యాధితస్కర దుర్భిక్ష పరరాష్ట్ర భయానిచ | జనాయత్ర న జానన్తి నా7కాల మరణం తథా || 9 యూపచిహ్నా మహీయత్ర దేవ వేశ్మావ తంసివా | యత్రోత్సవ సమాకీర్ణ వరవాపీ విభూషితా || 10 ఉద్యానేషు సదాయత్ర వేణుగాంధర్వ నిస్వనం | శిలీముఖరవైర్మిశ్నం? యాత్యసం బాధతాం గుణౖః || 11 యస్మిన్న కశ్చిత్ చ్యవతే నృధర్మాత్ దీనోజనో యత్రనచాస్తికశ్చిత్ | ననేత్రహీనో దికలేంద్రియోవా వసుంధరా యత్రయథార్థనామా || 12 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే-ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే కోసలవర్ణనం నామ ద్వాదశో7ధ్యాయః. వజ్రుడు-ఈ భారతవర్షము యొక్క తొమ్మిదవభాగమందు సగరు లెందులకు సాగరముం ద్రవ్విరని యడుగ మార్కండేయుడిట్లనియె : ఈ భారతవర్షముయొక్క నవమభాగము నందు నవమ దిగ్భాగమందు తూర్పుదిక్కున కోసలమను దేశమున్నది. అది ధనధాన్య సమృద్ధము. నిండైన గామములతో నిత్యము నానందభరితులగు ప్రజలతో గూడినదిపస్వియనులు. పయస్వినులు అనగా నదులు జలసమృద్ధములు. లేక గోవులు సమృద్ధ క్షీర సంయుతములు. ధర సస్యధర (పంటలతో గూడినది) రామలు (స్త్రీలు) మనోభిరామలు (సుందరులు) పురుషులు పౌరుషమంగ్రగాములు. మంచి నేరిమిగల జనులు గలది సర్వ పుణ్యనిలయము. గ్రామములు మనోహరములు. నగరములు వాని నే విషయములోను మించవు గ్రామములందు సాయంకాలమందు ఆవులమందలు ప్రవేశించునపుడు (గోధూళి లగ్నమందన్నమాట) సూర్యుడు గోధూళిధూసరితుడై వనములందు కొండచరియలందు సాయంకాల ప్రథమ యామమందస్త సమయమున అరుణారుణప్రభలతో విరాజిల్లుచుండును. అట రాత్రులందు స్వాధ్యాయధ్వని వినిపించుచుండును. ఫలభారమున నవనత శాఖములైన ఫలవృక్షములతో చల్లని నీడ నొసంగు ఛాయావృక్షములతో చలివెందలులు నూతులు చెరువులతో నింపుగులుకు మార్గములతో నా గ్రామములు చక్కగ విలసిల్లుచుండును. వ్యాధులు దొంగలు కరవు శత్రుభయము మొదలగు నీతిబాధలను అకాలమరణములను నక్కడి జన మెరుంగరు. ఆ గ్రామములందలి యుద్యానములందెల్లవేళల వేణునాదము తుమ్మెదల గానముతో కలిసిపోయి గుణములచే నెట్టి వైరుధ్యముపొందక శ్రవణసుభగమగుచుండును. అందేయొక్కండుం దన ధర్మము నుండి జారడు. దీనుడైనవా డొక్కడు నట లేడు. గ్రుడ్డివాడు నింద్రియవైకల్యముగలవా డక్కడ లేనేలేడు. వసుంధరయను పేరక్కడ భూమికి సార్థకము. అనగా వసు=ధనమును ధర=ధరించునది. అనుమాట సార్థకముగా నా గ్రామ భూములైశ్వర్యసమృద్ధములై విలసిల్లుచుండునన్నమాట. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున మార్కండేయ వజ్రసంవాదమున కోసలవర్ణనమను పండ్రెండవ యధ్యాయము.