Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటయిరువదియవ అధ్యాయము - ఆదిత్యోత్పత్తి

మార్కండేయ ఉవాచ : 

అతః పరం కశ్యపస్య శృణువంశం నరాధిపః యత్రప్రాయేణ సంభూతం జగత్థ్సవరజంగమమ్‌ ||

అదితేః ద్వాదశాదిత్యాః దేవపుత్రాః ప్రకీర్తితాః | ధాతాపుల్రోర్యమా పూషా శక్రోంశోవరుణో భగః || 2

త్వష్టా వివసాన్తరుణో విష్ణుర్ద్వాదశమ సధా | విష్ణురంశేన సంభూతాః సాధ్యా దేవగణా నృపః || 3

తఏవ తేజసోర్ధేన జాతాశ్చైవాదితేఃసుతాః | నరనారాయణౌచోభౌ ¸°తౌ రాజన్మయేరితౌ || 4

ఇంద్రావిష్ణూ తథైవోక్తా వాదిత్యేషునరాదిపః | మనోరంతరమాసాద్య సర్వత్రైవ జనార్దనః || 5

అంశేనై కేన భవతి సగణ సోమపాయినామ్‌ | తస్మిన్గణ దేవవరో విష్ణు ర్లోకనమస్కృతః || 6

తేజసాభ్యధికో నైకో భవతీతి ససంశయః | యస్తేషామార్తి శమనం కరోతి వసుధాధిపః || 7

కర్మాణ్యతీతేషు తధాంతరేషు | వక్ష్యే భవిష్యేషు తధా నరేంద్రః |

మన్యంతరాణాం పరికీర్తనేషు | శృణుష్వ తావద్ధితివంశముగ్రమ్‌ 8

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణ ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే ఆదిత్యోత్పత్తిర్నామ వింశత్యథికశతతమోధ్యాయః.

మార్కండేయుడనియె ఇటుపై కశ్యప వంశము నాలింపుము. ఈ వంశము నందు చరాచర ప్రపంగమంతయు జనించినది. అదితియందు కశ్యపునికి గలిగినవారు (ఆదిక్యులు) పండ్రెండుగురు. వారు 1. ధాత 2. పుత్రుడు 3. అర్యముడు 4. పూషుడు 5. శక్రుడు 6. అంశుడు 7. వరుణుడు 8. భగుడు 9. త్వష్ట 10. వివస్వంతుడు 11. అరుణుడు 12. విష్ణువు వనువారు. విష్ణువు వంశమున జనించిన సాధ్యులనెడి దేవగణములే యంధలి యదాంశముతో నదితి కుమారులై (ఆదిత్యులై) పుట్టినారు. నరుడు నారాయణుడు అనినను నే మున్ను దెల్పిన యిద్దరు ఇంద్రుడు విష్ణువుగా నాదిత్యుల యందు పేర్కొనబడినారు. మన్వంతరమందు జనార్దనుడుసోమపాయుల గణముగా నవతరించును. అసోమ పీఢుల గణమందు దేవవరుడగు విష్ణువు సర్వలోక నమస్కృతుడై అత్యధిక తేజస్వియై యనేకములగు (అవతారములు) రూపులు ధరించును. వారి యార్తిని పోగొట్టుచుండును. గడచిన రాబోవునట్టి మన్వంతరము లందు సంభవించు ఉగ్రమైన (భయంకరమైన) దితి వంశము (దైత్య పరంపరను) తెల్పెద వినుము.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున అదిత్యోత్పత్తియును నూటయిరువదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters