Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటయిరువదిరెండవ అధ్యాయము - అగ్నిస్తోత్రము

వజ్రువాచ : హిరణ్యకశిపోః పుత్త్రః కాలనేమిర్మహాసురః | కధంకృష్ణేన నిహత స్తన్మమాచక్ష్వ పృచ్ఛతః || 1

మార్కండేయ ఉవాచ :- యదాదైత్యవధేవృత్తే దైత్యాః పాతాళమాశ్రితాః |

మయతారౌసమాశ్రిత్య భూయోదేవాన్ప్రదుద్రుపుః || 2

తత్రదేవగణాః సర్వే మయతార పురస్సరైః | దానవైర్నిహతాయుర్ధే దేవాచార్యం బృహిస్పతిమ్‌ || 3

సంప్రాప్తాః శరణంవిప్ర తానువాచ బృహస్పతిః | తారకశ్చమయశ్చైవ మహాబల పరాక్రమౌ || 4

యయుర్జేతుం ధేవగణాన్తా విమౌ చోదయామ్యహమ్‌ | ఏవముక్త్వా దేవగణాన్దేవాచార్యో బృహస్చతిః ||

తుష్టావ దేవదేవేశం బహురూపం హుతాశనమ్‌ || బృహస్పతి రువాచ | 5

త్వమగ్నేః సర్వ భూతానామంతశ్చరసిపావక | వేదాస్త్వ దర్ఘం జాతాశ్చజాత వేదాస్త ధాహ్యసి || 6

త్వంయజ్ఞ స్త్వంవషట్కార స్త్వంహవీంషి మహాద్యుతే! | త్వం స దేవ! చరస్యాత్మా విష్ణొరమితతేజసః || 7

త్వం ముఖంసర్వదేవానాం సర్వస్యాత్మా తధా భవాన్‌ | ఊష్మాత్వం దేహినాం దేహే భుక్త పీతవత స్తధా || 8

యచ్ఛక్తిః సర్వదేవానాం త్వదీయా భూతభావన! | ప్రాప్తా త్వయాహుతిః సమ్యగాదిత్య ముపతిష్ఠతే || 9

ఆదిత్యాజ్జాయతే పృష్టిర్వృష్టేరన్నంతతః ప్రజాః | సర్వదేవవరేశాసః సర్వలోక సమస్కృతః || 10

సర్వలోక సముత్పత్తావేకః కారణతాంగతః | కాలాగ్నిరుద్రో భగవాన్‌ జగత్సంహారకారకః || 11

స్థితౌ నిమిత్తంచ భవాన్‌ సర్వేషాం దేహినాం శమః | అతీవదుర్దరం దేవ తవతేజః సుదారుణమ్‌ || 12

తేజసా తేన దైత్యేంద్రాన్‌ జాహి మా త్విచరం కృధాః | సభాచ తే రణ దేవ భవిష్యతి సమీరణః || 13

ఇత్యేవముక్తోంగిరసా మహాత్మా తథేతి తం ప్రాహ నృపేంద్ర! పూజ్యమ్‌ |

జీవోపి గత్వా పవనం జగాద దేవేశ్వరస్యానఘ ! సిద్దిమిచ్ఛన్‌ || 14

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రధమఖండే మార్కండేయవజ్రసంవాదే అగ్నిస్తోత్రం నామ ద్వావింశత్యధిక్‌ శతతమోధ్యాయః

వజ్రుడు హిరణ్యకశిపు సుతుని కాలనేమిని క్బష్ణుడెట్లు చంపెనో తెలుపుమన మార్కండేయుడనియె. కృష్ణుడు దైత్యులం జంపిన తరువాత మిగిలినవారు పాతాళమునకేగిరి. మయుడు తారుడునను వారి నాశ్రయించి వారు దేవతలపైకి దండెత్తిరి. అందు దేవతలెల్లరోడిరి. వారు విప్రుడగు బృహస్పతిని శరణందిరి. బృహస్పతి వారింగని తారకుడు మయుడు మహా బలశాలులు. దేవతలం జయింప నేగినారు. నేనే వీరిని ప్రేరేపించితిని అని పలికి దేవ గురువు బహు రూపుడగు నగ్నిని స్తుతించెను.

బృహస్పతి కృతమగు అగ్ని స్తుతి

ఓ అగ్నీ! నీవు సర్వ భూతాంతర్యామివి. నీవలన వేదములు పుట్టినవి. అందుచే నీవు జాతవేదుడవన నొప్పితివి. నీవు యజ్ఞము, పషట్కారము హవిస్సులు నీవే. నీవు విష్ణువు యొక్క ఆత్మవై చరించుచున్నావు. నీవు దేవతలందరకు ముఖము. అంతకు నీవాత్మవు. నీవు శరీరులు తిని త్రాగినపుడేర్పడిన ఊష్వ (ఉక్క, ఉడుకు) అదే దేవతలందరకు శక్తి. నీవు యజ్ఞములందు పొందు ఆహుతి ద్రవ్యము సరిగా ఆదిత్యుం పొందును. ఆదిత్యుని వలన వర్షము, పృష్టివలన నన్నము, దానన్‌ ప్రజలు గల్గుదురు. సర్వదేవరులకు నీశ్యరుడవు. సర్వలోక వంద్యుడవు నీవు. ముల్లోకముల పుట్టుకకు నీవే కారణ మయిన వాడవు జగత్సంహార కారకుడగు కాలాగ్ని రుద్రుడు నీవే. సర్వే దేహుల ఖ్థాతికి (నిలుకడకు) నీవే హేతువు. శమ స్వరూపుడవు (శాంతీ) నీతేజస్సు మిక్కిలి దారుజము. (భరింపరానిది.) దైత్యులను నీవాతేజస్సుచే సంహరింపుము. అలసింపకుము. నీకువాయువు తోడగును. అని యంగీరసుడు (బృహస్పతి) సుతింప మహాత్ముడగ్ని సరియే యనియెను. గురుడు చని వాయువునకీ విషయ మింద్రునికి జయముకొరి యెరింగించెను.

ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున యగ్నిస్తోత్రమను నూటిఇర్వది రెండవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters