Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటయిరువదియైదవ అధ్యాయము - కాలనేమివధ

మార్కండేయఉవాచ :- దృష్ట్వా సపురతోదేవం దాన వానభ్య భాషత | అయం సదృశ్యతే విష్ణుర్గానవా యేన ఘాతితాః ||

కుతృష్ణయేవ శక్రార్ధే బభూవకిల నామనః || యదావంచిత వాన్పుత్రం భాతృవ్యస్య బలింమమ || 2

నృవరాహవపుః కృత్వాలోకచితహరంపురా | హిరణ్యాక్షం జఘానైవ పితృవ్యం మమవిస్మితమ్‌ || 3

అపూర్వం రూపమాస్థాయ నరసింహస్యదానవాః | పితరం యోజఘానైన హిరణ్యకశిపుం రణ || 4

వరాహరూపిణానేన పాతాళతలమాస్థితాః | అసంభావ్య భ##యేనాజౌ దనవా వాని పాతితాః || 5

నరాశ్వవ పుషాయేన మధుకై పభయోఃపురా | పాతాళాదాహృతా వేదా స్తతస్తౌ యుధిగాతితౌ || 6

అస్యాజ్ఞా కారిణోదేవా నసంతిష్ఠంతిశాసనే | అయరక్షాం దేవానామస్మాభిర్వి ప్రకృప్యతామ్‌ || 7

త్త్రైలోక్యేదైత్యముద్భూతం యుద్ధేనైవపుసః పునః | దేవసాద్గమ ఇత్యేవ తేన వధ్యోథమేరిపుః || 8

అతీతస్యాద్యకాలస్య దుర్ణయస్యకృతస్యచ | భోక్ష్యతేయంఫలం దైత్సాః సర్యే పశ్యత మాచిరమ్‌ || 9

ఇత్యేత దైత్యనాధస్య వాక్యం శ్రుత్వైవ దానవాః | జయశబ్దంతతశ్చక్రు స్సింహనాద రవంతధా || 10

వాచశ్చప్రతికూలాస్తా స్తేన దుష్టేన చేతనా | తచ్ఛ్రుత్వాచహరి ర్దేవః క్రుద్ధోనామేదను బ్రవవీత్‌ || 11

కిమిదం గర్జసేదైత్య! శారదాంబుదవద్వృధా | ప్రజాపతి కృతం సేతుం కథం లంఘుతుమిచ్ఛసి || 12

ఏవంకథయతో ర్దేవదైత్యయోః పార్థివోత్తమ | ప్రావర్తత రణోఘోరో గదాపాత విభీషణః || 13

దానవైర్దేన దేవోపి కాలనేమి పురః సరైః | సంభాద్యతే మహాస్త్రౌఘై ర్మఘైరివనభ స్తలమ్‌ || 14

సంభాద్యమానో దైత్యేంద్రై ర్గౌవదేవో నవివ్యధే | యోధయామాస సరణ గదయాదాన వాన్బహూన్‌ || 15

తస్యదైత్య ప్రసక్తస్య కాలనేమిర్మ హాసురః | పాతయామాస కీగేన గదాం గరుడమూర్థని || 16

గదాఘాతేన రౌద్రేణ తేనతార్‌క్ష్య స్యమానద! | నాసాభగ్నావ్యధా జాతా రక్తచ్ఛర్దిశ్చ దారుణా || 17

వ్యధితం గరుడం గృష్ట్వా దేవేన హరి మేధసా | క్షిప్తం దైత్య వినాశాయతదా చక్రం సుదారుణమ్‌ || 18

యత్తత్సుదర్సనలనామ సూర్యతేజః సముద్భవమ్‌ | వ్రజ్రనాభం సహస్రారం క్షురపర్యంత మండలమ్‌ || 19

చ్యుతం చక్రికరాచ్చక్రం కాలనేమిం మహాసురమ్‌ | శీఘ్రం విశిరసంచక్రే విబాహుంచ తధా నృప! || 20

విబాహు శిరసంకృత్వా దేవ హస్తముపేయివాన్‌ | విబాహు శిరసం కాయం క్షర చ్ఛోణిత నిర్ఘరమ్‌ || 21

నవపాతాస్య మేదిన్యాం యదాతార్ష్యస్తతో రయాత్‌ | ఉరసాపాతయామాస దేవానాం వశ్యతాం తదా || 22

పతతా దైత్యకాయేన సశైల వన కానవా | కంపితా వసుధా సర్వా పతితాశ్చశిలోచ్చయాః || 23

దానవేంద్రంహతం దృష్ట్వామయతార పురోగమాః | తుష్ణువు ర్దేవదేవేశం పరచక్రాసి పాణినమ్‌ || 24

తుష్టాపచ తధాదేవో బ్రహ్మా శుభచతుర్ముఖః | సుతశ్చ బ్రహ్మణాదేవోలోక పాలాన్యధాపురా || 25

స్థానేషుయోజయామాస యజ్ఞం దేవముఖేతధా | జగామ బ్రహ్మణాసార్ధం బ్రహ్మలోకం తదా విభుః || 26

తత్రాత్మానం యజ్ఞమూర్తి మిజ్యమావం ద్యిజోత్తమైః | దృష్ట్వా స్వయంతు జద్రహ యజ్ఞభాగం మహాత్మనామ్‌ || 27

తత్రపూజా ముపాదాయ జగామ స హిరణ్వతీమ్‌ | అసై#్త్రరనుగత స్తత్ర సుష్యాప కిల యోగవీత్‌ || 28

ఏవం సదైత్య ప్రవరో నరేంద్ర! | కృష్ణేన చక్రేణ పురానిర స్తః |

ఆతఃథరం కిం కథయామి తుభ్యం | తన్వేవదస్వాయత లోహితాక్ష! || 29

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయవజ్రసంవాదే కాలనేమివధోదామ పంచవిఃవత్యుత్తర శతతమోధ్యాయః

మార్కండేయుడనియె:- ప్రహ్లాదుడెదుట హంగని దానవులతో ఇడుగో! నరవరాహ మూర్తి! మాపిన తండ్రిని హిరణ్యాక్షుని దానపురను జంపిన వాడు కనబడు చున్నాడు. లేనిపోని యాశతో (యాచకుడై) ఇంద్రుని కార్యము చక్కబెట్టు వామనుడై మాపినతండ్రి కొడుకగు బలిని వంచించి నాడితడే. నరసింహ మూర్తియై మా తండ్రిని హిరణ్య కశిపుం పోరిలో గూల్చిన యతడి తడే వరాహావతారుడై భయమననేమో యెఱుంగని యీతనిచేత బాతాళవాసురాలైన దైత్యులుగూల్పబడిరి. ఆరూపుతోడనే మధుకైటభుల పరివారము గూల్పబడి పాతాలమునుండి వేదుము లీయనవలననే గొనిరాబడినవి. అవ్వల యుద్ధమందు వాండ్రిద్దరు హతులైరి. వీని శాసనము నమలుచేయు దేవతలు మన వశమున నుండరు. దేవతలకితడు రక్షాక వచము. దీనిని మనము లాగి పారవేయ వలెను. దైత్యజాతి తిఱిగితిఱిగి యుద్ధముతోనే యుద్భవించినది. అనగా మనబూతి కేవలము యుద్ధనిమిత్తముగానే పుట్టినట్లున్నది. మనపోరున కంతు గానబడుటలేదన్న మాట. ఇపుడు ముల్లోకములు దేవవశ##మై పోయినవి కావుననే యీ శత్రువును కడతేర్చ వలసినవాడయి యున్నాడు. జరిగి పోయిన కాలము యొక్కయు, తాను మన యెడల చేసిన దుర్నయమునకు ఫలమిప్పుడే యనుభవింప గలడు అని యిట్లు దైత్యనాథుడు పలకినది విని జయజయధ్వానములు సింభగర్జనములుం జేసిరి. దుష్టమతితో నతడు పలికిన ప్రతికూల వచనములను హరి విని కుపికుడై యట్లనియె.

ఓరీ ! దైత్య! శరత్కాలమేఘమట్లు వ్యర్థముగ నేమిది గర్జించుచున్నావు. ప్రజాపతి ఏర్పరచిన కట్టను దాటనెట్టు తలంచుచున్నావు అని యిట్లు పలుకుచుండ దేవాసురులకు ఘోరరణ మారంభ మయ్యెను. కాలనేమి మున్నగు దానవుల మాయుభయులచే మహాస్త్రములచే విష్ణువు విష్ణుపదముగూడ (ఆకాశముకూడ) కప్పివేయబడెను. కాని దానికి హరియించుకయు బాధనొంద డయ్యెను. గద చేకొని శత్రువులతో బోరెను. అంతలో కాలనేమి గరుత్మంతునిపై గదను విసరెను. ఆగదా ఘతముచే గరుడుని ముక్కు పగిలి వ్యధ గలిగెను. దారుణముగా రక్తము గ్రక్కుకొనెను. అదిచూచి హరిమేథసుడు దైత్యనాశనమగు గాకయని అతిదారుణ చక్రాయుధమును విసరెను. అసుదర్శనము సహస్రారము (వెయియరలు పలుకలు) నడిబొడ్డు వజ్రమయము సూర్యునట్లు వెలుగుచుండెను. బ్రహ్మాండము తుది దాక వ్యాపించిన తోజో మండలము కలది. చక్ర కరము నుండి వదలివెళ్ళిన యమ్మాహాయుధము కాలనేమి మహాసురుని శిరోహీనుని బాహుహీనుని గావించెను. అది తిరిగి స్వామి హస్తమునకు వచ్చెను. తల చేతులు పోయి రక్తము సెలయేఱట్లు ప్రవహింప నింకను రణమందు పడిపోకున్న వాని మొండెమును గరుడడు ఱొమ్మునందాకి దేవతలట్టె చూచుచుండ మేదినిం బడవేసెను. ఆ దానవుని కాయము పడుక్కునంత ననంతగిరి కాననయైన యనంత (భూమి కంపించెను. పర్వతములు గూలెను. దానవేంద్రుడు హతుడగుట చూచి మయిరు తారుడు మున్నగు దానవులు చక్రగదా ఖడ్గపాణియగు విష్ణువును స్తుతించిరి. బ్రహ్మయు నలుమోముల నా హరిం గొనియాడెను. స్తుతింప బడి దేవదేవుడు లోకపాలురను ముందటియట్ల వారివారి స్థానములందు నిలపి దేవముఖ మందు యజ్ఞమును సంయోజించెను. (యజ్ఞ హవిర్భాగములు దేవతల ముఖమున కందునట్లు గావించె నన్నమాట.) అపుడు బ్రహ్మతో హరి బ్రహ్మలోకమున కేగెను. అక్కడ యజ్ఞమూర్తిగధన్ను ద్విజపరులు యజించు చుండ జూచి యా మహాత్ముడిచ్చిన యజ్ఞభాగములను దానునందుకొనెను. అక్కడ పూజగైకొని అస్త్రములు (అధి దేవతలు) తనను వెంబడింప హిరణ్య పలికేగి యోగేశ్వరుండట నిద్రపోయెను. ఇట్లా దైత్యనాథుడు కాలనేమి కృష్ణుని చక్రాయుధముచే గూల్పబడెను. ఇటుపై నేమి యానతిత్తు నది యడుగుమన వజ్రుండు మార్కండేయున కిట్లనియె.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున కాలనేమివధయను నూటిరువదియైదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters