Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటయిరువదియాఱవ అధ్యాయము - వరాహప్రాదుర్భావము వజ్ర ఉవాచ : యదుక్తం దైత్యవాధేన దైత్వానాం కాలనేమినా | పాతాల దైత్య శమనం వపుర్దేవస్య చక్రిణః ||
1 తదహం శ్రోతుమిచ్ఛామి తత్రమే సంశయో మహాన్ | చరితం తస్యదేవస్య భావాన్వేత్తి యథాతథమ్ ||
2 విష్ణునా తు బలౌ బద్ధే పాతాళతలమాశ్రితాః | జఘ్నర్దెత్యగణా లోకాన్ బ్రాహ్మణాంశ్చ విశేషతః ||
3 భూతలేహన్యమానేతు యజ్ఞేనాశ ముపాగతే | క్షుత్షా మైస్త్రిశై ర్ర్బహ్మా దైత్య హేతోః ప్రచోదితః ||
4 బ్రహ్మాపిచోదయామాస దేవదేవం జనార్దనమ్ | బ్రహ్మణా చోదితో దేవః పాతాల గమనేచ్ఛయా ||
5 చకారరూపం వారాహం భిన్నాంజన చయ ప్రభమ్ | శశాంక లేఖా దంష్ట్రాగ్రం వజ్ర ప్రోథఖురం తధా ||
6 వజ్రసంహననం భీమం త్రైలోక్య క్షోభకారకమ్ | పీనవృత్తాయత స్కంధం మహాపీన శిరోధరమ్ ||
7 వివృత్తాస్యం మహాకాయం భీమాక్షం భిమ నిస్వనమ్ | ఆవర్తి రోమ సంఘాతం తేన విగ్రహమూర్జితమ్ ||
8 స సముద్రేణ పాతాళం ప్రవిశ్య మధుసూదనః | దైత్యానాం దర్శనే తస్థౌ మహాబలపరాక్రమః ||
9 పాతాళేసూకరం దృష్ట్వాప్రోధాదారిత భూతలమ్ | సుముస్త గర్భకబలం శుంశుంకారకృతాననమ్ ||
10 పంకానులిప్త సర్వాంగం నిర్యయుర్దానవా స్తదా | సతతం మృగయాశీలా జఘ్న స్తంచ వరాయుధైః ||
11 సహస్యమానో దైత్యాసై#్త్రః పృషతైరివ పర్వతః | స్కంధ కండూచ్ఛలేనాఔ దైత్యాధిప నివేశనమ్ || 12 పాతయామాస వేగేన మహాద్రి శిఖరోపమమ్ | వేశ్మనశ్చ నిపాతేన దేవదేవస్య మాయయా || 13 హన్యంతే దానవాఘోరాః శతశో೭థ సహస్రశః | తే క్షయా ద్దైత్యముఖ్యానాం దైత్యముఖ్య క్షయంకరాః || 14 యథార్ధ క్షయతాం జగ్ముః క్షయే రౌద్ర ఉపస్థితే | క్షీయమాణాం క్షయైర్దృష్ట్వా క్షతజోత్షిప్త మూర్ధజాన్ || 15 క్ష్మాతలస్థాన్ క్షతైర్గోత్త్రైః క్షణన క్షణదా చరాన్ | ప్రధానా దైత్య ముఖ్యాయే ఔరసేన బలేన తే || 16 జగ్ముర్వరాయధై ర్దేవం శతశో೭ధ సహస్రశః | హన్యమానో దైత్యేంద్త్రైః ప్రోథేన దితిజోత్తమాన్ || 17 విదారయామాస రణ దంష్ప్రాగేణ తధాపరాన్ | ఏవం వరాహేణ రణ హతాన్ దృష్ట్వా దితేః సుతాన్ || 18 హరిం విజ్ఞాతవాన్దేవం ప్రహ్లాదో దైత్యసత్తమః | సప్రణమ్య హరిం దేవం తుష్టావపరవీరహా || 19 తంజగాద మహాతేజా దేవదేవో జనార్దనః | అనుగ్రాహ్యో೭సిమే దైత్య! భక్తో೭సి సతతంయతః || 20 తవాజ్ఞా లంఘకాఘోరాం ప్రాయేణ నిహతామయా | తవాజ్ఞాకారిణో దైత్యా నమే వధ్యా దితేః సుతాః || 21 శాసనం పాలయ మహ్యం పాతాలం త్వం సుఖీభవ |మార్గే స్థాపాయ దైత్యాం స్త్వం త్వదాజ్ఞ పిరిబృంహితాన్ || 22 ఆభూతసంప్లవం దైత్యజీవం త్వం న విమోక్ష్యసే | ధర్మిష్ఠానాంచ దైత్యానాం సదా రాజా భవిష్యసి || 23 మద్భక్త్యా పరయా వత్స! పుత్త్ర స్తవ విరోచనః || మార్గచ్యుతో೭పి నహతః కల్పాయుశ్చతధాకృతః || 24 బలిర్వైరోచన శ్చైవ మయాబద్ధః కృతే తవ | కరిష్యతి సశక్రర్వం ప్రాప్తే సావర్ణికేంతరే || 25 బాణంచ తనయం తస్య మమ విప్రియకారకమ్ | త్వత్కృతేన హనిష్యామి తస్యచ్ఛేత్స్యామి దోర్ద్రుమాన్ || 26 భిన్నబాహు ర్మయాయుద్థే హరస్యానుచరో బలీ | మహాకాల ఇతి ఖ్యాతో కల్పస్థాయీ భవిష్యతి || 27 ఏకమేకంతు దైత్యేంద్రః సంతానే సతతంతవ | నాహం వధిష్యే ధర్మజ్ఞ! త్వత్కృతే వ్యేతు తే భయమ్ || 28 భవాన్భక్త స్తధామహ్యం భ##క్తేష్వపి తథా మమ | నాస్త్యదేయం మహాభాగ! తస్మాత్త్వంగచ్ఛ నిర్వృతః || 29 హతశేషానుపాదాయ దైత్యాన్సత్పథమాశ్రితాన్ | ఏతావదుక్త్వా ప్రహ్లాదం తత్త్రెవాంత రధీయత || 30 ఏతద్వరాహచరితం తవ రాజ సింహ! ప్రోక్తం మయా సకల కల్మష నాశకారి | ఉద్వృత్త దైత్య శమనస్య ఋషిస్తుతన్య | కండూ వినోదన హతాసుర పుంగవస్య || 31 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే పాతాళే వరాహ పాదుర్భ్రావోనామ షడ్వింశత్యధీక శతతమో ೭ధ్యాయః కాలనేమికథనమునందు పాతాళమందలి దైత్యుల సంహరించుటకు హరి పూనిన శరీరమునుగూర్చి నాకు సంశయముగల్గు చున్నదది యానతిమ్మన మార్కండేయుడనియె. బలిని హరి బంధించినతరువాత పాతాళవాసులగు దైత్యులు లోకములను విశేషముగ బ్రాహ్మణులను చంపిరి. భూతలము హతమై యజ్ఞము నాశనమంద నాకలింగుమిలి దేవతలచే దైత్య (వధ) నిమిత్తముగ బ్రహ్మప్రేరేపింపబడెను. బ్రహ్మయుం బ్రేరేపింప హరి వరాహరూపముం దాల్చెను. నూరినకాటుకవలె నల్లని రూపము చంద్రరేకవంటి కోరకొన వజ్రాయుధమట్టి ముట్టెయు గిట్టలును వజ్రశరీరమునం నిండ బలిసిన వర్తులాకారమైన మూపు మగల నొత్తుకొన్న (లావైన) మెడ తెఱచిన మొగము భయంకర నేత్రములు భయంకర ఘర్ఘ&ురారావము సుడులుతిరిగిన రోమ సంఘాతముగల భయంకర త్రిలోకక్షోభకరమైన వరాహాకారముంబూని సముద్రము దారింబడి పాతాళముంజేరి దైత్యులెదురగుటకై నిలువబడెను. ముట్టెతో భూతల ముంజీల్చుచు తంగముస్తలనోట గఱచికొని నమలుచు శుంశుంకారము సేయుచు నొడలంత బురదపూసుకొనియున్న సూకరమును (పందిని) పాతాళమందుగని మహా బల విక్రములు వేట కలవాటుపడినవాండ్రు దానవులు వెడలి నిశితాయుధములం గ్రుమ్మిరి. వాన చినుకులం బర్వతమట్లా యసురుల యాయుధములం తాకిడిపడి మూపు గోకుకొను నెపమున నవియంధట్టిట్లు మెలగి మహాద్రిశిఖరమట్లున్న దైత్యరాజు భవనముం బడవేసెను. దేవదేవుని మాయచే నాగృహముగూలివడ దానియడుగునబడి నూరులు వేలుగ మూక దానవులు నుగ్గునుగ్గైరి. అట్లు దైత్యముఖ్యులు దైత్యముఖ్యక్షయము (నాశనము)నకు కారణులై యోమునుండి (భవనము నుండి) కూలియు అది పనిబడియు భయంకరమైన క్షయము =నాశనము (దానవులకు ప్రలయకాలము) అసన్నమైన యందరును యదార్థ క్షయమును బొందిరి. అసలైన నాశనమందిరన్నమాట. ఇట్లు సర్వవిధ క్షయములచేత క్షీణించిన యా దానవులను రక్తముచేవిండిన జుట్టుతో క్షణములో క్షతగాత్రులై క్షితితలమునబడి క్షణదాచరులను (క్షణద=రాత్రి) నిశాచరులను జూచి యింకను మిగిలియున్న ప్రధానులు దైత్యముఖ్యులు జేరిన బలముతో (ఉరః=ఱోమ్ము-గుండెబలముతో గుండెలు కుదుటబెట్టుకొని యన్నమాట) గట్టియాయుధమలతో వందలు వేలుగా దేవదేవుం గొట్టిరి. అట్లుగొట్టుపడి వరాహము మట్టితో కొమ్ముతో గ్రుమ్మి దైత్య ముఖ్యులను జీల్చివైచెను. నీవరాహమిట్లాహవమున దితి సంతానముం దెగనెయటంగని దైత్యోత్తముడు ప్రహ్లాదు డీయన హరియని గ్రహించెను. అతడు హరిం బ్రణమిల్లిస్తుతించెను. వానింగని మహాతేజస్వి జనార్ధనుడు దైత్యా! నీవు నాకనుగ్రాహ్యుడవు నా భక్తుడవు. కావున నీ యజ్ఞోల్లంఘనము సేసిన ఘోర రాక్షసుల నెందరనో నేను గూల్చితిని. వీయాజ్ఞాకరులను నేను వధింపను. పాతాళమందీవు శాసన పాలనముసేయుము. సుఖముండుము. నీయాజ్ఞావశులను దారిలోబెట్టుము. భూత ప్రళయము దాక నీవు ప్రాణముంగోల్పోవు. ధర్మనిష్ఠులయిన దైత్యులకీపు శాశ్వత ప్రభ వగుదువు. వత్సా! నీ పుత్రుడు విరోచనుడు నాయెడగల పరమ భక్తి మార్గము దప్పినవాడయినను నేను జంపలేదు. పైని వానిం గల్పాయుష్కుంగావించెను. నీకొరకే విరోఛనుని కొడుకును బలిని నేను బంధించితిని. సావర్ణి కమన్యంతర మందాతడే యింద్రుడగును. ఆ బలికొడుకు బాణుని నాకప్రియమొనరించినవాని నీకొరకు (నీవునా పరమ భర్తుడవని) జంపలేదు. వాని భుజతరువుల మాత్రము ఖండించితిని. నాచేజేతులు తెగినవాడు పరశివునికనుచరుడై యాబలశాలి మహాకాలుడను పేర కల్పాంతమువరకు జీవించును. నీ నిమిత్తమయిన యాదరముచేత నీ సంతానము నేయొక్కనింగాని నేను హరింపను. నీకు భయము వలదు. నీవు నా భక్తుడవు. భక్తులకు నాకు నీయరాని దొక్కటియు లేదు. మహాభాగ ! నీవు సంతుష్టుడవై చావగా మిగిలిన సన్మార్గము నందున్న దైత్యులం జేకొని జనుము అని ప్రహ్లాదునితో నని భగవంతుడంతర్ధానమందెను. రాజసింహా! ఇది వరాహావతార చరిత్ర యింతదనుక నీకు దెల్పితిని. సర్వపాప హారి యిది. ఉద్వృత్తులయిన దైత్యులను గూల్చి ఋషిస్తుతుడై దురద గోకికొను నెపమున ససుర వరులం గడతేర్చిన హరి చరిత్ర యిది. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున వరాహావతార చరిత్రమను నూటయిరువదియారవ అధ్యాయము.