Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటయిరువది ఏడవ అధ్యాయము-మరుదుత్పత్తి వజ్ర ఉవాచ : దితిర్వినష్ట పుత్త్రాచయచ్చకార ద్విజో త్తమ : తన్మమావక్ష్య సంక్షేపాత్ తత్రమే సంశయోమహాన్ ||
1 మార్కండేయ ఉవాచ :- దెతిర్వినష్టపుత్త్రాచ తపసామహతా నృప | ఆరాధయామాస తదా భర్తారం కశ్యపంమునిమ్
2 ఆరాధితః సుతవసా చ్ఛందయామాస భామినీమ్ | వరేణచ వచఃకాలే పుత్త్రవ్యసన కర్షితామ్ ||
3 కశ్యప ఉవాచ :- వరం వరయ! సుశ్రోణి! వరదో೭హముపస్థితః | ఏవముక్తా వరం వవ్రే దేవీ పుత్త్రవినాకృతా ||
4 దితిరువాచ:- శక్రహంతార మిచ్ఛామి పుత్త్రం బ్రహ్మ న్య శస్వినమ్ | యదితుష్టో೭సి మేబ్రహ్మం స్తం ప్రయచ్ఛ సుతంమమ ||
5 మార్కండేయ ఉవాచ :- ఏవముక్త స్తదా భర్తా నాతిప్రీతో೭బ్రవీద్వరమ్ | ఏవంతే భవితాభ##ద్రే శుచిస్త్వం చేద్భ విష్యసి || పూర్ణంవర్షసహస్రంచ నాన్యధా తద్భవిష్యతి | ఏవముక్త్వా తయాసార్థ మువాసరజనీం ద్విజః ||
7 తతోజగామధర్మాత్మా తపసేరృఢ నిశ్చయః | ఆతస్థే నియమందేవీ సగర్భావ దితి స్తదా ||
8 నియమస్థాంతు తాందృష్ట్వాశక్రో వచనమబ్రవీత్ | శక్రఉవాచ:- అహందేవి! కరిష్యామి తవ శుశ్రూహణంసదా | స్థితాయా నియమే ఘోరే తదనుజ్ఞాతు మర్హసి ||
9 మార్కండేయ ఉవాచ:- భాధమస్త్విత్యథో క్తస్తు తయాదేవాః పురందరః | తత్రోవాస చ్ఛ లాన్వేషీ శుశ్రూషు ర్మాతరంసధా || తదాబ్దశేషేకాతేచ దివాసుప్తా೭దితిర్నృప ! | మధ్యాహ్న సమయే రాజన్వాదయోఃకృతమూర్థజా ||
11 తస్యాః సంప్రాప్యతచ్ఛిద్రం వజ్రీపరపురంజయః | వికశ గర్భ మార్గేణ దివృతేన నరేశ్వర! ||
12 సంప్రషశ్యైవ తంగరృం వజ్రేణ శతపర్వణా | కృతవాన్సప్త ధావజ్రీ భాగం భారింతతః పునః
13 ఏకైకం సప్తధా చక్రే గర్భో೭పిప్రారుద త్తదా | మారుదస్వేతిం వజ్రీ ప్రాహకార్యేస్వకేస్థితః ||
14 ఏతస్మిన్నేవ కాలేచ ధైత్యేంద్ర జననీ తదా | విబుద్ధా వారయామాస శక్రందశశ##తేక్షణమ్ ||
15 వజ్రగర్భాంజలిఃశక్రో మాతుర్యచన యంత్రితః | నిశ్యక్రామోదరాత్తస్యాః సహబాలైర్మహాత్మభిః ||
16 తంజగాద దితిః శక్రం ప్రాంజలిం పురతః స్థితమ్ నతే శక్రా೭ వరాధోస్తి మమగర్భనిర్భంతనే ||
17 సర్వోపాయైర్వియంతవ్యః శత్రుర్నయ విదా సదా | మమా పరాధాద్గర్భో೭యం త్వయాద్యబహుధాకృతః
18 భవమరుతోనామ సర్వే దేవాః పృధక్ పృథక్ | మారుధధ్విమితి ప్రోక్తా యతః శత్వక్రయా సుతాః ||
19 తతశ్చమరుతోనామ భవిష్యంతి జగత్త్రయే | త్వత్సహాయా భవిష్యన్తి త్వదాజ్‌ఒవశవర్తినః ||
20 నచైతే భ్యోభయం కించిత్కదాచిత్తే భవిభ్యతి | ఏషాంనామ విభాగాం స్తుష్థానానివ తథాకురు ||
21 ఏకజ్యోతిశ్చ ద్విజ్యోతి స్త్రిచతుర్జ్యోతిరేవచ | ఏకశ క్రోద్విశ క్రశ్చత్రి శక్రశ్చ మహాబలః ||
22 ప్రథమే పవనస్కంధే గణో೭యం సురథః స్మృతః | ఇంద్రశ్చగవ్యో దృశ్యశ్చ ఇతః ప్రతిశిరా స్తధా ||
23 మితశ్చ సమ్మితశ్చైవ అమితశ్చ మహాబలః | ద్వితీయే పవనస్కంధే గణోనా నామ ప్రఘోషణః ||
24 ఋతజిత్సత్యజిచ్చెవ సుషేణః సేనబిత్తధా | అతిమిత్రోనామిత్రశ్చ పురుమిత్రో೭పరాజితః || 25 తృతీయ పవనస్కంధే గణం సంతాపన೭స్మృతః | ఋతేశ్చ ఋతవాన్ధాతా విధాతా ధరణోధ్రువః ||
26 విధారణవ్చతుర్ధస్తు గృహమేధో గణః స్మృతః | ఇదృక్షశ్చ సదృఓశ్చ ఏతాదృగమృతాశనః ||
27 క్రీతనః ప్రసదృక్షశ్చ సరభశ్చమహాయశాః | గృహేచ రోషణానామ వాయుస్కంధేచ పంచమే ||
28 ధర్తాదుర్గధ్వనిర్భీయో హ్యబియుక్తిః కృపాసహః | షష్ఠేతు పవన స్కంధే సాస్వీనామ గణఃస్మృతః ||
29 డ్యుతిర్వపురనాదృశ్యో నామఃకామో జయోవిరాట్ | ప్రేజేషణో గణోనామ వాయుస్కంధేచ సప్తమే ||
30 ఎషాందామ విభాగస్తు దత్త్వాస్థానావి దాచ్యుతః | జగామ న్వవృహం ప్రీత్యా దితిశ్చస్వగృహంయ¸° ||
31 ఏతత్తవోక్తం మరుతాంనృవీరః జన్మోత్తమం సావభయాపహారి | యస్మిన్ శ్రుతే నైవ జనస్యలోకే భయంతు వృత్త్యాన భవిభ్యతీహ || ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రధమఖండే మార్కండేయ వజ్రసంవాదే మరుదుత్పత్తిర్నామ సప్తవింశత్యధిక శతతమో೭ధ్యాయః మార్కండేయుడనియె:- దితి కొడుకులం గోల్పోయి తపస్సుచేసి కశ్యప మునిని ఆరాధించెను. ఆయన వరము కోరుకొను మనియె. ఆమె ఇంద్రుని జంపు యశస్వియైన కొడుకును గోరుచున్నాను సంతుష్టుడవైతివేని దయసేయుమనియె. అపుడామె భర్తదానికి కంప ప్రతీ నందనివాడయ్యు నీవు శుచిగా నుందువేని నీకు కుమారుడు గల్గును. వేయేండ్లు ముగియు నప్పటికి నీ కోరిక సఫలమగును ఇంకొకరీతి కాబోదని ఆమె దరి నొకరాత్రి వసించి మఱునాడు తపమ్మునకేగెను. దితి నియమంతురాలై గర్భవతి యయ్యెను. నియమమునందున్న యామెంగని యంద్రుడు దేవీ! నేను నీకు శుశ్రూషసేసెదను. ఈ ఘోరమైన నియమమున నాసేవలంగీక రింపుమన యామె ఇట్లనియె. తల్లింగొలుచుచు మోసగించుటలకు సమయము కనిపెట్టుచు నుండెను. ఒక్క సంవత్సరము శేషించిన తఱి నామె మధ్యాహ్న వేళ పాదములపై జుట్టు విరబోసికొని నిద్రపోయెను. అగని యింద్రుడు వజ్రముంగొని విడివడిన గర్భమార్గమున లోన బ్రవేశించి నూరుపర్వములు (అంచులు) గల యా వజ్రాయుధముచే నామె దర్భము నేడు తునకలుగావించెను. ఒక్కొక్క తునకను మఱియేడు ఖండములు గావించెను. అత్తఱి గర్భస్థశిశు వేడ్చెను. వజ్రియాశిశువును ''మారుద'' ఏడువకుమనియె. ఇదే సమయమున దితి మెలకువగొని వేయికన్నుల వానినయ్యింద్రుని నెదుట నిలువ బడిన వానింగని ఈ గర్భచ్ఛేదమందు నీతప్పిదములేదు. నీతి తెలిసిన వాడు సర్వోపాయముచే శత్రువును నిగ్రహింప వలసినదే. నాయ పరాభవము వలనని నీవు నా గర్భమును పెక్కుతునకలు సేసితివి. దీనివలన మరుత్తులను దేవతలు వేర్వేరు నేర్పడగలరు. వారికి మరుత్తులను పేరు ప్రసిద్ధ మగును. నీయాజ్ఞావశురై వీరు నీకు సహాయులగుదురు. వీరి వలన నీ కే కొంచెయేని యెపుడేని భయము గలుగబోదు. వీరికి వేర్వేరు పేరులు స్థానములను నేర్పరుపుము. ఏకధ్విత్రి చతుర్జ్యోతులను పేర నాల్గురు ఏకద్విత్రి శుక్రులను పేర ముగ్గురు ఈ యేడ్వురు ప్రథమ వాయుస్కంధము మరుద్గణము. సురథమను పేరం బరగ గలదు. ఇంద్ర-గవ్య-దృశ్య ఇత ప్రతిశిర-మిత సమ్మిత అమితులను పేరు రెండవ మరుద్గణము వాయు స్కంధమున ప్రఘోషణ మను పేరం ప్రసిద్ధమగును. ఋతజిత్ సత్యజిత్ సుషేణ సేనజిత్ అతమిత్ర నా మిత్ర పురు మిత్రుపరాజితలను పేరులతో తృతీయ వాయుస్కంధము నందు సంతాపనమను గణ మేర్పడును. ఋతి ఋతవంతుడు ధాత విధాత ఘరణుడు ధ్రువుడు విధారణుడు అను పేరులతో గృహమేధయను నాల్గవవాయు స్కంధము నందు మరుద్గుణ ముండును. (1) ఇదృక్షుడు (2) సదృక్షుడు (3) ఏతాదక్కు (4) అమృతాశనుడు (5) క్రీతసుడు (6) ప్రసదృక్షుడు (7) సరభుడు రోషణమను వాయుస్కంధ మైందవ మరుద్గణము. (1) ధర్త (2) దుర్గ (3) ధ్వని (4) భీముడు (5) కృపుడు (6) సహుడు నను నేడు వాయువులతో అఱప వాయువు స్కంధము స్వావియను మరుద్గణమున్నది. (1) ద్యుతి (2) వపుడు (3) అనాదృశ్యుడు (4) వాసుడు (5) కాముడు (6) జయుడు (7) విరాట్టు నను నేడు వాయువులతోడి ప్రేజేషణమను మరుద్గణము సస్తమ వాయుస్కంధమున్నది. ఇట్లే మరుత్తులకు పేర్లు స్థానములను హరి యొసంగి తన గృహమున కేగెను. దితియుం దన యింటికిం జనెను. ఓ నరేశ్వర! మరుత్తు జన్మ వృత్తాంతమిది పాప భయ నివారకము నీకు దెలిపితి. దీనిని విన్న వానికీలోకమున జీవితవృత్తికి భయము గలుగదు. సుఖజీవనము సేయునన్నమాట. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండ నందు మరుదుత్పత్తియను నూటిరువదియేడవ అధ్యాయము.