Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటయిరువది యెనిమిదవ అధ్యాయము-కశ్యపనర్గము

మార్కండేయ ఉవాచ :- 

జనయామాస రాజేంద్ర! దనుర్దానవ పుంగవాన్‌ | విప్రచిత్తి ముఖాన్వీరాన్‌ దైత్య పక్షముపాశ్రితాన్‌ || 1

కాలంచ జనయామాసకాలకేయాన్సుదారుణాన్‌ | దైత్యపక్షాశ్రితాన్‌ క్రూరాన్విరుద్ధాన్‌ దేవతాగణ || 2

దనాయుషాయః పుత్త్రస్తు పృత్రో నామమహాసురః | విరుద్ధస్తుసదా తేవైర్దెత్య వక్షముపాశ్రితః || 3

సింహిజనయామాససైంహికేయాన్మహాసురాన్‌ | రాహుసాల్వముఖాన్వీరాన్‌ బహునమితతేజసః || 4

గంధర్వాప్సరసో దివ్యా మునయస్తాన్నిబోధమే | చిత్రసేనోగ్రసేనౌచ ఊర్ణాయురనఘ స్తధా || 5

ధృతరాష్ట్రశ్చ గోపశ్చ సూర్యవర్చాస్త ధైవచ | యుగవస్తృణపః పార్ష్నిరర్ధశ్చిత్రరథ స్తధా || 6

కలిఃశాలి శిరాశ్చైవ వర్జన్యో నారదస్తధా | తేషాంచైవ యవీయస్యోదివ్యాశ్చా ప్సరస స్తధా || 7

అనూచానానవద్యాచ ప్రియముఖ్యా గణచరీ | మిశ్రకేశీ తధాచాపి పర్ణాశాపుంజకస్దలా || 8

మరీచిశుచికాచైవ ఎద్యుత్పర్ణీతిలో త్తమా | అట్టిలక్ష్మణా క్షేమా దేవీరంభా మనోరమా || 9

అసితాచ సుబాహుశ్చ సువ్రతాసువపు స్తధా | పుండరీకా సుగంధా చ సుదారా సురసా తధా || 10

హేమా శరద్వతీచైవ ప్రసూతా కమలాయా | సుముఖీహంసమార్గాచ సౌరీయాప్సరసః స్మృతాః || 11

కద్రూశ్చ జనయామాస నాగాం స్తీవ్ర పరాక్రమాన్‌ | యేషాంరోషః ప్రధానస్తు విష్ణుర్నాగవపుర్ధరః || 12

యేనేయంధార్యతే భూమిః సశైలవన కాననా | ఆహేయీంవాసుదేవస్య పూర్వమూర్తి ర్మయేరితా || 13

అనంత ఇతి విఖ్యాతా మహాకల్ప వినాశినీ | మహాకల్పే మహాస త్త్వే స్వయంభువతియా సదా || 14

తస్యాంశేన సముత్పన్నశ్శేషోహి ధరణీధరః | తస్యానుజాం స్తే నాగేంద్రాన్‌ ప్రాధాన్యేన వదామ్యహమ్‌ || 15

వాసుకి స్తక్షకశ్చైవ ఏలాపుత్త్రో ధనుంజయః | ఐరావతోమహాపద్మః కంబలాశ్వతరావుభౌ || 16

శంఖపద్మౌ మహాపద్మో ధృతరాష్ట్రవలాహకౌ | నీలాశ్వః పుష్పదంతశ్చ సుముఖోదుర్ముఖ స్తధా || 17

సహుషః కరరోమాచ కురుశ్చ కువిక స్తధా | క్రోధశ్చ జనయామాస దశకన్యా నరాధిప || 18

పులహాయ చ తాదత్తాః కశ్యపేన మహాత్మనా | మృగాచ మృగమందాచ హరిభద్రా మనోహరా || 19

భూతాచ కశిపా దంష్ట్రా సరసా సురసాతధా | ఇరాచైన తృణం సర్వం జనయామాస భామినీ || 20

పంచ ప్రకారం ధర్శజ్ఞ తమే నిగదతః శృణు | వృక్షగుల్మలతా వల్ల్యస్త్వ క్సారతృనాజాతయః || 21

అంతః సంజ్ఞా భవన్త్సేతా ఘోరేణతమసావృతాః | ఏతేషా మభిమానిన్యో దేవతా యదునందన || 22

జనయామాసధర్మజ్ఞ ఇరా దాక్షాయణీ శుభా | ప్రాధాప్రసూతాప్యర సస్తాసాం నామామే శృణు || 23

అనవద్యా అనూకాచ మునూకా కరుణ ప్రియా | మనూనా సుభగాచైవ సహజన్యా చ మేనకా || 24

ఘృతస్థూలా ఘృతాచీచ విఘాచీ పూర్వచిత్త్యపి | ప్రవ్లూెచీత్య ప్సరాశ్చైవ నివ్లూెచన్తీ తధైవచ || 25

అనేనైవ ప్రసంగేన తధాన్యాసాం మహీపతే | జన్మతేప్యరసాంవక్షేతన్మే నిగదతఃశృణు || 26

సుందోప సుందనాశాయ నిర్మితా విశ్వ కర్మణా | తిలంతిలంసమాదాయ సర్వరత్నైస్తిలోత్తమా || 27

యస్యాః ప్రదక్షిణాజ్జాతశ్చతుర్వక్త్రః పినాకభృత్‌ | సహస్రనయనః శ్రీమాన్వజ్రీ శక్రశ్చ పాకహా || 28

శేషైర్దేవగణౖర్దృష్ట్వా భ్రమద్వక్రైః ప్రదక్షిణౖః | కృతే కర్మణి సాప్రాప్తా సూర్యలోకం పరాంగనా || 29

ఏకస్థంరూప సౌందర్యం ద్రష్టుమిచ్ఛ న్పితామహః | అహల్యాంనామ కృతవాంసై#్రలోక్యసై#్యక సుందరీమ్‌ || 30

గౌతమాయచ తాంప్రాదాద్ర్భహ్మా శుభచతుర్ముఖః | యస్యాః కృతేతమేన శ కో నిర్వృషణః కృతః || 31

నారాయణోరు సంభూతా తధాచైవోర్వశీశుభా | సంత్యక్త మానసావవ్రే భర్తారంబుధజంనృపమ్‌ || 32

పురూరవ సనామానం రూఫ్గేణా ప్రతిమంభువి | తేనైవ సార్థమద్యా పిదివం ప్రాప్తాచ తిష్ఠతి || 33

ఆహూత్య ఇతి విఖ్యాతా తధైవాప్సరసః శుభాః | బ్రహ్మణామనసా సృష్టా దేవరామా మనోరమాం || 34

మనోః సుతాః శౌచవత్యో విద్యుజ్జాల రుచః స్మృతాః | భీరవశ్చసుతామృత్యోర్భూమి జాతా భువః స్మృతాః || 35

అమృతాఖ్యాశ్చ సంభూతాస్త ధైవామృతమంథనే | వహ్నిజాతాసుదానామ సోమాద్భే కురయాస్తధా || 36

ఆయుర్వత్త్యస్త ధాప్రోక్తౌ స్సూర్యరశ్మి సముద్భవాః | యజ్ఞోబ్పన్నాస్త ధానామ ఋక్సామభ్యస్తధేష్టయః || 37

వాయూస్రాన్నా సుదానామ దేవరామాః ప్రకీర్తితాః | ఇత్యేతే బహుసాహస్రా విజ్ఞేయా ప్సరసా గణాః || 38

దేవతానామృషీణాంచ పత్న్యస్తామాత రశ్చవై | సుగంధాశ్చ ప్యనిష్యందా సర్వాహ్యప్సరస శ్శుభాః || 39

తాసామాప్యాయతే స్పర్శాదానందంచాశ్నుతే మహత్‌ | వినతా నయామాస రుద్రాన్వైసోమ పిధినః 40

అంగారకం తధాసూర్యం నిరృతించ ఖఖగం తథా | అజైకపాదాహిర్భుధ్న్య ధూమకేతుధ్వజా స్తధా || 41

హవనం నృశ్వరం స్వభ్యం కపాలమథ కింకిణిమ్‌ | ఏకాదశైతే కథతాస్త వరుద్రామహా బలాః || 42

యేషాంచజన యామాస ద్వౌపుత్త్రౌ యక్షరాక్షసౌ | యయోః సంతాసంభూతా రాజన్వై యక్షరాక్షసాః 43

ఇమంచవంశం నియమేన యః వరేత్‌ మపాహాత్యన్మనాం బ్రాహ్మణదేవసన్నిధౌ |

అపత్యలాభం స లభేతపుష్కలాం శ్రీయంతధా ప్రేత్యస శోభనాంగతిమ్‌ || 44

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే కశ్యప నర్గోనామ అష్టావింశత్యధిక శతతమెధ్యాయః

మార్కండేయుడు వజ్రునకు కశ్యపుడు ధనువునందు విప్రచిత్త మొదలైన దానవులను, దానాయవయను నామెయందు వృత్రుని సింహిక యందు సైంహికేయులను నసురులను రాహు సాల్వాది వీరులను, గంధర్వాప్సరలను మునులను గనెనని తెల్పి వారి పేర్లు సెప్పెను. వారికి చెల్లెండ్రు గా నప్సరలను గనెనని వారిపేర్లు వేర్వేరు పేర్కొనెను. అతడు కద్రువయను భార్యయందు నాగులను గనెను. వారిలో శేషుడు అనంతుడను పేర విష్ణువే ఈభూమిని ధరించు నాగేంద్రు డతడే. మహాకల్పమందు వాసుకి తక్షకాదులా శేషుని తమ్ములు. వారిలో క్రోధుడను నాగుడు పదిమంది నాగ కన్యలం గనెను. వారిని కశ్యపుడు పులమున కిచ్చెను. వారి పేరు లియబడినవి - ఇర యనునది యూదువిధముల తృణజాతలం గనెను. ఆ తృణజాతి యైదురకములు. వృక్షములు గుల్మములు (పొదలు) లతలు వల్లులు త్వక్కార్యములు అనునవి. ఇది ఘోరమయిన తమో గుణములతో నావృతములయి యంతస్సారములుగా నుండును. అనగా వీనిలో చైతన్యము లోలోన నుండును. (అంతర్విదిములని కూడ వీనిని పురాణములు పేర్కొన్నవి) ఈ తృణజాతుల యభిమాన దేవతలను దక్షుని కూతురు ఇరా కన్నది. ప్రాధయను నామె యప్సరలం గన్నది. వారి పేర్లు వినుము. అనపద్య అనూక మూనూక కరుణప్రియ మానూన సుభగ సహజకన్య మేనక ఘృతస్థూల ఘృతాచి విషూచి పూర్వచిత్త ప్రవ్లొ%ాచి నివ్లూెచింతి. ఈ ప్రసంగములోనే మరికొందరప్సరసల పుట్టుకను గురించి తెల్పెద వినుము.

విశ్వకర్మ సుందోప సుందుల నాశనమునకు తిలనొక్కటిగా గైకొని (నువ్వుగింజను) సర్వ రత్నములతో తిలోత్తమ యను నప్సరసం జేసెను. ఆమెయొక్క ప్రదక్షణము వలన నలుప పినాకపాణి సహస్రాక్షుడు (ఇంద్రుడు) ననువారు పుట్టిరి. మిగిలిన దేవతలు ప్రదక్షిణముగా దిరిగిమొగములు ద్రిప్పగా దావచ్చిన పనియైనదనియా తిలోత్తమ సూర్యలోకమునకు వెశ్ళెను. బ్రహ్మ సర్వ రూప సౌందర్యము నొక్కచోటప్రోగుపరచి చూడవలెనని అహల్యను త్రిలోక సుందరిగా జేసెను. ఆయన యామెను గౌతమ మహర్షి కిచ్చెను. ఆమె నిమిత్తముగానే యింద్రుడు గౌతమ మునిచే వృషణ రహితుడుగా నొనరింప బడెను. నారాయణుని ఊరుపు నుండి ఊర్వసి పుట్టినది. బుధుని కొడుకును పురూరపుని భర్తగా మనస్సు తప్పించుకొని భూలోకమునకు వచ్చి యా పురూరపుని పేరుగలవాని నింకొక రాజును వరించినది. అతనితోనే స్వర్గమునంది యిప్పటికి నక్కదనే యున్నది. బ్రహ్మచే ఆహూతులను కల్యాణమూర్తుల దేవతా స్త్రీలు పరమ సుందరులు మనసుచే సృష్టింప బడిరి. మనువు శుచిత్వము గలవారు మెరుపు తీగలట్లుమెరయు వారు గనుక విద్యుజ్జ్వాల రుచులను పేర వారు జనించిరి. మృత్యువునకు బీరువులను వారు భూమికి పుట్టిన వారు భవులను పేర దేవతాస్త్రీలు ప్రసిద్ధిగనిరి. అమృత మథనమందు అమృతలను పేర కొందరు జనించిరి. అగ్నికి సుదలు సోమునికి భేకురయలు సూర్య రశ్ములకు పుట్టిన దేవతాంగనలు అయుర్వతులను పేరంబరగిరి. ఋక్పామలవలన యజ్ఞమునందు పుట్టిన యిష్టులు యజ్ఞోతృన్నలను పేరొందిరి. వాయువునకు గల్గినవారు సుదలను దేవతాస్త్రీలు. ఈ అప్సర స్త్రీగణములు పుక్కు వేలున్నవి. వారుదేవతలకు ఋషులకు భార్యలు తల్లులునైరి. అందరును సుగంధలు పరిమళించుచుండువారు అనిష్యందలు (చెమట మొదలయినవి లేని వారన్నమాట) వారి స్పర్సమాత్రమున మహానందము గల్గును. (తృప్తి) ఆప్యాయనముదయించును. వినత సోమపేథులగు రుద్రులం గన్నది. (వారు సొమపానము చేసిన వారన్నమాట) వారు అంగారకుడు సూర్యడు నిరృతి ఖగుడు అజైకపాత్తు అహిర్బుధ్న్యుడు కపాలుడు కింకిణి యనువారు. వీరేకాదశ (11 గురు) రుద్రులు. వీరికిద్దరు కొడుకులు. యక్షుడు రాక్షసుడు ననువారు. వారి సంతానమే యక్షులు రాక్షసులు. ఈ మహాను భావుల వంశము నెవ్వడు బ్రాహ్మణులయు దేవతలయొక్కయు సన్నిధిం బఠించునో యతడు పుష్కలమైన సంతానమును నైశ్వర్యమును శోభనమైన గతినింగూడ పొందును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున కశ్యప నర్గమను నూట యిరువది యెనిమిదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters