Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటఇరువదితొమ్మిదవ అధ్యాయము - ఊర్వశీసంభవము వజ్ర ఉవాచ : ఉర్వశీచ కధంజాతా బుధజం పార్ధివం కథమ్ | పతిం కృతవతీ దేవీ మానుషం తత్ప్రకీర్తయ ||
1 మార్కండేయ ఉవాచ : సాధ్యౌ ధర్మసుతౌ ప్రోక్తా నరనారాయణా వృషీ | ¸°తౌపూర్వం షుమీపాలౌ తాపుభొ యదునందన! ||
2 విష్ణోరంశౌ మహావీర్యౌ తపస్యభిరతౌ సదా | తయోస్త దాశ్రమం రమ్యం సుగంధి విట వద్రుమమ్ ||
3 బదర్యాశ్రమమిత్యుక్తం మృదుస్పర్శ హిమం శుభమ్ | ఉష్ణతోయవహా గంగా శీతతోయ వహా పరా ||
4 సువర్ణసికతారమ్యా కాంచనోత్పలమాలినీ | తత్రసా బదరీ రమ్యా నిత్య పుష్ప ఫలోపగా ||
5 తత్రతౌ ముని శార్దూలౌ ఘోరం తపఉ పాశ్రితౌ | భవాయ సర్వలోకస్య సర్వలోకేశ్వరాపుభౌ || 6 తయో స్తవస్యతో దేవం మౌనేయాప్సరసోదశ | తయోస్తు తపసో విఘ్నం సంభూయ కృతనిశ్చయాః || 7 తం ప్రదేశ మనుప్రాప్తా నానాభరణ భూషణాః | పితామహాన్న సౌమ్య೭ స్తి కశ్చిద్రాజన్ జతత్త్రయే || 8 తాసాం దర్శన మాసాధ్య నరఃకామ వశోభ##వేత్ | కుసుమావిచిన్వత్యోలంవత్యశ్చ యధా సుఖమ్ || 9 దృష్టా నారాయణనాధ సర్వాబాల మృగేక్షణాః | తాసామంతర్గతం భావం జ్ఞాత్వా వేదవిదాంవరః || 10 జితెక్రోధో మహాతేజా జితకామో೭ర్ధధర్మవిత్ | ఆదాయ సహకారస్య రసంమదన దీపసమ్ || 11 ఊర్వోశ్చిత్రేణచార్వంగీం నిర్మమే೭ప్సరసం శుభామ్ | ఊర్వోః కృతాసా చిత్రేణ చిత్రాకరణశాలినీ || 12 తస్మిన్నేవ క్షణనారీ బభ్రూవాయతలోచనా | న దేవీ నచ గంధర్వీనాసురీ నచ వన్నగీ || 13 తాదృగ్విధానలోకే೭స్మిన్యాదృశీసావరాంగనా | తాం దృష్ట్వా వ్రీడితాః సర్వా మౌనేయాప్సరసో దశ || 14 జగ్ముర్యథాగతం రాజం స్తచ్ఛ్రుశ్రావ పురందరః | ద్రష్టుం కౌతూహలా త్తాంచ బదర్యాశ్రమమాగతః || 15 పాదయోర్న్య పతద్వజ్రీ సాధ్యయోర్ధర్మ నిత్యయోః | దదర్శచ శుభాంగీం తాం శ్రియం దేవీ మివాపరామ్ || 16 తమువాచ హసన్సాధ్య స్తదా నారాయణః ప్రభుః | మిమోరుజాతా ధర్మజ్ఞ ఉర్వశీయం భ##వేదితి || 17 నయస్వ త్రిదివంచైతాం భవత్వప్సరసానశుభా | ఏవముక్తే ముదంప్రాప్య అభివాద్యవతా వృషీ || 18 అనయత్తాం తతః స్వర్గం దేవీం బాల మృగేక్షణామ్ | శిష్యత్వే ప్రదదౌ త్వేతాం గంధర్వస్యచ తుంబురోః || 19 తతః కదా చిచ్ఛిక్రస్యనన ర్త పురతస్తుసా | ఉపదేశ మతిక్రమ్య తుంబురో శ్చారుహాసినీ || 20 తాంశశాప స గంధర్వో మానుష్యే వత్స్యసే శుభే! | దేవలోక మిమంత్యక్త్వా మానుషేణ సహానఘే! || 21 కంచిత్కాల ముపాసై#్యవం మానుషం తం శుచిశ్మితే! | అగమ్య త్రిదివే తావ త్తస్మాదభ్యస్యసే తతః || 22 తేనైవ సార్ధంత్రిదివే రంస్యసే త్వం శుభాననా | వైవస్వతాఖ్యస్యమనో ర్యావదందర ముచ్యతే || 23 ఏవంహిశప్తా నృపవర్య! తేన వపాతరాజన్! గురుణానృలోకే | ఉవాసరాజ్ఞాసహితాతుతస్మాత్ స్వర్గం సమాసాద్య తధైవతేన || ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే ఉర్వశీ సంభవోనామై కోనత్రింశదధిక శతతమో೭ధ్యాయః ఊర్వశి జన్మవృత్తాంతము : ఆమె బుధుని కొడుకగు మనుష్యునెట్లు భర్తను గావించుకొన్నదది తెలుపుమని వజ్రుండడుగ మార్కండేయు డిట్లనియె. ధర్ముని కొడుకులు సాధ్యులు నరనారాయణులు ఋషులుగా పేర్కొనబడిరి. వారు మున్ను భూపాలురు. విష్ణ్వంశ సంభూతులు మహా వీరులు నిరంతరము తపస్సునం దిష్టము కలవారు. వారి యాశ్రమమది సుగంధితరులతాభరితము. అతి సుందరము. మృదుస్పర్శము గల మంచుతో గూడినది. బదర్యాశ్రమమనబడునది. అక్కడ గంగయొకటి ఉష్ణోదక ప్రవాహము గలది. వేరొకటి శీతోదక ప్రవాహము గలది. అందలి యిసుక బంగారమే. అందు కలువ పూలు సువర్ణ మయములు. నిత్య పుష్పఫల భరితమైన బదరీ వృక్షము (రేగు చెట్టు) అక్కడున్నది. అక్కడ నా మునివరులు ఘోర తపంబు నందుండిరి. సర్వ లోకేశ్వరులు వారు తపస్సు చేయుట లోకక్షేమస్థితికే. ఇట్లు తపస్సుచేయుచుండ మౌనేయ లయన యప్సరసలు పదిమంది ( మౌనేయలనగా బ్రహ్మ మానస పుత్రునికి గల్గిన వారన్నమాట) యాయన తపస్సునకు విఘ్నము సేయనిశ్చయించుకొని నానాభరణశోభితులై యా తావునకు వచ్ఛిరి. రాజా ! ముల్లోకములందు పితామహుని కంటె (బ్రహ్మకంటె) నింకొకడు సౌమ్యుడు లేడు. ఆయన సష్టిలోని యా యందగత్తెల దర్శించిన నరుడు కామవశుడై తీరును. వారు సుఖముగా ముచ్చటలు గులుకుచు దిట పూలు కోసుకొనుచుండిరి. ఆ బాల మృగ నయనల నా బాలలం గని నారాయణుడు వేద విదులలో నగ్రేసరుడు గావున వారిలోని భావము గ్రహించి మహా తేజస్వి కోపము నిగ్రహించుకొని కామము గెలిచి, ధర్మార్థములను పురుషార్థములను జక్కగా నెరింగినవాడు గావున తీయమామిడి పండ్ల రసము మదన దీపసమగుట దానింగైకొని తన మూరుపుల నుండి నొక్క యింతిని పరమ సుందరి నప్సరసం గల్యాణిని చిత్రరూపమున నిర్మించెను. ఆ చిత్తరువు క్షణములో స్త్రీయయ్యెను. ఆమె దేవతాస్త్రీ గాదు గంధర్వి ఆ సురి నాగకన్యయుం గాదు ముల్లోకములందు నామెంబోలిని సుందరి లేదు. ఆమెం జూచి యప్సరసలు అవ్వల తాము వచ్చిన దారిని జనిరి. ఇంద్రుడది విని యాత్రిలోక సుందరిం జూడనెంచి బదర్యాశ్రమమునకు వచ్చెను. ఇంద్రుడు అచట నున్న సాధ్వులు ధర్మనిరతులైన యా నరనారాయణుల పాదములపై బడెను. ఇంకొక శ్రీదేవీయో యన్నట్లున్న యా రమణింజూచెను. అత్తరి నల్లన నవ్వుచు సాధ్యుడగు నారాయణ ప్రభు నా ఇంద్రునితో నిట్లనియె. ఓ ధర్మజ్ఞా ! ఈమె నాయూరువు నుండి జనించినది. అందుచే నీమె ఊర్వశి యనంబడును. ఈమెను త్రిదివమునకు గొనిపొమ్ము. అప్సరసలం దీమెయు నాయూరుపు నుండి జనించినది. అందుచే నీవె ఊర్వశి యనంబడును. ఈమెను త్రిదివమునకు గొనిపొమ్ము. అప్సరసలం దీమెయు నొక్కతె గాగలదు. అనవిని యింద్రుడానందించి యా ఋషులు కెరగి బాలహరిణాక్షి నా దేవిని స్వర్తమునకుం దీసికొని వెళ్ళెను. ఇంద్రుని ముందోకతరి తుంబురు నేర్పిన దానికంటెను మిన్నగ చక్కగ నాట్యము సేసెను. అందుచే నా సుహాసిని నాతోడ గొంతకాలముండి యా మానవుని సేవించి తిరిగి స్వర్గమునకువచ్చి నా వలన విద్యాభ్యాసమం బడయుదువనియె. స్వర్గమునకు వచ్చి కూడ నీవా పురుషునితోనే క్రీడింతువు. వైవస్తవ మన్వంతరమంతయు నీవాతనితోనే యుందువు అని యిట్లు తుంబురుడు శపింప స్వర్గమునుండి యపనిపై బడి యా యన్న విధముగా యటనుండి తిరిగి యాతనితో స్వర్గమంది యటనే వసించెను. ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణమున ప్రథమఖండమున యూర్వశీ సంభవమను నూట యిరువది తొమ్మిదవ అధ్యాయము.