Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటముప్పదవ అధ్యాయము - ఉర్వశీరంభా సంవాదము వజ్రుఉవాచ :- నాకంత్యక్త్వోర్వశీ బ్రహ్మన్ ! బుధ పుత్త్రం కథంగతా | క్వచసా తంరేంద్రేంద్రం దృష్ట వత్య పరాజితం || మార్కండేయ ఉవాచ మనో ర్వై వ స్వతస్యాస్య ద్వా వరేప్రథమేపురా | వృత్తేదేవా సురేయుద్ధే వృత్తే చామృతమంధనే ||
2 సంగ్రామే కృతకర్మాణం తస్మిన్నేవ నరాధిపమ్ | శక్రస్యార్థాసన గతం రూపేణాప్రతమంతదా ||
3 సంపూజ్యమానం త్రి దశైర్దదర్శాయతలోచకా | బుధ పుత్త్రం నరేంద్రేంద్రం తదా నారాయణాత్మజా || 4 దృష్ట్వా బభూవ బాస్వస్థా కామమార్గణ తాడితా | తతః ప్రభృతిభ##వ్యేషు మేరుకుంజేషు భామినీ || 5 అకారం గుహమానాసా కాలం నయతి కామినీ | చింతయంతీ నరేంద్రేంద్రం కందర్ప ప్రతిమం సదా | 6 న సా భుం క్తే నస్వపితి శ్రాంతా స్వపితి సాయదా | తదాపశ్యతితం స్వప్నే నీలనీరజలోచనా || 7 మనోరధాంశ్చ కురుతే యాంశ్చ తంప్రతి భూమిపమ్ | 8 తాని సా పశ్యతి స్వప్నే కథం చిత్స్వప్న మోహితా | కదా చిత్ర్కీడతే రాజ్ఞా కదాచిదను నీయతే || 9 సుప్తా కదా చిద్రాంజేంద్రః వదతీ ప్రతిబుద్ధ్యతే | కంఠేగృహీతా సా రాజ్ఞా తయాచాసౌ మహీపతిః || 10 ఏవందృష్ట్వా తు స్వప్నే నిద్రా మోహముపాగతా | తథైవ బాహు పాశేన రచితేస విబుద్థ్యతే || 11 స్వప్నసంస్థం యదాదృష్ట్వా మోహ మాయాంతి సా చిరమ్ | కృత్వాచిత్రగతం పట్టే కదాచిచ్చ నిరీక్షతే || 12 ఏవం నరేంద్రే గతసర్వభావాం విజ్ఞాయ తాం చారుతరాంగయష్టిమ్ | ఆపాండురాక్షామ కపోలభిత్తిం దృష్ట్యైవ రంభా త్వరితం జగాదll యత్నేన చార్వంగి! నిగూహమానా భావం మయా త్వం విదితా೭సిసుభ్రూః తస్మిన్నరేంద్రే హృదయం తవేదం యో೭సౌ మహాత్మా సమరేష్వజేయః || 14 పురూరవానామ జగత్త్రమే೭స్మిన్ ఖ్యాతింగతః సచ్చరితైర్నృవీరః రూపేణ కామంవ్యతిరిచ్య భాతి శౌర్యేణ శక్రా దతిరిచ్యతే సః || 15 దానే సమ స్తస్య చ నాస్తి కశ్చిత్ సత్యేప్యనౌపమ్యగుణనృవీరః | దేవాసురే೭స్మిన్సమరే హతాని తేనాసురాణాం నియుతాని పంచ || 16 కేశీ విశాలో మదనస్తధోగ్రో మహాబలస్తేన తథా పి శస్తః | చంద్రస్య పౌత్రశ్చ బుధస్యపుత్రో మాతాపి తస్యార్క సుతస్య ధాత్రీ || 17 మానం సముత్సృజ్య విశాలనేత్రం తంగచ్ఛ బాలే నృపతిం ప్రతీతమ్ | త్వదాప్తయే తస్యచనాస్తి యత్నః సుదుర్లభత్వం ఖలుదేవతానామ్ || 18 మనోరథానాం త్వమగమ్యభూమి ర్యస్మా ద్విశాలాక్షి ! సురాసురాణామ్ | మృణాలశయ్యా సుతను ! త్వయేదం సంక్లేశితా చందన పంకయుక్తా || 19 తస్యాంక మారుహ్య భవస్వ కాంతే, విముక్తతాపా తపనీయ వర్ణే యాస్యామ ఏహ్యేహి నరేశ్వ రస్య తస్యాశు భో వేశ్మ వర ప్రయోగే! 20 పురం ప్రతిష్ఠానమితి ప్రతీతం మాతామహా ద్య త్సమవాప రాజా | ఇత్యేవ ముక్తా తపనీయవర్ణా తథ్యం విదిత్వా త్రపితా బభ్రూవ || 21 ఉవాచ రంబాం సఖి ! తథ్యముక్తంత్వయామతం తద్రుచితం భృశం మే | యాస్యామ అద్యైవ నరేశ్వరస్య తస్యాంతికం బాలమృగాభ నేత్రే || 22 యద్యద్య తం నీల సరోజ నేత్రం సంపూర్ణ చంద్రాభ ముఖం నరేంద్రమ్ | పశ్యామి నాహం పృథు దీర్ఘ బాహుం తలో గమిష్యా మ్యవశా వసానమ్ || 23 పంచైవ కామస్య జనః పృషత్కాన్ యదాహ రంభే తదలం మృషైవ | మమా೭నిశం భాణభ##ర్తెస్తు విథ్యన్ నశామ్యతే త్వక్షి నిమేష మాత్రమ్ || 24 కామాగ్ని మధ్యే పరివర్త మానం నయాతి భస్మతమిద శరీరమ్ | తసై#్యవ రాజ్ఞో వదనేందునా తత్ సంరక్ష్య తే మేహృదయ స్థితేన|| 25 నయస్వమాం తస్య విశాలనేత్రేః సమీప మధ్యై వ నరేశ్వరస్య | ఇత్యేవముక్తా కరుణన రంభా పాణాపుపాదాయ విశాలనేత్రామ్ || 26 బుద్ధ్యా సముత్ల్పుత్య తతో೭ంతరిక్షం | జగామ రాజ్ఞో భవనం ప్రహృష్టా || 27 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రధమఖండే మార్కండేయవజ్రసంవాదే ఊర్వశీ రంభా సంవాదోనామ త్రింశదుత్తర శతతమో೭ధ్యాయః. స్వర్గమువిడిచి ఊర్వశి బుధపుత్రునెట్లు గలిసెను. ఆమె పరాజయమెరుగని యాతని నెక్కడ జూచెనని వజ్రుడడుగగా మార్కండేయుడనియె. వైవస్వత మనువుయొక్క మొదటి ద్వాపర యగమందు మున్ను దేవాసురుల యుద్ధముజరిగి యమృత మధనమయినతరువాత నా సమరమందు కృతార్థుడైయింద్రుని యర్ధాసన మధిష్ఠించిన పరమ సుందరుడగు రాజును దేవతలందరి పూజలందుకొనుచున్న వానిని బుధ కుమారుని పురూరవుని నారాయణ తనయ ఊర్శశి చూచెను. చూచినదే తడవుగ కామబాణవశ##మై మనసు కలతపడి యది మొదలు మేరు పర్వతమునందు జక్కని పూలపొదరిండ్లం దనరూపు మరగుపరచికొని విరహాకులయై కాలము గడుపు చుండెను. మన్మధుని వంటి యా రాకుమారుని నిరంతరము ధ్యానించు చుండెను. భుజింపదు నిదురవోదు. మిక్కిలి యలసటగోని యొకవేళ నిదురించెనా కలలో నా సుందరునే దర్శించుచుండెను. ఆ పొగసుకాని యెడల తానేమేమి మనోరధములను (ముచ్చటలను) ఊహించుచుండెనో యవన్నియుం గలలో నామెకు గోచరించు చుండెను. ఒకతరి నందు రాజుతోగ్రీడించును. ఒక వేళ నాతనిచే ననునయింప బడుచుండెను (ప్రణయ కలహ మిద్దరికి నేర్పడినట్లును, అందా సుందరుడు తనను గలిసి బ్రతిమాలినట్లును గలలు గనుచుండె నన్నమాట.) ఒకపుడు కలలో మోహవశ##యై యాతని బిగికౌగిటం జిక్కినట్లై మెలుకువ గనుచుండెను. కలలోగన్న యా మోహమూర్తిని మెలకువ గొని చిత్తరువున వ్రాసి చూచి మైమరచు చుండెను. ఇట్లు నరేంద్రునిపై నిండు వలపు గొనిన యా సుందరాంగిని, నిండ తెలుపాలిన (విరహ వశమున పాలిపోయిన) చిక్కిన నును చెక్కిళుల విన్ననైయున్న యా యన్నువ మిన్నంగని రంభ యిట్లనియె. ఓ సుందరాంగీ ! నీతలపు గప్పిపుచ్చి మోహమున జిక్కిన నిన్నేను గ్రహించితి? ఆ నరేంద్రునిపై నీహృదయము లగ్నమైనది. నీవు మనసు పడిన యాతడు మహానుభావుడు. సమరదురయుడు. అతడు ముల్లోకములం దుత్తమ చరిత్ర చేతను పురూరపుడను పేరం బ్రఖ్యాతి గన్నాడు. తనసోయగముచే కామునతిశయించి శౌర్యముచే శక్రునతిక్రమించినాడు. దానమందు సత్యమందును పరమ గుణ సంపద యందాతని పోలిన వాడొక్కడునులేడు ఈ దేవాసుర సంగ్రామ మందాతని వలన ససుర సైన్యము నియుత పంచకము గూలినది. అతడు చంద్రుని పౌత్రుడు. అతని తల్లి అర్క పుత్రుడగు కుజుంగన్న తల్లి. నీవు గుట్టు(సిగ్గు) విడిచి యశస్సంపన్ను నా విశాల నేత్రు నా పుడమి రేనిం గూర్చి నీవ యిరుగుము. అందువలన దేవతలకు గూడ యందని నిన్నందగత్తెను బొందులు కాతని కెక్కువ యత్న మవసరము గలుగదు. ఓ విశాలాక్షి సురాసురుల మనోరథములకేని యందని దానవు. చందన మలది చల్లని మెత్తని తామర తూండ్లు పరచిన యీ పాన్పు నీచే నలిగి పోయినది. నీ విరహ తాపమున వాడి యట్టిటు దొరలిన నీ మేనిచే నిది యొత్తికొని మెత్తన చెడినది. అతని యంక మెక్కి యోకనకాంగీ ! తాపము వాసి సుఖముండుము. ఆ ఱని యింటి కో రమణీ! యాతని వరించు పని మీద వెళ్ళుదము రారమ్మ! అతనిది ప్రతిష్టాన పురము. మాతామహుని వలన నద్దాని నతడు వడసెను. ఇట్లు రంభ పలుక నా సువర్ణాంగి యది నిజమని యెరింగు సిగ్గు పడెను. మరియు నా రంభంగని యిట్లనియె. నెచ్చెలీ! రంభా! నీవునిజము పల్కితివి. నీ యిష్టమే నాకును మిగుల నిష్టము. ఇప్పుడు మన మానరేశ్వరుని దరికి వెళ్లుదము. ఇప్పుడాయిందీవర నయనుని సంపూర్ణ చంద్రాననుని చంద్రాననుని పృథు విశాల బాహునిం జూడనేని వివశ##వై కడతేరుదును. కాముని బాణము లైదేయని జన మనును. అది యబద్ధమే. నిరంతర మనేక బాణ పరంపర నీకు గల్గించుచు నొక్క రెప్పపాటు కాలమేని యాతడూరకున్నది లేదు. కామాగ్ని మధ్యమందు దొరలుచున్న యీ మేను బూదియైన గాకున్నది నా యెడంద నున్న ఆ రాజు పదనేందు బింబముచేతనే యీ శరీరము రక్షింప బడగలదు. ఓ విశాలనేత్రా! ఇప్పుడు నన్నా నరేండ్రు సన్నిధికిం గొనిచనుము. అని యిట్లు జాలిగలుగ నుగ్గడింప నూర్వశి పలుకు లాలించి రంభ యామెంగొని తలపుమాత్రన నరి%ితరిక్షమున కెగిరి మిగుల సంతసమున నారాజు భవనమున కేగెను. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున ఊర్వశీ రంభా సంవాదమను నూటముప్పదియవ అధ్యాయము.