Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటముప్పది యొకటవ అధ్యాయము-ఉద్యానవనవిహారము మార్కండేయ ఉవాచ :- ఊర్వశీ రంభయాసార్ధం జగాను త్వరితం తదాకామార్తాసిద్ధ మార్గేణ సాదదర్శాధ నారదమ్ || వ్రజంతంసిద్ధమార్గేణ దేవలోకముసాగతమ్ | సంపూజ్య నారదం సుభ్రుః ప్రయయావేకసత్వరా ||
2 తామాహనారదో రంభే! కేయం తే ప్రస్థితా సఖీ | రంభాశాపభయా త్తస్యాః సర్వమేవన్యవేదయత్ ||
3 తా మాహ నారదో భూయః శృణుష్వవచనం మమ | ఊర్వశీ గత భావేయం మానుషం తంనరేశ్వరమ్ ||
4 శాపేన తుంబురో ర్మోహాదుచితం తత్రవత్స్యతి | యధాశుభం తధాకార్యం త్వయామే వచనంశుభేః ||
5 సమయేనోర్వశీ తస్య వసత్య సితలోచనా | సమయ శ్చానయా కార్యో యోరాజ్ఞస్తం విబోధమే || 6 మేషద్వయంతు పుత్త్రత్వే పురాకృతవతీశుభా | తన్నిత్యంశయనాభ్యాశే స్థాపనీయం సులోచనే! || 7 ఆహారం ఘృతమాత్రం చ కర్తవ్య మనయాతధా | నద్రష్టవ్య స్తధా నగ్నో రాజా రంభే! పురూరవాః || 8 నకర్తవ్య మకామాయా స్తధా తేనచమైధునమ్ | ఏకస్మిన్నవ్యథో భ##గ్నే సమయే దారులోచనా || 9 యదివత్స్యతి రాజానం శిలాభూతా భవిష్యతి | ఊర్వశీరంభయా సార్థమేవ మన్వస్త్వితి నారదమ్ || 10 ఉక్త్వా సంపూజ్యచమునిం ప్రతస్థే పునరేవచ | నారదో వ్యగమ ద్విప్రః పురంవైశ్రవణస్యచ || 11 మార్కండేయుడనియె :- ఊర్వశి కామార్తయై రంభతోడి సిద్ధమార్గమున సత్వరమ చని యట దేవలోకము నుండి యేతెంచిన నారదుని దర్శించెను. ఆ సుందరి యమ్మునిని బూజించి తొందరగ నట నుండి ముందునకు జనెను. ఆమెంగని సురముని రంభా! నీ చెలికత్తె కాబోలీయె నారదముని ఓ కల్యాణీ! నా మాట వినుము. ఈ యూర్వశి మనుష్యుడైన యాఱనిపై వలపు గొన్నది. ఇది తుంబురుని శాపము వలన మోహవశ##యై యాతని దరినుచితవర్తనమున నీమె యుండగలదు. ఈమెకు మేలుగలుగుట కేను జెప్పినట్లు నీవు సేయవలయును. ఈ నీలాయతాక్షి యతని దరి నొక్క కట్టడకు లోబడి మసల వలయును. ఈమె యా రాజుతో జేసికొన వలసిన సమయము (కట్టడ) నేదెల్పెద నెఱిగి కొనుము. మున్నీమె రెండు మేకపిల్లలను దన పిల్లలుగా బెంచికొన్నది. వానిని దాను శయనించు ప్రక్కకు ప్రక్కనే నిలుపుకొనవలెను. ఈమె నేయి మాత్రమే యాహారముగ గైకొను నగును. ఈమె పురూరపుని నగ్నునిగా (దిగంబరిగా) నెన్నడు జూడరాదు. ఈమెయిచ్చగించనపుడాతడీమెతో నాడు గలియరాదు. ఈ సమయములం దేయొక్కటి చెడినను నీమె యాఱనితోనే యున్న యెడల రాయి కాగలదు. ఊర్వశీ రంభతో గూడ నట్లే యగుగాక యని యమ్మునిం బూజించి తిరిగి పయన మయ్యెను. నారదుడును వైశ్రవణుని (కుబేరుని) పురమున కేగెను. దదర్శచ ప్రతిష్ఠానం చోర్వశీ రంభయాసహ | స్రాకారేణార్కవర్ణేన కాంచనేన విరాజితమ్ || 12 చతుర్భిర్గోపురైః శుభై రాజత్రైశ్య్ప విరాజితమ్ | శోభనంచతధా రమ్యం విద్రుమస్యచతోరణౖః || 13 సువిభక్త మహారణ్యం మహారాజపధంశుఛమ్ | పరిఘాభిర్విచిత్రాభిః వద్మినీభిరలంకృతమ్ || 14 సముల్లిఖద్బిః ప్రాసాదైః పాండురై రుపశోభితమ్ | శూరాఢ్య జనభూయిష్ఠం దివ్యం పురుష సంయుతమ్ || 15 వణిగ్భిరుప సంకీర్ణం నానాపణ్య విభూషితమ్ | ఐరావత కులోత్పన్నై శ్చలత్పర్వత సంనిభైః || 16 కుంజరై ర్భహుసాహసై#్ర స్సంయుతం సుమనో హరైః | తురగై ర్వహ్నిజాతైశ్చ పవనస్య సమైరవే || 17 పానమత్తై ర్నరైర్యుక ముద్యానేషు తతస్తతః | శంఖభేరీమృదంగానాం వటహానాంచ నిస్వనైః || 18 వివిధానాంచ వాద్యానాం వాదిక్తత్రం సర్వక్మేగమ్ | బ్రహ్మఘోషం మహాఘోషం వీణావేణునినాదితమ్ || 19 హృష్టపుష్ట జానాకీర్ణం సర్వబాధా వివర్జితమ్ | పద్మకింజల్క వర్ణాభిర్యుతం స్త్రీభిః సమస్రశః || 20 శ్యామాభిశ్చ మహారాజ! కాండగౌరీభిరేవచ | నానావేషధారైధరైర్యుక్తం నానాదేశోర్భవైస్తధా || 21 నరైరనేకరూపైశ్చ శిల్పజ్ఞైశ్చ హ్యనేకశః | పురస్యతస్యమధ్యేసా దదర్శనృపతేర్గ్బహమ్ || 22 మధ్యేహిమాచలసై#్యవ కైలాసంపర్వతో త్తమమ్ | శ్రామ్యద్బిః సంయుతం రమ్యైర్తృహమేధైః సహస్రశః || 23 సుధావదాతైర్విపులై శ్చంద్రరశ్మి సమప్రభైః | క్వచిద్రత్నైః క్వచిద్రైక్మైః క్యచిధ్భూపాల! రాజతైః || 24 మణిఏద్రుమ సోపానై ర్ముక్రాజాలవిభూషితైః | క్వచిచ్చ పుష్పదామాడ్యై ర్వైజయంతీయుతైః క్వచిత్ || 25 తస్యా విదూరేవిపులం వనంచైత్రరథో పమమ్ | రాజ్ఞః క్రీడావనం రమ్యం దదర్శవిపులేక్షణా || 26 ద్రుమైర్బహువిధై ర్యుక్తం పుష్బపూగఫలోప హైః | పద్మినీభిర్వి చిత్రాభిః క్రీడాశైలైఃమనోహరైః || 27 ప్రాసాదైశ్చతధా రమ్యై రమ్యైర్మణిగణౖ స్తధా | తత్తు రంభావనందృష్ట్వా సభీ వచన మబ్రవీత్ || 28 రాజ్ఞఃక్రీడావనేరమ్యే గహనే೭స్మిన్సులోచనే! | మాయాచ్ఛన్నానివత్స్యామో యానద స్తమయంరకీః || 29 తతోగత్వా నరేంద్రం తం చోక్త్వాతవ చికీర్షితమ్ | అహంత్వాంతు తు నయిష్యామి సవిధే తస్య భూపతేః || ఏకముక్త్వా సభీ వాక్యం నోదయామాన చోర్వశీ 30 క్రీడావనం తేచ తతో೭వతిర్ణే తద్దేవ రామే సు మనో೭భిరామమ్ | క్రీడావనే తత్ర తధోర్వశీసా సూర్యాస్త కాలం మనసాసమైచ్ఛత్ || 31 ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రధమఖండే మార్కండేయ వజ్రసంవాదే క్రీడావనావతరణంనామ ఏకత్రింశ దుత్తర శతతమోధ్యాయః ఊర్వశి రంభతో గూడి సూర్యప్రభ##మైన బంగారు ప్రాకారముతో నాల్గురజతమయ (వెండి) గోపురములతో రాజిల్లుచు విద్రుమ తోరణములచే సుశోభనము సురమ్యము. సువిభక్త మునగు మహారణ్యము సునుచీర మహారాజపథము పద్మినీ సమలంకృత విచిత్ర పరిఘాలంకృతము. ఐరావత కులమంనుపుట్టి కదలుచున్న పర్వతమట్లున్న బహు సహస్రకుంజరములతో నొప్పుచు నగ్నిం బుట్టిన వాయుజవములయిన యుత్తమాశ్వములతో పానమత్తులగు జనములతో నుద్యానములం దెల్లెడశంఖభేరీ మృదంగ పటహముఖ వాద్యధ్వనులతో బ్రతిధ్వనించు సుందర మందిరములతో నొక వంక బ్రహ్మ ఘోషము (నేదధ్వని) వేఱొకట వీణావేణునినాదములు విననగుచు హృష్టప్రుష్ట జనాకీర్ణమై యేబాధలులేక పద్మకింజల్క సవర్ణశరీరులగు నవ¸°వన మింపెనయు వేలకొలది తరుణులతో నానావేషధరులు నానాదేశోద్భవులు నానారూపులగు నరులతో శిల్పులతో నాపుర మతి సుందరమై యుండును. ఆ పురము నడుమ రాజసౌధము హిమాచలము నడుమ గైలాసముట్లుండెను శ్రీమంతములగు గృహవేంఘములతో గ్రమ్ముకొని యుండెను. ఆ గృహములు కొండొక యెడ నచ్చము తెల్లనిది. సువిశాలము కొన్ని చంద్రరశ్మి ప్రకాశములు కొండొకయెడ రత్నములు కొండొక యెడ స్వర్ణమయములు, కొండొక యెడ రాజితములు అందలి సోపానములు మణిమయములు విద్రుమ (పగడ) మయములు ముత్యాలపేరులు కొన్నియెడల పూలమాలలుం గల్గిన వైజయంతులతో నలరు చుండెను. ఆ రాజ సౌధమున కల్లంత దూరమున రమ్యమగు కేశీవన మొక్కటి యామె చూచెను. అందనేక పుష్పఫల భరితములయిన వృక్షములు గలవు. పద్మినీ లతలు సొంపు గొల్కుచుండెను. క్రీడాశైలములతి మనోహరములు. అత్యంత రమ్యములగు ప్రాసారములు మనోహరమణి స్థగితములు. అటునొక రంభ యూర్వశితో సఖి! ఇది రాజ కేశీవనము సురమ్యము గహనము (రహస్యస్థానము) ఇందోసునేత్రా! మాయచే గప్పబడి ప్రొద్దు గ్రుంకు దనక నుండుము. అవ్వల నేనా నరేంద్రుని దరికేగి నీ చేయవలసిన పని నెఱింగించి నిన్నా రాజుదరికిం గొంపేయెదను. అన విని యూర్వశి యామెంబంపినది. ఆ దేవవనిత నిట్లా సమమోభిరామమైన యుద్యానములో దిగినది. ఊర్వశి సూర్యాస్తమయ సమయమున గోరుచుండెను. ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమునందు ఊర్వశీ రంభాక్షేరావనామతరణము అను నూటముప్పదియోకటవ అధ్యాయము.