Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటముప్పదిమూడవ అధ్యాయము - ఊర్వశీపురూరవసమాగమము మార్కండేయ ఉవాచ :- ఇత్యుక్తారంభయా వాక్యం దృష్ట్వా రాజా
సమాగతమ్ | హృష్టా సషాధ్వసా దేవీ బభూవాథ తధోర్వశీ || అత్యాశ్చర్య మభూ ద్దృష్టే రాజ్ఞి తస్యాఃశుభాననే! | రోమాంచితనుత్వంచ నప్రస్వేదం సమాబభౌ ||
2 తా మువాచ తతో రంభా శృణూర్వశి! వచోమమ | నేహాగమే೭స్య నృపతేః కార్యమల్పం భవిష్యతి ||
3 రాజా సభాసహాయో೭యం ప్రవిష్టోనిశి కాననమ్ | ప్రచ్ఛన్నేశృణువ స్తావ దస్యవాక్యాని భూపతేః ||
4 ఏవమస్త్విత్యు వా చాధ రంభాం నారాయణాత్మజా | మాయాచ్ఛన్న శరీరే తే తతశ్చాయయతు ర్నృపప్ ||
5 రాజానం చారుసర్వాంగం పప్రచ్ఛ తు తదా సఖా | రాజ్ఞోబహుమతోనిత్యంగుణనాంశ్చాతి ధార్మికః ||
6 సఖోవాచ :- యతః ప్రభృతి రాజేంద్ర! | త్రిదివాత్త్వమిహాగతః | తతః ప్రభృతి చాస్వస్థో మయాదృష్టో೭సి!మానద! || త దస్వాస్థ్వం కామకృతం జ్ఞాతవానస్మి తేనృప ! | తన్మ మాచక్ష్వ తే గుసహ్యం నచే న్నరవరోత్తమ! ||
8 పురూరవా ఉవాచ :- తవ గుహ్యం న మే కించిత్ కదాచిదపి విద్యతే! అస్వాస్థ్య కారణలసైమ్య! తప పక్ష్యామ్య ధాత్మనః || నారాయణసుతా కాంతా రూపేణాప్రతిమా శుభా | ఉర్వశీనామతః ఖ్యాతా మయాదృష్షా వరాప్సరాః ||
10 యతః ప్రభృతి చార్వంగీ తతః ప్రభృతిమేసఖే! | కామేనాలోడ్యతే చిత్తం నచశామ్యతి మే తధా ||
11 నచోపాయం ప్రవశ్యామి తస్యా లాభే ద్విజోత్తమ! | దేవతానామపి శుభా డుర్లభా సా వరాంగనా ||
12 ఏవందుఃఖపరీతస్య సఖే! కాలోగతోమమ | ఉపభుక్తామయాస్వప్నే సాద్య చార్వసితేక్షణా ||
13 చంద్రకాంత గృహేహ్యస్మిన్ కామమార్గణతాడితా | చంద్రోదయే చారుముఖీ త్రైలోక్యసై#్యకసుందరీ || 14 వినోదనార్థంహినఖే! మనసో೭తిమనోహరమ్ | చంద్రోదయేతతః ప్రాప్తంచంద్రాకంత శిలాగృహమ్ || 15 తదేహి త్వరితంసౌమ్యః ప్రవిశ్యరుచిరంగృహ్ | వినోదయామి హృదయంమన్మధున వశీకృతమ్ || 16 సఖోవాచ:- యధా దృష్టం త్వయాస్వప్నే తధాద్య భవితాధ్రువమ్ | సాపికామవరీతాంగీ త్వాముపేష్యతి భామినీ || 17 మార్కండేయ ఉవాచ :- ఏవముక్త్వా నివేశాధ చంద్రకాంత శిలాగృహమ్ | ఆసాంచక్రే తదాతస్మిన్మదనేనవశీకృతః || ఉర్వశీరంభయాసార్థం తచ్ఛ్రుత్వాహర్షమాగతా | ఆత్మానం దర్శయామాస రంభాపి నృపతే స్తదా || 19 జయేత్యుక్త్వా మహీనాధం రంభా కామవశా త్తధా | బభూవ పురతస్తన్య శోభయంతీవ తద్గృహమ్ || 20 తామువాచ తతోరాజా స్వాగతం తే వరాననే ! | అలంకురుష్వచార్వంగి ! రత్నాసనమిదం శుభమ్ || 21 రత్నాసనోపవిష్టాయాం తదాగమన ఎస్మితః | తదారాజీవరక్తాక్ష స్తామువాచ వరాననామ్ || 22 శక్రస్యగరం రమ్యం రాజతే నిత్యశ స్త్వయా | పౌర్ణమాస్యా యధారాత్రిః శశాంకేనే భామిని! || 23 త్వం సభా మండనం తస్య సచ్ఛిష్యా త్వంచ తుంబురోః | త్వయా೭భిభూతాః సకలాః స్త్రియఃసుప్తాః సుశోభ##నే! || 24 త్వయా೭భిభూతాః సకలాః స్త్రియః స్వర్గేసుశోభ##నే! | తవనేత్ర సహస్రేణ పశ్యన్నపి తు పాకహా || 25 సర్వత్ర చారుసర్వాంగి! నతృప్యతి శుభాననే | తన్మమాచక్ష్వ సుభ##గే! ఇహాగమనకారణమ్ || 26 మార్కండేయుడనియె :- ఇట్లు రంభ యూరడించుచు పలికినంతట లోనననుకొనకుండ నాలోన నరుదెంచిన రాజుంగని నంతన యూర్వశి తత్తరపాటు సెందెను. అతడు కనబడినంత నామె కత్యాశ్చర్యము గల్గెను. మేను పులకరించెను. చెమట పట్టెను. అంత రంభ యిట్లనియె. ఊర్వశీ నా మాట విను. ఈఱని యీరాకలో జరుగ వలసిన కార్యము చిన్నదియై యుండదు. ఈ రాజు నెచ్చెలులతో నర్థరాత్రి యీ కాననముంజొచ్చి నాడు. మనమిద్ధరము చాటున నిల్చి యీ భూపతి మాట లాలింతము. అన నూర్వశీ యట్లే యనెను. వారిరువురు మాయతో తమ మేనులం గ్రమ్ముకొని యారాజు నెదుట కరుదెంచిరి. పరమ సుందరు నారాజు నాతని చెలికాడు రాజునకెంతేని యెడవడని యిష్టుడు గుణవండుడతి ధార్మికు డిట్లని ప్రశ్నించెను. రాజేంద్రా! స్వర్గమునుండి యిటు వచ్చనిదిమొదలు నాకీవస్వస్థుడవుగ గనబడు చుంటివి. ఆ యస్వాస్థ్యము కేవలము కామ నిమిత్తమని నేగ్రహించితిని. నాకడ దాపరానిదైనచో నా రహస్యము నాకు జెప్పుమన పురూరపు డిట్లనియె. నీకు నా వలన దాపరికమెన్నడు నేమియు లేదు. ఓ సౌమ్య ! నా యస్వస్థతకు కారణము నీకు దెల్పెదను. నారాయణుని కుమారి భూమియం దప్రతిమాన రూపవతి. ఊర్వశి యను పేరి యస్పరస నాకు కనబడినది. ఆమె కంటబడినది మొదలు మిత్రమా! నామనసు కామునిచే కలత బడినది. ఆ కలత శమించుట లేదు. ఓ విప్రోత్తమా! ఆమెంబడయుట కుపాయ మేదియు తోచకున్నది. నాకే కాదా వరాంగి దేవతలకేని దుర్లభ ఇట్లు పగలం బొగులు నాకు కొంబొక జాలము జరిగినది. ఆ నీలలోచనం గలలో నీలోన ననుభవించితిని. ఈ చంద్ర కాంత శిలాన్థగిత మందిరమందు కామబాణ తాడితయై చంద్రోదయ సమయమందా సుందరముఖిం త్రైలోక్య సుందరిని మనోహరమైన యీసదనమున కేను మనస్సునకు వినోదనార్దమైవల్య చంద్రోదయమైనతఱిం దర్శించితిని. సౌమ్యా! ఈ చక్కని సదనమునకు త్వరగరమ్ము మన్మథ వశ##మైన నాహృదయము నిచ్చట వినోదింప జేసికొందును. అనవిని రాజుసఖుండు కలలో నీ కెట్లు కనబడినదట్లే యిపుడు తప్పక గాగలదు. ఆభామిని కూడ కామపరీతయై యీదరికి రాగలదు. అన విని రాజాచంద్రకాంత శిలా గృహముం జూచ్చి యట మదనవశుడై యుండెను. ఊర్వశి రంభతో నదియెల్లవిని హర్ష మొందెను. రంభ రాజునకు దనను దా దర్శింప జేసి కొనెను. మఱియు రాజును జయశబ్దమున నభినందించి కామవశమున ఆ గృహమెల్ల శోభింప జేయుచు నెదురయ్యెను. ఆమెం జూచి రాజు శుభాననా! స్వాగతము ఈ రత్నాసన మలంకరింపు మనియె. రత్నాసనమందు గూర్చున్న యంత నామె రాక కచ్చెరు వంది యా రాజీవ రక్తాంతనయను డారమణితో రంభా! నీచే నింద్రుని నగరము పున్నమి రేయి పున్నమి చంద్రునిచే నట్లెంతేని రాజిల్లుచుండును. కల్యాణీ! స్వర్గభామిను లెల్లరు నీచే దిరిస్కృతులు. పాకశాసనుడు నిన్ను వేయిగన్నులం గనుచుండియుందని వినొందడు సరికాని ఓ సుందరీ! నీ విటకు వచ్చిన కారణము నాకు దెలుపుమన రంభ యిట్లనియె. రంభోవాచ :- శృణుష్వావహితో రాజన్మ మాగమన కారణమ్ | శ్రుత్వాతచ్చ నరేంద్రేంద్ర! కురుష్వ వచనంమమ || 27 నారాయణసుతాదేవీ తత్ర త్రైలోక్య సుందరీ | ఉర్వశీనామ చార్వంగీ భూమిపాల! సఖీమమ || 28 సా త్వాందృష్ట్వా మహేంద్రస్య సదనే కామమోహితా | నశర్మలభ##తే బాలా హాహేతి వదతీముహుః || 29 సా త్వదర్ధ మనంగేన మార్గణౖర్భృశపీడితా | లావణ్యశేషాసంవృత్తా దినైః కతిపయైః శుభా || 30 క్షామక్షామ కపోలా సా త్వత్సమర్పితమానసా | మదనే నాభితస్తాంగీ మానముత్సృజ్య భామినీ || 31 ప్రస్థితా సా మయా సార్థం తప దర్శనలాలసా | అంతరానారదేనో క్తా యత్రత్వం ప్రస్థితాశుభే || 32 తత్రత్వయాతుయేవ స్తవ్యం సమమేన వరాననే | మేషద్వమంతు పుత్త్రత్వేయ త్త్వయా పరికల్పితమ్ || 33 తత్తుతే శయనాభ్యాశే స్థాపయే త్సతతంయది | సరాజా చారు సర్వాంగి! నగ్నోనేక్షేత భామిని! || 34 మైధునం చాప్యకమాయా నాసౌతే కర్తుమర్హతి | ఘృతాహారా సదా తత్ర వసత్వం సుభ##గే ! సదా! || 35 ఏకస్మిన్న వ్యతిక్రాంతే సమయే యది పార్థివమ్ | సత్యక్ష్యసి తదా సౌమ్య! శిలాభూతా భవిష్యసి || 36 ఏతాని సమయాన్యుక్తా నారదేన సభీమమ | తానిత్వం ప్రతివద్యస్వభజవ్వ చశుభాననామ్ || 37 రాజా! నారాకకు కారణము మనసు పెట్టి వినుము. విని నాయా మాట నీవు నెరవేర్పుము.నారాయణుని కూతురు త్రైలోక్య సుందరి. ఊర్వశి యను పేరిందిది. నా సఖురాలు. ఆ బాలిక నిన్నింద్రభవనమున జూచి కామ మోహితయై యీపుడిం తేని సుఖము గనకున్నది. మాటి మాటి కయ్యో అయ్యోయని వలువరించును. అది నీకై యనంగుని యమ్ములను గురియై మిక్కిలి పీడ నొందుచున్నది. కొన్ని రోజులలోనే యా కల్యాణి లావణ్య మాత్రా వశిష్ట యైనది. చెక్కిళులు మిక్కలి మిక్కిలి చిక్కినవి. మనసు నీ కప్పనము సేసినది. మదనునిచే నమ్మానిని మేనెంతేని క్రాగుచున్నది. గుట్టు విడిచి నిను దర్శించు వేడుక గొని యా యింతి యటవెడలి నాతో బయలు దేరి, దారిలో నారదుడు నీ వున్న జాడ తెలిపి, నీ వెవనికై బయలు దేరితి వక్కడ ఒక కట్టు బాటుకనకు (షరతు) లో బడి వసింప వలయాను. నీవు పుత్రులట్లు పెంచిన మేకలురెండునూ నీ శయనము దరినే యుంచికొనవలయును. ఆ రాజు నగ్నుడై నీకు గనబడరాదు, నీవు కోరనపుడతడు నీతో సంగమము కూడ చేయరాదు. ఓ సుందరీ! వాని దరి నీవు నేయి మాత్రమాహారించుచు వసింప వలయును. ఈ చెప్పిన యే యొక్క సమయమేని దప్పినచో నీ వా రాజును వదల వలయును. అప్పుడు నీ వొక రాయి యయ్యెదవు. అని యిట్లు నారదుడు మా చెలి కెరింగించెను. ఆ సమయముల నీవు అంగీకరించి మా చెలి ననుభవింపుము. అన విని పురూరపుం డిట్లనియె. పురూరవా ఉవాచ :- రంభే! తవాద్య వాక్యేన అమృతేనేవ భావిని! | మృత్యోర్వశమనుప్రాప్తో జీవితో೭స్మి శుభాననే! || మమాపితత్కృతే రంభే! మదనః శరవృష్టిభిః | దునోతిహృదయం సుభ్రుః దివారాత్రమతంద్రితః || 39 సా త్వంజీవయ మాం శీఘ్రం దర్శయస్వవరాంగనామ్ | స్థాస్యామి సమయే తస్మిన్ యస్మిన్‌మాం వక్ష్యసేశుభే! || 40 కృతం తం సమయం విద్ధి నారదేన యదీరితమ్ | అనాక్రందే నిమగ్నస్య మమకామమహోదధౌ || 41 ప్లవోభవ విశాలాక్షి ! ప్రాణదాభవ సుందరి ! | మార్కండేయ ఉవాచ :- ఏవముక్తా నరేంద్రేణ రంభా చాంతర్దధే తదా || ఉర్వశీ సహితాచాధ దర్శయామాసతంసృపమ్ | జయేత్యుక్త్వా నరేంద్రంతు తదా నారాయణాత్మజా || 43 వీడితా పురత స్తస్థౌ తస్యరాజ్ఞోమహాత్మనః | తాందృష్ట్వా ప్రీతిమాపా೭థ స నరేంద్రోమహాద్యుతిః || 44 ప్రులకాంచిత సర్వాంగో వర్ణితుం సాస శక్యతే | పాణా వాదాయ త్రపితాం ఉత్సంగేచోపవేశయత్ || 45 రత్నాసనం తధా భేజే రంభా೭పి సుమనోహరమ్ | తతశ్చోవాచ వచనంరాజా ముదితమానసః || 46 రంభా! అమృతముచేనట్లు నీమాటచే నేనిట మృత్యువశుడనయ్యునిదె బ్రతికితిని. శుభాననా! అమెకై మదనుడు రేయింబవళ్ళు శరవర్షముల నాహృదయమూరక వేధించుచున్నాడు. నీవు నన్నుబ్రతికింపుము. శీఘ్రముగా నా సుందరాంగింజూపింపుము. నీ వెట్లంటివట్ల కట్టుబాట్ల కేను గట్టుపడియుండెద. నారదుడు సెప్పిన యాసమయము నేని నిర్వర్తించితినే యని తెలియుము. అక్రందింప విన దిక్కులేని కామమహాబ్ధిలోమునిగిని నాపిలిటి కీపు తెప్పవగును. ప్రాణదాత్రిగమ్ము. అని పురూరపుండు పలుక రంభ యపుడ యంతర్ధానమంది యూర్వశితోగూడ వచ్చి యామె రేనిం జూపించెను. అత్తరి నారాయణ తనయ (ఊర్వశి) జయ జయ శబ్దము గావించి సిగ్గుగొని యామహానుభావుని ముందు నిలువబడెను. అమ్మహాతేజస్వి యామెంజూచి యెక్కడలేని ప్రీతింబొందెను. మేనుపులకింప నామె వర్ణింప శక్యముగాక యున్న యామెం గేలగైకొని తన యంకమున గూర్చుండబెట్టుకొనెను. రంభయు నయ్యెడ చక్కని నొక రత్నాసనము నలకరించెను. రాజానందభరిత మనస్కుడై యప్పుడిట్లనియె. పురూరవాఉవాచ :- కామదేవః ప్రసన్నో೭ద్య మయోర్వశి! వరాననే! | అద్య వేద్మ్యధికం సుధ్రూఃశక్రాదాత్మానమాత్మనా || త్రైలోక్య రాజ్యలాభే೭పికుతః సాశుమేశుభేరతిః | అజ్ఞాకారిత్వమాసాద్యయా తవాద్యసులోచనే! || 48 మార్కండేయ ఉవాచ :- ఏవంవదతి భూపాలే య¸° రంభావరాసనా | క్షణన మేషసహితా పునః ప్రాప్తా నృపాంతికమ్ || 49 మేషౌదత్వా నరేంద్రస్య రాజానంవాక్య మబ్రవీత్ | రంభోవాచ :- యాస్యామి లంకాం రాజేంద్ర! తత్రప్రాణశ్వరోమమ || మత్ర్పతీక్షః స్థితః శ్రీమాన్ ధనదస్యాత్మ సంభవః | నలకూబర నామా೭సౌత్రైలోక్య విదితః ప్రభో! || 51 యధాచేయంసభీమహ్యం నోత్కంఠాంకురుతే శుభా | సభీజనస్య స్వర్గ్యస్య తధాకార్యంత్వయా೭నఘః || 52 పురూరవా ఉవాచ :- యతిష్యే೭హం తధాకర్తుం నిర్వృతాభావ మానదే! | రత్నాన్యేతాన్యుపాదాయ నిర్గచ్ఛస్వ యధా సుఖమ్ || 53 మార్కండేయ ఉవాచ :- ఏవముక్తా తతోరంభా నృపతేః ప్రీతికారణాత్ | రత్నాన్యుపాదాయ య¸°భేన లంకాం మహాపురీమ్ || 54 లబ్ధ్వోర్వశీం నరేంద్రో೭పి రేమే స సహితస్తయా | యధాశచ్యా సురారిఘ్నో బలవాన్పాకశాసనః || 55 సంన్యిన్తభారః సతు మంత్రిముఖ్యం రమేతయా యాదవ సింహముఖ్య! | లక్ష్మ్యాసమేతో భగవా ననంతో యధాసదేహోభువనస్యగోప్తా || 56 ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే ఉర్వశీ పురూరవసమాగమోనామ త్రయస్త్రింశరు త్తర శతతమో೭ధ్యాయః ఓసుముఖీ! ఇపుడు కామదేవుడు నాయెడ సుముఖుడైనాడు. ఇపుడు నన్నేను శక్రునికంటెనధికునిగా నెరింగికొనుచున్నాను. సులోచనా! ఇపుడునీయాజ్ఞంజేయవాడనై (దాసుడవై) యుండుభాగ్యముంబడసినవారి కిక త్రైలోక రాజ్యలాభమందెక్కడి కోరిక! అని యిట్లుభూపాలుండనుచుండగనే రంభయట నుండి క్షణములో జని తిరిగి మేకలతోదేని సన్నిధికేతెంచెను. ఆమేకలసురాజేంద్రునకిచ్చి యతనితోనిట్లనియె. రాజేంద్రా నేను లంకంకుజనియెద. అక్కడ నాప్రాణశ్వరుడున్నాడు. నాకొర కెదురుచూచుచుండును. ధనదుని తనయుండాయన నలకూబరుడను పేరివాడు త్రైలోక్య ప్రసిద్దుడు. నానెచ్చలి నాకై బెంగపెట్టుకొని యేవిధముగతన తన సఖురాండ్ర కొఱకు స్వర్గము కొరకును జ్రతీక్షింపనియట్లయె నీపులాలింపుము. పాలింపుమన పురూరుపుడు ''కలతపడకు మీవన్నట్లు సేయుటకు యత్నించెదను, వెళ్ళిరమ్ము ఈ రత్నాలుగైకొని సుఖముగా బయలుదేరుము'' అని పురూరపుడన రంభ రాజు ప్రీతికొరకు రత్నాలను జేకొని యాకాశమున లంకా మహాసురమునకేగెను. నరేంద్రుడు నట్లూర్శశింబౌంది యామెతో శచీదేవితో సురేంద్రుడట్లు క్రీడించెను. ఓయాదవ సింహనాయకమణీ! పురూవుడు మంత్రి ముజ్యనిపై రాజ్యభారముంచి భగవంతుడనంతుడు భువనక్షకుడు కాగా విష్ణువు లక్ష్మీదేవితో నట్లాదేవితో నతడు క్రీడించెను. ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము ప్రథమ ఖండమున ఊర్వశీ పురూరవ సమాగమము అను నూటముప్పదిమూడవ అధ్యాయము.