Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటముప్పది నాల్గవ అధ్యాయము - ఉర్వశీసంభోగవర్ణనము

మార్కండేయ ఉవాచ :- 

వ్రాసాదేషు విచిత్రేషు తధా మణిగృహేషుచ | పుష్పవేశ్మసు రమ్యేషు తధావస్త్ర గృహేషుచ ||

రత్నవేశ్మసు ముఖ్యేషు తధా చిత్రగృహేషుచ | పర్వతానాంచదుర్గేషు నదీనాంపులినేషుచ || 2

పద్మినీషుచ పుల్లాసు తధాచోత్పలినీషుచ | శయ్యాసుచవరార్ధ్యాసు పుష్పశయ్యాసుచాప్యధ || 3

రమయామాసతాందేవీం తధావిరచితేషుచ | గృహేషుబహురత్నే షు ధూపోద్గారిషు పార్థివ || 4

రేమేసతుతయాసార్దం మానసేషుపునః పునః | రమయంస్తాం వరారోహాం నతృప్యతి స నిత్యశః || 5

నిశాసుచసచంద్రాసు చంద్రకాంతతరం ముఖమ్‌ | పపౌతస్యాయుధాకామం నరేంద్రః సనరాధిప! || 6

నిశాసునష్టచంద్రాసు తన్ముఖోద్యోతితప్రభే | దేశేతాం రమ యామాస రాజారాజీవలోచనాం || 7

నిశాసునష్ఠచంద్రాసు తన్ముఖోద్యోతితప్రభే | దేశేతాం రమ యామాస రాజారాజీవలోచనాం || 8

వర్థయంతీ నరేంద్రస్య సాతుకామందినే దెనే | అదృష్టపూర్వేవశుభా భవత్యాయతలోచనా || 9

వరచందన దిగ్ధాంగౌ నానా భరణ భూషితౌ | రేమాతే దంపతీహృష్టౌ నానారత్న విభూషితౌ || 10

అలంకరోతితాంరాజా స్వయమేవ కదాచన | తయాలంక్రీయమాణశ్చ ప్రీతిమాప్నోత్యను త్తమామ్‌ || 11

పరేషు తౌవిచిత్రేషు రేమాతే ముదితౌ భృశమ్‌ | కేశాన్సంశోభయంతౌ తౌ కుసుమైస్తు పరస్పరమ్‌ || 12

ఉర్వశ్యభ్యు దితంపుష్పం తధా చగ్రధితం పునః | ధారయామాసశిరసాప్రేవ్ణూ పార్థివ సత్తమః || 13

పత్రచ్ఛేదేన యాంశ్చక్రే తిలకాన్స నరాధిపః | తాంశ్చసా ధారయామానలలాటే చారుహాసినీ || 14

ఏవం సంక్రీడతో రాజ్ఞస్తయానహ సుమధ్యయా | బభూవుస్తనయాఃపంచ నామతస్తాన్నిభోధమే || 15

అయుర్జ్యేష్ఠస్తతో ధీమాం స్తతశ్చాన్య స్త్వనామయః | అయుతాయుశ్చతుర్ధోభూచ్ఛ తాయుశ్చైవపంచమః || 16

ఏవంతస్యాః ప్రసూతావై యాతి కాలే మనోహరే | 17

గంధర్వ ముఖ్యాస్తుతదానమేతా తయావిహీనాభృశముత్సుకాస్తు |

తదాగమాయాధ సురేంద్రలోకే మంత్రంతదా చక్రురదీనసత్త్వాం || 18

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రధమఖండేమార్కండేయ వజ్రసంవాదే ఉర్వశీ సంభోగవర్ణనోనామ చతుస్త్రింశదుత్తర శతతమోధ్యాయః

మార్కండేయుడనియె. చిత్ర విచిత్ర ప్రాసాదములందు మణిమందిరములందు పూబొదరిండ్లం జక్కని పట కుటీరము లందు రత్నగృహములందు ఇసుక తిన్నెలందు వికసించిన తామర పూదీగలందు నప్పటికప్పుడు పైకెగిసిన బహురమ్యములుగా ధూపవాసనల ఘుమఘుమలు నించు సుందర హర్మ్యము లందా రాజాదేవసుందరిని రమింపజేసెను. ఆమెతోగూడ నాతడు మానస సరస్థిరములందు మరి మరి నిరంతరము క్రీడించుచు క్రీడింప జేయుచు దృప్తి గనఢయ్యెను. చంద్రునితోడి వెన్నెల రేల నా రాజ చంద్రుడు చంద్రునియట్లు మిగులచక్కనిదాని నెమ్మోమును దనవితీర నాస్వాదించెను. ఆ రాజీవనయనుడు చంద్రుడులేని రాత్రులందా చంద్రముఖి కున్ముఖుడై దాన మిక్కిలిగ ప్రభనించు ప్రదేశ మందామె నానంద వరవశం జేయుచుండెను. దినదినమీ యిందువదన యా నరేంనిద్రుకి కామ మినుమడింప జేయుచు మున్నెన్నడు చూడని దట్లప్పటి ంప్పుడా విశాల వయన క్రొత్తిదియై తోచి యా రేని కెంతేని దయిత (వల్లభ) యై రెట్టింపుగ క్షణ క్షణ నూతనుడయి తోచుచు ప్రీతినించెను. పలపులు నించు మంచి గంధపు పూతలతో నానాభరణములతో నా దంపతులు నానారత్న సముదయములతో మిక్కిలిగ విలసించిరి. ఆ రేడామెను ఆమె తనను అలంకరింప నెక్కడలేని యానందము నందుచుండెను. ముదితులై యా యిద్దరు దివ్య నవనములందు క్రీడించిరి. ఒండొరులు తమ తమ వేనలులం బువ్వులుముడిచికొనుచు నెనలేని శోభనముం బొందుచుండిరి. ఊర్వశి నీళ్లుపోసి పెంచి పూయించిన ఆమె తనయండ జుట్టుసంగై సేసిన పువ్వుల బ్రేమమెయి దలదాల్చి యా పార్థిమోత్తముండెంతేని మురియుచుండెను. అతడు నా యింతినెమ్మెమున రకరకములపత్రరేఖ లేమేమిరచించెను. ఏమేమి తిలకములు దిద్దెను. వాని వాని నల్లన నవ్వుచుం దన నుదుట ధరించి ముచ్చటలు నించెను. ఇట్లామెంగూడి క్రీడించు నా రేని కై దుగురు తనయులు గలిగిరి. వారిలో ఆయువు జ్యేష్ఠుడు అటుపై క్రమముగ ధీమంతుడు అనామయుడు అయుతాయువు శతాయువు ఇట్లు కాలము గడు సొంపుగ గడుపుకుండ నామె యెడమాటుగొని గంధర్వముఖ్యు లామె రాకకొరకు సురేంద్ర లోకమున నయ్యెడ నాలోచనము సేసిరి.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమున ప్రథమఖండమునందు ఊర్వశీ సంభోగ వర్ణనమను నూట ముప్పదినాల్గవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters