Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటముప్పదియైదవ అధ్యాయము - పురూరవవిరహవర్ణణము మార్కండేయ ఉవాచ :- ఊర్వశ్యాగమనేయత్నం చక్రుస్తే మంత్రముత్తమమ్ |
గంధర్వస్తూగ్రసేనాఖ్య స్త దామరిత్రమ భాషత || ఉగ్రసేన ఉవాచ :- సమయే೭వస్థితా తస్మిన్నుర్వశీ చారుభూషణా వ్యుత్ర్కాంతసమయంసాకు రాజానం త్యక్ష్యతే చతమ్ || తమహంవేద్మి సమయం తత్రయాస్యామిచానఘ! | యుష్మత్కార్యం కరిష్యామి సనహాయోన సశంయః || 3 మార్కండేయ ఉవాచ :- ఏవముక్త్వాయ ¸°తతత్ర యత్రాసౌనృపతిః స్థితః | రాత్రౌ జహారమేషంచ మాయయా స నరాధిప! || 4 మేషం జ్ఞాత్వాహృతందేవీ రాజాన మిదమబ్రవీత్ | మేషోహృతో మహీపాల! కేనావ్యద్ధా సుతోమమ || 5 ద్వితీయశ్చ హృతో రాజం స్తమానయ సుతంమమ | ఏవముక్తస్తయా రాజా నగ్న ఏవాధసంభ్రమాత్ || 6 ఉత్థాయాన్వేషణం చక్రే మేషయోః పురుషర్షభ | అధాపశ్యత సానగ్నం దాజాన మసితేక్షణా || 7 సంస్మృత్య నారదవచస్తతో భూతాబభూవసా | గంధర్వాణాం య¸°సాపి సమీపందుఃఖితాతదా || 8 స్వర్గం ప్రావ్యవిశాలాక్షీ నిత్యంనృప పరాయణా | కామనున్న శరీరాపి కాలం నయతిసుందరీ || 9 ఋషిశాప భయాద్భీతా మదనేనపశీకృతా | నిత్యమాస వరారోహా నిఃశ్వాసపరమాసతీ || 10 అప్రాప్య మేషయుగళం ఎనివృత్తోనరాధిపః | నాపశ్యచ్ఛయనేదేవీం సస్మారసమయంతదా || 11 విదిత్వా త్యక్తమాత్మానం స్మృత్వానమయ మాత్మనః | కామ బాణార్దితోరాజా తధాపి ఎజనే వనే || 12 తాంమార్గతి వరారోహా మున్మత్త ఇవ నర్వతః | ఏకాకీఎజనేరాజా ప్రియయా రహిత స్తదా || ఎలలావమహాసత్త్వః కుసత్త్వఇ వకశ్చన | 13 మార్కండేయుడనియె. గంధర్వులు ఊర్వశి తిరిగి వచ్చుటకు చాల ప్రయత్నమును జేసిరి ఉగ్రసేను డప్పుడొకయాలోచన చెప్పెను. ఊర్వశి పురూరవునితో నొక నియమము సేసియున్నది. అతడా నియమమును దప్పిన యెడల నామె యాతావు విడిచి వేయును. ఆ నియమము నేనెరుంగుదును. అట కేగుటచే సహాయుడనై మీ పని జక్కపెట్టి వచ్చెదను అని పలికి యుగ్రసేను డా రాజున్న యెడ కేగి రాత్రి మాయచేసి యామేకలను హరించెను. అదితెలిసి యూర్వశి రాజా! మేక నెవ్వడో హరించెను. రెండవ మేక గూడ దొంగలింప బడినది. దానిం గొనితెమ్ము అన విని ఱడు దిగంబరిగానే తొట్రువడుచు లేచి యా మేకలను వెదకెను. ఆ యప్సరస యతనిని నగ్నునిగానే చూచెను. నారదుని మాట జ్ఞప్తిసేసికొని యప్పుడ యంతర్ధానమై దుఃఖించుచు గంధర్వుల సమీపమున కేగెను. స్వర్గమందా విశాలాక్షి రాజుపైన మనసుపడి నిత్యము మన్మధ వివశ##యై కాలము గడపుచున్నది. ఋషి శాప భయమున మదన వశ##యై నిట్టూర్పులు పుచ్చుచుండెను. నరపతి వెదకియు నామేకలం గానక మున్నొనరించిన ప్రతిజ్ఞ జ్ఞాపకము వచ్చి దానింబట్టి యామె తనను విడిచి వెళ్ళినదని తెలిసి కామార్ధితుడై విజనమైన యా వసమున నామెను వెదకి పిచ్చివాడట్లొంటరియై నామె లేమి గడు కృశించి మహా సత్త్వుడయ్యు సత్తువ లేని వాడయి యిట్లు పరితపించెను. పురూరవా ఉవాచ:- క్వగతా೭సి విశాలాక్షిః విహాయ విజనేత్రమామ్ || 14 కథంప్రవేక్ష్యామి పురం ప్రతిష్ఠానం వినాత్వయా | ప్రాణా స్త్యక్త్వా గమిష్యంతి శరీరంమమ సుందరి ! || 15 అనుగంతుం శరీరేణ నశక్నోమి వరానే! | త్వంహిమే చపలాపాంగి! ప్రాణభ్యో೭పిగరీయసీ || 16 తృయాత్యక్తోధ్రువం ప్రాణాం స్త్యక్ష్యామి వరవర్ణిని! | క్వాసి క్వాహం గమిష్యామి కింకరోమి వ్రజామి కామ్ || 17 శరణం కామతప్తస్యకోమే సందర్శయేత్ర్పియామ్ || కంస్విత్పృచ్ఛామి విజనే కస్యసా విదితా భ##వేత్ || 18 క్షేమో వామమ కస్యస్యాత్ యోయేసందర్శయేత్ర్పియామ్ | ప్రియావిరహితసై#్యష నిశాశేషోగతోమమ || 19 అంతర్థానం గతాస్తారా యధాదేవీ మమోర్వశీ | దేవో೭రుణకరుస్పర్శాచ్ఛో భాంత్యజతి చంద్రమాః || 20 నిశాక్షయేక్షామవపు ర్యథా೭హం తద్వినాకృతః | ఏషాహ్యావ ర్తతేపూర్వా సంధ్యాస్నాత్వాద్విజాతయః || 21 నూనం నియమ సంయుక్తాస్తిష్ఠంతి విజి జతేంద్రియాః | అయంహ్యుదయ మాయాతి సవితా రక్తమండలః || 22 సర్వసత్త్వ సమోదేవః సర్వేషాంపాపనాశనః | ఉదితశ్చాప్యయం సూర్యో విభాతివిమలేంబరే || 23 ఏకంఫుల్లం మహాపద్మం సరసీనామతేయధా | ఉదితంభాస్కరంజ్ఞాత్వా నళినీ పద్మలోచనా || 24 ఉన్మీల్యాలోకతే సర్వంవినా తేన నిమీలితా | తీక్ష్నార్కః సంప్రవృత్తో೭యం దివసః కామవర్ధనః|| 25 నైదాఘో మాం విశేషేణ సంతాపయతి తాంవినా | కంపృచ్ఛామి వరారోహోం సంతప్తకనకప్రభామ్ || 26 దృష్టామయేతి సాదేవీ కోమాంవక్ష్యతి కాననే | కరీంద్రస్త్వయ మభ్యేతి తత్కుచాభౌ సముద్వహన్ || 27 కుంభౌకఠోరౌ సుముఖం పృచ్ఛామ్యేనం మతంగజం | త్వద్దంతయుగల ప్రఖ్యం యదూరుయుగళంహ్యభూత్ || 28 గతాంతాంయదిజానీషే కథయస్వమమోర్వశీం | ఏషమస్తీ గతస్త్రా సాత్సింహ స్యాస్య మహాత్మనః || 29 అదత్వైవో త్తరంమహ్యం సింహం పృచ్ఛామ్యహం వనే | మధ్యస్తదువమ స్తస్యాః క్వసా సంప్రత్వి కేసరిన్! || 30 ఉర్వశీదయితా మహ్యం యదిజానాసి కధ్యతాం | అదత్వైవోత్తరం సింహః కథమేషగతోమమ || 31 దృష్టాకధమయేబంబ! దేవీం బింసఫలాధరా೭ అనేనాపిన బాఖ్యాతా పృష్టేన సుదతీమమ || 32 మయూర! యది జానీషే బాలాం బాలమృగేక్షణాం ఉర్వశీం కథయస్వాద్య క్వప్రియా మమవర్తతే || 33 అంతఃశరీరం కామాగ్నిర్బహి ర్దహతి భాస్కరః | తాపార్తానిఃశ్వసంత్యేతే సింహా గిరిగుహాగతాః || 34 నిరస్తజిహ్వాః సప్తాంగా వివృతాస్యాముహుర్ముహుః | యూధాని మహీషీణాంచ శేరతే నళినీజతే || 35 సూర్యోద్ధృత జలాస్వన్యే వంకశేషాసుశేరతీ | గగనం చాతకశ్చాయం తృష్ణార్తో లోకతే ముహుః || 36 సభృశంతోయ పానార్ధే ఉర్వశ్యర్ధే యధా త్వహం యాంత్యేతే పద్మినీ ఖందాన్ కుంజరాస్తా వరూషితాః || 37 సుహ స్తముక్తైశ్చజలైః సించంత్యాత్మౌన మాత్మనా | మహాద్రుమాణాం స్కంధేసు విషణ్ణా శ్చాపరేగజాః || 38 తావంనయంతి మధ్యాహ్నే ముంచంతః శీకరంముహుః | శాఖావర్నాంతరాణ్యతే విహగాస్తా పతాపితాః || 39 విశంతిచై వత్రాణార్థం మధ్యాహ్న సమయే భృశమ్ | ద్రుమశాఖాగతాహ్యేతే విహగానాంచ బాలకాః || 40 రక్తాంతచక్రాః సుభృశంవిశంతీహ ముహుర్ముహుః | త్యక్తాహార క్రియాశ్చైతే మృగయూధా మహావనే || 41 ద్రమచ్ఛాయాసు తిష్ఠంతి రోమంధంకుర్వతోముహుః | అన్వేషమాణో దయితాం శ్రాంతోస్మి విజయే భృశమ్ || 42 ఛాయాయాం విశ్రమిష్యామి శిరీషస్యాస్యసాంప్రతమ్ | తద్గాత్రసుకుమారాణి పుష్పాణ్యన్యవనస్పతేః || 43 శిరీషవృక్షోరమ్యో೭యం మనోహృదయనందనః | కింతుమాం పీడయత్యేష శిరీషస్త ద్వినాకృతమ్ || 44 సూర్యశ్చాస్త ముపాయాతి క్వగమిష్యామి శర్యరీమ్ | అస్తంయాతః సహస్రాంశు ర్నిశాప్రాప్తా సుదారుణా || 45 రాత్రిమేనాం వివత్స్యామి న్యగ్రోధే೭స్మిన్మహాద్రుమే | ఉర్వశ్యా బుద్ధిరచితే పరకేశ్మని పార్థివః || 46 సక్రీడతి తయాసార్థం సర్వకామైః సుపూజితః | నూనంమాంసజనో కేత్తి ప్రతిష్ఠానపురే తుమే || 47 ఏతామవస్థాం కశ్చిన్మే న విజానాతి సాంప్రతమ్ | పౌరోజానపదః కశ్చిజ్జనోమేదయితఃసదా || 48 నిద్రేభజస్వ మన్నేత్రే ధ్రువంస్వప్నే పరాననామి | తాంతుప్రాప్స్యామ్యహం సౌమ్యాం మానసః ప్రీతివర్ధనీమ్ || 49 కథమభ్యుదితశ్చంద్రః పీడాంజనయతేమమ | తద్వక్త్రవిజితః పూర్వం వికరోత్యధునామయి || 50 తుద చంద్ర ! యధాకామం మమదేహం వినాకృతమ్ | త్వయాతునాధం సంప్రాప్య సాపత్న్యం మమదర్శయ || 51 హాహతో೭స్మివినష్టోస్మి ఉర్వశ్యారహితోననే | చంద్రః పౌత్రేకురుదయాం దర్శయస్వ మమప్రియామ్ || 52 శశాంకా! దేవా! శీతాంశో! నృణాందృష్టిమనోహర | అక్రందామి తనాద్యాహం దర్శయస్వప్రియం మమ || 53 అతృప్తదర్శనన్యైవ సాగతాసుందరీ మమ | అంతర్ధానం విశాలాక్షీ తాందర్శయ మమోర్వశీం || 54 కదా೭ధర రసం తస్యాః పాప్యామ్యమృతసంనిభం | కదాద్రష్టా೭స్మి తాంభూయః కమలోదర సంనిభాం || 55 మృణాళబాహుయుగళాం పద్మవక్త్రాంకదాప్రియామ్ | నీలోత్పలాక్షీమాలింగ్య తాపంత్యక్ష్యామ్యనంగజం || 56 అనంగశరనున్నస్యబాలే! భవ గతిర్మమ || దధస్వ దర్శనం సుభ్రూః కామమాన్యాగతిర్భవేత్ || 57 కామమోహ గృహీతస్య త్వమేవాభూర్గతిర్మమ | భూయ స్త్యమేవ సుభ##గే! గతిర్భవ మమానఘె! || 58 ఏషావిరశితారాత్రి ర్మమ పర్షశతో పమా | అన్వేష్టుంక్వ గమిష్యామి నిర్ఘృణాం తాం మమోపరి || 59 యస్యాః కోంన జానామిస్వప్నే೭పివరవర్ణిని! | దైవేనోపహతస్యాద్య త్యక్తాసాసుభగా గతా || 60 మార్కండేయ ఉవాచ :- ఎవంసవిలపన్రాజా త్యక్తా హారః పరిభ్రమన్ | ఆససాదకురుక్షేత్రం ద్వాదశాహేన పార్థివ! || పుష్కరిణ్యా స్తటప్లక్షే పుష్కరైరుపశోభితే | నిషసాద తదాశ్రాంతః క్షుత్పిపాసాసమన్వితః || విలలాప స తత్రాపి మదనేన వశీకృతః | 62 కదానుతచ్చంద్ర మసో೭నుకాంతి | ముఖంస్మితం చారువిలోచనాయాః | ఉన్నమ్యపాస్యా మ్యధ రంతృషార్తో | వారీవపాంధః పధికృచ్ఛ్రలభ్యమ్ || 63 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే పురూరవః ప్రలాపవర్ణనోనామ పంచత్రింశదుత్తర శతతమోఅధ్యాయః ఓ విశాలాక్షీ; నన్నీ నిర్జనమైన యడవిని విడిచెపెట్టి యెటుపోయితివి? నీవు లేకుండా నేను ప్రతిష్ఠానపురమెట్లు ప్రవేశింప గలను. సుందరీ! నా ప్రాణము లీతనువుం బాసిపోనున్నవి. శరీరమును వెంబడింప జాలను. ఓ చపలాక్షీ ! నీవు నా ప్రాణముల కంటెను నెక్కువ దానవు గదా! నీవు నన్నెడబాసిన నేను తప్పక ప్రాణములు విడిచెదను ఎట నున్నావు? ఎటకు బోదును? ఏమి సేయుదును? ఎవ్వతెం గూర్చి పోవుదును? ఈ కామతప్తునకు దిక్కెవ్వడు? ఎవ్వడు నా ప్రియురాలిం జూపును? ఈ నిర్జనా రణ్యమం దెవ్వని నడుగుదును? ఎవని కీమె తెలియును? నా క్షేమమెననికి గావలయును? నా ప్రియురాలి నెవ్వడు చూపించును. ప్రియ విరహితుడనైన నాకప్పుడే యీ రేయి కడ చనినది. నా దేవి చక్కనిచుక్క యుర్వశి యంతర్థాన మైనట్లే చుక్కలు యంతర్థానమైనవి. అరుచు కరస్పర్శచే చంద్ర భగవాను డల్లదె ఆమెం బాసి నేనెట్లు బక్కచిక్కితి నట్ల శోభ దక్కి యున్నాడు. ఇదిగో పూర్వ సంధ్య తిరిగినది. ద్విజులు విజితేంద్రియులు స్నానముసేసి మడిగట్టుకొని యనుష్ఠానము లందున్నారు. ఇడుగో నెఱ్ఱని బింబముతో సవిత యుదయ మందు చున్నాడు. సర్వ సత్త్వసముడు సర్వ పాపముల నశింప జేయు సూర్యభగవానుడుదయించి యిల్లిదె నిర్మలాకాశముని దేజరిల్లు చున్నాడు ! భాస్కరుడుదయించుటెరిగి పద్మ లోచన పద్మిని యా ప్రభువు లేమి నింతమున్ను మూసికొని యున్న దిప్పుడు తెరచి కొని సర్వముం జూచుచున్నది. ఇదిగో దివసడు ప్రచండార్కమై కాకుముం బెంచుచున్నది. ఆమె నెడబాసిన నన్నీ నైదాఘము (వేసవి) మిక్కిలిగ నుడికించు చున్నది. కరగిన బంగారము వన్నెగల యన్నుట్లుయా మిన్నం గూర్చి యెవ్వని నడుగుదును? ఆ దేవి నాకు గనపడినదని కారడవిన నెవ్వడు నాకు దెలుపును? యింతి కుచముల కఠినమైన కుంభస్థలము లూని యిల్లిదె కరీంద్రము సముఖమై సమ్ముఖమయి వచ్చుచున్నది. ఈ కరీంద్రము నామెజాడ యడుగుదునా! నీలురు దంతముల సెంపున నింపు గులుకు నూరువులం గొని నడచి చనిన యా పడతి నూర్వశి వెరుంగుదువా? నాకు తెల్పుమని ప్రశ్నింతునా! ఈ ఏనుగిదె యీ మహానుభావునకు సింహమునకు జడిసి పోయి నాకు బదులు పల్కకుండ నిటెపోయినది. పోనిమ్మీ సింహమును, ఆ తనూమధ్య మధ్యము (నెన్నడుము) నీ నడుముం బోలునది కేనరీ ! ఇప్పుడామె యెక్కడున్నది? నా ప్రాణశ్వరి యెరిగితేని నాకు దెలుపును. ఈ సింహము గూడ నాకు బ్రత్యుత్తర మీయకుండ బోయినది. ఓ బింబమా! ఓ దొండతీగా ! బింబ ఫలాధర (దొండ పండు వంటి పెదవులు గలది) నా దేవి గనబడినద? చెప్పుము. నే నడిగిన నిదియుం నా సుదతి జాడం గూర్చి బదులీయకున్నది. ఓ నెమలీ! లేడి పిల్ల కన్నులు గల యా బాల నూర్వశి నా వల్లభ యిప్పుడెందున్నది తెల్పుము. కామాగ్ని శరీరము లోపలను భాస్కరుడు వెలుపలను దహించు చున్నారు. ఇవిగో గిరిగుహలందున్న యీ సింహములు తాపార్తములై నాలుకలు వెలువరించి మేను వడక నోళ్లు తెరచుకొని మాటి మాటికి నిట్టూర్చు చున్నవి. గేదెల మందయునిట్ల తామర కొలనిలో పండుకొన్నవి. కొన్ని సూర్యు డుదకముల నెత్తికొని పోవ యడుసు మిగిలిన మడువులందు పండుకొన్నవి. ఇదుగో ఈ చాతకము (తృష్ణార్తయై) దప్పికకు నుడిసి తోయ పానార్థియై (నీరు ద్రావ గోరి) తృష్ణార్తుడనైని (యామె వంక నాస పుట్టుకొనిన) అధర పాదార్థియైన నావలె నూరక యాకసము వంక జూచుచున్నది. ఇల్లిదె కుంజరములు తాపమున నుడికి తొండములందుండి యరలు జలములం దమ్ము దాము తడుపుకొనుచు పద్మినీ ఖలడములకై (తామర తూడులకు లేదా తామర మడుపులకు) పోవుచున్నవి. కొన్ని యేనుగులు పెద్ద మ్రాకుల నీడకు జేరి మరి మరి తొండములం దుంపురుల విసలించుచు నీ మధ్యాహ్న వేళ తాపమును వారించు కొనుచున్నవి. ఇవిగో పక్షి కిలకిలలు. మధ్యాహ్న సమయ తాపమును వారించుకొనుటకు కొమ్మల లోలోని యాకుల గుబురుల దూరి యున్నవి. మృగముల (లేళ్ళ) మంద లల్లదిగో మేతలు మాది యిమ్మాహా వనమగదు చక్రాంతడూలు ఎరుపెక్కి (దక్తాంత చక్రాః) మరి మరి నెమరు వేయుచు జెట్ల నీడలందు నిలిచినవి. నా వల్లభ నల్లల్ల విజనమై నెదకి వెదకి మొల్లబోయితిని (అలసితిని) ఇప్పుడి శిరీషము (దిరిసెన) నీడ విశ్రమింతును. ఈ తరువు కుసుమము లామె మేని వలె సుకుమారములుగా నున్నవి. ఈ వృక్షమతి రమ్యము. నా మనస్సులు హృదయము నానందింప జేయ గలదే. కాని యామె విడ సేయబడిన సన్నిది యిప్పుడెంతేని బాధ పుట్టుచున్నది. సహస్త్ర కిరణుడస్తమించినాడు. సుదొరుణ రాత్రి వచ్చినది. ఈ పెద్ద మఱ్చట్టు నీడ నీరేయి నూర్వశి భాగ్య సమృద్ధిం సమకూర్ప బడినది నన్ను నిక్కముగా నెరుంగును. కాని యీ నా యవస్థ నిప్పుడు నా పేర బూనవద మేదియు నెరుంగదు. ఓ నిద్రా! నా కన్నులం బొందుము. శుభానను నా మనసు నుల్లాసముం బెంపొందించు నా సౌమ్యను (మంచి దానిని) నా సుందరిని గలలో నైన నిక్కముగ తిలకింతును. మున్నామె నెమ్మోమున చంద్రుడిపుడభ్యుదయ మొంది నాకెంత బాధ కల్గించు చున్నాడు ! మున్నామె నెమ్మోముచే నోడింపబడి యిప్పడు నాపై కసి దీర్చుకొను చున్నాడు. ఓ చందమామా! ఆమె కెడమయి యిప్పుడు నీతో సనాథమయిన నీచే సనాదమైన అనగా ఇప్పుడు నీవే స్వామివై నీవేదిక్కయి యున్న యీ దేహమును నీయిష్టము వచ్చినట్లు వేధింపుము. దానియెడ సాపత్న్యమును (సవతి తనమును) చూపింపుము. అయ్యో! హతుడనైతిని. ఊర్వశీ నే వినష్టుడనైతిని. నీ పౌత్రునియందు (నీ కొడుకు బిడ్డనైన నాయందు) దయగోనుము (జాలిగొనుము) నా ప్రియురాలిం జూపింపుము. ఓ శశాంకా ! ఓ శీతాంశూ! మానవుల దృష్టిని మనమును హరించు వాడ! నీకై యాక్రందించు చున్నాను (గోల పెట్టు చున్నాను). నాకా యీర్వశిం గానిపింపుము. అమృతము వంటి ఆమె అధర రస మెప్పడు నే గ్రోలెదను? కమలోదరమట్లు అరుణారుణ ప్రఢ గులుకు మేని దానిం దానిని మరల యెప్పుడు గాంతును. తామర తూడుల కెనయగు బాహువులు పద్మమున కీడగు మొగము నల్లగలువల తులతూగు కన్నులు గల నిజ వల్లభ నే నెన్న డాలింగనమొనరించికొని యీ యనంగ తాపమును బాసెదను. ఓ బాలికా! అసమ శర శరాహతుడగు నా కీవు గతివిగమ్ము. ఓ సుభ్రు! కామ మోహము బట్టిన నాకు నీవే గతి వయితివి. ఓ సుందరీ! ఓ పుణ్యాత్మురాలా ! నీవ యిప్పుడును గతివి గమ్ము. ఈ యొక్క రేయి నాకు నూరేండ్లట్లు పెరిగినది. నాపై జాలిలేని యా లేమను వెదకుట కెక్కడకు బోదును. కలలోనైన నెవ్వతె కోపమే నెరుంగ నట్టి సుందరి దైవోపహతుడ నగు నన్ను విడిచి వెళ్ళినది. అని యిట్లా రాజు విలపించుచు నాహారముముట్టక నిట్టట్టు దిరుగుచు బ్రండ్రెండు రోజులకు కురుక్షేత్రమును జేరెను. తామర పూవులచే శోభించు పుష్కరిని యొడ్డునంగల జువ్వి చెట్టు క్రింద నలసి యాకలి దప్పికల సొలసి కూర్చుండి యట కూడ మదనునికి లొంగి దప్పిక సడలి చంద్రుని కెనయైన కాంతి గల యాకాంత మ్రోల నవ్వును గులుకు నా చారులోచన నెమ్మోమియల్లన నెత్తి యయ్యధరమ్ము నతి కష్టము మీద లానించిన మంచినీటిం బాటసారి యట్లెప్పుడో క్రోలుతును గద యని విలపించెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండము నందు పురూరవవిరహవర్ణనమను నూటముప్పదిఐదవ అధ్యాయము