Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటముప్పదియేడవ అధ్యాయము - పురూరవ స్వర్గప్రాప్తి మార్కండేయ ఉవాచ : తతః సస్వపురం ప్రాప్య చాగ్న్యపాసన తత్పరః |
ఈజేబహువిధైర్యజ్ఞైః ప్రజా ధర్మేణ పాలయన్ ||
1 అశ్వమేధశ##తైరిష్ట్వా వా జపేయైః సహస్రశః | అగ్నిష్టొమై శ్చాతిరాత్రై ర్ద్వాదశాహైః పునః పునః ||
2 సప్తద్వీపసముద్రాయాం పృధివ్యామేకరాడ్ బభౌ | అమానుషైర్వృతః సత్త్వైః స విజిగ్యేమహీతలమ్ ||
3 దుర్భిక్షంమరణం వ్యాధిర్నాభవత్క స్యచిత్క్వచిత్ | సర్వోధర్మపరోలోకః సర్వ ఏవసుభీజనః ||
4 సర్వేచైవ సమృద్ధార్థాస్తస్మిఞ్జన పదేశ్వరే | నాసీత్పశువధార్హాణాం వధస్తస్మిన్ పృథాతదా ||
5 సర్వభూతాని రాజానం భావేనోపగతాని తమ్ | సర్వస్యచ జనన్యాసీత్సరాజా పితృసంనిభః || 6 దృష్ట్వాతంభూపతింస్వప్నే ప్రసీదంతి జనా స్తదా | యత్యదానిర్యా సౌ రాజాచతురంగబలాన్వితః || 7 గృహచర్యారతా నార్యస్తదా పశ్యంతి తంసదా | పుషై#్పశ్చందనధూపైశ్చ తధైవ వికిరంతి తమ్ | 8 ఉర్వశీ కృతపుణ్యాసా దేవీనారాయణాత్మజా | యయాక్రీడి తమస్యాంకే వదంత్యేవంచ యోషితః || 9 అయ మాయాత్యసౌ రాజా యదాశృణ్వంతియోషితః | గృహకార్యాణ్యపి త్యక్త్వా తదా యాంతి గవాక్షకాన్ || 10 అభ్రాణిశారదానీవబహు చంద్రాణి యోషితామ్ | ముఖైరాజంతి వేశ్మాని నిర్యాతే పృధివీశ్వరే || 11 యానపశ్యతితం యాంతం సాతం జ్ఞాత్వాతిరోహితమ్ | ముషితం చైవ సా೭೭త్మానం లేత్తినిందతి సాఛృశమ్ || 12 యాచపశ్యతితం యాంతం కందర్పసదృశంనృపమ్ | తద్గతేన హ్భదాసా೭పిశూన్యాతిష్ఠతి వేశ్మని || 13 యదాయజతియజ్ఞెశ్చ తదాశూన్యావసుంధరా | సర్వాభవతి రాజాన్యం తతా గచ్ఛజనః || 14 యశ్చయాతిజనస్తస్య యజ్ఞేరాజ్ఞో మహాత్మనః | కిమిచ్ఛక్తెస్తదారాజ్ఞా సర్వః సంపూజ్యతేతదా || 15 సభాసంస్థన్యవైరాజ్ఞః ప్రతీహారో దినేదినే | ఉద్ఘోషయతికార్యార్థీ తస్యరాజ్యే కధంచన || 16 ఇత్యేవం శాసతోరాజ్యం గతఃకాలోమహీపతేః | సకదాచిద్ద్విజానాహ దర్శయధ్వంసు మోర్వశీమ్ || 17 ద్రక్ష్యసే తాంస్వయం రాజన్‌నవయం దర్శయామహే | తతస్తే షాంధనేలోభంచ కామనిపీడితః|| 18 మార్కండేయుడనియె. అటుపై పురూరవుడు తన పురమునుజేరి త్రేతాగ్యుపాసన తత్పరుడై ప్రజలను ధర్మముగ పాలించుచు పలువిధములైన యజ్ఞములుగావించెను. అనేక శతాశ్వమేధములు వాజపేయసహస్రములు పండ్రెండురోజులదీక్షగల అగ్నిష్టోమాతి రాత్రములు మరల మరల గావించి సప్తద్వీప వసుంధర కేకచ్ఛత్రాధిపతియై విలసించెను. అమానుష సత్వ సంపన్నుడై మహీమండలమెల్ల జయించెను. దుర్భిక్షము మరణము వ్యాధి యెవ్వనికినిలేకుండెను. సర్వలోకము ధర్మవరమై సర్వజనముసుఖించెను. అతడు రాజ్యాధిపతియైనతరి నందరు సర్వార్థ సమృద్థులై యుండిరి. అతని రాజ్యమున వ్యథా పశువధ లేదు. ఆ ఱని నెల్లభుతము లాశ్రయించికొని యుండెను. ఎల్ల జనమునకాతడు తండ్రివలె నుండెను. ఆయ్యెడ నాతనిం గలలో గని జనులు ప్రసన్న మనస్కులగుచుండిరి. చతురంగ జలములతో నతడు పురము వెడలుతరి నింటిపనుల నిరుకువడియుం బడతులాతనిపై పూవులను చందనోదకములను ధూపముల వెదజల్లుచుండిరి. నారాయణుని గన్నకూతురు ఊర్వశి యీతని యొడిలో క్రీడింప నెంతపుణ్యము సేసికొన్నదని పురాంగన లొండొరులతో చెప్పికొనుచుండిరి. ఇడుగో రాజు వచ్చుచున్నాడని విని మానిను లింటిపనులు గూడ మని గవాక్షముల చెంతకు బరువులిడి యా దొరం దిలకించు చుండుట అనేక చంద్రబింబములతోడి శారదాకాశములో యన నాతనిం జూచు వేడుక గొన్న సుందరుల నగుమొగములతో నా నగరమందలి మందిరము లింపొందుదుండును. రాజవీధి నతడు దాటి కనుమరుగువడెనని తెలిసి యక్కలికి దానేమో దొంగతనము సేసికొన్నట్లనుకొని తన్ను దా నిందించుకొనును. కందర్పుడట్లు సుందరుడగు నతడూరేగుచుండ గని యతనిపై మనసుపడి యింట శూన్యయై ఏమియు తోచక బెంబేలు పడి నిలుచును, అతడు యజ్ఞము లెప్పుడు సేయునప్పుడాతని సన్నిధికి జనేమెల్ల నయ్యెడ వసుంధర యెల్ల శూన్య మయ్యెను. అనగా నతని రాజ్యమందలి ప్రజలాబాలగోపాలముగ నీతని యజ్ఞ వైభవమును జూడముచ్చట గల్గి యుండిరన్నమాట. అమ్మహాత్ముని యజ్ఞమున జనమేదికోరి వెళ్ళినను నతడు వారి వారి నది యిచ్చి సత్కరించు చుండెను. దిన దినము నతడు సభ నలంకరించినతరి నాతని ప్రతిహారి యెవరెవరి పనులేమని యాతని రాజ్యమునందలి ప్రజలకు జాటించు చుండెను. ఇట్లు ప్రజారంజనముగ నారాజు పరిపాలనము సేయ బహుకాలము గడచెను. హ్రియమాణధనే విపై#్రః శప్తః పంచత్వమాగతః | జీవితశ్చాపరైర్విపై#్రర్గతరోషైర్మహీవతిః || 19 ఆత్మానం గర్హయిత్వా೭సౌ లబ్ధ సంజ్ఞో మహీపతిః | అయుం రాజ్యే೭భిషిచ్యైప ప్రతిష్ఠాన పురేస్వకే || 20 సాగ్నిహోత్ర స్తతోరాజా య¸°నారాయణాశ్రమమ్ | తస్వాశ్రమేతపశ్చక్రే రాజా సంవత్సరత్రయమ్ || 21 తతోనారాయణః ప్రాహతంనృపం తవసి స్థితమ్ | అద్య ప్రాప్స్యసి తాం రాజన్ ! యత్కృతేపరితప్యసే || 22 సశరీరో೭ద్యగంతా೭సిత్రి దివం రాజసత్తమ! | ఏవంద్విజేంద్రే వదతి విమానం ప్రత్యదృశ్యత || 23 ఉర్వశ్యధిష్ఠితం రమ్యం గంధర్వైశ్చసహస్రశః | యస్మిన్యుక్తంతురంగాణాం సహస్రం చంద్రవర్చసామ్ || 24 విమానాదవరుహ్యాథ గంధర్వాప్పరసాంగణాః | ఉర్వశీచవవందైన మృషిం జ్వలనతేజసమ్ || 25 అనుజ్ఞాతో೭థఋషిణా తదారాజా వురూరవాః | కృత్వాగ్నిహోత్రమాత్మస్థం విమానంతం సమాస్ధితః || 26 ఋషింప్రదక్షీణీకృత్య త్రి తివం సనృపోగతః | సశరీరో నృపః స్వర్గం తదాప్రాప్య సుదుర్లభమ్ || 27 శ##క్రేణాభ్యర్చితః కాలే విజహార యధాసుఖమ్ | దేవోద్యానేషు సర్వేషు ఉర్వశ్యాసమితస్తదా || 28 నాసౌవియుజ్యతే సాక్ష్కాదాచిదపి పార్థివః | అమావస్యామమావస్యాం నియతం చంద్రబాస్కరౌ || 29 ద్రష్టుంయాతౌమహీపాల మేకరాశిగతంసదా | ఉర్వశ్యాసహితం పౌత్రం యదాపశ్యతిచంద్రమాః || 30 తదాసుధారసందేవః స్నేహాత్ర్పవతి మానద! | సుధామృతరసం తంచ పిబంతిపితరఃసదా || 31 శ్రాద్ధకాలస్తదాప్యుక్తో నృణాం నృపవరోత్తమ! తదాశ్రాద్ధంహియర్దత్తం సుధారసవిమిశ్రితమ్ || 32 తదశ్నంతి మహీపాల! పితరో೭మృత సన్నిభమ్ | అమావస్యామమావస్యాం తదాశ్రాద్ధం ప్రయత్నతః || 33 కురుష్వ భూమిపశ్రేష్ఠ! సర్వాన్కామానవాప్స్యపి | యే೭పిశ్రాద్ధం కరిష్యంతి తదాచా೭వ్వేనరాధిప! || 34 తేషామాయుర్యశః సౌఖ్యం దాస్యంతి ప్రపితామహాః | దేవకార్యా దపిశ్రేష్ఠం పితృకార్యంప్రచక్షతే || 35 పితరోనామరాజేంద్ర! దేవానామపిదేవతాః | రాజ్యకామః స్వర్గకామః పుష్టికౌమ స్త ధైవచ || 36 పితౄవ్సంతర్పయే చ్ర్ఛాద్ధే చంద్రసూర్యసనూగమే | వసంతి సతతంరాజన్! పితరశ్చంద్రమండలే || 37 తేషాంమాసమహోరాత్రం విభాగంతత్రమేశృణు | కృష్ణపక్షాష్టమీమధ్యే తేషాముదయతే రవిః || 38 శుక్లాష్టమ్యాం తధైవాస్తం తేషాంయాతిదివాకర | అమావస్యాతదాతేషాం మధ్యాహ్నంజాయతేనృప! || తస్మాచ్చ్రాద్ధాని దేయానితస్మిన్కా తేప్రయత్నతః | ఏతావదుక్తం నృపవర్య! తస్య ధర్మాత్మజస్యాప్రతిమస్యవృత్తమ్ | ధన్యం యశస్యం రిపునాశనంచ సౌభాగ్యదం పావహరం సుఖంచ || 40 ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే పురూరవసః స్వర్గప్రాప్తిర్నామ సప్తత్రింశదుత్తర శతయోధ్యాయః అతడొకప్పుడు నాకూర్వశిం జూపింపుడని ద్విజులతోననెను. రాజా! నీవు స్వయముగా నామెం జూడగలవు. మేము చూపింపమని వారనిరి. కామవశుడైన కతన నా నృపతి వారికి ధనాశ గల్పించెను. ధనములట్లు హరించుకొనిపోవుచు నది చాలక యతృప్తిచేతనో మరియేమో వైమనస్యమున వారిచే శపింపబడి ప్రాణములువాసి మరికొందరు రోషములేని మహానుభావులచే బ్రతికింప బడెను. [''యాచకన్య యాచకశ్శత్రుః'' అను న్యాయమున నొకనికి సత్కారము బాగుగ జరిగినది. నాకు జరుగలేదని యసూయ ఈర్ష్యగలవా రుద్రిక్తులై యజమానునెడ వైరము గొనుట లోక స్వభావ మన్నమాట.] అతడట్లు తెలివి వచ్చి తనను దానిందించుకొని కుమారుని రాజ్యాభిషిక్తుం గావించి యగ్నిహోత్రములతో నాభూపతి నారాయణాశ్రమమునకేగి యచ్చట మూడేండ్లు తపస్సు చేసెను. ఆతనితో నప్పుడు నారాయణుడు దేనికై నీవుపరితపించు చున్నావో ఆమె నిప్పుడు పొందెదవు. రాజోత్తమా! శరీరములో నీనిపుడు స్వర్గమునకేగుదువు. ఇట్లా ద్విజోత్తముడనుచుండగనే ఊర్వశి యోక్కి వచ్చిన రమణీయవిమాన మాయెదుటగనబడెను. అందు వేలకొలది గంధర్వులూర్వశితో పాటు కూర్చుండియుండిరి. చంద్రప్రభములైన వేయిగుఱ్ఱము లావిమానమును వహించుచుండెను. అవ్వల నావిమాన ముందిగి గంధర్వాప్సరో గణములు ఊర్వశియును నగ్నివలె వెలుంగు నీనారాయణునికి వందనము సేసిరి. అవ్వల ఋషియనుజ్ఞగొని పురూరవో నృపతియగ్నిహోత్రమును ఆత్మారోపణముసేసికొని యావిమానమెక్కెను. దాన నారాయణ ఋషికి బ్రదక్షిణము సేసి సుదుర్లభ##మైన త్రిదివమును(స్వర్గమును) నశరీరముగబొంది యింద్రునిచే మిగులనర్చింపబడి యనేకకాలము యథాసుఖముగ సర్వసుపర్వోద్యానము లందు నూర్వశిం గూడి యయ్యెడ విహరించెను. ఆ పార్థివు డొక్కపుడేని యామెను విడిచి యుండలేదు. అమావాస్య యామావాస్యకు సూర్య చంద్రులు నియతముగా నేకరాశి యందుండి యాతనిం దర్శింప నేగుచుండిరి. ఊర్వశీ యుక్తుడైన మనుమని (పౌత్రుని) నెప్పుడు సూచు నపుడా దేవుడు చంద్రుడు వాత్సల్యముచే నమృతరసము స్రవించును. ఆ అమృత రసమును స్వధాకరా భరితయైన దానిని పితృదేవత లెల్లపుడు ద్రాపుచుందురు. అపుడు మానవులకది శ్రాద్ధకాలమున గలిసివచ్చును. సుధారస విమిశ్రితముగ నా యీయబడిన శ్రాద్ధము అమృత ప్రాయముగ పితృదేవత లారగింతురు. ఓ భూమిపశ్రేష్ఠా ! ప్రతియమావాస్యకు నీవు శ్రాద్ధమునిర్వర్తింపు మెల్లకామములం బడయుదువు. ఇంక నెవ్వరేని యీ యమావాస్య శ్రాద్ధమును సేయుదురు వారికాయుర్దాయమును సౌఖ్యమును బితామహులను గ్రహింతురు. పితృకార్యము దేవకార్యము కంటెను మిద్నయని చెప్పుదురు. పితరులనగా దేవతలకు గూడ దేవతలు. రాజ్యకాముడు స్వర్గకాముడు పుష్టికాముడును చంద్రసూర్య సంగమమందు (అమావాస్య - యందు) శ్రాద్ధము పెట్టి యందు పితృదేవతలను సంతర్పితులం జేయవలెను. పితృదేవత లెల్లపుడు చంద్రమండలమునందు వసింతురు. వారికి మాసము అహోరాత్రము నను వాని విభాగము విషయము వినుము. కృష్ణపక్షాష్ట మీతిథి మధ్యమందు వారికి సూర్యుడుదయించును. శుక్ల పక్షాష్టమి నాడస్తమించును. అనగానమావాస్య వారికి మధ్యాహ్న కాలమగును. కావున నా కాలమున వారికి ప్రయత్న పూర్వకముగ శ్రాద్ధము పెట్టవలయును. ఓ నృపాగ్రాణీ! ఆ ధర్మ సుతుడగు పురూరవ శ్చక్రవర్తి చరిత్ర యింతదాక చెప్పబడినది. ఇది ధన్యత్వసంసాదకము, యశస్యము (యశస్కరము) శత్రునాశకము, సౌభాగ్యదము, పాపహరము సుఖకరమును. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున పురూరవుని స్వర్గప్రాప్తియను నూట ముప్పది యేడవ అధ్యాయము.