Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూట ముప్పదియెనిమిదవ అధ్యాయము - స్వర్గనరకపితృసమాప్యాయనవర్ణనము

వజ్రుఉవాచ : వర్తంతేపితరః స్వర్గేకేషాంచిన్నరకేతథా నరకస్థాః ఫలం దాతుం కథంశక్తా వదస్వమే || 1

మార్కండేయ ఉవాచ : పితౄణాంతుగణాః సప్తనామత స్తాన్నిబొధ మే |

త్రయోమూర్తి మతశ్చైషాంచత్వారశ్చసమూర్తయః || 2

సుభాసురాబర్హిషదోగ్ని ష్వాత్తా స్తథైవచ | త్రయోమూర్తి మతశ్చైషాంచత్వారశ్చాప్యమూర్తయః || 3

క్రవ్యాదాశ్చోపహూతాశ్చ ఆజ్యపాశ్చసుకాలినః | మూర్తిమంతః పితృగణాశ్చత్వారశ్చ ప్రకీర్తితాః || 4

సుభాసురా బ్రహ్మసుతాః సోమ మాప్యాయయంతి యే | బ్రహ్మలోకచరా రాజన్‌! నిత్యం మూర్తివివర్జితాః || 5

తథాబర్హిషదోనామ రాజపుత్త్రా మరీచినః | ఆప్యాయయంతితేదేవాన్‌ లోకే సోమవదేస్థితాః || 6

విభ్రాజలోకే తిష్ఠంతి అగ్నిష్వాత్తా నరాధిప! | పులస్త్య స్య ఋషేః పుత్రాభావయంతి జగంతి తే || 7

దానవా న్యక్ష గంధర్వాన్‌ పిశాచోరగ రాక్షసాన్‌ | దైత్యాన్భూత పిశాచాంశ్చవిద్యాధర గణాం స్తథా || 8

నాగాన్సర్పాన్సు పర్ణాంశ్చ పర్వతాన్సరిత స్తథా | క్రవ్యాదాంశ్చో వహూతాంశ్చ ఆజ్యపాంశ్చసుకాలినః || 9

బ్రాహ్మణాన్‌ క్షత్రియాన్వైశ్యా న్భావయంత్యంత్యజాం స్తథా | కవేరాంగిరసశ్చైవ కర్దమస్యప్రజాపతేః || 10

వసిష్ఠస్యతథా పుత్త్రాః క్రమేణౖతే ప్రకీర్తితాః | జ్యోతిర్భాసః స్మృతాలోకే యేచలోకా మరీచినః || 11

తేజస్మినోమానసాశ్చ క్రమేణౖతే ప్రకీర్తితాః | ఏతేశ్రాద్ధస్యభోక్తారో విశ్వేదేవైః సదాసహ || 12

ఏతేశ్రాద్ధం సదాభక్త్వా పితౄన్సంతర్ప యన్యతః | యత్రక్వచన ధర్మజ్ఞ! వర్తమానాహియోగతః || 13

ఏతేచపుష్ట్యా వినియోజయంతి శ్రాద్ధస్యదాతార మదీన సత్త్వాః |

తృప్తాస్తథైతే వినియోజయంతి దాతుఃపితౄన్‌ సర్వగతాన్‌ మహీవ! 14

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మర్కండేయ వజ్రసంవాదే పితృస్వర్గనరక నివాసహేతు నిర్ణయోనామ అష్టత్రింశదుత్తర శతతమోధ్యాయః

వజ్రప్రభువు కొందరి పితరులు స్వర్గమందు వసింతురు. కొందరి పితృవర్గము నరక మందుందురు. నరకమందున్న పితరులు ఫలము నెట్లీయ గలరు? ఇది నాకు వచింపుమన మార్కండేయుడనియె. పితరులు గణములు ఏడు. వేర్వేర నవి వినుము. ఇందు మూడు గణములు అమూర్తిమంతములు. నాల్గు మూర్తిమంతములు. సుభాసుర - బర్హిషద-అగ్నిష్వాత్తులను మూడు గణముల వారు అమూర్తులు. క్రవ్యాదులు ఉపహూతులు అజ్యపులు సుకాలులు నను పితరులు నాలుగు గణముల వారు మూర్తిమంతులు. ఆమూర్తులు లయిన సుభాసురులనువారు బ్రహ్మ సుతులు. బ్రహ్మ లోకమందు సంచరింతురు. సోముని (చంద్రుని) పానము సేయుదురు. వీరికి మూర్తి (ఆకారము) లేదు. బర్హిషదులు రాజపుత్రులు. మరీచులు అనువారు చంద్ర స్థానమున నుండి లోకమందలి దేవతలను అప్యాయనము సేయుదురు. వీరును ఆమూర్తులే. అగ్నిష్వాత్తులను పితరులు పులస్త్య ఋషి పుత్రులు. విభ్రాజ లోకమందు వసించువారు. జగమ్ములను భావింతురు. అప్యాయన మొనరింతురు. వీరును మూర్తిలేని వారే. ఇక మూర్తిమంతులయిన నాల్గు పితృగణములకు జెందినవారు క్రవ్యాదులు ఉపహూతులు అజ్యపులు సుకాలులు ననువారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను అంత్యజులను భావన సేయుదురు. అప్యాయితులం గావింతురు. ఈ నల్గురు వరుసగా కవియొక్క (శుక్రునియొక్క) అంగిరస్సుయొక్క కర్దమ ప్రజాపతి యొక్క వశిష్ఠుని యొక్క పుత్రులు - వీరిలోక ములు వరుసగా జ్యోతిర్భాసనులు మరీచులు తేజస్వులు మానసములు నని పేర్కొనబడినవి. ఈపితృగణము వారెల్లరు విశ్వేదేవులతోగలసి శ్రాద్ధము నారగింతురు. వీరు శ్రాద్ధమును భూజించి పితరులను సంతర్పింప జేయుదురు. సంతృప్తులను గావింతురన్న మాట. ఓ ధర్మజ్ఞా! వజ్రనృపతీ ! యోగశక్తిచే నెక్కడనైన వర్తింపగలవారై మహాసత్త్వ సంపన్నులైన వీరు శ్రాద్ధదాతకు పుష్టిని సమకూర్తురు. అంతేకాదు తాము తృప్తులయి శ్రాద్ధదాత యొక్క పితరులను (పితృపితామహ ప్రపితామహులను) వారేలోక మందున్నను వారినందరిని సంతృప్తులం గావింతురు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమునందు స్వర్గనరక నివాసి పితృసమాప్యాయన వర్ణనమను నూట ముప్పది యెనిమిదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters