Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటనలుబదియొకటవ అధ్యాయము - శ్రాద్ధ హవిర్ద్రవ్య నిరూపణము వజ్రఉవాచ : కస్మిన్‌దేశే కర్తవ్యం శ్రాద్ధంభృగుకులోద్వహ! | కించదేయ మదేయంచ తన్మేబ్రూహిద్విజోత్తమ!
1 మార్కండేయ ఉవాచ : త్రిశంకుంవర్జయేద్దేశం సర్వంద్వాదశ యోజనమ్ | ఉత్తరేణ పతంగస్య దక్షిణనచ కైకటమ్ || దేశ##సై#్రశంకవోనామ వివర్జ్యః శ్రాద్ధకర్మణి | కారస్కరాః కలింగాశ్చ సింధోరుత్తరమేవచ || 3 చాతుర్వర్ణ్వవిహీనాశ్చ యేచ దేశా నరాధిప! | అన్యేష్వ పిచదేశేషు తద్దేశ జనదర్శనమ్ || 4 వర్జయేచ్రాద్ధకాలేతు పతితానాం విశేషతః | రజస్వలాశ్చ షండాశ్చ శ్వానసూకరకుక్కుటాః || 5 యథాశ్రాద్ధంనపశ్యన్తి తథాకార్యం విజానతా | రక్షార్థం చాప్యథై తేషాం గుప్తిఃకార్యానరేశ్వర || 6 తిలావికిరణం కార్యంయాతుధాన వినాశనమ్ | పిండాంశ్చగో೭జ విప్రేభ్యో దద్యాదగ్నావథక్షిపేత్ || 7 మధ్యమంపుత్ర కామావా పత్నీ పిండంచ భక్షయేత్ | తీర్థశ్రాద్ధేతధా పిండాన్ క్షిపే త్తీర్థే విచక్షణః || 8 దక్షిణాభిముఖోభూత్వాపైత్రీ దిక్సా ప్రకీర్తితా | పిండనిర్వపణం కార్యం కుశాలాభే విచక్షణౖః || 9 కుశేషురాజ న్సర్వేషు పవిత్రేతేపరేమతే | సూత్రం ప్రదేయం వాసో೭ర్థేక్షౌమ కార్పాససంభవమ్ || 10 దశాం వివర్జయేత్ర్పాజ్ఞో యద్యప్య హతవస్త్రజామ్| క్షౌమకార్పా సజం త్యక్త్వావస్త్రమన్యత్ర్ప దాపయేత్ || 11 ఘృతేన దీపోదాతవ్య స్త్వథ వా ప్యౌషధీరసైః | వసామేదోద్భవందీపం ప్రయత్నేన వివర్జయేత్ || 12 చందనాగురు కర్పూర కుంకుమాంశ్చ ప్రదాపయేత్ | అశ్వమేధ సమాహ్యేతే పితౄణామనులేపనాః || 13 నదాతవ్యం మనుష్యేంద్ర ! యదస్యచ్చాను లేపనమ్ | ధూపోగుగ్గులుజోదేయ స్తథాచందనసారజమ్ || 14 అగురుంచ సకర్పూరం తురుష్కంచ ప్రదాపయేత్ | అతో೭న్యదపి ధూపార్థేయత్కించిత్త ద్వివర్జయేత్ || 15 సఘృతం గుగ్గులుంధూపం ధూపార్థేయః ప్రయచ్ఛతి | అశ్వమేధఫలం తస్యధూపదాతు స్తథైవచ || 16 జాత్యశ్చ సర్వా దాతవ్యా మల్లికాశ్వేతయూథికా | జలోద్భవాని సర్వాణి కుసుమాని వివర్జయేత్ || 17 యానికంటకిజాతాని నదేయానినరాధిప! | యానికంటకి తాగ్రాణి శుక్లాని సురభీణిచ || 18 తానిరాజేంద్రా! దేయానిలతాజాని విశేషతః | రక్తా నిజలజాతాని తథాదేయాని యాదవ! || 19 విపులాంశ్రియ మాప్నోతి పితౄన్పుషై#్పః సమర్చయన్ | వజ్రుండు భృగువంశ భూషణా ! ఏ దేశమందు శ్రాద్ధము పెట్టవలయు నే ద్రవ్య మీయదగినది యేది యీయగూడనిది అనతిమ్మన మార్కండేయుడనియె. శ్రాద్ధకర్మమందుత్రిశంకుదేశమును పండ్రెండామడమేరవర్జింపవలెను. పతంగమునకు నుత్తరమున కైకటము దక్షిణమున ననునవిహద్దులుగా గలదేశమును త్రైశంకవమని యందురు. కారస్కరములు కలింగములు సింధునది కుత్తర ప్రదేశము చాతుర్వర్ణ్య వ్యవస్థ లేని మరి యితర దేశములను నా యా దేశముల జనములను జూచుటయు శ్రాద్ధకామందునిషిద్దములు విశేషించి పతితులు (జాతి కుల భ్రష్టులు) రజస్వలలు షండులు (నపుంసకులు) కుక్కలు పందులు కోళ్ళు శ్రాద్ధమును జూడకుండు నట్లు సేయవలెను. వీని వలని రక్షణకు గుప్తి చేయనగును. గుప్పెడు తిలలను జల్లవలయును. అది రక్షో వినాశకరము. శ్రాద్ధ పిండములను గోవులకు మేకలకు బ్రాహ్మణునకు పెట్టవచ్చును. అగ్నియందు వేయవచ్చును. పుత్రకామయైన స్త్రీ మధ్యపిండము దినవచ్చును. తీర్థశ్రాద్ధము నందెపుడును పిండములను తీర్థమందే వేయవలెను. పిండనిర్వపణము దక్షిణాభి ముఖుడై సేయవలెను. ఆ దిక్కు పితృదేవతల దిక్కని కీర్తింప బడినది. కుశలు లభింపనపుడు తెలిసినవాడు దక్షిణాభి ముఖుడగుట విధింప బడినది. కుశలు దక్షిణ దిక్కు అనునవి రెండును పరమపవిత్రములని చెప్పబడినవి. వస్త్రార్థము సూత్ర (బద్దె) మీయవలెను. అది క్షౌమము(పట్టు) కార్పాసము దూదిది పనికిరాదు. అహత వస్త్రమందున్నను క్రొత్తదైనను నా వస్త్రమున కంచు (దశ) ఉండగూడదు. ఆవునేతి దీపముపెట్టవలెను. లేదా ఓషధీ రసములతో నైన బెట్టవచ్చును. వస మేదస్సు (కొవ్వు) అను వానితో దీపము పనికిరాదు. చందనము అగరు కర్పూరము కుంకుమపువ్వు ననునివి అశ్వమేధముతో సమానమైనవి పితృదేవతల కర్హములైన యనులేపనములు. ఇంతకుమించి యేవస్తువైన పనికిరాదు. గుగ్గులు ధూపము చందనసారముచే నైనది. ధూపము - అశ్వమేథ ఫలప్రదము అన్ని జాతులు (జాజిపువ్వులును) మల్లెలు శ్వేతయూథికలు (తెల్లమొల్లలు) నీయవలెను. నీటిలోబుట్టిన పువ్వు లేవియు పనికిరావు. ముండ్లచెట్ల పువ్వులు పనికిరావు. అగ్రమందు ముళ్ళున్నవి. (గులాబీల వంటివి) తెల్లనివి పరిమళము గలవియుం బనికివచ్చును తీగల బూచిన యెఱ్ఱపువ్వులు ప్రశస్తములు. నీటబుట్టిన ఎఱ్ఱదామరలు కూడ శ్రేష్ఠములే. పితరులను బూవుల నర్చించిన విపులమైన యైశ్వర్యము నొందును. అభక్ష్యాణి వివర్జ్యాని శ్రాద్ధే నిత్య మతంద్రితైః || 20 భ##క్ష్యేష్వపి నదేయాని యాని తానినిభోధమే | భూస్తృణం సుముకం శిగ్రుం పాలక్యం తుండులీయకమ్ || 21 కూష్మాండాలాబు వృంతాక పిప్పలీమరిచానిచ | శ్రాద్ధేషునాగరం దేయం లవణం సైంధవంతథా || 22 సైంధవవ్యతిరేకే ణలవణాని సదాపయేత్ నక్తంగృహీతముదకంతథా పల్వలసంభవమ్ || 23 శ్రాద్ధకాలేవివర్జ్యంచ మాహిషం క్షీరయేవచ | రాజమాషమసూరాశ్చ చణకాః కోరదూషకాః || 24 వర్జ్యాశ్చా భిషవోనిత్యం శత పుష్పంగవేధ్రకమ్ | కరంభాణి కుసుంభంచ పటోలం బృహతీఫలమ్ || 25 కరీరసురభీచోభౌ పూతిగంధిచయద్భవేత్ | జంబీరజఫలం వర్జ్యం కోవిదారంచపార్థివ! || 26 వస్తుసందర్శనం శస్తంశ్రాద్ధే నిత్యమరిందమ! | కుతువస్యచసాంనిధ్యం తథాకృష్ణాజినస్యచ || 27 కృష్ణాజినస్యదానంచ రజతస్య విశేషతః | కృష్ణాజినంసకుతపం కృష్ణానిచతిలానిచ || 28 శ్రాద్ధకర్మణిశస్తాని విట్పతిస్త త్పుతస్తథా | సోమః సదై వమాసాంతే రవిణాసహసంగతః || 29 ఆపశ్చైవోషధీశ్చైవ తదావిశతి పార్తివ! | అమాయాంతు పయః పీత్వాభుక్త్వాచై వౌషధీః శుభాః || 30 పయఃక్షరంతి యద్దివ్యం గావో೭మృతరసో పమమ్ | తత్పవిత్రం పరంరాజన్ ! కాపిలంచేద్విశేషతః || 31 హవ్యేకవ్యే చతద్రాజ న్సోమతుల్యం ప్రకీర్తితమ్ | శ్రాద్ధమందభక్ష్యములను విడువవలెను. భక్ష్యములలోగూడ భూస్తృణము=(కర్పూర తృణము) సువాసనగల సుముకము ఒక గడ్డి శిగ్రు=తోటకూర పాలక్యము =పాలకూర జీవంతి తండులీయకము కూష్మాండ (గుమ్మడి) అలాబు (ఆనప) వృంతాక =నీరువంగ పిప్పలీ =పిప్పళ్ళు మరిచములు =మిరియాలను శ్రాద్ధనిషిద్ధములు. నాగరము=శొంఠి, సైంధవలవణము మంచిది. సైంధవ లవణముగాక మరియే లవణములును బనికిరావు. రాత్రి దెచ్చిన నీరు పల్వలములలో (గుంటలలో) నీరు నిషిద్ధము. గేదెపాలు వర్జ్యము. బొబ్బర్లు సెనగలు మసూరములు=చిరుసెనగలు కోరదూషకములు=ఆళ్ళు అనుధాన్యము వర్జ్యములు. అభిషవము = శతపుష్పము=గవేధుకమన అడవిగోధుమలు కరంభములు=అడవి పిప్పలి. కుసుంభము=కుసుంభా పుష్పము పటోలము=పొట్ల బృహతీఫలము - వాకుడు ములగయు, పూతిగంధియు=దుర్వాసనగలదియునగు కరీరము=వెణుతురు సులభి జంబీరఫలము=నిమ్మ కోవిదారము=కాంచనము నిషిద్ధములు. చక్కగా కనిపించు వస్తువు ప్రశస్తము. కుతపకాలము, కృష్ణాజినము కృష్ణాజిన దానము రజత దానము విశేష యోగ్యములు. కుతుపకాలుమతోడి కృష్ణాజినముముడి సాన్నిధ్యము కృష్ణతిలలు మిక్కిలి ప్రశస్తములు. శ్రాద్ధమందు విట్పతి = ఆయనకొడుకు; (మాసాంతమందలి సూర్యునితోడి సోముడు (చంద్రుడు) (ఆమావాస్య యన్నమాట) చాల ప్రశస్త వస్తువులు. ఆనాడు ఉదకములలో ఓషధులలో చంద్రుడు ప్రవేశించును. అమావాస్యయందు శుభములైన ఓషధులం దిని నీరుద్రావి గోవుల అమృతరసోపమానమైన దివ్యక్షీరము నొసంగును. కపిల గోక్షీర మింకను బరమ పవిత్రము. ఆపాలు హవ్యమందు (దేవతల నుద్దేశించు హవిస్సునందు) కవ్యమందు (పితృదేవతల నుద్దేశించి యీయబడు హవిస్సు నందు) నది సోమముతో సమానము. తిలైర్ర్వీహియవైర్మాషై రద్భిర్మూలఫలేనచ || 32 ప్రియంగుభిస్తథాదారైః శృంగాటక ఫలైఃశుభైః | గోధూమైశ్చే క్షుభిర్ముద్గైః సచీనచణకై స్తథా || 33 శ్యామాకైర్హస్తిశ్యామాకై ర్మధూకైర్హకైర్హవ్యదాడిమై | వనసైర్నారికేరైశ్చ ఖర్జూరామ్రఫలై స్తథా || 34 ఆమ్రాతైశ్చామ్రానారంగై ర్బిల్వైర్దీర్ఘైశ్చ మూలకైః | విదార్యానిర్భ రూటైశ్చ విశేషైశ్చవరాటకైః || 35 పిచుకైశ్చతథా కర్దైర్బదరైః కరకందుభిః | పాలేవతై రాష్ట్రకైశ్చ అక్షోటైః వనసైస్తథా || 36 కాకోలైః క్షీరకాకోలై స్తథా పిండాలుకైఃశుభైః | సువర్చలామధూకైశ్చవాస్తుకేనచ పార్థివ! || 37 సితాఖండగుడై ర్ముఖ్యైః ఫణితేనచ సక్తుభిః | లాజాభిశ్చ సధానాభి స్త్రపుసైర్వారుచిర్భటైః || 38 సర్షపారాజశా కాభ్యామింగుదై రాజ జంబుభిః | ప్రియాలానులకైర్ముఖ్యైః ఫల్గుభిశ్చతిలోలకైః || 39 వేత్రాంకురైస్తాలదర్భైశ్చుక్రికాక్షీరి కాధవైః | చోచైః సమీచైర్లకుచైస్తథావై బీజపూరకైః || 40 ఛత్త్రాతిచ్ఛత్రక్షీరాకైః కలండుక కశేరుకైః | సుజాతకైః పద్మఫలైర్భక్ష్యైర్భోజ్యైః సుసంస్కృతైః || 41 రాగషాఢవచోషై#్యశ్చత్రి జాతక సమన్వితైః | దత్తేనమాసం ప్రీయంతే శ్రాద్ధేన పితరోనృణామ్ || 42 ద్వౌమా సౌమత్స్యమాంసేన త్రీన్మాసాన్హరిణనతు | ఔరభ్రేణాథచతురః శాకునేనతుపంచవై || 43 షణ్మాసాన్నాశ##కేనాపి సప్తపారిశ##తేనచ | తథాష్టౌఛాగమాంసేన వయసాపాయసేనచ || 44 వారాహేణనవైవాహూ రౌరవేణ తథా దశ | మాసానేకా దశైవాహుర్గవయేననరాధిప! || 45 సంవత్సరంతు గవ్యేనపయసాపాయసేనచ | పయోవికారైశ్చ తథా హృద్యైశ్చ మనుజేశ్వర! || 46 పానకైశ్చతథాహృద్యై స్త్రిసుగంధైః సుశీతలైః | వార్ధ్రీణసస్యమాంసేన తృప్తిర్ద్వాదశ వార్షికీ || 47 వజ్రఉవాచ : వార్ధ్రీణసమహం బ్రహ్మన్ శ్రోతుమిచ్ఛామి తత్త్వతః | యస్యమాంసేనకథితా తృప్తిర్ద్వాదశవార్షికీ || 48 మార్కండేయ ఉవాచ : త్రిపిబంత్వింద్రియక్షీణం యూథస్యాగ్రసరంతథా | రక్తంవర్ణేన రాజేంద్ర ఛాగం వార్ధ్రీణసం విదుః || 49 కాలశాకాం మహాశల్కం ఖడ్గమాంసం తథైవచ | అనంత్యాయభ##వేద్దత్తం సర్వంచమధుసంయుతమ్ || 50 ఖడ్గావిషాణౖః పరివర్జితామే తేషాంహి మాంసేనభవత్యనన్తమ్ | శ్రాద్ధంమహారాజ! తతః ప్రదేయం ఖడ్గస్యమాంసేనహితాయతేషామ్ || 51 ఇతి శ్రీవిస్ణు ధర్మోత్తర ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శ్రాద్ధహవిర్వర్ణనం నామైకచత్వారింశదుత్తర శతతమో೭ధ్యాయః. తిలలు (నువ్వులు) వ్రీహులు=వడ్లు యవలు ఉదక మూలములు నీటిలోని దుంపలు పండ్లు ప్రియంగువులు =కొఱ్ఱలు దాదములు శృంగాటక ఫలములు = ఒకరకమైనపండ్లు గోధుమలు చెఱకులు పెసలు చీనములు =చీనలను ధాన్యము(?) చణకమలు (సెనగలు) శ్యామాకలు=చామలు హస్తి శ్యామాకమలు = చామలలోరకము మధూకము = ఇప్ప హవ్యదాడిమములు ఖర్జూరములు మామిడి పండ్లు ఆమ్రాతకములు = అంబాళము మామిడి ఆమ్రములు = మామిడిపండ్లు నారంగములు మారేడుపండ్లు దీర్ఘమూలకములు తీగతుమిడి విదారి=తెల్లనేలగుమ్మడి నిర్భరూటములు పరాటకమలు పిచు(క) ములు బర్రెంక కర్దములు బదరములు = రేగు కర్కంధువులు = రేగులోరకము పాలేవతములు రాష్ట్రిక వాకుడు అక్షోటములు = మృదుద్రుమము (ఆక్రూటు) వసనలు కాకోలములు = క్షీరకాకోలములు పిన్నపాల మనుపాల, పిండాలుకములు సువర్చలములు మధూకమలు = ఇప్ప వాస్తుకము = చక్రవర్తికూర సితా = పంచదార ఖండ = కలకండ (పటికబెల్లము) గుడ = బెల్లము ఫణితము సక్తువు = పేలపిండి లాజలు=పేలాలు ధానలు త్రవుస = చేదుదోస వారుచులు = భటములు సర్షప = ఆవాలు, రాజాశాకములు రాజజంబువులు = అల్లొనేరేడు ప్రియాలములు = మోరటి ఆమలకమలు = ఉసిరికాయలు ఫల్గువులు = బొమ్మమేడి (కుక్కమేడి) తిలోలములు వేత్రాంకురములు = వేపచిగుళ్ళు (?) తీలదర్భలు చుక్రిక = చింతపండు క్షీరిక = చిరుపాల ధనములు నోచములు సమీచములు లకుచములు= గజనిమ్మ బీజపూరకములు ఛత్రములు = కొత్తుమిరి చినూప అతిచ్ఛత్రములు = సదాపక్షీరకములు కలండుకమలు= ఒకరకము కూరాకు (గోళి) కశేరుకములు సుజాతకములు పద్మఫలములు సంస్కృతములో=చక్కగా శుచిగా వండిన భోజ్యములు. ఇవిగాక భక్ష్యములు త్రిజాతక సహితములైన రాగషాడబములు చోష్యములు ననువానితో నిడిన శ్రాద్ధముచే పితృదేవత లొక్కనెల తృప్తి పొందుదురు. చేప మాసంముచే రెండు నెలలు, హరిణ (జింక) మాంసముచే మూడు ఔరభ్రమాంసముచే పొట్టేలు మాంసముచే నాల్గు శాకున మాంసముచే నైదు శాశిక మాంసముచే నారు పారిశత మాంసముచే నేడు ఛాగము (మేక) మాంసముచే పాలచే పాయసముచే నెనిమిది వరాహ మాంసముచే తొమ్మిది రురుమాంసముచే పది గవయ మాంసముచే పదునొకండు నెలలు గవ్యములయిని (గోవుయొక్క) పాలు పామసము ఆవుపాలతో దయారగు రకరకాల రుచికరములైన వంటకములచే సంవత్సరము సంతృప్తులగుదురు. త్రిసుగంధ ద్రవ్యమిళితములు (త్రిసుగంధములు - ఏలకులు లవంగాలు జాపత్రి (జాజికాయలు) మిక్కిలి చల్లనివియు నగు రుచిగల పాకములు. సంవత్సరము ప్రీతి నిచ్చును. వార్ధ్రీణస మాంసము పండ్రెండు సంవత్సారల తృప్తి నిచ్చును. అనవిని వజ్రుడు వార్ధ్రీణసమన నేమో విన గుతూహల పడుచున్నానన మార్కండేయుడు - త్రిపిబము ఇంద్రియక్షీణము తన మందకు ముందునడచునది ఎఱ్ఱనిదియునగు ఛాగమును (మేకను) వార్ధ్రీణస మందురు. కాలశాకము మహాశల్కము ఖడ్గమాంసము మధువుతోను (తేనెతో) నిచ్చిన ననంత ఫలమిచ్చును. ఖడ్గమృగములు కొమ్ములులేని వాని మాంసమనంత ఫలదము కాన పితృదేవతల హితముకొరకు తృప్తికి ఖడ్గమాంసముతో శ్రాద్ధము పెట్టవలెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున శ్రాద్ధహవిర్ద్రవ్య నిరూపణమను నూటనలుబదియొకటవ అధ్యాయము.