Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటనలుబదిరెండవ అధ్యాయము - శ్రాద్ధకాల నిరూపణము

వజ్రఉవాచ : 

శ్రాద్ధకాలం సమాచక్ష్వ సర్వధర్మ భృతాంవర | కస్మి న్కాలేకృతే శ్రాద్ధేప్రీయంతేపితరోనృణామ్‌ || 1

మార్కండేయ ఉవాచ :- శ్రాద్ధకాల స్త్వమావస్యాం నిత్యం పార్థవసత్తమ! |

పౌర్ణమాసీతథామాఘీ శ్రావణీచనరోత్తమ: || 2

ప్రోష్ఠపద్యామతీతాయాం తథాకృష్ణ త్రయోదశీ | ఆగ్రహాయణ్య తీతాయాం కృష్ణాస్తి స్రో ష్టకాస్తథా || 3

శాకైశ్చ ప్రథమంకార్యా మాంసైశ్చ తదనంతరం | తృతీయాచతథాపూపైర్నిత్య మేవవిజానతా || 4

అన్వష్టకాసు చస్త్రీణాం శ్రాద్ధంకార్యంతథైవచ | అష్టకావిధినాహుత్వా క్రమేణౖతాస్తు పంచకాః || 5

మాత్రేరాజన్‌ పితామహ్యై శ్రాద్ధంకార్యంయథావిధి | తథై వప్రపితామహ్యై విశ్వేదేవ పురస్సరమ్‌ || 6

పిండనిర్వపణం కార్యం తాసాంచ పితృవన్నృప !| భుక్త వత్సుచ విప్రేషు తత్ర కర్మని బోధమే || 7

ప్రాదేశమాత్రారాజేంద: చతురంగులమాయతాః | తావదేవసముత్సేధాః షట్కర్షూ స్తత్రకారయేత్‌ || 8

ప్రత్యేకకర్షమూలేతు పరిస్తీర్యహుతాశనమ్‌ | అగ్నిసోమయమానాంచ యాగంకృత్వాయథాపురా || 9

కర్షుత్రితయమూలేతు పురుషాణంతుకారయేత్‌ | పిండ నిర్వపణం ప్రాగ్వదేకై కస్మిన్యథావిధి || 10

కర్షుభిస్త్రితయం తచ్చ క్షీరాన్నాద్భిః ప్రపూరయేత్‌,| కర్షత్రితయమూలేతు స్త్రీణాం నిర్వపణంభ##వేత్‌ || 11

దధ్నా మాంసేన పయసా కర్షూణాం చైవ పూరణమ్‌ | అన్నోదక విమిశ్రేణ కార్యం మనుజ పుంగవ: || 12

భవంతీభ్యో భవత్యేత దక్షయం పరికీర్తమ్‌ | ఏతానిశ్రాద్ధకాలాని నిత్యాన్యాహ ప్రజాపతిః || 13

ఓ సర్వధర్మ నిధీ ! ఏకాలమున శ్రాద్ధము జరిపిన పితరులు ప్రీతులగుదురో తెలుపుమన మార్కండేయుడనియె. అమావాస్య శ్రావణపూర్ణిమ మాఘపూర్ణిమ ప్రోష్ఠపది దాటిన కృష్ణత్రయోదశి. ఆగ్రహాయణి దాటిన కృష్ణపక్షమందలి మూడు అష్టకములు శ్రాద్ధప్రశస్తములు. ముందు కూరలచేతను తరువాత మాంసముచేతను నదిజరుపవలెను. ఆపూపములుకూడ అర్హములే. అన్వష్టకలందు అష్టకాది దానమున క్రమముగా నీ యైదు హోమములు సేసి శ్రాద్దము చేయువలయును. తల్లి పితామహి ప్రపితామహి విశ్వేదేవులు అనువారికి పిండనిర్వపణము తండ్రికట్లే చేయవలెను. బ్రాహ్మణ భోజనమయిన తరువాత నక్కడ చేయవలసినది తెలిసికొనుము. నాల్గు అంగుళములు పొడవు అంతేవెడల్పు గల షట్కర్షువులు ఏర్పరుపవలెను.ఆ కర్షువుల మొదలున దర్భలుపరచి అగ్నిని ప్రతిష్ఠించి అందు ముందటియట్ల అగ్ని సోమయను దేవతల నుద్ధేశించి యాగము (హోమము) సేసి ఆ మూడు కర్షువుల మొదలు పురుషులకు పిండప్రదానము ఒక్కొక్కరి కొక్కదానిపై చేయవలెను. కర్షుత్రితయమును క్షీరాన్నాదులతో నింపవలెను. పెరుగు మాంసము పాలు ననువానితో నా దొన్నెలను బూరింపవలెను. అన్నము నీరు గలిపి యది చేయవలెను ''భవతీభ్యః భవత్వే తదక్షయం'' తమకీ యర్చన మక్షయమగుగాక యనిచెప్పవలెను. బ్రహ్మ నిత్యశ్రాద్ధ కాలము లివియని పలికెను. ఇందు శ్రాద్ధము సేయనివాడు నరకమందును.

శ్రాద్ధ మేతేష్వకుర్వాణో నరకం ప్రతి పద్యతే | వృద్ధౌ శ్రాద్ధంనరః కుర్వన్‌ నిత్యం వృద్ధిము పాశ్నుతే || 14

వృద్ధౌ సమర్చయేద్వి ప్రాన్‌ నిత్యం నాందీముఖాన్పితౄన్‌ | వృద్ధి శ్రాద్ధేషు కర్త వ్యాస్తిల స్థానేయవాస్త థా || 15

కర్కంధు దధిసం మిశ్రాన్‌ తథా పిండాంశ్చ నిర్వపేత్‌ | అచ్ఛిన్న నాభ్యాం కర్తవ్యం శ్రాద్ధంవైపుత్ర జన్మని || 16

అశౌచో పరమే కార్య మథవా పినరాధిప | వివాహ దివసే శ్రాద్ధం తథా కార్యం! విచక్షణౖః || 17

వృద్ధి శ్రాద్ధం విధానేన చంద్రే జన్మర్ష మాశ్రితే | శ్రాద్ధం ప్రయత్నాత్కర్తవ్యం భూతికామేన పార్థివ! || 18

ఉత్తరాద యనాచ్ర్ఛాద్దం శ్రేష్ఠం స్యాద్దక్షిణాయనే | చాతుర్మాస్యంచతత్రాపి సుప్తే స్వాత్కేశ##వేహితమ్‌ || 19

ప్రోష్ఠపద్య పరం పక్షం తథా పిచ విశేషవత్‌ | పంచమూర్ధ్వం చతత్రాపి దశ మ్యూర్ధ్వం తతోప్యతి. 20

మఘాయుతా చతత్రాపి శస్తా రాజం స్త్రయోదశీ | తత్రాక్షయం భ##వేచ్ఛ్రాద్ధం మధునా పాయసేనచ || 21

సర్వస్వేనాపి కర్తవ్యం శ్రాద్ధమత్ర నరాధిప | పరాన్న భోజీత్వ వచః శ్రాద్ధమత్రతు కారయేత్‌ || 22

యస్తుశ్రాద్ధం సదాకుర్యాత్‌ సోశ్వ మేధఫలో భ##వేత్‌ | నిద్రాంత్యజతి సర్వాత్మాయస్మిన్కాలే జనార్దనః || 23

తత్రశ్రాద్ధ మథానంత్యం నాత్రకార్యా విచారణా | శ్రాద్ధం సంక్రమణ భానోః కర్తవ్య పృథివీ పతే! || 24

విషువద్ద్వి తయంతత్ర అయనేద్వే విశేషతః | వ్యతీ పాతే తథా శ్రాద్ధం జ్ఞేయం బహుఫలంనృప! || 25

అక్షయంచ తథా శ్రాద్ధం విజ్ఞేయం రాహు దర్శనే | వ్రీహిపాకేచ కర్తవ్యం యవపాకే తథై వచ || 26

నతానద్యుర్మహారాజ! వినాశ్రాద్ధం కథంచన | అశ్వినస్యావరే పక్షే ప్రథమే కార్తి కస్యచ || 27

పూర్వాహ్ణే శుక్లపక్షస్య శ్రాద్ధం కుర్వాద్విచక్షణః అపరాహ్ణే తథా కార్యం కృష్ణ పక్షేన రాధిప! || 28

సంధ్యయో ర్వర్జయేచ్ఛ్రాద్ధం తత్రరాత్రౌనరేశ్వర! | రాత్రావసిచ కర్తవ్యం యదాస్యాద్రాహు దర్శనమ్‌ || 29

అక్షయం తత్సముద్దిష్టం య ద్దత్తం రాహు దర్శనే | అతఃకామ్యాని వక్ష్యామి శ్రాద్ధాని తవ పార్థివ! || 30

వృద్ధియందు శ్రాద్ధము పెట్టినవాడు నిత్యము వృద్ధిపొందును. వృద్ది శ్రాద్ధమందు తిలలకు బదులు యవలు వాడవలెను. కర్కంధువుతో పెరుగుతో కలిపి పిండనిర్వపణ మొనరింపవలెను. కొడుకు గల్గినపుడు బొడ్డు కోయకుండ గాని పురుడు వెళ్ళిన తర్వాత గాని వృద్ధి శ్రాద్ధము నొనరింపనగును. వివాహమురోజున చంద్రుడు జన్మనక్షత్రమందున్నపుడు భూతికాముడు (ఐశ్వర్యము కావలెననువాడు) వృద్ధిశ్రాద్ధము నొనరింపవలెను. ఉత్తరాయణముకంటె దక్షిణాయనము శ్రేష్ఠము. ఆషాఢ పూర్ణిమ మొదలు (చాతుర్మాసము) నాల్గుమాసములు విష్ణువు శయనించిన కాలము శ్రాద్ధప్రశస్తము. అందులోగూడ ప్రోష్ఠపది యవతలి పక్షము విశేషమైనది. అందుకూడ పంచమి తరువాత దశమి తరువాతను మరీమంచిది. మఘతోడి త్రయోదశినాడు తేనెతో పాయసముతో శ్రాద్ధము పెట్టిన నక్షయమగును. సర్వవిధముల నెపుడు శ్రాద్ధము పెట్టితీరవలెను. పరాన్నభుక్కు, ఇంటిలో వంటలేనివాడు నీశ్రాద్ధము పెట్టవలెను. ఈ చెప్పిన శ్రాద్ధములను మానకుండ జరిపిన వాడశ్వమేధ ఫలము పొందును. విష్ణువు నిద్రనుండి లేచినపుడు పెట్టిన శ్రాద్ధమనంత ఫలప్రదము. రవిసంక్రమణము రెండు అయనములందలి రెండు విషువత్పుణ్య కాలములు వ్యతీపాత గ్రహణమందు వ్రీహిపాకము యవపాకమునైన శ్రాద్ధమత్యుత్తమము. అవి లేకుండ మరి శ్రాద్ధప్రసక్తి ఋషులు చేయనేలేదు. అశ్వయుజమాస కృష్ణపక్షము కార్తిక శుక్లపక్షము శుక్లపక్ష పూర్వాహ్ణమున శ్రాద్ధము సుప్రశస్తము. కృష్ణపక్షమందపరాహ్ణము మంచిది. సంధ్యాసమయము రాత్రి నిషిద్ధములు. గ్రహణ శ్రాద్ధము రాత్రికూడ పెట్టవచ్చును. అది యక్షయము. ఇటుపై కామ్య శ్రాద్ధములు తెల్పెదను.

ఆరోగ్యమథ సౌభాగ్యం సమరే విజయం తథా | సర్వాన్కామాంస్తథా విద్యాం ధనం జీవితమేవచ || 31

ఆదిత్యాది దినేష్వేవం శ్రాద్ధం కుర్వన్సదానరః | క్రయేణౖ తదవాప్నోతి నాత్రకార్యా విచారణా || 32

స్వర్గంహ్యపత్యాని తథా బ్రహ్మవర్చసమే వచ | రౌద్రేణ కర్మణాసిద్ధిం భువంపుష్టిం తథాశ్రియమ్‌ || 33

సర్వాన్కామాంశ్చ సౌభాగ్య ధనం జ్ఞాతి ప్రధానతామ్‌ | రూపయుక్తాంశ్చతనయా న్వాణిజ్యాద్ధనసం పదమ్‌ || 34

కనకం సుహృదో రాజ్యం సఫలాంచ తథా కృషిమ్‌ | సముద్ర యానాల్లాభంచ సర్వన్కామాంస్త థైవచ || 35

శ్రైష్ఠ్య కామాంస్తథా సర్వాన్‌బల మారోగ్యమే వచ | రూప్యం ద్రవ్యం గృహం గాశ్చ తురగాంశ్చైవ జీవితమ్‌ || 36

కృత్తికాది భరణ్యంతం క్రమాత్తు భగనేరః | ఏకైక స్మిన్ర్కమాత్కుర్వం చ్ఛ్రాద్ధం ప్రాప్నోత్య సంశయమ్‌ || 37

స్త్రియః సురూపాఃస్వగృహే కన్యానాంచ తథా వరాన్‌ | సర్వాన్కామాన్య శ##శ్చైవ శ్రియంద్యూతజయంకృషిమ్‌ || 38

వాణిజ్యం వశవశ్చైవవాజినశ్చ తథా సుతాన్‌ | సువర్ణరౌప్య సౌభాగ్యం ప్రాప్నోతి శ్రాద్ధదః క్రమాత్‌ || 39

ప్రతిపత్ర్ప భృతిహ్యేతత్‌ యావద్రాజంస్త్ర యోదశీ | చతుర్దశ్యాం తుకర్తవ్యం యే నరాం శస్త్రఘాతితాః || 40

శ్రాద్ధం సదా పంచదశీషు కార్యం కామాన్స మగ్రాంల్లభ##తే మనుష్యః |

తస్మాత్ర్ప యత్నేన నరేంద్ర కార్యం | శ్రాద్ధం సదా పంచద శీషుత జ్‌జ్ఞః || 41

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శ్రాద్ధకాల వర్ణనంనామ ద్విచత్వారింశ దుత్తరశతతమోధ్యాయః.

కామ్యశ్రాద్ధములు.

ఆరోగ్య సౌభాగ్యములు యుద్దవిజయము మరియెల్లకోరికలు విద్య ధనము ప్రాణముకోరి ఆదివారము మొదలు వరుసగా శ్రాద్ధము పెట్టినవాడా యా ఫలములం దప్పక పొందును. స్వర్గము సంతానము బ్రహ్మవర్చస్సు రౌద్రకర్మ సిద్ధి భూమి పుష్టి సంపద సర్వాభీష్టములు సౌభాగ్యము ధనము జ్ఞాతులందరిలో ప్రధానుడగుట రూపవంతులయిన కొడుకులు వాణిజ్యమూలకముగ ధనసంపద బంగారము సుహృత్తులు (మిత్రులు) రాజ్యము వ్యవసాయ సాఫల్యము సముద్రయానము వలన లాభము అన్ని శ్రేష్ఠములయిన కోరికలు బలము ఆరోగ్యము వెండి ద్రవ్యసంపద ఇల్లు గోవులు గుఱ్ఱములు ప్రాణము కామ్య శ్రాద్ధమువలన పొందును. కృత్తిక మొదలు భరణిదాక నొక్కొక్క నక్షత్రమందది సేసిన నీపైనిచెప్పు ఫలములు గల్గితీరును. చక్కని స్త్రీలు తనయింట నాడు పిల్లల కుత్తమపరులు కీర్తి సంపద జూదములో గెలుపు కృషి వాణిజ్యము పశువులు గుఱ్ఱములు కొడుకులు బంగారము వెండి సౌభాగ్యముననువానిని శ్రాద్ధదాత తప్పక పొందును. పాడ్యమి మొదలు త్రయోదశిదాక నివి జరుపవలెను. శస్త్రఘాతము పొందినవారికి చతుర్దశినాడు పెట్టవలెను. పూర్ణిమనాడు శ్రాద్ధము తప్పక పెట్టిన సర్వకామ సమృద్ధుడగును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున శ్రాద్ధకాల నిరూపణమను నూటనలుబదిరెండవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters