Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటనలుబది యారవ అధ్యాయము - కృష్ణ యుధిష్ఠిర ధర్మప్రసంగమున వృపోత్సర్జన వృషభలక్షణ వర్ణనము దాల్భ్యఉవాచ : ఉపవాసాశ్రితం సమ్యగ్లోక ద్వయ ఫలప్రదమ్ | కథితం భవతా సర్వం యత్పృష్టో೭సిమయాద్విజ || 1 అన్యదిచ్ఛామ్యహం శ్రోతుంతద్భవాన్ర్ప బ్రవీతుమే | సంసారహేతుంముక్తించ సంసారాన్ముని సత్తమ || 2 పులస్త్య ఉవాచ : అవిద్యా ప్రభవం కర్మ హేతు భూతం ద్విజోత్తమ | సంసారస్యాస్యతన్ముక్తిః సంక్షేపాచ్ఛ్రూయతాంమమ || 3 స్వజాతివిహితం కర్మ రాగద్వేషాది వర్జితమ్ | కుర్వతః క్షీయతే పూర్వమన్య బంధశ్చనేష్యతే || 4 అపూర్వ సంభవాభావాత్ క్షయంయాతేతు కర్మణి | దాల్భ్యసంసార విచ్ఛేదః కారణాభావసంభవః || 5 భవత్య సంశయంచాన్య చ్ఛ్రుయతా మత్రకారణమ్ | సంసార విచ్యుతేర్ధాల్భ్య సమాసాద్వదతోమమ|| 6 గృహీతా కర్మణాయేన పుంసా జాతి ర్ద్విజోత్తమ! తత్ర్పాయశ్చిత్త భూతం వైశృణు కర్మక్షయావహమ్ || 7 బ్రాహ్మణ క్షత్రియ విశాం తథాంత్యానాం చసత్తమ | స్వజాతి విహితం కర్మ రాగద్వేషాది వర్జితమ్ || 8 జాతి ప్రదస్యాక్షయదం తదేవాద్యస్య కర్మణః | జ్ఞాన కారణ భావంచ తదేవ ప్రతిపద్యతే || 9 పుమాంశ్చాధి గతజ్ఞానో భేదంనాప్నోతి సత్తమ! బ్రహ్మణా విష్ణు సంజ్ఞేన పరమేణా వ్యయాత్మనా || 10 ఏతత్తే కథితం దాల్భ్య ! సంసారస్య సమాసతః | కారణం భవముక్తిశ్చ జాయతే యోగినోమమ || 11 మార్కండేయ ఉవాచ : ఇతిదాల్భ్యః పులస్త్యేన యథా వత్ర్పతి బోధితః | ఆరాధయామాస హరిం లేభే కామాంశ్చ వాంఛితాన్ || 12 తథాత్వమపి రాజేంద్ర! కేశవారాధనం కురు | ఆరాధ్యతం జగన్నాథం నకశ్చి దవసీదతి || 13 ఏ తస్మయోక్తం సకలం తవభూమిప! పృచ్ఛతః | అనారాధ్యా చ్యుతం దేవం కః కామానాప్నుయాన్నరః || 14 వజ్ర ఉవాచ : భగవానవ తీర్ణో೭ భూన్మర్త్యలోక మిహాచ్యుతః | భారావతారణార్థాయ భువో భూమిపతిర్హరిః || 15 మానుషత్వేచ గోవిందో మమ పూర్వపితామహః | చకార ప్రీతి మతులాంపాండు పుత్రైః సహ ద్విజ || 16 సారథ్యం కృతవాంశ్చైవ తేషాం నర్వేశ్వరో హరిః | నిస్తీర్ణో యేన భీష్మౌషుః కురుసైన్య మహోదధిః || 17 ధన్యాస్తే కృతపుణ్యాశ్చ తే మే పాండు సుతా మతాః | వివిశుర్యే పరిష్వంగై ర్గోవింద భుజపంణరమ్ || 18 రాజ్యహేతోరరీన్ జఘ్నురకస్మాత్పాండు నందనాః | సప్తలోకైక నాధేనయే భవంత్యేక శాయినః || 19 ఆత్మానమను గచ్ఛామి భగవంత మకల్మషమ్ | జాతంనిర్ధూ తపాపే೭స్మిన్ కులే విష్ణు పరిగ్రహే || 20 ఏవం దేవ వరస్తేషాం ప్రసాదసు ముఖోహరిః | పృచ్ఛతాం కచ్చిదాచష్ట కించిద్గుహ్యం మహాత్మనామ్ || 22 గుహ్యాన్ జనార్దనం యాంస్తుధర్మ పుత్త్రోయుధిష్టిరః | పప్రచ్ఛ ధర్మా సభిలాంస్తాన్సమా ఖ్యాతు మర్హసి || 23 ధర్మార్థకామ మోక్షేషు య ద్గుహ్యంమధు సూదనః | తేషామవోచద్భగవాన్ శ్రోతు మిచ్ఛామి తత్త్వతః || 24 దాల్బ్యుడు ఉపవాసముతో గూడిన నుభయలోక ఫలసాధనమైన వ్రతము నీవు తెలిపితివి. మరియు కొన్ని విశేషములెఱుంగ గోరెద నానతిమ్ము. సంసారకారణము సంసార ముక్తింగూర్చి వినగోరెదనన పులస్త్యుండిట్లనియె. అవిద్యవలన సంసారహేతువైన కర్మ మేర్పడినది. ఆ కర్మ విముక్తినిగూర్చి వినుము. తనజాతికి విధింపబడిన కర్మము రాగద్వేషములు లేకుండ జేసినవానికి ప్రారబ్ధము వర్తమానమునైక కర్మము క్షీణించును. అ పూర్వము పుట్టుటలేదుగావున కర్మక్షయముకాగానే సంసారబంధము తెగిపోవును. కారణములేని కార్యముండదుగద ! సంసార విచ్యుతిని సంగ్రహపరచి చెప్పుదును వినుము. మానవుడు మున్నుజేసిన ఏకర్మమువలన జాతిని గ్రహించెనో (పుట్టెనో) ఆ కర్మమునకు బ్రాయశ్చిత్తమైనది కర్మక్షయకారకమైనది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు శూద్రులకు అంత్యులను గూడ సజాతి విహితకర్మము రాగము ద్వేషము లేకుండ చేయవలసినదున్నది. (అదే స్వధర్మ మనబడును) జన్మకారణమైన ప్రారబ్ధము నది క్షయింపనీయదు. అది జ్ఞానమునకు గారణముకాదు. జ్ఞానము పడసిన యాతడు విష్ణువను పేరుగల అవ్యయమైన పరబ్రహ్మతో భేదము పొందడు. సంసార కారణము ముక్తికలుగు మార్గమునిది నీకు వచించితిని ఆనెను. ఇట్లు దాల్భ్యుడు పులస్త్యునిచే యథాతథముగా బోధింపబడి హరిని గొలిచి యభీష్టములను బడసెను. అట్లే ఓ వజ్రమహారాజా! కేశవు నర్చించి ధన్యుడవుగమ్ము అచ్యుతునారాధింపక యెవ్వడభీష్టముల నందగలడు? అవిమార్కండేయుడన వజ్రుండు భగవంతుడు భూభారహరణ మనకీ మనవలోకము నందవతరించినాడు. నాకు ప్రపితామహుడగు గొవిందుడప్పుడు పాండవులకెంతో ప్రీతినికూర్చెను. సర్వేశ్వరుడు వారికి రథముకూడ తోలెను. భీష్ముడను ప్రవాహముగల కురుసైన్య మహాసముద్ర మాయనవలన వారు దాటిరి. అన్నియెడల నాయన పాండవులకు తండ్రివలె నుపకరించెను. వారాతని గౌగలించుకొని యా గోవిందుని భుజపంజరమందు జొచ్చి భద్రముగ నుండిరి. రాజ్యముకొరకు శత్రువు నవలీలగ గూల్చిరి. సప్తలోకముల కేకైక నాథుడగు భగవంతునితో నొక్కశయ్యం బరుండిరి. విష్ణుశరణమై పాపమువాసిన యీ యా యదువంశమున నవతరించిన యా భగవంతుని పరమాత్మ నే ననుసరించెదను. ఇట్లు ప్రసన్నుడై యా మహానుభావుకేదేని యించుక రహస్యమునుపదేశించెనా ? ధర్మపుత్రుడు యుధిష్ఠిరు డేమేని ధర్మరహస్యముల నా పరమాత్మ నడిగెనా? ధర్మాది పురుషార్థ రహస్య విషయములను వారికి భగవంతుడానతిచ్చిన వానిని విన గుతూహలపడుచున్నానన మార్కండేయుడనియె. మార్కండేయ ఉవాచ : బహూనిధర్మ గుహ్యాని పుత్త్రాయ కేశవః | పురా ప్రోవాచ రాజేంద్ర ప్రసాద సుముఖోహరిః || 25 శరతల్ప గతాద్భీష్మా ద్ధర్మాంచ్ఛ్రుత్వాయుధిష్ఠిరః | పృష్టవాస్య జ్జగన్నాధం తన్మే నిగదతః శృణు || 26 కృష్ణుడు మున్ను ధర్మజునకెన్నో ధర్మగుహ్యములను అనుగ్రహ సుముఖుడై వచించెను. శరతల్పగతుడైన భీష్ముని వలన ధర్మములను విని యైదవ యశ్వమేధమందవబృథస్నానము సేసిన ధర్మరాజు జగన్నాధుని కృష్ణునడిగిన యంశము దెల్పెదవినుము పంచమేనాశ్వ మేధేన యదాస్నాతో యుధిష్ఠిరః || యుధిష్ఠిర ఉవాచ : భగవన్వైష్ణవా ధర్మాః కింఫలాః కింపరాయణాః || 27 కింకృత్య మధికృత్యైతే భవతోత్పాధితాః పురా | యదితే పాండవస్నేహో విద్యతే మదు సూదన || 28 శ్రోతవ్యాస్తే మయాధర్మా స్తతస్తాన్కథయాఖిలాన్ | పవిత్రాశ్చై వయేధర్మః సర్వపాపప్రణాశనాః || 29 తవవక్త్ర చ్యుతాదేవ! సర్వధర్మేష్వనుత్తమాః | తాంచ్ఛ్రుత్వా బ్రహ్మహాగోఘ్నః పితృఘ్నో గురుతల్పగః || 30 నురాపో వాకృతఘ్నశ్చ ముచ్యతే సర్వకల్బిషైః | ఏతన్మే కథితం సర్వం సభా మధ్యే సురోత్తమ! 31 వసిష్ఠాద్యైర్మహాభాగైర్ము నిభిర్భావితాత్మభిః | తతో೭హం తవదేవేశ ! పాదమూలముపాగతః || 32 ధర్మాన్కథయతాన్దేవ! యద్యహంభవతః ప్రియః | శ్రుతా మేమాన వాన్ధ ర్మా న్వాసిష్ఠాన్వా మహాఫలాన్ || 33 పరాశరకృతాంశ్చైవ తథా೭ త్రేయస్య ధీమతః | శ్రుత్వాశంఖస్యగార్గ్య స్య లిభితస్యయమస్యచ || 34 జాబాలేశ్చ మహాబాహోర్మునేర్ద్వై పాయ న స్యచ | ఉమామహేశ్వరాశ్చైవ జాతిధర్మాశ్చ పావనాః || 35 గుణస్య గుణ బాహోశ్చ కాశ్యపేయా స్తథైవచ | బహ్వాయన కృతాశ్చైవ శాకునేయాస్త థైవచ || 36 ఆగస్త్య గీతా మౌద్గల్యాః శాండిల్యాః సౌరభాస్తథా | భృగోరం గిరసశ్చైవ కశ్యపోద్దాల కోదితాః || 37 సుమంతా జైమినీ యాశ్చ పైలస్యచ మహాత్మనః | వైశంపాయన గీతాశ్చ పిప్పలాద కృతాశ్చయే || 38 ఐంద్రాశ్చ వారుణాశ్చైవ కౌబేరావాత్స్య పౌణకాః | ఆవస్తంబకృతా ధర్మాస్తథా గోపాలకస్యచ || 39 భ్భగ్వంగిరః కృతాశ్చైవ సౌరాహారీత కాస్తథా | శ్రీభగవానువాచ : శృణురాజన్ ! మహాబాహో! ధర్మాత్మన్కురు నందన! || భగవంతుడా! విష్ణుభక్తులయొక్క ధర్మములకు ఫలమేమి? వాని పరమ లక్ష్యమేమి? ఏ కృత్యము నుద్దేశించి నీవు వీని నేర్పరచితిని మాయెడ నీకు చెలిమిగలదేని యవి యానతిమ్ము నే వినవలయును. నేను నీ కిష్టుడనేని యా పవిత్ర ధర్మములను నీ ముఖమును విననెంచెద. వానినివిని బ్రహ్మఘ్నుడు గోహంత పితృఘాతకుడు గురుతల్పగుడు సురత్రాగినవాడు కృతఘ్రుడును సర్వకిల్భిషములను బాయును వశిష్ఠాది మహానుభావు లాత్మభావనులు మునులీ యంశమును నాసభలో సెలవిచ్చినారు. అందువలన నేను నీ పాదములచెంత కేతెంచితిని. నేను మను వశిష్ఠ పరాశర ఆత్రేయ శంఖ గార్గ్య లిఖిత యమ జాబాలి మహాబాహు ద్వైపాయన ఉమామహేశ్వర గుణ గుణబాహు కాశ్యప బహ్వాయన శకున అగస్త్య ముద్గల శండిల సురభ భృగు అంగిరః కశ్యప ఉద్దాలక సుమంత జైమిని పైల వైశంపాయన పిప్పలాద ఇంద్ర వరుణ కుబేర వాత్స్యపుణక అపస్తంబ గోపాల సూర్య హరీతక ప్రభృతులగు మహర్షులానతిచ్చిన ధర్మములను విన్నానన భగవంతుండు రాజా! వినుమనియె ధర్మవృద్ధి కరం వచ్మి వృషభస్యతులక్షణమ్ | ఋషభః ససముద్రాఖ్యః సతతం కులవర్ధనః || 41 మల్లికాపుష్ప చిత్రశ్చ ధన్యోభవతి పుంగవః | కామలైర్మండలైశ్చాపి చిత్రోభవతి భోగదః || 42 అతసీపుష్ప వర్ణశ్చ తథా ధన్యతరః స్మృతః | ఏతేధన్యాస్తథా ధన్యాన్కీర్తయిష్యామి తేనృప || 43 కృష్ణతాల్వోష్ఠదశనా రూక్ష శృంగశ ఫాశ్చయే | అవ్యక్త వర్ణాహ్రస్వాశ్చ వ్యాఘ్ర భస్మని భాశ్చయే || 44 ధ్వాంక్షగృధ్ర సువర్ణాశ్చ తథా మూషకనం నిభాః | కుబ్జాఃకాణాస్తథాఖంజాః కేక రాక్షాస్త థైవచ || 45 విషమశ్వేత పాదాశ్చ ఉద్ర్బాంతనయనా స్తథా | నతేవృషాః ప్రయోక్తవ్యా నచధార్యాస్తథాగృహే || 46 మోక్తవ్యానాంచ ధార్యాణాం భూయో వక్ష్యామి లక్షణమ్ | 47 ధర్మవర్ధనమైన వృషభము యొక్క లక్షణము దెలిపెద సముద్రమనుపేరి వృషభము కులాభివృద్ధిసేయును. మల్లిపువ్వు వలెనుండు కమలాకారమునైన ఎఱ్ఱని చుక్కలు (మండలములు) గలది భోగప్రదము. ఈరంగని నిర్ణయింపరానివి పొట్టివి పెద్ద పులిభస్మము కాకి గ్రద్ద ఎలుకల రంగుగలవి గుజ్జుని కాణములు ఖంజములు కుంటివి విషమముగా తెల్లగానున్న పాదములు గలవి. మిడిగ్రుడ్లు గలవియునగు నెడ్లు దానమీయదగవు. ఇంటనుండగూడదు, ఇందులకుచితమైన వృషభముల లక్షణమిదె దెల్పెద. స్వస్తి కాకార శృంగాశ్చ మేఫ°ఘ సదృశస్వనాః | మహాప్రమాణాశ్చ తథా మత్త మాతంగ గామినః || 48 మహోరస్కా మహోచ్ఛ్వాసా మహాబల పరాక్రమాః | శిరః కర్ణౌలలాటంచ వాలధిశ్చరణానిచ || 49 నేత్రపార్శ్వేచ కృష్ణాని శస్యంతే చంద్రమస్త్విషః | చిహ్నాన్యేతాని శస్యంతే కృష్ణస్యతు విశేషతః || 50 భూమింకర్షతి లాంగూలాత్ర్పశ స్తః స్థూలవాలధిః | పురస్తాన్న తథా నీచో వృషభశ్చ ప్రశస్యతే || 51 శక్తీ ధ్వజ పతాకాభా యేషాం రాజిర్విరాజతే | అనడ్వాహస్తు తేధన్యా బుద్ధి సిద్ధి జయావహాః || 52 ప్రదక్షిణం నివర్తంతే స్వయంయే వినివర్తితాః | సమున్నత శిరోగ్రీవా ధన్యాస్తే కోశవర్ధనాః || 53 రక్తశృంగాగ్రనయనాః శ్వేతవర్ణాభవంత్యపి | శ##ఫైః ప్రవాళసదృశై ర్నాస్తి ధన్యతరస్తతః || 54 ఏతేధన్యాః ప్రయత్నేన మోక్తవ్యా యదివావృషాః | ధారితాశ్చ తథా ముక్తాధనధాన్య వివర్ధనాః || 55 చరణానిముఖం పుచ్ఛం యస్వశ్వేతాని గోపతేః | లాక్షారససవర్ణశ్చ తంనీలమితినిర్దిశేత్ || 56 వృషఏవ సమోక్తవ్యోన సంధార్యో గృహే భ##వేత్ | యదర్థమేషా చరతి గాధాలోకే పురాతనీ || 57 ఏష్టవ్యా బహవః పుత్త్రాయద్యేకో೭పియాంవ్రజేత్ | యజేతవా೭శ్వమేధేన నీలంవా వృషముత్సృజేత్ || 58 ఏవంవృషం లక్షణ సంప్రయుక్తం గృహోద్భవంక్రీత మథాపిరాజన్ ! ముక్త్వాన శోచన్ మరణం మహాత్మా మోక్షంవిధించాహ మతోవిధాస్యే || 59 ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే వృషలక్షణ వర్ణనం నామ షట్చత్వారింశదుత్తర శతతమో೭ధ్యాయః. స్వస్తికాకారమునకొమ్ములు మేఘమురిమినట్టి ఱంకెయంగల్గి పెద్దప్రమాణముననుండి మదపుటేనుగువలె నడచుచు పెద్దఱొమ్ము పెద్దయుచ్ఛ్వాసము గొప్పబలము పరాక్రమము తల చెవులు నుదురు తోక కాళ్ళునుంగలిగినవి కంటికొన నలుపుగలిగి చంద్రుని కాంతి గల వృషభములు విశేషించి నల్లవివిప్రశస్తమలు. రోమరాజి (సుడి) తోక భూమి తాకుచుండునని చాలశ్రేష్టములు. ముంగాళ్ళు పొట్టిగా లేనిది శక్తి ధ్వజము పతాక రూపమున నున్న యెడ్లు మంచివి. సమృద్ధిని కార్యసిద్ధిని జయసును నొసంగును. తోలినపుడు ప్రదక్షిణమ గాదిరిగి నడచునవి ఉన్నతశిరస్సు మెడయుంగలవి ధన్యములు కోశమును(ధనమును) పెంపొందించును. ఎఱ్ఱని కనుగొలుకులగలవి యుత్తమములు. డెక్కపవడముల రంగులోనున్న వానిని మించినది మరిలేదు. ఇట్టివానిని అచ్ఛువోసి వదలినను ఇంట బెంచికొనినను ధనధాన్యసమ్రుద్ధిసేయును. కాళ్ళు ముఖముతోక తెల్లగాను లక్కరంగులోనుగల వృషభరాజము నీలమనబడును. అది ఉత్సర్జనార్హము. ఇంటనుంచుకొనరానిది. ఈ విషయముననొక్క పురాతన గాధ ప్రచారమందున్నది. ఒక్కడేని గయకు వెళ్ళును. అశ్వమేధమైన జేయును. నీలవృషోత్సర్జనమేని జేయునని పెక్కుమంది పుత్రులు గానవలెను కోరుకొనవలెను. రాజా ! ఇట్టి లక్షణములుగల యెద్దును దనయింటబుట్టిన దానినమ్మినను వదలినను నామహాత్ముడు మరణమున కేడ్వడు. ఇక మోక్ష విషయమున విధి నెరింగింతును. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున కృష్ణ యుధిష్ఠిర ధర్మ ప్రసంగమున వృషోత్సర్జన వృషభ లక్షణ వర్ణనమను నూటనలుబదియారవ అధ్యాయము.