Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటనలుబదియేడవ అధ్యాయము - వృషోత్సర్జన వర్ణనము మార్కండేయ ఉవాచ : అశ్వయుక్ కృష్ణ పక్షస్య పంచదశ్యాం నరాధిప | కార్తికే೭ప్యథవా మాసి వృషోత్సర్గం నరాధిప ||
1 గ్రహణద్వేమహేపుణ్య తథా చైవాయనద్వయమ్ | విషువద్ద్వితయంచైవ మృతాహో బాంధవస్యచ ||
2 మృతాహోయస్య తస్యార్థే తస్మిన్న హని శంకరమ్ | సుసమిద్ధే గవాంమధ్యే పరిస్తీర్య హుతాశనమ్ ||
3 పయసాశ్రపయే ద్విద్వాంశ్చరుం పౌష్ణం సమాహితః | పూషాగా అన్వేతు నశ్చ పూష్ణేహుత్వానరాధిప!
4 ఇహరాడితి చ జపేద్రుద్రా న్సమాహితః | తథైవ పౌరుషం సూక్తం కూష్మాండాని నరాధిప!
5 తతః కోష్ణేన వృషభమయ స్కారః సుశిల్పవాన్ | శూలేన దక్షిణ పార్శ్వే వామే చక్రేణ నిర్దహేత్ ||
6 అంకితం స్నాపయేత్పశ్చా త్స్నానే తస్య తథా పఠేత్ | హిరణ్య వర్ణేతి ఋచశ్చత స్రోమను జేశ్వర! 7 ఆపోహిష్ఠేతి తిస్రశ్చ శన్నోదేవీతి చాప్యథ | వత్సతర్యశ్చతస్రశ్చ తంవృషంచ నరాధిప! 8 అలంకుర్యాత్తతః పశ్చాద్గంధ మాల్యైశ్చ శక్తి తః | కింకిణీభిశ్చరస్యా భిస్తథా చీనాం శుకైః శుభైః || 9 తతఃకర్తా జపేన్మంత్ర మిమం ప్రయతమానసః | వృషోహిభగవాన్ ధర్మశ్చతూష్పాదః ప్రకీర్తితః || వృణోమి తమహంభక్త్యా సమే రక్షతు సర్వతః || 10 ఏనం యువానం వృషభం దదామి గవాంపతిం యూథపతి సధర్మమ్ | అనేన సార్ధం చరత ప్రకామం యథాతధా ప్రాప్నుత వత్సతర్యః || 11 ఏనంయునానం గోపతిం వోదదామి అనేన క్రీడంతీశ్చరతీః ప్రియేణ | సహాస్మాభిః ప్రజయా మా తనూభిః మావధామద్విషతం సోమరాజన్ || 12 మంత్రం పితా వత్స ఇతి ప్రతీతం జపేతకర్ణే వృషభస్య సవ్యే | ప్రచాలయేత్తం వృషభం తతస్తు పూర్వాందిశంవత్స తర్యశ్చ సర్వాః || 13 వాసోయుగం గ్రహీతురథ ప్రదేయం సువర్ణ యుక్తం సఘృతంచకాంస్యమ్ | శిల్పప్రధానస్యత థైవమూల్యం దేయం యథాతుష్టిముపైతి రాజన్ || 14 విప్రా స్తథాన్నం దధి సర్పిషాయుతం సంభోజనీయాః పయసాచమిశ్రమ్ | ఉత్సృష్ట మాత్రే వృషభే వ్రజంతి తృప్తిం పరాంతస్య పితామహాయే || 15 యస్మింస్తమంగే సజలం తృషార్తః పాతుం సమాగచ్ఛతి తత్పితౄణామ్ | దివ్యాంబు పూర్ణంకులశం మహీవతే! లోకం పరం తృప్తి మతః ప్రయాంతి || 16 సరిద్వరాం కాంచి దథోపయాతి తృష్ఠాన్విత స్తస్య పితామహానామ్ | తృప్తిం విధత్తే సరితాం వరిష్ఠా సుదీర్ఘ కాలం విఘులాంబు వాహైః || 17 దర్పేణపూర్ణః సవిషాణ ధరాంయదా ధారయతే నరేంద్ర! పితౄంస్తదా తస్య తదన్నకూటం ధ్రువంస నయతీతి ససంశ##యె೭త్ర || 18 రోవ్ణూం చతుల్యాని శతాని రాజన్! భోక్తా తథా తస్య దివంప్రయాతి | సంవత్సరాణాం పరిపూర్ణ కామః సంసేవ్య మాన స్త్రిదశాంగనాభిః || 19 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే వృషోత్సర్గవర్ణనం నామ సప్తచాత్వారింశదుత్తరశతతమోధ్యాయః. మార్కండేయుడనియె. ఆశ్వయుజ బహుళ మందమావాస్యనాడు కార్తికమాసమందు వృషోత్సర్గము సేయవలెను. సూర్య చంద్రగ్రహణములు ఉత్తర దక్షిణాయనములు రెండు విషువత్పుణ్యకాలములు బంధువెవరేని చనిపోయిన రోజున యతని నుద్దేశించి తన గోవులమంద నడుమ తెలిసిన యతడగ్ని పరిస్తరణము సేసి శంకరు నుద్దేశించి గోక్షీరముతో పౌష్ణచరువును హోమము సేయవలెను. పూష గోవులను మమ్ములను వెంబడించు గాక అను నర్థముగల మంత్రముతో ''ఇహరాడితి'' యను మంత్రముతో హోమము సేసి రుద్రమును =నమకచచమకములను పురుషసూక్తమును కూష్మాండ మంత్రమును జపింపవలెను. అవ్వల నించుక వేడిగల శూలముతో కమ్మరి శిల్పి యా యెద్దునకు కుడిప్రక్కను ఎడమప్రక్క చక్రముతో గాల్చవలెను. అట్లంకితమయిన దానిని స్నానము సేయింపవలెను. అప్పుడు ''హిరణ్యవర్ణ'' అను నాల్గు ఋక్కులను ''అపోహిష్ఠా'' అను మూడు ''శంనోదేవీ'' అనుమంత్రమును పఠింపవలయును. అవ్వల నాల్గు దూడలను ఆ ఎద్దును గంధమాల్యాదులచేత నలంకరింప వలెను. శక్తిని బట్టి చక్కని చిరుగంటలు చీనాంశుకములుగూడ యలంకరింపవలెను. అవ్వల కర్త మనస్సుకుదిరించికొని వృషభము సాక్షాత్తు చతుష్పాదమైన ధర్మదేవమే. అట్టిధర్మమును నేను భక్తితో నర్చించుచున్నాను. అది నన్నన్నివిధముల రక్షించుగాక!ఈనడివయసులోని యెద్దును (గిత్తను) వృషభపతిని ధర్మసహితుని యిట్టిచ్చుచున్నాను. ఈ యసతోగూడ స్వేచ్ఛగా నీ దూడలు చరించుగాక! అదియేగిన యట్లాయాతావులను బొందుగాక ! ఓ దూడలారా! ఈ వృషభరాజును వయసులోనున్న దానిని మందకునాయకుని గోపతినిమీకిచ్చుచున్నాను. ఈ వృషభ పతితో మారు క్రీడించుచు దిరుగుడు. ''పితావత్స'' యనుమంత్రమును వృషభముయొక్క కుడిచెవిలో బిగ్గరగా జపింపవలెను. అటుపై నా వృషభమును దూడలను దూర్పుదిశగా తోలవలెను. అటుపై వస్త్రయుగ్మమును సువర్ణముతో ఆవునేతితోడి మంచుచెంబును ప్రతి గ్రహీతకీయవలెను . శిల్పికిని సంతృప్తికలుగునట్లు మూల్యమునీయవలెను. నెయ్య పెరుగుతోడి మృష్ఠాన్నభోజనము విప్రులకు బెట్ట వలెను. ఇట్లు వృషభమును వదలినంతనే యజమాని తాతముత్తాతల పరమ తృప్తినందుదురు. ఆ కలశము పుచ్చుకొన్న యాతడు దప్పికగొని చెరువునకేగి యా పాత్రతో మంచినీళ్ళుత్రావునంతట నా కలశప్రదాతయొక్క పితరులు సంతృప్తులై యుత్తరలోకమున కేగుదురు. ఆ వృషభము దప్పికగొని యొకమహానదికివచ్చి యందలినీరు త్రావినంతట నాతని పితృదేవతల కానది నిర్మలోదక ప్రవాహములచే సుదీర్ఘకాలము సంతృప్తికలిగించును. నిండుదర్పముగొని కొమ్ములతో డెక్కలతో నావృషభము భూమిని చీల్చినంత నావృషోత్సర్జనము చేసినవారి పితృదేవతల నన్నరాసుల కది నడిపించును. సంశయములేదు. వృషోత్సర్జనము చేసినయతడు ఆయెద్దు యొక్క రోమములెన్ని గలవో యన్నిసంవత్సరము లాపుణ్యముననుభవించి యాతడు స్వర్గమునకుజనును. అక్కడ దేవతాసుందరులతో సేవింపబడును. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున వృషోత్సర్జనమను నూటనలుబదియేడవ అధ్యాయము.