Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటయేబదియవ అధ్యాయము - హిమగిరి వర్ణనము

ఆలోకయన్నదీం పుణ్యాంతత్సమీ రహృతక్లమః | సగచ్ఛన్నేపదదృశేహి మవంతం మహాగిరిమ్‌ || 1

ఖముల్లిఖద్భిర్భహుళైర్వృతంశృంగైః | సపాండురైః | పక్షిణా మథసంచారై (ర్‌) వినాసిద్ధగతిం శుభామ్‌ || 2

నదీ ప్రపాత సంజాతమహాశ##బ్దైః సమంతతః | అసంశ్రుతాన్య శబ్దన్తం శీతతోయం మనోరమమ్‌ || 3

దేవదారు వనైర్నీలైః కృతాధోపసనం శుభం | మేఘెత్తరీయం తం శైలం దదృశేననరాధిపః || 4

శ్వేతమేఘ కృతోష్ణీషం చంద్రార్కము కుటంక్వచిత్‌ | హిమాను లిప్తసర్వాంగం క్వచిద్ధాతు విచిత్రితమ్‌ || 5

చందనేనాను లిప్తాంగం దత్త పంచాంగు లింయథా | శీతప్రదం నిదాఘేపి శిలావిషమ సంకటమ్‌ || 6

సాలక్తకైరప్సరసాంముద్రితం చరణౖః క్వచిత్‌ | క్వచిదస్పృష్ట సూర్యాంశుం క్వచేచ్ఛత మసావృతమ్‌ || 7

దరీముఖైః క్వచిద్భీమైః పిబంతమనిలంబహు | క్వచిద్విద్యాధరగణౖః క్రీడద్భిరుప శోభితమ్‌ || 8

ఉపగీతం తథా ముఖ్యైఃకింనరాణాంగణౖః క్వచిత్‌ | అపాన భౌమౌచగణౖ ర్గంధర్వాప్సరసాంక్వచిత్‌ || 9

గీతాదిభిః సమాకీర్ణంగంధర్వీణాం మనోహరము | నిరుద్ధ పవనైర్దేశైర్నీల శాద్వల మండితైః || 11

క్వచిచ్ఛకు సుమైర్యుక్తంచాత్యంతరుచిరైః శుభమ్‌ | తపస్వి శరణంశైలం కామినామ పిదుర్లభమ్‌|| 10

మృగయూథాసు చరితందంతిభిన్న మహాద్రుమమ్‌ | యత్రసింహని నాదేన త్రస్తానాంభైరవం రవమ్‌ || 12

శ్రుత్వోత్పశ్యతి విభ్రాంతం గజానామాకులం కులమ్‌ | తపశ్చతాపసైర్యస్య కూలదేశేష్వలంకృతమ్‌ || 13

రత్నైర్యతః సముత్పన్నైసై#్రలోక్యం చాప్యలం కృతమ్‌ | అహీనశరణం నిత్యమహీన జనసేవితామ్‌ || 14

అహీనః పశ్యతిగిరి మహీనం రత్నసంపదమ్‌ | ఆల్పేనత పసాయత్ర సిద్ధిః ప్రాప్యేతతా పసైః || 15

యశ్చదర్శన మాత్రేణ సర్వకల్మషనాశనః | మహాప్రతాప సంపాతప్రభీతఖగ బంధుభిః || 16

వాయునీత సదావృష్టిః కృతదేశం క్వచిత్క్వచిత్‌ | అలబ్ధ జలదైః శృంగైః క్వచిచ్చాతి సముచ్ఛ్రితైః || 17

నిత్యార్క తాప విషమైరగమ్యైర్మన సాయుతమ్‌ | దేవదారు మహావృక్ష పుంజశాఖా నిరంతరైః || 18

సమస్తభువనాకారైః ప్రదేశైరుప శోభితమ్‌ | హిమచ్ఛన్న మహాశృంగం ప్రపాతమిత నిర్ఘరమ్‌ |

శబ్దలభ్యాంబు విషమం హిమసంరుద్ధకందరమ్‌ ||

దృష్టైవతాంచారు నితంబు భూమిం మహాను భావః సమహీంద్రనాధః |

బభ్రామతత్రైవ ముదాసమేతః స్థానంతతః కించిదథా ససాద || 20

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే హిమవద్వర్ణనో నామ పంచాశదుత్తర శతతమోధ్యాయః.

మార్కండేయుడనియె. ఆపుణ్యనదింజూచుచు నా నదిపైనుండివీచు వాయువులచే శ్రమవాసినడచుచునేపోయి రాజు హిమాలయ మహాపర్వతముంజూచెను. అది తెల్లనిశిఖరములనేకములచే నాకసమును రాయుచుండెను. సిద్ధులగమనముదప్ప మరిపక్షిసంచారము గానరాదు. సెలయేళ్లవలని శబ్దముతప్ప మరియేశబ్దమట వినిపింపదు. అచటిజలములు గడుచల్లనివి. అదిచూడ నింపైనది. నల్లని దేవదారు వనములాగిరికి చక్కని కట్టువస్త్రము. మేఘముత్తరీయ మట్లుండెను. (మేఘమండలము దాటి యా పర్వతమున్నదని భావము) తెల్లని మేఘములు తలపాగగ చంద్రసూర్యులు కిరీటములుగ మంచు మైపూతగ గంధముపూసినమేన గోరింటాకు మొదలైన వానిచే చిత్రవర్ణములైన యైదేవేళ్ళున్నట్లు అట నటగైరికాది ధాతువుల పలురంగుల విచిత్రవర్ణమై గ్రీష్మృతువునం గూడ చలువనించునదై ఎగుడు దిగుడుగనున్న రాళ్ళచే నొడుదుడుకులైన చెట్లక్రింద సప్సరసల యడుగులపారాణి ముద్రలంగొని సూర్యకిరణములు తాకక యొకచో భయముగొలుపు గుహాముఖముల నూరక వాయువుంద్రాగుచు గొన్నియెడల విద్యాధరగణము లాడుకొన మిగులశొభనమై కొండొక తావుల కిన్నరవరులు గుమిగూడిపాడుకొన మిక్కిలి మోహనమై వేరొకట పానశాలల గంధర్వాప్సరోగణములయు గంధర్వులయొక్క గంధర్వస్త్రీలయుక్కయు గీతములచే నంతటననముకొన్నదై వాయువుచొరని ప్రదేశముల నీలపురంగులు గుల్కు ముదురు పచ్చిక బయళ్ళతోనెక్కడ సత్యంత రుచిరములైన కుసుమములతో గూడినదై తపస్సులకాశ్రయము కాముకులకుగూడ దుర్లభముమనై మృగముల మందలందందు చరింపనై నద దంతి విభిన్న మహాద్రుమమై సింహముల భయంకర గర్జన రవములాలించి యడలి కన్నులుతేలవైచి యట్టిటు పరుపులిడు నేనుగుల గుంపులంగూడి తాపసుల తపస్సు నదీతీరముల నలంకరింప తనయందు పుట్టిన రతనములచే ముల్లోకము నలంకరింప అహి+ఈన శరణమై =సర్పరాజముల కాశ్రయమై నిరంతరమును అహీన =హీనులుగాని మహానుభావులచేత సేవింపబడుచు నా హిమగిరి పరమసుందరమై యుండెను. అహీనుడా గిరిని అందలి అహీనమైన రత్న సంపదను దర్శించును. తాపసులట నేకొంచెము తపస్సు చేసినను సిద్ధిం బడయుదురు. ఏ గిరి దర్శన మాత్రమున సర్వకల్మష నాశనము అచ్చటి గొప్పగొప్ప ప్రపాతములయొక్క సంపాతములచే ఖగబంధువులు (ఆల్పాల్పములయిన పక్షులు) హడలిపోవుచుండును. మేఘములకందుబాటులోలేని మిక్కిలియెత్తైన శిఖరములుగలిగిన కతనవాయువుచేత గొనిరాబడిన నిరంతరవృష్ఠులుగురియు ప్రదేశములు కొన్ని యందుగలవు. దేవదారు మహాతరు పుంజముల కొమ్మలు ఎడములేకుండ గ్రమ్ముకొని నిత్యమును సూర్యుని వేడిమికి విషమములై మనస్సునకుగూడ యగమ్యములైన్న సమస్త భువనాకారములయిన ప్రదేశములతో శోభించునదై మంచు గప్పిన మహాశిఖరములు ప్రపాతములచే మితమైన సేలయేళ్ళు గల్గి శబ్దమాత్రముచే చెప్పుడుం బడి పొందదగిన నీటిచే విషమమై (నీరెక్కడ లభించునో తెలియనంత దట్టమై చీకటి గొన్నదన్నమాట) మంచు గ్రమ్మిన కందరములు (చరియలు) గల్గియున్న యా చక్కని హిమగిరి నితంబ (మధ్య) భూమిం దర్శించి యా మహానుభావుడు పురూరవ మహీంద్రనాధుడట పరిభ్రమించి (అట్టిటు తిరిగి) యానందభరితుడై యవ్వలనట నొకించుక చోటుం జేరెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమునందు హిమగిరివర్ణనమను నూటయేబదియవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters