Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటయేబది రెండవ అధ్యాయము - ఆశ్రమ వర్ణనము మార్కండేయ ఉవాచ : తత్ర¸°తౌ మహాశృంగౌమహా వర్షమహిహామౌ | తృతీయంతుతయోర్మధ్యేశృంగ మత్యంతముచ్ఛ్రితమ్ || నిత్యాత పంతప్త శిలంసదా భవతి వర్జితమ్ | తస్యాధస్తాదృక్షగణదేశే భాగేచ పశ్చిమే '' జాతీలతాపరిక్షిప్తం వివరం చారు దర్శనమ్ | దృష్ట్వైవకౌతుకావిష్ట స్తంవివేశ మహీవతిః ||
3 తమసాచాతిని బిడం సల్వమాత్రం మహీపతిః ! నల్వమాత్ర మతిక్యమ్య స్వప్రబాభరణో జ్జ్వలమ్ ||
4 సముచ్ర్ఛితమథా త్యంతం గంభీరం పరివర్తులమ్ | నతత్ర సూర్యస్తపతి నవిరాజతి చంద్రమాః ||
5 తథాపి దివసాకారం ప్రాకాశ్యంతద హర్నిశమ్ | క్రోశాధిక పరీమాణం సరసాచ విరాజితమ్ ||
6 సమంతాత్సరస్తస్య శైలలగ్నాతువేదికా | సౌవర్ణై రాజతైర్వక్షైర్విద్రుమై రపి శోభితా ||
7 నానామాణిక్య కుసుమైః స్వప్రభాభరణోజ్జ్వలైః | తస్మిన్సరసి పద్మాని పద్మరాగచ్ఛదానిచ ||
8 వజ్ర కేసరజాలాని సుగంధీని తథాప్యతి | పత్రైర్మరకతైర్నీలై ర్వైదూర్యైశ్చ మహీపతే! ||
9 కర్ణికాశ్చ తథా శేషా జాతరూపస్య పార్థివ! | తస్మిన్సరసియా భూమిర్వసాకర్దమ సంకులా ||
10 నానారత్నైరుపచితా జలజానాంసమాశ్రయా | కపర్దకానాం శుక్తీనాం శంఖానాంచమహీపతే ||
11 మకరాణాంచ మత్స్యా నాంపైండానాంకచ్చపైఃసహ | తత్రమర తక ఖండాని వజ్రాణిచ సహస్రశః ||
12 పద్మరాగేంద్ర నీలాని మహానీలాని పార్థివ! | పుష్పరాగాణి రమ్యాణి తథాకర్కేతకానిచ ||
13 తురూకస్యచఖండాని తథాశేషస్యభాగశః | రాజావర్తస్యముఖ్యస్య రుధిరాఖ్యస్య చాప్యథ ||
14 సూర్యేందుకాంతయో శ్చైవ పీలోర్భల్లాత కస్యచ | జ్యోతీరసస్య రమ్యస్య శంఖకస్యచ భాగశః ||
15 మసార గవలంకానాం స్ఫటికస్య తథైవచ | గోమేదపిత్తకానాంచ ధూశీమర తకస్యచ ||
16 వైదూర్య సౌగంధిక యోస్తథా రాజమణర్న్పప ! | మార్కండేయుడనియె : అక్కడ రెండు శిఖరములు వర్షము మంచును నధికముగా గలవి. వాని నడుమ మూడవ శిఖరము మిక్కిలి యెత్తైనది. అట నెల్లపుడు నెండగాయును. సప్త శిలము ఏడు శిలలు గలది. నక్షత్ర గతి యక్కడ యుండదు. దానికి క్రిందు గపడమటి భాగమందు నక్షత్ర దర్శనమున్న తావున జాజిలతలతోడి యొక చక్కని విపర (రంధ్ర) మున్నది. రాజు కేవలము నల్వ మాత్రము కాదు చీకటి గ్రమ్మినదియు నగు నా వివరముంజూచి తాను ధరించిన రత్నాభరణ ప్రభ##చే వెలుగు గొన్న యా లోతైన వర్తులాకారమైన ఎత్తైన సూర్య చంద్ర సంచారము లేని యా గుహలోనికిం జొచ్చెను. అట సూర్య చంద్రులు లేకున్నను సహర్నిశము పట్టపగలట్లు వెలుగు నించుచుండును. క్రోసు కంటె మించి విశాలమైనది. అట నొక సరస్సున్నది. ఆ సరస్సు చుట్టునున్న శైలములపై వేదిక యొకటి యున్నది. ఆ వేదిక బంగారు వెండి పవడముల చేట్లచే శోభిల్లు చుండును. నానా విధ మాణిక్య కుసుమములతో గూడిన యాసరస్సు నందు పద్మరాగమణులట్టి పద్మములు గలవు. వాని కేసరములు వజ్రమయములు ఆయినను సువాసనలు వెదజల్లు చుండును వాని రేకులు నీలమరకత వైడూర్యమయములు. ఆ తామర పూవుల కర్ణికలు దుద్దులు స్వర్ణమయములు. ఆ సరస్సు క్రింది భూమి మట్టి గాదు నానారత్న స్థగితములయిన కమలముల కాశ్రయము. గవ్వలు ముత్యపు చిప్పలు శంఖములు మొసళ్లు చేపలు తాబేళ్లతో గూడిన పైండములు కేవలము మరకత వజ్రమయములు. పద్మ రాగేంద్ర నీల మహానీల పుష్పరాగములు కర్కేతములు =తురూకములను మణుల ఖండములు గలవు. శేషము రాకావర్తము రుధిరము సర్వకాంత చంద్ర కాంతములు పీలువు భల్డాతకము జ్యోతీరసము శంఖము మసారము గవలంకము స్పటికము గోమేదము పిత్తకము మరకతము అను రత్నాలధూళి, వైడూర్యము సొగంధము రాజమణి ముక్తాఫలము (ముత్యాలు) తారామూర్తులై (నక్షత్ర స్వరూపములై యన్ని రత్నాలట ప్రకాశము నించుచుండును. ఖంజస్య చైవమఖ్యస్య తథా బ్రహ్మమణరపి || 17 ముక్తాఫలానాం ముఖ్యానాం తారావిగ్రహధారిణామ్ | సుఖోష్ణం చైవతత్తో యంస్నానాచ్ఛీత వినాశనమ్ || 18 వైదూర్యస్య శిలామధ్యే సరసస్తస్య శోభనా | ప్రమాణన తథా సాచ ద్వేచరాజన్ధనుః శ##తే || 19 చతురస్రాతథా రమ్యాతపసా నిర్మితా೭ త్రిణా | బిలద్వార సమేదేశే కేతుస్తత్ర హిరణ్మయః || 20 ప్రదేశః సతురాజేంద్ర! ద్వీపేతస్మిన్మనోహరే | తథాపుష్కరిణీ రమ్యాతస్మిన్రాజన్చి లాతలే || 21 సుశీతామల పానీయా జలజైశ్చవిరాజితా | ఆకాశ విమలా రాజన్ చతురస్రా మనోహరా || 22 తస్యాస్త దుదకంస్వాదు లఘు శీతంసుగంధిచ | నక్షిణోతి తథాకాయంకుక్షి మాపురయత్యపి || 23 తృప్తింవిధత్తే పిబంతా శరీరేచమహత్సుఖం | మధ్యే చతస్యాః సుకృతం ప్రాసాదం తపసాత్రిణా || 24 రుక్మసేతు ప్రవేశంత త్సర్వ రత్నమయం శుభమ్ | శశాంకరశ్చి సంకాశం ప్రాసాదం రాజతంహితమ్ || 25 రమ్యం వైదూర్య సోపానం విద్రుమామల తారకమ్ ఇంద్రనీల మహాచక్రం జాతరూప విభూషితమ్ || 26 పద్మరాగ మహాస్తంభం తథా మరకతవేదికమ్ | వజ్రాంశుజాలైశ్చురితం రమ్యం దృష్టి మనోహరమ్ || 27 ప్రాసాదేతత్ర భగవాన్దేవదేవో జనార్దనః భోగిభోగావశీసుప్తః సర్వాలంకార భూహితమ్ || 28 జానుమాకుంచితంత్వేకం దేవదేవస్యచక్రిణః | ఫణీంద్ర సంనివిష్టాంఘ్రి ర్ద్వితీయశ్చతథానృప ! 29 లక్ష్మ్యుత్సంగగతాంఘ్రిస్తు శేషభోగప్రసారితః | ఫణీంద్ర భోగవిన్య స్త బాహుకూర్పర శోభితః || 30 స్వాంగుశీపృష్ఠవిన్యస్త దేవశీర్షధరం విభుమ్ | ఏకంతు దేవదేవస్య ద్వితీయం సంప్రసాదితమ్ || 31 సమాకుంచితజానుస్థ మణిబంధసు శోభితమ్ | కించిదా కుంచితంచైవ నాభిదేశే కరస్థితమ్ || 32 తృతీయంచ భుజంత స్యచతుర్ధంతు తథా శృణు | ఆతస్తందాన కుసుమం ఘ్రాణదేశాను సర్పిణమ్ || 33 లక్ష్మ్యాసంవాహ్య మానాంఘ్రిం పుల్లపద్మని భైఃకరైః | సంతాన మాలాముకుటం హారికేయూర భూషితమ్ || 34 భూషితంచ తథాదేవమంగదై రంగుశీయకైః | ఫణీంద్ర ఫణ విన్యస్త చారురత్నశిఖోచ్చలమ్ || 35 అజ్ఞాతవస్తు చరితం ప్రతిష్ఠిత మథా త్రిణా | సిద్ధాంత పూజ్యం సతతం సమంతాత్కుసు మార్జితమ్ || 36 దివ్యగంధావలిప్తాంగం దివ్యధూపేన ధూపితమ్ | గోరసైః సఫలైర్హృద్యై సిధ్ధై రుపహృతైఃసదా || 37 సంశోభితం పురః పార్శ్వం దేవముత్తమ శీర్షకమ్ | తథా పశ్చాన్ముఖందృష్ట్వా వవందే ననరాధిపః || 38 జానుభ్యాం శిరసాచైవ గత్వాభూమి యథా విధి | నామ్నాం సహస్రేణ తథా తుష్టాన మధుసూదనమ్ || 39 ప్రదక్షిణమథో చక్రే సతూత్థాయ పునః పునః | రమ్యమాయతనందృష్ట్వా తత్రోవాసాశ్రమేనృపః || 40 విశాలాంచ గుహాంకాంచిదా శ్రిత్యసుమనోహరామ్ | తపశ్చకారతత్రైవ పూజయానో జనార్దనమ్ || 41 నానారసైః సదాపుషై#్పః ఫలైర్మూలైః సగోరసైః | నిత్యంత్రిషవణస్నాయీ వహ్నిపూజా పరాయణః || 42 దేవవాపీజలైః కుర్వన్స తతంప్రాణధారణమ్ | సర్వాహార పరిత్యాగం సకృత్వా మనుజేశ్వరః || 43 అనాశ్రిత గుహాశాయీ కాలంనయతి పార్థివః | త్యక్తాహారక్రియ స్యాస్య కేవలాంభో೭ శినస్తథా | గ్లానిస్తస్య సమాయాతి నశరీరే తదద్భుతమ్ || 44 ఏవం సరాజా తపసిప్రసక్తః సంపూజయన్దేన పరంసదైవ | తత్రాశ్రమే కాలమువాస కంచిత్ స్వర్గోపమే దుఃఖమ విందమానః || 45 ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తర ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే ఆశ్రమవర్ణనో నామ ద్విపంచాదశదధిశ శతతమో೭ధ్యాయః. ఆ సరస్సునందలి నీరు వెచ్చనై స్నానయోగ్యమై సుఖకరముగ నుండును. వైడూర్యశిలా మధ్య మందు రెండు వందల ధనుస్సుల విశాలమైన నలుచదరమై అత్రి మహర్షి తపస్సుచేత నిర్మించిన రమ్యమైన బిలద్వారము వంటి ప్రదేశ మందు స్వర్ణమయమై జెండావలె నొక చక్కని భూమి ద్వీపమున్నది. ఆ రమ్య ద్వీపమధ్య మందు పుష్కరిణి యున్నది. అందులో నున్న ఒక్క శిలాతలమందు మిక్కిలి చల్లని స్వచ్ఛమైన నీరుగలది తామరపూవులతో నున్నది. ఆకాశమట్లు నిర్మలమై నలుచదరముగ మనోహరమైన యా పుష్కరిణి యొక్క నీరు మధురము లఘువు (తేలికది) చల్లనిది. సువాసన వెదజల్లునది. శరీరము కృశింప నీయదు. కడుపును నిండచేసి పరమతృప్తి నిచ్చును. శరీరమున కెంతేని సుఖమిచ్చును. ఆపుష్కరిణి నడుమ చక్కని శిల్పము గలది అత్రిమహర్షి తపశ్శక్తిచే నిర్మించిన ప్రాసాదము (రాజసౌధము) గలదు. ఆ సౌధమును పోవుటకు బంగారు సేతువు గలదు. ఆ సౌధము సర్వరత్నమయము చంద్రకిరణ సదృశము. రజతమయము. వైడూర్య రత్న సోపానములగలది. విద్రుమములు (పవడములు) అందు తారకలు (చుక్కల) వలె మెరయుచుండును. ఇంద్ర నీలములు చక్రాకారముగ పొదుగబడినవి. స్వర్ణభూషితము. పద్మరాగమయ స్తంభములు మరకతమయ వేదికలు వజ్ర కిరణ స్ఫురణముగలిగి చక్కనై చూపులను మనస్సును హరించును. ఆ ప్రాసాదమందు దేవదేవుడగు విష్ణువు సర్వాలంకారములు వెట్టుకొని భోగి(శేష) భోగతల్పమునందు శయనించి యుండును. ఆ చక్రి మోకాలు ముడిచి కొనియుండును. రెండవ పాదము ఫణీంద్రునిపై లక్ష్మీదేవి యొడిలోనికి ప్రసారితమై యుండును. స్వామి యొకచేయి వంచి మణికట్టు మోకాలి కానించి యుండును. రెండవ హస్తము నాభి దేశమందుండును. మూడు నాల్గుహస్తములు కల్పవృక్ష ప్రసూనమలూని నాసిక దగ్గర నుంచి వాసన చూచుచున్నట్లుండును. విప్పారిన తామర పూలట్లు మృదులములైన చక్కని హస్తములలో లక్ష్మీ పాదములొత్తుచుండును. కల్పవృక్ష కుసుమ మాలలు కిరీటమగ జుట్టుకొని హారకేయూరభూషియై భుజకీర్తులు దాల్చి ఉంగరములు పెట్టుకొని ఫణీంద్ర ఫణాగ్రమందానించిన చక్కని రత్నాలంకృతమైన కొప్పుతో నేరికిం దెలియరాని యపూర్వకథా మధురమైన చరిత్రగలిగి అత్రిమహర్షిచే ప్రతిష్ఠితమై యా శేషశయన మూర్తి నిరంతరము సంతానతరు పుష్ప సముదయముచే సిద్ధింతానుసారము (కల్పోక్త ప్రకారమన్నమాట) పూజింపబడు చుండును. ఆ మూర్తి నిండ దివ్యగంధములు పూయబడును. దివ్యధూపములాఘ్రాణింప బడును. తియ్యని గోరసములు పండ్లు సిద్ధులుగొని తెచ్చినవి నిత్యమా స్వామికి నివేదింప బడుచుండును. పురూరవ చక్రవర్తి శిరస్సుశేషఫణిపడగల నొత్తుగా నానించి యొక ప్రక్కగా పండుకొనిన పశ్చిమముఖుడైన స్వామిని దర్శించి మోకాళ్ళు భూమినానించి వంగి శిరస్సు వంచి వందనము కావించెను. విష్ణునామ సహస్రమున నమ్మధు సూదను స్తుతించెను. ఆ పైలేచి పునఃపునః ప్రదక్షిణములే సేసెను. ఆ దేవాలయపు నందము చూచి రాజక్కడనే విశాలమైన యొక గుహలో జేరి యటనివసించెను. శ్రీహరిని పూజించుచునట తపస్సు చేసెను. నానావిధ ఫలములను గోరసములను నానుచు నిత్యము త్రిషవణ స్నానము నాచరించి యగ్నిహోత్రముసేయుచు దేవవాపీజలములం గ్రోలుచు ప్రాణదారణము సేసెను. ఆ మ్మనుజేశ్వరుడట సర్వాహార పరిత్యాగము సేసెను. గుహలలో గాక యారుబయట పరుండి కాలము గడుపు చుండెను. ఆహారము మాని కేవలము నీరు ద్రావుచున్న యాఱనికి మేనిలో గ్లని వ్రాడుట) గలగనేలేదు. అని యెంతేని వింత. ఇట్లా రాజు తపస్సునందు మిక్కిలి సక్తుడై నిరంతరము దేవదేవుం బూజించుచు స్వర్గోపమ మైన యాప్రదేశమం దేవగవు నొందక హాయిగ వసించెను. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమునందు అత్రి యాశ్రమ వర్ణనమను నూటయేబదిరెండవ అధ్యాయము.