Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటయేబదిమూడవ అధ్యాయము - జలక్రీడా వర్ణనము

మార్కండేయ ఉవాచ : గత్వాశ్రమ పదేరాజా త్యక్తాహార పరిచ్ఛదః | క్రీడా విహారైంర్గంధైర్వైః పశ్యత్య ప్సరసస్సహ ||

కృత్వాపుష్పోచ్చయం భూరి గ్రంథయిత్వాతథా స్రజః | అగ్రేనివేద్య దేవాయ గంధర్వేభ్యస్తథా దదౌ || 2

పుష్పోచ్చయ ప్రసక్తా నాం క్రీడంతీనాం యథా సుఖమ్‌ | చేష్టానానావిధాకారః పశ్యన్న పినవశ్యతి || 3

కాశ్చిత్పుష్పోచ్చయేసక్తా లతాజాతేన వేష్టితాః | సఖీజనేన సంత్యక్తాః కాంతేనపరమోక్షణాః || 4

మకరంద సమాక్రాంత నయనాః కాశ్చిదంగనాః | కాంతనిః శ్వాసవాతేన నీరజస్కీకృతేక్షణాః || 5

కాచిదుచ్చిత్యపుష్పాణి దదౌ కాంతస్య భామినీ | కాంతసంగ్రథితై సై#్తశ్చర రాజకృత శేఖరా || 6

స్వయముచ్చిత్యపుష్పాణి దదౌ కాంతస్య భామినీ | కాంతసంగ్రథితై సై#్తశ్చర రాజకృత శేఖరా || 7

అన్యస్మిన్గహనే కంజే విశేష కుసుమాలతా | కాచిదేవం రహోనీతా రమణనరిరంసునా || 8

కాంత సంనామిత లతా కుసుమాని విచిన్వతీ | సర్వాశ్యః కాచిదాత్మానం మేనే సర్వగుణాధికమ్‌ || 9

క్వచిత్పశ్యతి భూపాలో నశినీషు పృథక్పృథక్‌ | క్రీడ్యమానాస్తు గంధర్వైర్దేవరా మామనోరమాః || 10

కాచిచ్చాతాడయత్కాం తముదకేన శుచిస్మితా | తాడ్యమానా తథైవాన్యా కాంతేన రతిమాయ¸° || 11

కాంతాతు తాడయామాస జాతఖేదా వరాంగనా | అదృశ్యత వరారోహా శ్వాసనృత్యత్పయోధరా || 12

కాంతాంబు తాడన భ్రష్టకేశపాశని బంధనా | శ్వాసాకుల ముఖీభాతి మధుపైరివ పద్మినీ || 13

స్వవక్త్ర సదృశైః పుషై#్పః సంఛన్న నశినీ వనే | ఛన్నాకాచిచ్చిరాత్ర్పాప్తా కాంతే నాన్విష్య యత్నతః || 14

స్నాతాశేతావదేశేన కాచిత్ర్పౌఢాంగనా భృశమ్‌ | రమణాలింగనం చక్రేమనోభిలషితంచిరమ్‌ || 15

జలార్ద్రం పసనం సూక్ష్మ మంగలీనం శుచిస్మితా | ధారయంతీ జనంచక్రే కాచిత్తత్రస మన్మథమ్‌ || 16

మార్కండేయుడనియె : రాజా శ్రమస్థానమునకేగి యాహార నిద్రలు మాని క్రీడా విహారులైన గంధర్వులతో గూడ యప్సరసల నాలోకించుచుండెను. సమృద్ధిగా బూవులుకోసి మాల గ్రుచ్చి విష్ణుదేవునికర్పించి గంధర్వులకు బ్రసాదముగా నొసంగు చుండెను. పుష్పాపచయ ప్రసక్తలై సుఖముగా క్రీడించుచున్న యప్సరస్సుందరుల నానావిధ విలాస వికారములం జూచుచుండియుం జాడడయ్యెను. పూలగోయుచు కొందరబలల తీగలగుబురులం జుట్టుకొని సభీజనముచే విడిపింపబడి ప్రియునిచేగూడ తప్పింప బడి మకరందరసము కన్నులంబడి రమణుల నిశ్శ్వాసవాయువులచే కంటిలో ధూశి యూదివేయబడి సుఖమందుచుండిరి. ఒక భామిని పూవులుకోసి కాంతుని కొసంగెను. వానిచే నతడు గట్టి పూలచెండు శిరమునం గట్టుకొనెను. స్వయముగా పూలుగోసి బంతి గట్టి యీయగార మణుండది తలదాల్చ మన్మథవర్ణినియై యా బాల తనను గృతార్థురాలైనట్లు భావించుకొనెను. ఒక రమణీమణిరహస్య ముగా గ్రీడింప నొకనిచే గహనమైన పొదరింటికిం గొంపోబడెను. ఒక మానిని తన మగడు తీగలువంప నందుకొని పూలుగోయుచు నందదికంటె తాన సౌభాగ్య గుణ సంపన్నురాలననుకొనెను. తామరకొలనునందు గంధర్వులతో గూడి వేర్వేర జలక్రీడ లాడుచు మనోహారిణులైన దేవరమణుల నా భూరమణు డొక్కచో దిలకించుచు నిలిచెను. అచ్చపు తెలినవ్వులం గులుకును నొక కులకులాడి సొగసుకానిపై నీళ్ళం జిమ్మికొట్టెను. అట్లే యింకొక కాంత తన్ను కాంతుడుదకములం జల్లినంత నెంతేని రతి నొందెను. యొక సుందరి నిజసుందరుని సలిలములం జల్లిచల్లి యలసి నిట్టూర్పులం బాలిండ్లుతూగ కాంతు డుదకముల గొట్ట గొప్పువిరిసి శ్వాసాకులముఖియై తుమ్మోదలు పైనలమిన పద్మినివోలె విలసిల్లెను. తన మోమున కెనయైన పువ్వులతో గ్రమ్ముకొన్న పద్మినీవనమందొక వధూటి దాగికొని వల్లభుడు చాలసేపు యత్నించి యత్నించి వెదకికొన కొనకు గనవచ్చెను. ఒక్క ప్రౌఢాంగన (జాణ) స్నానము సేసి చలివేయునున్నదను నెపమున చిరకాలమునుండి తా ముచ్చటపడునున్న రమణుని దాన గట్టిగ కౌగలించుకొనెను. ఒక పడతి కడుసన్నని జిలుగు తడిచీర గట్టుకొని యచ్చ మైన చిఱునగవుల గులుకుచు మడువెడలి గట్టునకు వచ్చి యచ్చటి జనమ్ములను మన్మథ వివశులం గావించెను.

గంధమాల్య గుణౖః కాచిత్‌ కాంతేనా కృష్యచాంభసి | త్రుట్యత్ర్సగ్దామ పతితం రమణం ప్రాహసచ్చిరమ్‌ || 17

కాచిన్మగ్న సభీదత్త జానుదేశన ఖక్షతా | సంభ్రమాక్రాంతర మణుమగ్నాసాపిపిన్యమజ్జత || 18

కాచిత్పృష్ఠీ కృతాదిత్యా కేశనిస్తోయకారిణీ | శిలాతల గతాభర్త్రా దృష్టాకామార్త చక్షుషా || 19

హృతమాల్యం సులలితల సంక్రాంత కుచకుంకుమమ్‌ | రతాంత క్లాంత కాంతాభమ భవత్తత్సరోదకమ్‌ || 20

సుస్నాంత దేవగంధర్వ దేవరామాగణనచ | పూజ్యమానం స దదృశే దేవదేవం జనార్దనమ్‌ || 21

ఒక కామిని సుగంధ బంధుర కుసుమ మాలికా గుణంబుల (గుణములు =దారములు) నీటిలోనికి లాగికొని చని యా సూత్రములు తెగి యా నీటిలో బడిపోయిన సొగసుకానింగని మిక్కిలి తడవు పకపక నవ్వజొచ్చెను. నీటమునిగి చెలికత్తెలు మోకాలి కడ గోరుల గిచ్చినతరి (నఖక్షతము సేసినయెడ) విభ్రాంతయై కాంతుని కడకు దూకి యతడు మునుగ దాసు నాతనితో నీట మునిగెను. ఒక యంగన సూర్యునకు వెనుదిరిగి జుట్టు పిడిచికొనుచు నొక రాతిపై నిలుపబడి కామార్తములయిన చూపులం మగనిచే జూడబడెను. పూలమాలల్లుకొని కుచకుంకుమ లలముకొని యా సరోవర జలము రతతాంతయైన కాంతవలె జూడముచ్చట యయ్యెను. చక్కగ స్నానములు సేసి దేవగంధర్వాప్సరః సుందరీగణము పూజించు దేవదేవుని జనార్దను నా పురూరవ సార్వభౌముడు దర్శించెను.

క్వచిచ్చ దదృశే రాజాలతాగ్రహ గతాః స్త్రియః | మండయంత్యః స్వగాత్రాణి కాంతసంస్యస్తమానసాః || 22

కాచిదా దర్శసువ్యగ్ర కరాదూతీ మఖోద్గతమ్‌ | శృణ్వతీకాంత వచన మతి క్లాంతముఖాబభౌ || 23

కాచిత్సత్వరితా దూత్యాభూషణానింవి పర్యయమ్‌ | కుర్వాణానైవ బుబుధే మన్మథా విష్టచేతనా || 24

ఒక్కెడ లతాగృహములం జొచ్చి (పొదరిండ్లు సొచ్చి) కాంతులపై స్వాంతములుంచి తమ శరీరముల జక్కగ నలంకరించుకొను మించుబోణుల య్యెడనుండుట చూచెను. ఒక యిందువదన యద్దమట్టిట్టుగ నొరగు హస్తములతో దూతికల ముఖమునుండి వెడలు ప్రియవచనములాలించి మిక్కిలి పసివాడిన నెమ్మోమునం దీపించెను ఒక యింతి దూతిక తొందరవెట్ట మన్మథావిష్టమనస్కయై తాను నగలం దారుమారుగ ధరించుటను గుర్తింపనేలేదయ్యె. (కాలికి పెట్టుకొనునగ చేతికి, ముక్కుకు పెట్టు కొనునది చెవికి నిట్లు మదనావేశమున మైమరచి ధరించినారనుట యిది శృంగారానుభవము).

వాయునున్నాంత సురభి కుసుమోత్కర మండితే | క్వచిత్పి బంత్యోదదృశే ప్రదేశే నీలశాద్వలే || 25

పాయయామాస రమణం స్వయం కాచిద్వరాంగనా | కాచిత్ప పౌవరారోహా కాంత పాణి సమర్పితమ్‌ || 26

కాచిత్స్వ నేత్రసంక్రాంత నీలోత్పల యుతం వధూః | పీత్వా పప్రచ్ఛరమణం క్వగతేతే మహోత్పలే || 27

త్వయైవ పీతేతేనూన మిత్యుక్తారమణనసా | సత్యం విదిత్వాముగ్ధత్వాద్బ భూవవ్రీడితాచిరమ్‌ || 28

కాచిత్కాం తార్పితం సుభ్రూః కాంతపీతావ శేషితమ్‌ | సవిశేష రసంపానం పపౌమన్మథ వర్ధనమ్‌ || 29

అపాన గోష్ఠీషు తదాతా సాంసనర పుంగవః | శుశ్రావవివిధం గీతంతంగ్రీ స్వరవిమి శ్రితమ్‌ || 30

ప్రబోధసమయే తాశ్చ దేవదేవం జనార్దనమ్‌ | రాజన్సదోపనృత్యంతి నానావాద్య పురఃసరాః || 31

యామమాత్రే గతే రాత్రావ నిర్జిత్య గుహా ముఖాత్‌ | ఆయాంతి సంయుతాః కాంతైః స్వబుద్ధిర చితాన్గృహాన్‌ || 32

నానాగంధార్పిత తలాన్‌ నానాగంధ సుగంధినః | నానావిచిత్ర శయనాన్కు సుమోత్కర మండితాన్‌ || 33

గాలికి జలజల రాలు పరిమళభరిత పూలజల్లుల నుల్లపించు చల్లని నీడల నీల శాద్వలములు (పచ్చకబయళ్ళ) నొక్కెడ నాసవములం ద్రావు నంగనామణులు గానవచ్చిరి. అందొకతె తానతాన వల్లభుం ద్రావించుచుండెను. వల్లభుడు తనచేత త్రావింప ద్రాపుచుండెను. ఒక్క మానవతి ఒక్కయెడ నొక మదవతి త్రాగి తన నేత్రములందు (ముద్దువెట్టుకొన్నపుడు) భర్త చేతిలో నల్లగలువలు తాకియు తాకిన దెరుగక మైమరచి నీ చేతిలోని కలువపూజంట యెటువోయెనని ప్రశ్నించెను. వానిని నీవే త్రాగివేసితిని నిజమని మగడన ముగ్ధ గావున నిజమనుకొని జగడము సేయక చాలసేపు బిడియపడి యూరకుండెను. ఒక సుభ్రుపు (సోగలైన కనుబొమ్మలు కలది) తన కాంతు డందించిన తన కాంతుడు త్రాగి మిగిలి నది కావున నందెంతో విశేష రుచి కలదని మన్మథవర్ధనమైన యా మధువును దాను ద్రావినది. పానగోష్ఠులందు (పానశాలలో త్రాగుబోతులు గుంపులు గుంపులుగా గూర్చుండి త్రావుచుందురు గావున దానిని పానగోష్టియుని కవులు పేర్కనుచుందురు.) త్రావి యా యువిదలు తంత్రీస్వర సమ్మేళనముగ బాడు నాటి గీతములు నా నరపుంగవుడప్పుడక్కడాలించెను. ఆ యంగనామణులను బ్రదోష సమయమందు దేవదేవు నెదుట నానావాద్య సమ్మేళనముగ నుపనర్తించుచుండిరి (శివుడు నర్తించునని యాయనతోడ వెనువెంట వారును నర్తించిరని) రాత్రి యొక జాము మాత్రమే గడచినతర్వాత గుహముఖమునుండి వెలుపడివచ్చి తమ కాంతులతో నక్కాంతలు తమ సంవత్సమృద్ధిననుసరించి నిర్మించు కొన్న తమ యిండ్ల కేతెంతురు. ఆ గృహములు నానావిధ గంధ చర్చితోపరిభాగములు. నానావిధ సువాసనావాసితములు. నానా చిత్ర విచిత్ర తల్పములు ననల్పకుసుమోత్కర సుందరములును.

ఏవమప్సర సాంపశ్యన్ర్కీడితాని సవర్వతే | తపస్తేపే మహారాజః కేశవార్పితమానసః | 34

తమూచుర్న్పపతింగత్వా గంధర్వాప్సర సాంగణాః | రాజన్స్వర్తోవ మందేశం ప్రాప్తస్త్వ మరిమర్ధన || 35

వయంహితే ప్రదాస్యామో మనసః కాంక్షితాన్వరాన్‌ | తానాదాయ గృహంగచ్ఛ తిష్ఠేహయదివాపునః || 36

పురూరవాఉవాచ : ఆమోఘదర్శనాస్సర్వే భవంతస్త్వ మితౌజసః | వరం వితరతాద్యైవప్రసాదం మధుసూదనాత్‌ || 37

మార్కండేయ ఉవాచ :

ఏవమస్త్విత్యథో క్త సై#్తః సతురాజాపురూరవాః | తత్రోవాస సుభీమాసం పూజయానో జనార్దనమ్‌ || 38

ప్రియఏవ సదైవాసీ ద్గంధర్వాప్సర సాంనృప | తుతోష సజనో రాజ్ఞస్త స్యాలౌల్యేన కర్మణా || 39

మఘస్యమధ్యేస నృపః ప్రవిష్ట స్తదాశ్రమం రత్నసహస్ర చిత్రమ్‌ |

తోయాశ నస్తత్ర ఉవాసమాసం యావత్సితాంతంనృప ఫాల్గునస్య || 40

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే

జలక్రీడా వర్ణనంనా మత్రిపంచాదశధిక శతతమోధ్యాయః ||

ఇట్లా మహారాజా పర్వతముపై నా యప్సరో యువతీమణుల క్రీడలును పనకేశీ విహారములను జూచుచు మాధవార్పిత మానసుడై తపస్సు చేసెను. అతని దరికేగి గంధర్వాప్సరోగణము లో అరిమర్దన! నీవు స్వర్గోపమమైన దేశమునకు వచ్చితివి. మేము నీకు మనసైన కోరికలను వరముల నిత్తుము. వానిం గొని నీ యింటికిం జనుము. లేదా మరి యిక్కడనే యుండుము. అనిరి. పురూరవుడు మీరోజస్సమృద్ధులు. అమోఘ దర్శనలు. మీ దర్శనము వ్యర్థముకాదు. విష్ణునివలన ప్రసాద మిది పరమం దయసేయుడు అన అట్లయగుగాకయని వారన నాప్రభువు హరి నారిధించుచు నొక్కనెల యటనే యుండెను. వజ్రమహారాజా ! అతడక్కడ గంధర్వాప్సరసల కెల్లతరిం జాలప్రియుడయ్యెను. అజనమును లౌల్యములేని యాతని యనిష్టానమున కెంతేని సంతోషించెను. మాఘమాసము నడుమ నాతడారత్న సహస్ర చిత్రమైన యాశ్రమముం బ్రవేశించి జలాశనుడై నీరుమాత్రమేత్రావుచు ఫాల్గునశుక్లపక్షము చివరదాక యటనే యుండెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున జలక్రీడావర్ణనమను నూటయేబదిమూడవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters