Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటయేబదినాల్గవ అధ్యాయము - పురూరవునకు అత్రిమహర్షి దర్శనము మార్కండేయఉవాచ : ఫాల్గునామల పక్షాంతే రాజాస్వప్నే పురూరవాః | తసై#్యవదేవదేవ స్యశుశ్రావ గదితం శుభమ్ ||
1 రాత్ర్యా మస్యాంవ్య తీతాయాం మంత్రిణా త్వంసమేష్యసి | తేన రాజన్స మా గమ్యకృతకృత్యో భవిష్యసి || 2 న్వప్నమేవం సరాజర్షి ద్దృష్ట్వా విపుల విక్రమః | ప్రత్యూషకాలే విధివత్స్నాతః ప్రాగ్వదతంద్రితః || 3 కృతకృత్యో యథా కామం పూజయిత్వా జనార్దనమ్ | స్వప్నంతద్దేవ దేవస్యన్యవేదయతధార్మికః || 4 తతఃశుశ్రావవచనం దేవతార్చా సమీరితమ్ | ఏవమే తన్మహీపాల! నాత్రకార్యా విచిరణా || 5 ఏవం ప్రసాదం సం ప్రాప్యదే వదేవాజ్జనార్దనాత్ | కృతృత్యమివాత్మానం మేనేసనరపుంగవః || 6 కృతదేవార్చనో రాజా తదాహుతహుతాశనః | జగాద సుహృదాంతేషాం ప్రసాదం మధుసూదనాత్ || 7 తమూచుశ్చతదా సర్వేరాజానమ పరాజితమ్ | విదధాతు ప్రసన్నస్తే దేవదేవో జనార్దనః || 8 అప్రసన్నే జగన్నాధే దేశే೭స్మిన్నృప కస్యచిత్ | నగతిర్విద్యతే రాజంస్త్వంచ దేశమిహాగతః || 9 సుఖం ప్రాప్నుహిభద్రంతే భూయ ఏవహితేప్పితాన్ | ససాదయిత్వాతే కామాన్ దేవః సర్వగతః ప్రభుః || 10 ఏవముక్త్వానరేంద్రంతం గంధార్వాప్సర సాంగణాః | జగ్ముః క్రీడా విహారార్థం యథా పూర్వ మరిందమ ! 11 మార్కండేయుడనియె. ఫాల్గున శుక్లపక్షము చివర పురూరవ మహారాజు కలలో నా దేవదేవుని పలుకులు వినెను. ఈరేయి గడువ నీవు నీ మంత్రిని కలిసికొందువు. నీవందువలన కృతకృత్యుడయ్యెదవు. ఆరాజర్షి ఇట్లు కలగని వేకువ వేళ నెప్పటియట్లు యథావిధిగ స్నానముసేసి యెట్టి తొందరగొనక తా గోరినయట్లు విష్ణుపూజసేసి యా ధార్మికుడా స్వప్నమును హరికి నివేదించెను. అవ్వల అర్చామూర్తి నుండి ఇది యిట్లేయగును. ఓ మహీపతి ! ఇక్కడ నాలోచింపవలదు అను పలుకు వినెను. ఇట్లు జనార్దనుని ప్రసాదము నొంది యతడు తాను గృతార్థునిగ భావించెను. దేవతార్చనగావించి యగ్నిని వేల్చి మదుసూదనునివలని యనుగ్రహ మాత్మసుఖులకుం జెప్పెను. వారెల్లరు నాతనితో ప్రసన్నుడై విష్ణువు నిన్నపరాజితుం గావించుగాక ! ఆ జగత్పతి ప్రసన్నుడు గాడేని యీ ప్రదేశమున కెవ్వనికి దాని దొరకదు. రాజా ! నీ వీ ప్రదేశమునకు వచ్చితి సుఖమందుము. నీకు భద్రమగుంగాక ! సర్వగతుడైన యా ప్రభువు నీయభీష్టములన్నిటిని నెరవేర్పగలడు. అని గంధర్వాప్సరో గణము లా రేనితో బలికి మనుపటియట్ల క్రీడావిహార మొనరింపనేగిరి. అథాజగామ తందేశం బ్రహ్మణోమానసః సుతః | త్రిజగద్యశసాంస్థాన మత్రిస్సుర గణార్చితః || 12 తమాగతం ముని వరం దృష్ట్వా రాజా పురూరవాః | పాద్యార్థ్యాచమనీయాద్యైరా సనే నాభ్యపూజయత్ || 13 సంపూజ్యచ మహాభాగమిదంవచన మబ్రవీత్ | అద్యమే సఫలం జన్మ అద్యమే సఫలంతవః || 14 యత్తేదేవగణౖ ర్వంద్వౌందితౌ చరణౌమయా | శ్రేయః ప్రసూతి వృక్షస్య ప్రరోహ స్తవ దర్శనమ్ || 15 సర్వ పాపాంతకరణ సర్వకల్యాణ కారణమ్ | కింవానలభ్య మస్తీ హతేషాంద్వి జపరోత్తమ | 16 అమోఘదర్శనే దృష్టేభవత్యమిత తేజసి | ఏవముక్త స్తదా రాజ్ఞాసంప్రసన్నో జగాదతమ్ || 17 అటుపైని బ్రహ్మమానస పుత్రుడు ముల్లోకముల కీర్తికి ఎ్థానమునైన యత్రి మహర్షి సురగణ పూజితుడచ్ఛోటికి దయచేసెను. ఆ వచ్చిన మునివరుం దర్శించి రాజు పాద్యార్ఘ్యాచమనీయాసనా ద్యుపచారములం బూజించి యట్లనియె. ఇపుడు నా పుట్టువు సఫలమైనది. ఇపుడు నాతపస్సు ఫలంచినది. వేల్పులెల్ల పూజించు నీపాదములమ నేనిపుడు పూజింప గల్గితిని. నీదర్శనము శ్రేయఃప్రసూతి వృక్షమునకు అంకురము. ఇది సర్వ పాపాంతకరము. సర్వకల్యాణ కారణము. ఓ ద్విజపరశ్రేష్ఠా మహాతేజస్వివగు నీదర్శనమయినవారికి ఆమోఘుడవగు నినుదర్శించిన వారికి యిట మరి లభ్యముకాని దేమున్నది? అని రాజు పలుక ఋషిరాజు ప్రసన్నుడై యతనికిట్లనియె శృణురాజన్వచోమహ్యం యత్తేవక్ష్యామి సువ్రత ! | దేవదేవ సమాదేశాద్దత్తంతే దర్శనంమయా || 18 సుప్రసన్మోహిభగవాన్దే వస్తే మధుసూదనః | ద్వాదశీషు సదా రాజన్సో పవాసేన నిత్యశః || 19 పూజితో భగవాన్విష్ణు స్త్వయాతీతేతు జన్మని | రాజసేనతు భావేన త్వయాదేవః సమర్చితః || 20 అవరం కామమాశ్రిత్య రాజన్నిహత కంటకమ్ | సాత్త్వికేనతు భావేన పూజయిత్వాజనార్దనమ్ || 21 రాజ్యం మద్రేషు సంప్రాప్తం నిష్కంటకమరిందమ ! | ద్వాదశ్యర్చా ప్రసన్నేన దేవదేవేన చక్రిణా || 22 ప్రదర్శితమిదం స్థానం మదీయం స్వర్గసన్నిభమ్ | ఇహరాజం స్త వస్తప్త్వా దేవదేవంనార్దనమ్ || 23 ఆరాధ్యదృష్ఠవానస్మి పురావర్షగణాన్బహూన్ | ప్రాప్యాను జ్ఞాంహృషీకేశాత్తత్కృతే వివరేశుభే || 24 నిత్యంసన్నిహితారాజంస్తసై#్య వార్చాస్వ వినిర్మితా | నియోగాద్దేవదే వస్య పూజ్యతే సిద్ధసత్తమైః || 25 రాజా ! నామాటవినుము. నీవ్రతము సువ్రతమైనది. విష్ణునాజ్ఞచే నీకు నేదర్శనమిచ్చితిని. భగవంతుడు నీయెడనెంతేని యనుగ్రహము సూపినాడు ద్వాదశులందుపవాసము సేసి నీవు గడచిన జన్మమందు విష్ణుదేవుని రాజసభావముతో సవరము (అంత మంచిది కానిది) అయిన కోరికనుగొని యర్చించితివి. తరువాత సాత్వికభావముతో నర్చించితివి. కాన నీకిపుడు నిష్కంటకమైన మద్రరాజ్యము లభించినది. ద్వాదశీ సమర్చనమున బ్రసన్నుడైన దేవదేవుండు చక్రాయుధుడు స్వర్గతుల్యమైన యీ నా ఆశ్రమ స్థానముం జూపించెను. ఇక్కడ తపస్సుచేసి పెక్కేండ్లు హరింగొలిచి యీ స్థానముంగంటివి. హృషీకేశు ననుజ్ఞ వడసి యాయన యొనరించిన యీ శుభ పదమైన వివరమందు ఆ శ్రీహరి యర్చనము నిత్యసన్నిహితముగ నేర్పరుపబడినది. ఆ దేవదేవుని నియోగమున సిద్ధవరులిట హరిపూజ గావింతురు. నేయందృష్టా మనుష్యేంద్ర ! మనుషై#్యర్నచరాక్షసైః | పిశితాశైస్త థైవాన్యైర్దృష్ట పూర్వాకథంచన || 26 అస్మిన్స్వర్గో పమేదేశేత్వయాలౌల్యేన కర్మణా | ఆరాధితో జగన్నాధో దేవశ్చక్రగదా ధరః || 27 అసన్నఫలములే೭పిబహుగోరస సంయుతే | క్షౌద్రయుక్త శిలా ప్రాయే సమాక్షిక ఫలైర్యుతే || 28 కేవలాంభోశినాతప్తం యత్త్వయా పరమంతపః | తేనతేహం వరందద్మియద భీష్టం తవానఘ! 29 అచిరేణౖవకాలేన త్వయారాజన్కృతం తపః | రూపార్థం రూపలాభాయ ప్రాప్తంమే గదతఃశృణు || 30 తద్వ్రతం యేకరిష్యంతి మనుజేశ్వర మానవాః | స్త్రియోథవానర శ్రేష్ఠ ప్రాప్స్యంతే రూపముత్తమమ్ || 31 సౌభాగ్యమతులం లోకే లావణ్యమపి చోత్తమమ్ | ధర్మిష్ఠతాం తథా రోగ్యం కులేజన్మ తథోత్తమే || 32 జన్మాంతర మథాసాద్యస్వర్గ లోకం తథా విధమ్ | స్వర్గలోకాత్పరి భ్రష్టామనుష్యే గుణసంయుతాః || 33 బ్రాహ్మణా ధనసంపన్నాభవిష్యంత్యథవానృపాః | జన్మాంతర మథాసాద్య సర్వసై#్యవ ఫలప్రదాః || 34 రూపవంతో మహారాజ ఇహాముత్రచతే೭న ఘాః | యస్మాత్త్వయా తపస్తప్తం కేశవశ్చాథ పూజితః || 35 మయాసమాగతశ్చాపి గంధర్వైశ్చసహస్రశః ఇహైవకృత్వాధర్మజ్ఞ! రూపసత్రంమహాఫలమ్ | దివ్యరూపధరో భూత్వాస్వరాష్ట్రంగంతు మర్హసి || 36 ఏతావదుక్తః సతుమద్రనాధో మహాత్మనాతేన నరేంద్ర సింహ! | పప్రచ్ఛతం ధర్మభృతాం పరిష్ఠః సత్రస్య తస్యాగమజం విధానమ్ || 37 ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే పురూరవసో೭త్రిదర్శనం నామ చతుః పంచాశదధిక శతతమోధ్యాయః. ఈ యర్చనను మనుజులుతప్ప మరియెవ్వరు మాంసాశనులు రాక్షసులు చూడలేదు. ఈ స్వర్గోపమమయినచోట నీవుచేసిన లౌల్యములేని కర్మముచే (నిష్కామ కర్మముచేత) చక్రగదాధరుడు జగదాధారు డర్చితుండయ్యె. పండ్లుదుంపలు నందుబాటులో నున్నను పెక్కు గోరసములు తేనెలొలుకు శిలలు సమృద్ధిగనున్నను తేనెలూరు పండ్లు నిండుగానున్నను కేవలము జలాశనము సేసి నీవు పరమ తపస్సు సేసినావు. అందుచే నీకేసు నీ కోరిన వరమిచ్చుచున్నాను. నీ వీ తపస్సు రూపముగోరి చాల స్వల్పకాలమే సేసితివి. రూపనిమిత్తమైన వ్రతముస్త్రీలేని పురుషులేని యిట నొనరించినవారు ఉత్తమరూపముం బొందుదురు. అనుపమాన సౌభాగ్యమును అత్యుత్తమ లావణ్యమును ధర్మిష్ఠతను (ధర్మనిష్ఠను) ఆరోగ్యమును ఉత్తమకుల జన్మమును బొందుదురు. అటుపై నింకొక జన్మమొంది పైవిధమయిన స్వర్గముంబొంది యటనుండి తిరిగి యిటకుజారి మానవలోకమందు గుణవంతులయిన బ్రాహ్మణులయి ధనసంపన్నులగుదురు లేదా రాజులగుదురు. అటుపై మరొక జన్మమంది సర్వఫలప్రదులై పరమందు నా పుణ్యాత్ములు రూపవంతులుగ రూపొందుదురు. నీవు తపమాచరించితివి కేశవస్వామి నర్చించితివి నాతో సమాగమమునుం బొందితివి. వేలకొలది గంధర్వులు గలిసికొంటివి. ఇక్కడనే నీవు మహాఫలమైన రూపసత్ర మాచరించి దివ్యరూపధారివై నీరాజ్యమున కేగదగుదువు. అని యింతదాక విష్ణువు పలుక మద్రనాధుడు ధర్మనిష్ఠులలో పరిష్ఠుడా పురూరవ మహారాజ శ్రేష్ఠుడా సత్రమునకు సంబంధించిన విధానముం గూర్చి యమ్మహర్షిం బ్రశ్నించెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండము పురూరపునకత్రిమహర్షి సందర్శనమను నూటయేబదినాల్గవ అధ్యాయము.