Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూట యేబదియారవ అధ్యాయము - పురూరవుడు తన రాజధానిం బ్రవేశించుట

పురూరవా ఉవాచ : 

భగవన్సర్వ ధర్మజ్ఞ ! పితామహ! మహాద్యేతే! | గురుత్వంతువ్రతే బ్రహ్మన్‌ కర్తుమర్హసిమానద! || 1

వ్రతావసానేచ తథా సామగ్ర్యంద్విజ పుంగవః | ఏవంశక్యోస్మ్య రణ్యస్మిన్‌ కర్తుం బ్రహ్మన్‌ మహద్ర్వతమ్‌ || 2

అత్రిరువాచ : తవప్రసాదం భగవాన్‌ సర్వాత్మా మధుసూదనః | కురుతేహం కరిష్యామి గురుత్వమపరాజితః || 3

వ్రతానసానేచతథా సామగ్ర్యం ద్విజపుంగవైః | కామాః సన్నిహితాశ్చాన్యైర్దేశేస్మిన్‌ నృపసర్వదా || 4

మార్కండేయ ఉవాచ : ఎవముక్త్వాసధర్మాత్మా సప్తమేచదినే తదా |

జ్యేష్ఠాయాంసప్తమీయోగే గ్రాహయామాసతం వ్రతమ్‌ || 5

పాదర్షాత్తు ప్రభృత్యేవ మృక్షేఋక్షే నరాధిపః | కారయామాస దేవస్య కథితాంగాది పూజనమ్‌ || 6

స్నానం నక్షత్రనిర్దిష్టం నక్షత్రస్యచ పూజనమ్‌ | నక్షత్రదైవతస్యాపి సోమస్య వరుణస్యచ || 7

పూజనంచ తథా విష్ణో ర్దేవదేవస్య చక్రిణః | హోమంతథైవ సర్వేషాం యథావన్మనుజేశ్వర || 8

మాఘశుక్లమఘాం ప్రాప్య ద్వాదశీంచతథాతి థిమ్‌ | అత్రిర్ర్వతానసానే తమాగతో బ్రాహ్మణౖఃసహ || 9

వ్రతానసానే సంపూజ్యకేశవాం గార్చి సోమజాన్‌ | రాజ్యంనివే దయామాససోత్రేః సకలమేవహి || 10

ప్రతిగృహ్యచ తద్రాజ్యం తస్మాద్వైమంత్రవిన్నృప! | భూయః ప్రాదాత్సతసై#్యవ వచనం చేదమబ్రవీత్‌ || 11

సమేరాజ్యేన కర్తవ్యం కించిదేవా స్తిపార్థివ ! | నధనేననకామేన యాజితా ధ్రువ యాజ్ఞియాః || 12

సమత్వం రాజాశార్దూల ! స్వస్తిగచ్ఛ గృహాన్ర్పతి | ఏవముక్త్వాయ యావత్రిరంతర్ధానమథేశ్వరః || 13

సర్వైర్ద్విజగణౖః సార్ధం తదాదత్వా సపార్థివః | దేవపుష్కరిణీతోయేస్నాతమాత్రోబభూవహ || 14

తప్తజాంబూనదాకారో నీలకుంచితమూర్ధజః | పృథువక్షామహాబాహు స్తనుకుక్షిర్మహాకటిః || 15

గంధర్వరాజ ప్రతిమః సర్వసత్త్వవశంకరః | రూపంతుతాదృశం తస్యదృష్వ్వా గంధర్వసత్తమాః || 16

తథైవాప్సరసోముఖ్యాదిష్ట్యా దిష్ట్యేతితేబ్రువన్‌ | సభాజ్యపార్థివంతేన పూజితాః ప్రయయుః సుఖమ్‌ || 17

పురూరపుండు స్వామీ! ధర్మజ్ఞా! పితామహా! మహాతేజస్వీ! నేనొనరింపబోవు నా రూపసత్రమందు తాము గురుత్వము వహింపవలెను. వ్రతము చివర దానికి సామగ్ర్యమును =సంపూర్ణతను సంపాదింప వలయును. ఈ యరణ్యమందేనీ మహాద్భుత వ్రతము సేయుశక్తి గల వాడనన నత్రి మహర్షి యనియె. రాజా! నీయెడభగవంతుడు మధువైరి తప్పక ప్రసన్నుడగును. నేను నిందపరాజితమైన గురుత్వము పూనెదను. వ్రతావసానమున ద్విజపుంగవులతో గూడి దీనికి సమగ్రతను జేకూర్చెదను. ఈ వ్రతమందు సర్వదా సర్వాభీష్టములు సన్నిహితములై యున్నవి. అని పలికి నాటికి నప్తమదివసమందు సప్తమీ తిథియందు జ్యేష్ఠ నక్షత్ర పాదమునుండి యిది ప్రారంభించి ప్రతినక్షత్రమందు నాఱనిచే నీమున్ను జెప్పబడిన ప్రత్యంగ పూజ నక్షత్ర నిర్దిష్టమైన స్నానము నక్షత్ర దేవతకు సోమునికి వరుణునికి దేవదేవుడు చక్రాయుధుడునగు విష్ణువునకు పూజ యందరికి యథావిధిగ హోమముం జేయించెను. తుదను మాఘశుక్లమందు మఘానక్షత్రము ద్వాదశి తిథి కూడిన నాడు బ్రహ్మణులతో నత్రి మహర్షి యాఱనిదరికి దయచేసెను. ఆరాజు వ్రతావసానమందు మహర్షిని బూజించి కేశపునంగములను అర్చిని బుధునినర్చించి యా యత్రి మహర్షికి తనసర్వరాజ్యమును నివేదించెను. మంత్రవిదుడైన యమ్ముని యాతని నుండి రాజ్యముంగైకొని తిఱిగి యాఱనికే దాని నొసంగి యమ్ముని వరుడు ''పార్థివా! నాకు రాజ్యముతో బనిలేదు. ధనముతో కోరికలతో నవసరము లేదు. ధ్రువయాజ్ఞియులు (యజింపదగిన) శాశ్వతులయిన దేవతలను నీవు యజించితివి. నీకు స్వస్తియగుగాక ! ఇక గృహములకేగుము. అని యమ్మునీశ్వ రుండంతర్ధా న మయ్యెను. అటుపై పురూరవ చక్రవర్తి ద్విజగణమందఱితో నేగి దేవపుష్కరిణీజలమందు స్నానముసేసిన యంతన పుటము వెట్టిన బంగారపు మేనిచాయ నీలములై కుంచితములైన శిరోజములు విశాలపక్షము ఆజానుబాహువు సూక్ష్మకుక్షి మహాకటి భాగము గల్గి గంధర్వరాజు వలెనయి సర్వసత్త్వాకర్షకుడయ్యెను. గంధర్వవరులలాటి యతని రూపముంజూచి యప్సరః కాంతా మణులు బాగుబాగనిరి. ఆఱనిన యందఱుం గౌరవించి యాతని వలన బూజలందుకొని సుఖాన నేగిరి.

నీత్వాసంవత్సరంతత్ర పూర్ణేసంవత్సరే నృపః | దేవతాశ్చాప్యథామంత్ర్య పూజయిత్వా యథావిధి || 18

తథాపుష్కరిణీంపుణ్యాం గుహాంపద్మ సరస్తదా | ఆశ్రమం శైలముఖ్యంచ తథైవచ వనస్పతిమ్‌ || 19

గంధర్వాప్సరసశ్చైవ! ప్రయ¸°స్వపురంతతః | ఉచ్చసంగమసంప్రాప్తాదృష్టో వైషయికై స్తతః || 20

స్తుతోదేవ ప్రసాదాచ్చ భక్త్యాతైశ్చాభినంధితః | సత్వరైశ్చతథా కైశ్చిద మాత్యానాం నివేదితః || 21

అమాత్యాశ్చా గతంశ్రుత్వా లబ్ధకా మంనరాధిపమ్‌ | నిర్యయుర్నగరా త్తస్మాచ్చతురంగ బలాన్వితాః || 22

రాజ్ఞః ప్రతిగ్రహార్థంతే గణముఖ్య పురఃసరాః | తైఃసమేత్య సరాజర్షిర్యథావన్మనుజేశ్వర || 23

కల్పితేగ గజేంద్రేణ పతాకాధ్వజశోభినా | ప్రవివేశపురంహృష్టః శాకలం నామనామతః || 24

రాజ్ఞః ప్రవేశేతత్పౌరైః సితచందనవారిణా | బహువర్ణైస్తథా పుషై#్పర్యథాస్థానే విభూషితమ్‌ || 25

చందనాగురుసారాణాం ధుపనైః సురభీకృతమ్‌ | మహోచ్ఛ్రిత పతాకాఢ్యం మాల్యదామ పరిష్కృతమ్‌ || 26

మాల్యమోదక హసై#్తశ్చ పౌరజాన పదైర్యుతమ్‌ | అతీవజన సంబాధమతీవ సునోహరమ్‌ || 27

ప్రసాదవరసంస్థాశ్చ గవాక్షక గతా స్తథా | వేదికాస్థాశ్చ పశ్యంతిస్త్రియ స్తం మన్మథార్దితాః || 28

సముష్టన్యోషితాం చిత్తం దృశశ్చ మనుజాధిపః | లాజాచందనచూర్ణైశ్చ కీర్యమాణః సమంతతః || 29

పుషై#్పశ్చస్త్రికరోన్ముక్తైః పూర్వమాణో నరాధిపః | అభిగమ్యచతత్రాసౌ దేవతాయతనాం స్తతః || 30

రాజచటనే యొక యేడుండి దేవతలందరితో జెప్పి యథావిధి నాపుణ్యపుష్కరిణిని గుహను పద్మసరస్సును ఆశ్రమమును గిరిరాజమును నటనున్న వనస్పతిని గంధర్వాప్సరసలనుం బూజించి తనపుర మునకేగి మహోన్నత మంగళాచారములం బౌరులువచ్చి దర్శింప స్తుతింప దేవప్రసాదమువలన భక్తిచేతను వారిచేత నభినందింపబడి తొందరగా కొందరేగి మంత్రులకు తనరాక తెలుప వారెదురువచ్చి చతురంగములతో పురము వెడలివచ్చి స్వాగతమియ వారితో గణముఖ్యులును వారిగొనిచ్చి ప్రతాకాధ్వజాలంకృతమైన ఏనుగుపైనెక్కి (గజమెక్కి) శాకలమను తన రాజధానిం బ్రవేశించెను. రాజనగర ప్రవేశమునందు పౌరులు తెల్లచందనపు నీరతనిపైనించిరి. చక్కని రంగురంగు పూలు జల్లిరి. చందనాగరు సారధూపములం బరమళించుచు మిక్కిలి యెత్తుగ నెత్తిన పతాకలలో పూలమాలల యలంకారములతో గూడిన యా నగరమందు పూమాలలు మోదకములు (లడ్లు) చేతులంబూని నాగరికులు జనాపదాలు (పల్లెటూరి జనము) నెదురేగి స్వాగతమయి మిగుల సమ్మర్దమై సుమనోహరమైన ప్రాసాదమునెక్కి గవాక్షములనుండి కొందరు యరుగులమీదనిల్చి కొందరు పౌరసుందరు లాసుందరునింగని మరుబారికి జిక్కిరి. ఆ మనుజపతి యువతుల చూపులను మనసులనునాచికొనుచు వారు కరకమలముల పేలాలు పూలు మంచిగంధపుపొడి గ్రమ్ముకొన పైపైజిమ్ముచుండ నరుగుదెంచి తొలుత నాతడు దేవాలయములకేగి దేవదర్శనము సేసి శరత్కాలమేఘ పాండురమగు తనమందిరముం బ్రవేశించెను.

ప్రవివేశగృహం శ్రీమత్‌ శారదాభ్రచయోపమమ్‌ | తత్రాభిగమనం కృత్వాదేవతానాం యథావిధి || 31

సంపూజ్య బ్రాహ్మణాన్‌ భక్త్యా వివిధైర్ధన సంచయైః | సభాస్థం సాంత్వయామాస పౌరజానపదంజనమ్‌ || 32

అశ్వాస్యప్రేషయామాస గృహాన్యోధజనంతథా |

అక్కడ యథావిధి గృహదేవతల నభిగమించి (యెదురుగునిల్చి) భక్తితో వివిధ ధనరాసుల బ్రాహ్మణులం బూజించి కొలువునందున్న పౌర జానపద జనమందర నాదరించెను. మరియు వారిని తన యోధవర్గమును వారివారి గృహములకంపించెను.

జనానురాగసం యుక్తస్తతః ప్రభృతిపార్థివః || 33

రాజశాస్త్రోపదేశేన పాలయామాసమేదినీమ్‌ | రేమేచ సహరామాభిర్గం ధర్వప్రతియోయువా || 34

సతుకాలేన మహతా రాజా పంచత్వ మాగతః | ఉవాససుచిరం కాలం పూజ్యమానః సురోత్తమైః || 35

మన్వంతరేహ్యతీతేతు చాక్షుషస్య మహాత్మనః | వైవస్వతేథ సంప్రాప్తే బుధపుత్త్రత్వ మాగతః || 36

తత్రతస్యతు యద్రూపం సౌభాగ్యాదేవ విశ్రుతమ్‌ | సశరీరస్యచతథా స్వర్లోకేగమనంనృప || 37

స్వర్గతోపి సరాజర్షిః క్షీణవైవస్వతేంతరే | ప్రవిశ్యాతిపురం విష్ణోశ్చంద్రమండలమధ్యగమ్‌ || 38

ఏతత్తే సర్వమాఖ్యాతం కర్మణాయేన పార్థివః | అవాపతాదృశంరూపం సౌభాగ్యమపి చోత్తమమ్‌ || 39

అదిమొదలు జనానురాగము చూరగోని యారాజు రాజశాస్త్రముల యుపదేశము ననుసరించి మేదినిం బరిపాలించెను. గంధర్వసముడు యువకుడయైద రమణీమణులతో క్రీడించెను. అటుపై చాలకాలమతడు కాలగతింజెందెను. సురవరులు పూజింప బహుకాలమతడు స్వర్గమందు విహరించెను. చాక్షుమన్వంతరము గడచి వైవస్వత మున్వంతరమేతేర నతడు బుధునికి గుమారుడై సౌభాగ్యసంపన్నమైన యా తొలుతటి రూపముంగొని సశరీర స్వర్గగమనము సేసెను. ఆ రాజర్షి స్వర్గమందయుండి పైవస్వత మన్వంతరము గడచిన చంద్రమండల మధ్యమందున్న విష్ణువు నతిపురమందుండెనను నీవృత్తాంతమెల్ల నీకు దెల్పితి.

పూజయంతిహరిం దేవం నాత్త్వికాస్తు నిరాశిషః | రాజసాః కామకామాశ్చ క్రూరకామాశ్చ తామాసాః || 40

హరింసంపూజ్యమనసా రాజసేన పురూరవాః | సప్తద్వీప సముద్రాయాం పృథివ్యామేకరాడ్బభౌ || 41

స్వర్గం సుదుర్లభః ప్రాప్యస్థానం ప్రాప్స్యతి శాశ్వతమ్‌ | నాస్తివిష్ణు సమోనాధోనాస్తి విష్ణుసమాగతిః || 42

నాస్తివిష్ణు సమంత్రాణం నరస్యార్తస్య భేషజమ్‌ | సత్కృతం పూజనంయేన కృతందేవస్యచక్రిణః || 43

ఆరాత్రికం కృతంతేన సంప్రాప్తం పరమంపదమ్‌ యేనసంకీర్తితం రాజన్హరిరిత్యక్షరద్వయమ్‌ || 44

బద్ధః పరికరస్తేన మోక్షాయగమనం ప్రతి | ఏతత్తే బుధపుత్త్రాయ త్రిషుజన్మసు పార్థివ! || 45

ధన్యంయశస్యం రిపునాశనంచ సాభాగ్యదం పుష్టివివర్ధనంచ |

శ్రోతవ్యమేతన్నియతంచసద్భి రాఖ్యానమూర్జన్కరమృద్ధికామైః || 46

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే

పురూరవసస్స్వపుర గమనం నామషట్పంచాశదధికశతతమోధ్యాయః.

విష్ణుదేవుని నిరాశిషులు (అశీస్సులు కోరనివారు) అనగా నేకోరికయు లేనివారు సాత్త్వికులు (సత్త్వగుణ ప్రధానులు) పూజింతురు. కామకాములు (సకాములు) క్రూర రాజసులు క్రూరకాములు తామసులును హరిని పూజింతురు. పురూరవుడు రాజసమనస్కుడై హరినర్చించి సప్తద్వీపములకు నేకచ్ఛత్రాధిపతి యయ్యెను. దుర్లభ##మైన స్వర్గస్థానముగూడ బడసి శాశ్వతస్థానమును (ముక్తిపదమును) బొందగలడు. విష్ణువునకు సముడయిన నాధుడు లేడు. విష్ణుగతితో సమానమైన గతిలేదు. విష్ణుసమానమైన రక్షణ లేదు. ఆర్తుడగు నరునకు సంతకుమించు ఔషధములేదు. చక్రిపూజనము నొనరించిన యతడు సర్వముం జక్కగా నొనరించినవాడే. ఆ స్వామికి ఆరార్తికము (కర్పూర హారతి) నొసంగినయతడు పరమపదమందును రాజా! ఎవ్వడు హరియను రెండక్షరములు సంకీర్తించునాతడు ప్రయాణమునకు బద్ధపరికరుడే. రాజా! బుధకుమారుడగు పురూరవుని మూడుజన్మముల చరితమిదియెల్ల నీకేను వచించితిని. ఇది ధన్యము యశస్యము శత్రునాశనము సౌభాగ్యప్రదము పుష్టివర్ధనము సత్పురుషులు బుద్ధికాములై ఓజస్కరమైన యీకథను నియతముగా వినవలసినది.

ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున పురూరపుడు తన రాజధాని బ్రవేశించుట యను నూటయేబదియాఱవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters