Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటయేబది తొమ్మిదవ అధ్యాయము - శుక్లపక్ష ద్వాదశీవ్రత వర్ణనము వజ్ర ఉవాచ : భగవంచ్ఛ్రోతుమిచ్ఛామి ద్వాదశీషు పృథక్పృథక్ | ఉపోష్యకింఫలంలోనే శుక్లపక్షే విధీయతే ||
1 అనేకజన్మ సాహసై#్రర్యేషాం పాపంక్షయం గతమ్ | అకామాస్తే ప్రవర్తంతే దేవదేవార్చనేనరాః ||
2 మార్కండేయ ఉవాచ : ద్వాదశ్యాంమార్గశీర్షస్య శుక్లపక్షే ఉపోషితః | నామ్నా కేశవ మభ్యర్చ్య వహ్నిష్టోమ ఫలంలభేత్ ||
3 నారాయణంతథాభ్యర్చ్య పౌషేమాసే జగత్పతిమ్ | అత్యగ్నిష్టోమ మాప్నోతి నాత్రకార్యావిచారణా ||
4 మాఘేమాధవమభ్యర్చ్య ద్వాదశాబ్ద ఫలంలభేత్ | గోవిందం ఫాల్గునేమాసి పూజయిత్వా మహీధర ||
5 అతిరాత్రస్యయజ్ఞస్య ఫలం ప్రాప్నోత్య సంశయమ్ | చత్రేవిష్ణుమథాభ్యర్చ్య వాజపేయఫలం లభేత్ ||
6 ద్వాదశ్యాం మాసివైశాఖే సంపూజ్యమధు సూదనమ్ | గోసవస్యతుయజ్ఞస్య ప్రాప్నోత్యనుత్తమమ్ ||
7 జ్యేష్ఠేమాసేతథాభ్యర్చ్య దేవదేవం త్రివిక్రమమ్ | పుండరీకస్యయజ్ఞస్య ఫలంవిందతి మానవః ||
8 ఆషాఢే వామనం దేవం పూజయిత్వాజగత్పతిమ్ | క్షిప్రమేవసమాప్నోతి యజ్ఞం బహుసువర్ణకమ్ ||
9 శ్రీధరంశ్రావణ మాసిపూజయిత్వామహేశ్వరమ్ | వైష్ణవస్యతు యజ్ఞస్య ఫలం విందత్య సంశయమ్ ||
10 మాసేభాద్రపదే దేవం హృషీకేశం సమర్చయన్ | అశ్వమేధ మవాప్నోతికులంచైవ సముద్ధరేత్ ||
11 అశ్వినేమాసి సంప్రాప్తే పద్మనాభం సమర్చయన్ | రాజసూయమావాప్నోతినాత్రకార్యా విచారణా ||
12 దామోదరమథాభ్యర్చ్య కార్తికేమాసియాదవ! | సర్వవేధమవాప్నోతి స్వర్గలోకంచ గచ్ఛతి ||
13 మాసోక్తేన సదా నామ్నాశుక్లపక్షేహ్యుపోషితః | ద్వాదశీషుసదా కుర్యాజ్జవ్యహోమాన్స మాహితః ||
14 సంవత్సరాంతే దాతవ్యం ఘృతపూర్ణంచ భాజనమ్ | కాంస్యస్యవైనతేయంచ రుక్మపత్రనివేశితమ్ || 15 క్రమోపవాస తస్త్వేతేప్రోక్తాయజ్ఞ ఫలానృప | పూర్ణంసంవత్సరం కృత్వావ్రతమేతన్నరాధిపః || 16 స్వర్గలోకమవాప్నోతి కులంచైవ సముద్ధరేత్ | దేవరామాగణస్థేన వీణామురజనాదినా || 17 హంససారసయుక్తేన విమానేనార్కవర్చసా | కింకిణీశతఘోషేణ విహరత్యమరప్రభః || 18 యావజ్జీవంనరః కుర్యాద్ర్వత మేతత్సమాహితః | శ్వేతద్వీపమవాప్నోతి యత్రచంద్రప్రబానరాః || 19 చతుర్భుజా మహాసత్త్వానిత్యతృప్తాః సుగంధినః | అనిష్యందా నిరాహారాః సర్వజ్ఞాః సర్వదర్శినః || 20 తత్రోష్యకాలం సుచిరం నరేంద్ర!భిత్త్వార్క బింబం సహస ప్రయాతి| స్థానంపురోదేవవరస్యవిష్ణోర్నిత్యస్య తస్యానఘ! సర్వగమ్య! || 21 ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శుక్లపక్ష ద్వాదశీ విధిర్నామ ఏకోనషష్ట్యధిక శతతమో೭ధ్యాయః వజ్రుడనియె. శుక్లపక్షద్వాదసులన్నిటియొక్క ఉపవాస ఫలము వినవలతును. అనేక జన్మసహస్రములెత్తి పాపము క్షయించుకొని నిష్కాములయిన వారు దేవదేవుని యర్చనమునందు బ్రవృత్తులగుదురన మార్కండేయుడనియె. మార్గశిరశుక్ల ద్వాదశినాడుపవాసముసేసి విష్ణునర్చించినవారు అగ్నిష్టోమము సేసిన ఫలమందుదురు. వైశాఖమాస ద్వాదశీనాడిట్లు మధుసూదను నర్చించినచో గోమేధముసేసిన ఫలమందును. జ్యేస్ఠమాస ద్వాదశీవ్రతము సేసి హరినర్చించిన పౌండరీక యాగముసేసిన ఫలము గల్గును. ఆషాడమందు వామనమూర్తి నర్చించిన బహుసువర్ణ దక్షిణాకములయిన యజ్ఞముల ఫలమువచ్చును. శ్రావణమాసమం దర్చించిన విష్ణుయాగఫలముపొందును. భాద్రపదమందు హృషీకేశుని ద్వాదశీవ్రతముసేసి యర్చించిన అశ్వమేధయాగఫలమబ్బును. అశ్వయుజమందు పద్మనాభునర్చించిన రాజసూయము సేసిన ఫలముగల్గును. కార్తికమందు దామోదరు నర్చించిన సర్వమేధఫల ములనందుటయేకాక స్వర్గలోకముంగూడ పొందును. ఈ చెప్పినమాసములలో శుక్లపక్షమందే ద్వాదశులందు ఉపవసించి జపహోమములను అర్చనమును జేయవలెను. సంవత్సరము తుదిని కంచుపాత్రలో ఘృతమునింపి దానముసేయవలెను. దానితోబాటు గరుత్మంతుని బంగారురేకుపై ముద్రకూడ దానమీయవలెను. ఈ మాసక్రమ ద్వాదశీ తిథులందుపవాసము వ్రతము సర్వయజ్ఞ ఫలప్రదము. ఇట్లు సంవత్సరము పూర్ణముసేసినచో స్వర్గము పొందును. కులము నుద్ధరింపగలడు. ఈ వ్రతమిట్లుసేసిన పుణ్యాత్ముడు దేవసుందరీమణిగణము కొలువ వీణులు మురజములు (గుంజలుఅని వాడుక) మొరయ హంసలు సారసములు నలంకరించు చిరుగంటలుమ్రోయ సూర్యప్రభ##మైన విమానమెక్కి దేవతా ప్రభతో విహరించును. ఈ వ్రతమును యావజ్జీవ మాచరించిన సుకృతి చంద్రప్రభా భాసురులయన నరులు విహరించు శ్వేతద్వీపమును బొందును. అక్కడనుండు పుణ్యులు నాలుగు సేతులు గల్గి మహాసత్త్వులై నిత్యతృప్తులై సువాసనభరితులై (అవిష్యందులై) క్రిందితిరిగి జారిపడక నిరాహారులై సర్వజ్ఞులై సర్వద్రష్టలై యుందురు, అక్కడ సుచిరకాలము వసించి సూర్యబింబముం ఛేదించికొని అనగా సూర్యబింబమునకు చుట్టున్న తేజోమండలములకు నడిమి దారింజూచి నిత్యుడగు విష్ణువుయొక్క లోకమునకేగును. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున శుక్లపక్ష ద్వాదశీవర్ణనమను నూటయేబదితొమ్మిదవ అధ్యాయము.