Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
పదునాఱవ యధ్యాయము ధుంధుమారో పాఖ్యానము మార్కండేయ ఉవాచ ః భాతతస్యాస్య వర్షస్య భాగే೭స్మి న్నపమే నృప ! సముద్రో వాలుకాపూర్ణ ఉజ్జానక ఇతిశ్రుతిః || 1 తస్యమధ్యే సముద్రస్య ధుంధు ప్రస్థపతేస్సదా | సంవత్సరస్య సో೭ న్తేతు మహోచ్ఛ్వాసం ప్రముంచతి || 2 యదా తదా భూస్ఖ్సలతి సశైల వనకాననా ప్రాణినో యే೭ల్ప సత్వాశ్చ తేయాన్తి యమ సాదనమ్ || 3 యదా విబుద్ధో భవతి కించిచ్ఛేషా మహీతదా ఆహారార్థం కరోత్యుగ్రః పాపాత్మా జలరాక్షసః || 4 ఏతస్మి న్నేవ కాలేతు చోత్తంక స్తప్యతే తమః | తపసో೭న్తే మహాత్మానం దదర్శ మధుసూదనమ్ || 5 తమువాచ హరిర్దేవో వరం వరయ భార్గవ | ఉత్తంకః ప్రాంజలి ర్భూత్వా తుష్టావ మధుసూదనమ్ || 6 ఉవాచ వరదం దేవ మేష ఏవ వరోమమ | యదహం దేవదేవస్య దృష్టవాంశ్చరణాంబుజౌ || 7 శ్రీ భగవాన్ ఉవాచ : అవశ్యంతే వరోదేయః మయాభృగు కులోద్భవ | అజరశ్చామర శ్చైవ మత్ర్పసాదా ద్భవిష్యసి || 8 యత్రేచ్ఛసి జలం తత్ర భవిష్యతి తథాతవ | దేవతానాం మహత్కార్యం తథైవచ కరిష్యసి || 9 అశృమస్యాస్య తేబాధాం యః కరోతి సదానఘ | కువలాశ్వేవ తంగత్వా ధుంధుం ఘాతయ | మాచిరమ్ || 10 అహంచాస్య ప్రవేక్ష్యామి కువలాశ్వస్య విగ్రహమ్ || తేజ సా సమదీయేన ధుంధుమాజౌ హనిష్యతి || 11 నహ్యల్ప తేజసా హన్తుం ధుంధుశ్శక్యోభృగూత్తమ | మార్కండేయుడిట్లు పలికెను: వజ్రమహారాజ | ఈ భారతవర్షము యొక్క తొమ్మిదవ భాగమునందు ఇసుకతో నిండియున్న సముద్రముగలదు. దానికి ఉజ్జానకమని వాడుక. ఈ సముద్రమధ్యమున ధుంధువు సంవత్సరాంతమునందు పెద్ద నిట్టూర్పువిడువగా పర్వతములు అరణ్యములతో భూమి తొట్రుపాటుచెందును. అల్పజీవములన్నియు యమపురికేగును. అతడు మేల్కొనగానే భూమి కొంచెము మిగిలియుండును. పాపస్వభావుడును. భయంకరుడు నగు నీజల రాక్షసుడు అహారము నిమిత్తమై యత్నించెను. ఇంతలో నుత్తంకుడు తపసుచేయుచు మహాత్ముడగు మధుసూదనుని చూచెను. మధుసూదనుడు వరము కోరుకొనుమనెను. ఉత్తంకుడు దోసిలి ఒగ్గి మధుసూదనుని స్తుతించెను. వరదుడగు మధుసూదనునితో ''దేవదేవుని పాదపద్మముల దర్శించితిని. ఇదియే నాకు కావలసిన వరమ''న భగవంతు డిట్లనెను. భృగువంశీయుడా ! నీకు తప్పక వరమీయవలసి యున్నది. నీవు నా అనుగ్రహమున జరామరణ రహితుడవగుదువు. నీ కెచట జలము కావలెనందువో అచట నది సిద్ధించును. దేవతల మహా కార్యమునట్లే చేయగలవు. నీ యీ యాశ్రమమునకు నెవడు భాద నెపుడు కలుగజేయునో అట్టి ధుంధుని అలస్యముచేయక శీఘ్రముగ కువలాశ్వుని (బృహదశ్వుని కుమారుని)తో నేగి సంహరింపుము. నేను కువలాశ్వుని విగ్రహమును ప్రవేశింతును. అ కువలాశ్వుడు నా తేజస్సుచే ధుంధుని యుద్దమునందు చంపగలడు భృగూత్తమా | అల్పతేజస్సుతో ధుంధుని చంపుట శక్యముగాదు. మార్కండేయ ఉవచః ఏతావదుక్త్వా భగవాన్ గతోంతర్ధాన మీశ్వరః || 12 జగామచ తథాయోధ్యా ముత్తంకో೭పి మహాతపాః | పూజితో బృహదశ్వేన బృహదశ్వ మభాషత || 13 ఉత్తంక ఉవాచ : కథం నిద్రాసి రాజేంద్ర ! సుఖం పర్యంక మాస్థితః | ధుందో శ్చరిత మాలోక్య బద్ధ కక్షో భవా೭ధునా || 14 వచనా న్మమ రాజేంద్ర | ధు ధుం హంతుం తవాస్తిభోః | శక్తిః,కిముద్యమాద్రాజ్ఞాం దుష్కరంతేపునః కథమ్ || 15 జహి ధుంధుం మహాకాయం నృపతే | ద్విజ బాధకమ్ | శ్రుత్వాముని వచో రాజా కువలాశ్వ మభాషత || 16 అహం వనప్రవృత్తస్తు త్యక్తదండ స్తథైవచ జహితందానవ శ్రేష్ఠం త్వముత్తంకేనపాలితః || 17 ఏవముక్తః పరిష్వక్తః పిత్రా ప్రకృతి వత్సలః | ఉత్తంక సహితో గత్వా యుద్ధాయోదక రాక్షసం || 18 యుయు ధే తంచ ధర్మాత్మా ధుంధుంతేనైవకేశవః | ఉత్తంకానుమతే పశ్చాద్ర్బహ్మాస్త్రేణ జఘానతమ్ || 19 హత్వాతం రాక్షసంలేభే త్రిద శేభ్య స్తదావరా& | కృష్ణేభక్తిం స్థితిం ధర్మేవాసం స్వర్గే తథాక్షయమ్ || 20 మధుకైటభయోః పుత్రంఘాతయిత్వానరాధిపః | ధుంధుమారత్వ మగమ దశోభత తథాపురీమ్ || 21 తస్మి& హతే దైత్యవరే ప్రసన్నాః దిశోబభూవు ర్ముదితాశ్చ దేవాః | విష్ణు విఘ్నంచ జగత్ తదా స రాజచకిర్తం వరమా మవాప|| 22 ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే ధుంధుమారోపాఖ్యానం నామ షోడశో೭ధ్యాయః. మార్కండేయ డిట్లనెను: ఇంతవరకు చెప్పి భగవంతుడగు మధుసూదనుడు అంతర్ధానమందెను. మహాతపస్వియగు | నుత్తంకుడు అయోధ్యకుచేరి బృహదశ్వునిచే పూజితడై యిట్లనెను. ''రాజేంద్రా | శయ్యనుచేరియెట్లు నిద్రించుచున్నావు ! ధుంధుని చరిత్రను చూచి, యిపుడు బద్ధకక్షుడవగుము ! రాజేంద్రా ! నా మాట బట్టి ధుంధుని చంపుటకు నీకు శక్తి గలదు. రాజులకు ప్రయత్నమువలన నేది దుష్కరమెట్లగును ? ఓ రాజా ! ద్విజులను బాధించునట్టి మహాశరీరుడగు ధుంధుని చంపుము. ఉత్తంకముని వాక్యమును విని బృహదశ్వమహారాజు కుపలాశ్వునితో పలికెను. నేను వనమందున వాడనై దండమును వదలితిని. కావున నీవు ఉత్తంకునిచే పాలితుడవై దానవశ్రేష్ఠుడగు నా ధుంధుని చంపుము. ఇట్లు తండ్రియగు బృహదశ్వునిచే పలుకబడి ప్రజలయందు వాత్సల్యముగల అలింగితుడై ఉత్తంక సహితుడై యుద్ధార్థమై ఉదకరాక్షసుడగు ధుంధుని చేరి యుధ్ధము చేసెను. ఉత్తంకుని యనుమతితో బ్రహ్మస్త్రముతో కేశవుడు, కువలాశ్వునిచే ధుంధుని చంపించెను. అట్లు ఆ రాక్షసుని చంపి దేవతల వలన కృష్ణభక్తి. ధర్మమున నిబ్బరము, స్వర్గమునందు అక్షయనివాసము కుపలాశ్వుడు వరములుగ పొందెను. ఓ రాజా! మధుకైటభుల పుత్రుని సంహరించి ధుంధుధారుడును పేరును సంపాదించి ప్రకాశించెను. అ రాక్షసవరుడు చంపంబడగా దిక్కులు ప్రసన్నములాయెను. దేవతలానందించిరి. జగత్తు విఘ్న శూన్యమాయెను. రాజు గొప్ప కీర్తిని పొందెను. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమున ప్రథమఖండమున మార్కండేయ వజ్ర సంవాదమున ధుంధుమారోపాఖ్యానమను పదునారవ అధ్యాయము.