Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటాఅరువదియవ అధ్యాయము - కృష్ణపక్ష ద్వాదశీ వ్రతము వజ్ర ఉవాచ : కేవలం కృష్ణపక్షస్య ద్వాదశీషు జనార్దనమ్ | కదాప్రభృతి ధర్మజ్ఞ విధినాకేనచార్చయేత్ ||
1 మార్కండేయ ఉవాచ : మార్గ్యాంతు సమతీతాయాం ద్వాదశీయాభ##వేన్నృప | తతఃప్రభృతికర్తవ్యం వ్రతమేవము పోషితః || 2 ద్వాదశీషుచ కృష్నాసు నామకృష్ణ స్యకీర్తయేత్ ! | తేనైవనామ్నా కర్తవ్యౌజవహోమౌతథైవచ ||
3 తిలైర్నివేదనం కార్యం హోమః కార్యస్తథాతిలైః | పౌష్యాంతు సమతీతాయాం కృష్ణాయాద్వాదశీభ##వేత్ ||
4 తస్యాంవ్రతావ సానేతు తిలాన్దద్యాద్ద్విజాతిషు | సువర్ణంచ మహీపాల! రక్తవస్త్రం తథైవచ ||
5 సంవత్సర మిదంకృత్వావ్రతం మనుజపుంగవ! | తిర్యగ్యోనిం నచాప్నోతి స్వర్గలోకంచగచ్ఛతి || 6 యావజ్జీవం వ్రతమిదం యఃకరోతిసమాహితః | ససదుఃఖం సమాప్నోతి నరకంచ నరాధిప! || 7 యత్రవైతరణీ దుర్గా క్షురధారాశ్చ పర్వతాః | పాపానాం యాతనా మత్ర తత్రాసౌనగమిష్యతి || 8 యస్యాంగణాః భీమబలా మహోగ్రా దంష్ట్రాకరాళా వికటోగ్రవేషాః | విద్రావణాః పాపకృతాం నరాణాం నమేన తస్యా నృపయాంతిమార్గమ్ || 9 ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే ప్రతికృష్ణపక్ష ద్వాదశీవిధిర్నామషష్ట్య ధికశతతమో೭ధ్యాయః కేవలము కృష్ణపక్ష ద్వాదశీ వ్రతముసేసి హరి నర్చించు విధాన మానతిమ్మని వజ్రుడన మార్కండేయు డిట్లనియె మార్గశిరమాసము గడచినప్పటినుండి అనగా పుష్యమాసమందు కృష్ణపక్షమందు ద్వాదశి మొదలుకొని యీవ్రత ముపవాసముండి సేయవలెను. కృష్ణ ద్వాదసులందు కృష్ఱనామ సంకీర్తనము సేయవలెను. ఆ నామ సంపుటితోనే జపము హోమములు సేయనగును. తిలలు (తిలాన్నము) నివేదన తిలలతో హోమము చేయవలెను. పుష్యమాసము గడచి (మాఘమాసముందన్నమాట) కృష్ణపక్ష ద్వాదశినాడు వ్రతము సమాప్తిసేసి (ఉద్యాపనమన్న మాట) ద్విజులకు తిలదానము సేయవలెను. అందు బంగారము ఎఱ్ఱని వస్త్రములుగూడ యీయవలెను. ఒక్క సంవత్సర మీవ్రత మాచరించినాతడు పశుపక్ష్యాది జన్మములందడు. స్వర్గలోకమేగును. ఇది యావజ్జీవము సేసినాతడు దుఃఖము నెరుంగడు. నరకమునకుం జనడు. దాటరాని వైతరణి దుర్గమమయిన పదునైన కత్తుల నరకము యమయాతనలుగల నరకమున కీ పుణ్యాత్ముడు పోడు. ఆ నరకమందు భయంకరులు మహాబలులు మహోగ్రులు వికృత మయిన కోరలతో జడిపించువారు వికటమయిన ఉగ్రమైన వేసములవారు పావులను అటునిటు నూరక తరిమికొట్టువారును సమ్మర్దముగ దిరుగు నరకమార్గము నీ ద్వాదశీవ్రతు సేసినధన్యులు చూడనైన నజూడరు. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున కృష్ణపక్ష ద్వాదశీ మహిమయను నూట అరువదియవ యధ్యాయము.