Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటఅరువది యొకటవ అధ్యాయము - శ్రవణద్వాదశీ ప్రశంస వజ్ర ఉవాచ : ఉపవాసాసమర్థానాం శుక్లపక్షేద్విజోత్తమ! | ఏకాయాద్వాదశీపుణ్యాతాంవదస్వమమానఘ! ||
1 మార్కండేయ ఉవాచ : మాసిభాద్రపదే శుక్లాద్వాదశీశ్రవణాన్వితా | మహతీద్వాదశీజ్ఞేయా ఉపవాసే మహాఫలా ||
2 సంగమే సరితోః పుణ్యద్వాదశీంతాముపోషితః | అయుత్నాదేవమాప్నోతి ద్వాదశ ద్వాదశీఫలమ్ ||
3 బుధశ్రవణ సంయుక్తా సైవచేద్ద్వాదశీభ##వేత్ | అత్యంతమహతీయస్యాం సర్వంకృతమథాక్షయమ్ ||
4 ద్వాదశీశ్రవణో పేతాయదాభవతి పార్థవ! | సంగమేతు తదాస్నాత్వా సత్తీర్థ స్నానజం ఫలమ్ ||
5 సోపవాసః సమాప్నోతి నాత్రకార్యా విచారణా | వారిధానీంతదాదత్వా జలపూర్ణాంద్విజాతయే ||
6 ఛన్నాం వస్త్రయుతాం రాజం చ్ఛత్తోపానహ సంయుతామ్ | స్వర్గలోకమ వాప్నోతి కులముద్ద రతిస్వకమ్ ||
7 స్వర్గం సమాసాద్య చిరంచోభోగాన్ భుక్త్యా మహేంద్రోపమ దేవతుల్యాన్ |
8 మానుష్యమాసాద్య భవత్యరోగో ధనాన్వితో ధర్మపథోమనస్వీ. ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శ్రావణీద్వాదశీ ప్రశంసావర్ణనంనామ ఏకషష్ట్యధిక శతతమోధ్యాయః ఉపవాసములు సేయజాలని వారికిగూడ పుణ్యద్వాదశి యేదో యానతీయ వలయునను మార్కండేయుడు భాద్రపద శుక్ల ద్వాదశి శ్రవణానక్షత్రముతో గూడినది మహాద్వాదశి యన బడునది. అందుపవాసము మహాఫలమిచ్చును. రెండు నదులు కలిసిన పుణ్యతీర్థమందు భాద్రపద శుక్లద్వాదశినాడుపవసించి హరి నర్చించిన ధన్యుడప్రయత్నముగ ద్వాదశద్వాదసుల ఫలమందును. అదే భాద్రపద శుక్ల ద్వాదశినాడు బుధవారము శ్రవణానక్షత్రము కూడ కలిసివచ్చినచో నంతకంటె మించిన గొప్ప తిథి మరిలేదు. అందు జేసిన వ్రతము ఉపవాసము అర్చనము అక్షయము. శ్రవణ ద్వాదశినాడు (శ్రవణానక్షత్రయుక్త ద్వాదశియన్నమాట) నదీ సంగమస్థానమందుపవసించి హరి నర్చించిన యాతడు సర్వతీర్థ స్నానఫలము నందును. ఇక్కడ విమర్శచేయ నవసరము లేదు అప్పుడు తీర్థజలపూర్ణ కుంభమును పైని నూతనవస్త్రముంగప్పి ఛత్రముతో (గొడుగుతో) ఉపానహములతో (పాదరక్షలతో) దాన మిచ్చిన పుణ్యాత్ముడు స్వర్గలోకమందు తన కులమెల్ల నుద్ధరించును స్వర్గమందు దేవేంద్రభోగములనుభవించి యాతడు మనుజుడై పుట్టి యెట్టి రోగములు లేక ధనవంతుడు ధర్మపరుడు ఉత్తమమనస్సంపన్నుడగును. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున శ్రావణీద్వాదశీ ప్రశంసనమను నూటఅరువదియొకటవ అధ్యాయము.