Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూట అరువదిమూడవ అధ్యాయము - తిలద్వాదశి మహిమానువర్ణనము

వజ్ర ఉవాచ : ఏకాముషోష్య కృష్ణాంయాం ద్వాదశీం విధినా నరః | మహత్ఫలమవాప్నోతి తాం సమాచక్ష్వభార్దవ! || 1

మార్కండేయఉవాచ: పౌష్యాంతు సమతీతాయాం శ్రవణనతు సంయుతా | ద్వాదశీ యాభ##వేత్కృష్ణాప్రోక్తాసా తిలద్వాదశీ ||

తిలైఃస్నానంతిలైర్హోమం నైవేద్యంతిలమోదకైః | దీపాశ్చతిలతైలేన తథాదేయం తిలోదకమ్‌ || 3

తిలాశ్చదేయావిప్రేభ్య స్తస్మిన్నహని పార్థివ! | ఉపవాసదినేరాజన్హోతవ్యాశ్చ తథాతిలాః || 4

ఉపోషితేనాపరేహ్ని హోతవ్యాశ్చ విశేషతః | ఇంధనంచ ప్రదాతవ్యం బ్రాహ్మణీభ్యస్తథానఘ! || 5

తిలప్రస్థంతదాహుత్వా సోపవాసో జితేంద్రియః | నదుర్గతిమావాప్నోతి నాత్రకార్యా విచారణా || 6

తద్విష్ణోః పరమంపదం హోమమంత్రః ప్రకీర్తితః | పౌరుషంచతథాసూక్తం శ్రీసూక్తేన చ సంయుతమ్‌ || 7

హోమఃకార్యోథరాజేంద్ర! సావిత్ర్యాచయతాత్మనా | ఏతత్ర్పోక్తం ద్విజాతీనాం స్త్రీశూద్రేషుతథాశృణు || 8

ద్వాదశాష్టాక్షరో మంత్రస్తేషాం ప్రోక్తో మహాత్మనామ్‌ | హితౌచద్విజాతీనాం మంత్రశ్రేష్ఠౌ నరాధిప || 9

తాభ్యామభ్యధికో మంత్రో విద్యతేనేహకుత్రచిత్‌ | వజ్ర ఉవాచ : ద్వాదశాష్టాక్షరౌ మంత్రౌ కథయస్వమమానఘ || 10

పుణ్యౌపవిత్రౌ మంగల్యౌ సర్వ పాపప్రణాశణౌ !

మర్కండేయ ఉవాచ : ఓం నమోభగవతే వాసుదేవాయ! ఓం నమో నారాయణాయ || 11

ఏతౌమయాతేకథితౌ పవిత్రౌ మంత్రోత్తమౌ పాపహరౌ వరేణ్యౌ |

పారాయణౌ సర్వ తపస్వినాంచ రహస్య భూతౌభువనేషు నిత్యమ్‌ || 12

యథాతిథిస్తే శ్రవణనయుక్తా మాఘస్యమాసస్యతథాతవోక్తా |

కార్యాతథేయం నృపతే విశేషా ద్యోగేపవిత్రే సరితోర్ద్వయస్య || 13

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే మహాపురాణ ప్రథమఖండే మార్కండేయవజ్రసంవాదే తిలద్వాదశీ ప్రశంసావర్ణనం నామత్రిషష్ట్యధిక శతతమోధ్యాయః.

భార్గవా ! ఏ ఒక్క కృష్ణపక్షద్వాదశినాడుపవసించి మహాఫలమును బొందవచ్చునో యానతిమ్మన మార్కండేయుడిట్లనియె. పుష్యమాసము గడచినమీదట శ్రవణనక్షత్రముతో గూడిన కృష్ణద్వాదశి తిలయుండలతో నివేదనము చేయుట నువ్వులనూనె దీపము పెట్టుట తిలతర్పణము సేయుట విప్రులకు తిలదానముసేయుట ప్రశస్తము. నాడుపవసించి తిలలతోహొమముసేయనగును. ఉపవసించి మరునాడు తిలలతోహోమముసేయుట చాలవిశేషము. బ్రాహ్మణులకు ఇంధనము (కట్టెలమోపు) దానము సేయవలెను. ఉపవాసముతో తిలప్రస్థము ప్రస్థపరిమాణతిలలను హోమముసేయవలెను. అట్టివానికి దుర్గతి కలుగదు. హోమముసేయునపుడు ''తద్విష్ణోః పరమం పదం'' అన్నమంత్రము నుపయోగింపవలెను. నియమశిలియై పురుషసూక్త శ్రీసూక్తములు సావిత్రీమంత్రమును సంపుటీకరించి హోమముసేయనగును. ఇదిద్విజులవిషయము. ఇక స్త్రీలు శూద్రులవిషయము వినుము. మహాత్ములయినవారికి ద్వాదశాక్షర అస్టాక్షర మంత్రములు సెప్పబడినవి. అది ద్విజులకును హితములే. వానినిమించిన మంత్రమింకొకటి యిటలేదు. అనవిని వజ్రుండామంత్రములు పవిత్రములు మంత్రోత్తమములు సర్వపాపహరములు మంగళ్యములుంగావున యవి యానతిమ్మన మార్కండేయుడు వాని నిట్లుపదేశించెను. ఓం నమోభగవతే వాసుదేవాయ- ఇదిద్వాదశాక్షరమంత్రము. ఓం నమోనారాయణాయ- ఇదిఅష్టాక్షర మంత్రము. శ్రేష్ఠములయిని యీమంత్రములను నేను నీకుపదేశించితిని. ఇవి సర్వతపస్వులకు పరమోపాస్యములు. భువనములందివి అతిరహస్యములను. రెండుపవిత్రనదుల సంగమమందు మఘానక్షత్రయుక్త పూర్ణిమనాడు (మాఘమాసములో) ఈ ద్వాదశీ విధినిర్వహణము చాలవిశేషము.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున ''తిలద్వాదశీ మహిమానువర్ణన'' మను నూటఅరువదిమూడవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters