Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటఅరువదియెనిమిదవ అధ్యాయము - పుష్పఫలాహరణ పూజా వర్ణనము వజ్రువాచ : ఉపవాసా೭సమర్థానాం హీనానాం ద్రవిణనచ | కర్మణాకేన ధర్మజ్ఞ ! తోష మాయాతి శంకరః ||
1 మార్కండేయః : సన్తి పుష్పాణ్యరణ్యషు మూలానిచ ఫలానిచ | స్వయం గ్రాహ్యాణి రాజేంద్రా! యైస్తుష్యతి జనార్దనః || చంద్రః సామాన్య దీపో೭యం విభ##వైః కంప్రయోజనమ్ | యథాలభ్యేన రాజేంద్ర! యై స్తుష్యతి జనార్దనః ||
3 ఫలమూలాశినో೭రణ్య కుసుమైర్మధుసూదనం | సంపూజ్య సతతం కామానభీష్టం ప్రతిపద్యతే ||
4 అకామస్తదవాప్నోతి యద్విష్ణోః పరమంపదమ్ | అరణ్యషునరః కృత్వా దేవదేవస్య చార్చనమ్ ||
5 అతీత ముద్ధరే ద్రాజన్ ! ఫలేన సశతం నృణామ్ | భవిష్యాణాం శతం చైవ నరాణాం యదునందన! ||
6 నగరే೭పి వసన్‌యస్తు భైక్ష్యాశీ సంశిత వ్రతః | ఆరణ్యా దాహృతైపుషై#్పర్మూల వత్రఫలాంకురైః ||
7 యథోపపనైః సతత మభ్యర్చయతి కేశవమ్ | సర్వకామ ప్రదో దేవస్తస్యస్యాన్మధుసూదనః || 8 తస్యాప్యకామకామస్య పరం స్థానం ప్రకీర్తితం | యత్రగత్వాన శోచన్తి తద్విష్ణోః పరమం పదమ్ || 9 స్వయ మాగత్య పుష్పాద్యైర్భైక్ష్యాశీవార్చనం | కృతం యేన సరాజేంద్ర! వంశాసుద్ధరతే శతమ్ || 10 వంశా సతీతాన్ పంచాశత్ తావతశ్చాప్యనాగతాన్ | ఉద్ధరే దాత్మనో రాజన్! నాత్రకార్యా విచారణా || 11 ఉపవాసము సేయలేనివారు నిరుపేదలు నేమి సేసిన శంకరుడు సంతుష్టుడగు నానతిమ్మన మార్కండేయుడు వజ్రనృపతి కిట్లనియె. ఆడవులందు పువ్వులు పండ్లు దుంపలు పెక్కులున్నవి. తమంతతామోవ్వరేని యేరితెచ్చికొనవచ్చును. దాని సమర్పణ మున హరి సంతుష్టుడగును. చంద్రుడు సర్వసాధారణ దీపము. దానికి విభనములుండుట లేకుండుటతోనేమిపని? లభించినదానిం దానుసమర్పించిన జనార్దనుడు హర్షించును. పండ్లు దుంపలు దిని యడవిలో ఋవ్వుల మధుసూదను నర్చించి యభీష్టార్థములం బడయవచ్చును. కోరికలులేనివాడు విష్ణువు పరమపదమదియందును. (ముక్తినందునన్నమాట) అస్థానమందినవానికి శోకముండదు. అరణ్యములందా దేవదేవు నర్చించినయతడు తత్ఫలముచే నూరుతరముల మునుపటివారిని తరువాతి వారిని గూడ యుద్ధరింపగలడు. నగరమందు వసించియు భిక్షాశనము నారగించి వ్రతనిష్ఠుడై అడవినుండి తెచ్చిన పూలతో పండ్లతో దుంపలతో నాకులతో జివుళ్ళతో బుట్టినవిపుట్టినట్లుగా గొనివచ్చి విష్ణువునర్చించినవానికి విష్ణువు సర్వకామము లనుగ్రహించును. గడచినవారి నేబది తరములవారు రాబోవువారి నేబదితర ములవారు మొత్తము నూరుతరములవారతనిచే నుద్ధరింపబడుదురు. ఇట సందేహమేమియులేదు. గృహస్థో೭పినరో రాజన్ ధర్మాగత ధనాగమః | అరణ్యా దాహృతైః పుషై#్పః యఃకుర్యాత్కేశవార్చనమ్ || 12 ఏతదేవ సమాప్నోతి నాత్రకార్యావిచారణా | ధర్మార్జిత ధనః క్రీత్వాయః కుర్వన్ కేశవార్చనమ్ || 13 స్వయముపై#్తశ్చ కుసుమైర్యః కుర్యా త్కేశవార్చనమ్ || ఉద్ధరిష్యత్య సందేహం సప్తపూర్వాపరాన్నరాన్ || 14 యథా కథంచి దాహృత్య కథంచి త్పూజయేద్ధరిమ్ | నాకవృష్ఠమావాప్నోతి నమే೭త్రాస్తి విచారణా || 15 మానుష్యేచ పరాం రాజన్! శ్రియమాప్నోత్యసంశయమ్ | వనా దాహృత్య కుసుమైః కర్తవ్యం దేవతార్చనమ్ || 16 పత్రం పుష్పం ఫలం తోయం దూర్వాంకుర మథాపివా | నివేదయిత్వా కృష్ణాయ భోక్తా నాకమావాప్నుయాత్ || 17 అక్షమై స్తూపవాసానాం తథా ధన వివర్జితైః | వనా దాహృత్య కుసుమైః కర్తవ్యం దేవతార్చనమ్ || 18 అరణ్యా దాహృతైః పుషై#్పః సంపూజ్యమధుసూదనమ్ | గృహస్థుకూడ ధర్మమునవచ్చిన ధనముతో నరణ్యానీతములయిన పుష్ప ఫలాదులతో ధర్మార్జిత ధనముతో కొన్నవానితో గాని కేశవునర్చించి యిదేఫలమందును. తనకుదా గోసిన పూవులతో హరినర్చించిన యతడు సప్తపూర్వోత్తర పితృవర్గము నుద్ధరించును. ఏదోవిధముగ నీ పూజాసామగ్రి సేకరించి యెట్లేని హరినర్చించి నా కపృష్ఠ మధిరోహించును. ఇచట విమర్శలేదు. వనము నుండి కొనివచ్చిన పూలతో హరినర్చించి మనుష్యజన్మమందు పరమైశ్వర్యమునందును. పత్రము పుష్పము ఫలము తోయము, గరిక మొలకగాని కృష్ణునికి నివేదించిన ప్రసాదముగ భక్షించినవాడు నాకమునందును. ఉపవాసము సేయలేనివారు ధనహీనులు నడవి నుండి పువ్వులుతెచ్చి హరినర్చింపనగును. ముందటి పుట్టువున అరణ్యాహృతములయిన పూలచే మధువైరి నర్చించి పొందిన రాజ్యమునుగురించి యిదెవినుము. పూర్వజన్మని సంప్రాప్తం శృణు! నరాధిప! || 19 నృగోయయాతి ర్నహుషో విష్వగశ్వః కరన్ధమః | దిలీపో యవనాశ్వశ్చ ఋతువర్నో భగీరథః || 20 సోమకః సహదేవశ్చ మహామాలో మహాహనుః ! | రేవకః కాలకాఖ్యశ్చ కృతవీర్యో గుణకరః || 21 దేవరాతః కకుత్థ్సశ్చ వినీతో విక్రమే రఘుః | మహోత్సాహో వీతభయో నిరిమిత్రః ప్రభాకరః || 22 కపోతరోమా వర్జన్యశ్చంద్రసేనః పరాంతకః | భీమసేనో దృఢరథః కుశనాభః ప్రభద్రకః || 23 ఏతేచాన్యేచ బహవః పూర్వజన్మని కేశవమ్ | పూజయిత్వాక్షితా వస్యాంప్రాపుః రాజ్యమకంటకమ్ || 24 యక్షత్వమథ దేవత్వం గంధర్వత్వం తథైవచ | విద్యాధరత్వం నాగత్వం యేగతా మనుజోత్తమ! || 25 బహుత్వాత్తే కథం శక్యా మయావక్తుం తవానఘ | తస్మాద్యత్నః సదా కార్యః పురుషైః కుసుమార్చనే || 26 అరణ్యజాతైః కుసుమైః సదైవ సంపూజయిత్వా స్వయమాహృతైస్తు | సర్వేశ్వరత్వం ఫల మాప్నువన్తి రాజేంద్ర! తద్వర్ణయితుం నశక్యమ్ || 27 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే మహాపురాణ ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే పుష్పాహరన ఫల వర్ణనం నామ అష్టషష్ట్యధిక శతతమోధ్యాయః. నృగుడు యయాతి సహుషుడు విష్వగశ్వుడు కరంధముడు దిలీపుడు యవనాశ్వుడు ఋతుపర్ణుడు భగీరథుడు సోమకుడు సహదేవుడు మహామాలుడు మహాహనువు రేవకుడు కాలకుడు కృతవీర్యుడు గుణకరుడు దేవరాతుడు కకుత్థ్సుడు వినీతుడు విక్రముడు రఘువు మహోత్సాహుడు వీతభయుడు నిరమిత్రుడు ప్రభాకరుడు కపోతరోముడు పర్జన్యుడు చంద్రసేనుడు పరాంతకుడు. భీమసేనుడు దృఢరథుడు కుశనాభుడు ప్రభద్రకుడు ననువీరు మరియెందరో ముందటిజన్మమందు హరినర్చించి యీ క్షితియందకంటక మైన రాజ్యముంబడసిరి. యక్షత్వము దేవత్వము గంధర్వత్వము విద్యాధరత్వము నాగత్వము పొందినవారున్నారు. వారు పెక్కురగుటవలన నీకునేనుజెప్పటకు వశముగాదు. అందుచే మానవులు పూలచే హరినర్చింప యత్నము సేసి తీరవలయును. అరణ్యము లందు పూసినపూలను దానుస్వయముగా గొనివచ్చి హరినర్చించినచో సర్వైశ్వర్యవంతు డగును. రాజేంద్ర! ఆఫలము వర్ణనకందదు. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున పుష్ప ఫలాహరణ పూజావర్ననమను నూటఅరువదియెనిమిదవ అధ్యాయము.