Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటడెబ్బదిరెండవ అధ్యాయము - ప్రదుర్భావ స్వరూప వర్ణనము

వజ్ర ఉవాచ : 

ప్రాదుర్బావా వరాహాద్యాః సర్వేశ స్యామితాత్మనః | మహాభూతచయా స్సర్వేజన్మ మృత్యు యుతాశ్చమే || 1

యద్యేవం ప్రాణిభిస్తేషాం కో విశేషో భృగూత్తమ! | ఏతత్త్వం సంశయం ఛిన్ధి పరం కౌతూహలంహిమే || 2

మార్కండేయః : సర్వేజీవా మహీపాల! కర్మబంధనిబంధనాః | జాయన్తేచ మ్రియంతేచ పరతంత్రా స్సదైవ హి ||

ఈశ్వర ప్రేరితై ర్నిత్యం కర్మబంధైః శుభాశుభైః | జన్మాంతర కృతైర్భూవ! సుఖదుఃఖ సమన్వితాః || 4

వాసుదేవస్తు ధర్మాత్మా ప్రాదుర్భావేషు యాదవ! | ఆత్మనః స్వేచ్ఛయా జన్మ విధత్తే మరణం తథా || 5

కర్మాణినచ లింపన్తి ప్రాదుర్భావేష్వపి ప్రభుమ్‌ | కర్మస్వపి సదా సక్తం పద్మపత్రమివాంభసా || 6

ఫలానాం కర్మజాతానాం భోగం తత్రాపి యాదవ! | నృణాం దర్శయతే మిథ్యా మర్యాదా భేదధీర్నృప! 7

యదా యదాహిధర్మస్య గ్లానిర్భవతి యాదవః | అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజత్యసౌ || 8

దేవతిర్యజ్‌ మనుష్యేషు గంధర్వోరగ పక్షిషు | యోనిష్వన్యేష్వపి తథా బుద్ధ్వాకార్య బలాబలమ్‌ || 9

యస్యాం యస్యాం యదాయోనౌ ప్రాదుర్భవతి కారణాత్‌ | తద్యోని సదృశం తత్స తదాలోకే విచేష్టతే || 10

సంహర్తుం జగదీశానః సమర్థోపితదా నృపః | తద్యోని సదృశోపాయైర్వధ్యాన్‌ హింసతి యాదవ! || 11

హరియొక్క వరాహాది ప్రాదుర్భావములు (ఆవతారములు) మహాభూతసంఘములు జన్మమృత్యువులుగల వేయైనచో వానికి వీనికి ప్రాణిసమూహమునకు గలభేదమింకేమున్నది? ఈ సంశయము వారింపుము. వినువేడుకనున్నానని వజ్రుండనగా మార్కండేయుడిట్లనియె. మహీశా ! అన్ని ప్రాణులు కర్మబంధముతో ముడిపడియున్నవే. అని పుట్టుచు గిట్టుచుండును. ఎల్లపుడు నవి పరాథీనములు. ఈశ్వరప్రేరితములయిన జన్మాంతరకృత పుణ్యాపుణ్య కర్మబంధములచే సుఖదుఃఖములతో గూడుచుండును. వాసుదేవుడు మాత్రము ధర్మమూర్తికావున అవతారములందు స్వేచ్ఛగాదనకు దాన పుట్టువును మరణమును గల్గించుకొనుచుండును ఈప్రాదుర్భావములందు ప్రభువుగావున (సర్వ సమృద్ధుడుగావున) ఆయనకు నేకర్మములు నంటువడవు. ఆయన యాయాకర్మము లందున్నను దామరాకు నీటిచే నంటువడనట్లు వానిచే నతడంటువడడు (నిర్లిప్తుడుగానే యుండును) ఆయన కాయనచేసిన కర్మముల ఫలానుభవముకూడలేదు. అయినను లోకమొక హద్దుమీరునను భయముచేత వలె దానును కర్మఫలమనుభవించుచున్నట్లు ప్రదర్శనము సేయును. ఆయన సీతా వియోగాదుల వలన శోకించుట మొదలయినదంతయు లోకమున కేకపత్నీవ్రతమర్యాద యలవరచుటకు చేసిననటనకాని నిజానికా శోకస్పర్శయాయనకు లేనే లేదన్నమాట. ఓ యాదవ! ఎప్పుడేప్పుడు ధర్మమునకుగ్లాని (వాడు వాటు) గల్గునో, అధర్మమున కభ్యుత్థానము (ఎగిసిపాటు) గల్గునో అప్పుడప్పుడు దనను దాసృజించుకొనును. అందుచేతగూడ ఆ యాకారములయొక్క బాలాబలమెరిగి దేవతలలో పశుపక్షులలో మనుష్యులలో మరి యితర యోగులలో దనను బ్రాదుర్భవింపజేసి కొనును. ఏయేయోనియం దెప్పుడు కారణవశమునందానవతరించునో ఆయోనికి (జన్మకారణమైనజాతికి) అనువుగ నతడెల్లపుడు నడచుకొనును (ఆయాచేష్టలచేయు నన్నమాట) జగదీశానుండాయన సంహారముసేయుటకు సమర్థుండయ్యు నాయవతార సమయమునందు దానికి సరియైన యుపాయములచేతనే వధ్యులను (చంపదగినవారిని) జంపును.

హార్దంతమస్తథానైశం మూర్తంచ పురుషోత్తమః | ఏక ఏవ సలోకానాం నాశయ త్యమల ద్యుతిః || 12

హార్దం ధ్వస్తం తమస్తేన జగతో దేవమూర్తినా | జ్యోతీరూపేణచ ధ్వస్తం తమో నైశం సుదారుణమ్‌ || 13

తమెనాశయితుం మూర్తం ప్రాదుర్బావ గతః సదా | మూర్తం తమశ్చ రాజేంద్ర! దైత్యదానవ రాక్షసాః || 14

వధ్యానా మపిదైత్యానాం దేహస్థోపి జనార్దనః | న విముంచతి దేహాని యుక్త్యా తాంశ్చ జిఘాంసతి || 15

అపురుషోత్తముడు లోకముయొక్క హృదయగతమైన తపస్సును (తమోగుణమను చీకటిని) రాత్రిసంబంధమైన తమస్సును=చీకటిని గూడ కేవలనిర్మల జ్ఞానజ్యోతి స్వరూపుడుగావున తానొక్కడే హరించును. దేవమూర్తియై (హృదయ గుహయందు నీవారశూకమట్లు సుసూక్ష్మమైయున్న యణురూపమైన జ్యోతియొక్క శిఖమధ్య దీపించుపరమాత్మతానై) జీవుల హార్దమైన తమస్సును ( హృద్గుహయందు సంస్కారరూపమైయున్న తమోగుణమును) ధ్వంసముచేయును. రాత్రిగ్రమ్ముకొను కారుచీకటిని సూర్యాదిజ్యోతీరూపమును తేనేయైహరించుచుండును. మూర్తమైన (రూపుగొన్న) తమస్సు నాశనము సేయుటకప్పుడును ప్రాదుర్భావ మందును. (అవతారము ధరించును) మూర్తమైన తమస్సనగా నోరాజేంద్ర! యేదోకాదు దైత్యదానరాక్షసులేయా చీకటి. వధ్యులయినయాదైత్యుల దేహమందు హరితానుండియు నా దేహములను దాను విడువడు సర్వాంతర్యామిగా దానటనుండియే యుక్తిచేత వాండ్రను సంహరించును.

దేవతానాం గురూణాంచ ద్విజానాంచ గురుప్రియః | శాస్త్రదృష్టేన విధినా భవత్యారాధనే రతః || 16

నచ తస్యాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించన | నైవానాప్త మవాప్తవ్యం వర్తతేథచ కర్మసు || 17

సర్వజ్ఞః సర్వదర్శీచ సర్వశక్తి రపి ప్రభుః | తథాప్యధీతే యజతే తప స్తప్యతి పార్థివ ! || 18

మర్యాదా స్థాపనార్థాయ జగతో హితకామ్యయా | కరోతి రాజన్‌! కర్మాణి కీనాశ ఇవదుర్బలః || 19

యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరోజనః | సయత్ర్పమాణం కురుతే లోక స్తదను వర్తతే || 20

ఏత త్కారణ మాస్థాయ సదా కర్మసు వర్తతే | ప్రాదుర్భావ కృతోవిష్ణుః యథాన్యః ప్రాకృత స్తథా || 21

గురుప్రియుడు కావున నాభగవంతుడు శాస్త్రము (వేదము) నందుగానవచ్చు విధిచే (వేదవిహిత విధానముచే) దేవతల యొక్కయు గురువులయొక్కయు ద్విజులయొక్కయు ఆరాధనమందు ఆసక్తిగలవాడగుచుండును. అయగుటలో నాయనకెట్టి కర్తవ్యము ముల్లోకములందునులేదు. లేకపోయినను లోకాను శిక్షణము కొరకు గుర్వారాధ నాదికర్మము లిందతి శ్రద్ధతో వర్తించుచుండును తానుపొందనిది పొందవలసినదియు నాయనకులేదు. అయినను కర్మములయందు బ్రవర్తించుచుండును. ప్రభువు సర్వజ్ఞుడు సర్వదర్శి సర్వశక్తితానయ్యునుంగూడ యధ్యయనము సేయును యజ్ఞములు సేయును తపస్సుచేయును రాజా! జగత్తు హితవుకోరి మర్యాదాస్థాపనకై యిటుసేయును దుర్బలుడైన నిరుపేదవలె కార్యములు సేయును. శ్రేష్ఠుడు (పెద్ద) సేయుపనిని తదితరుడుం కొద్ది వాడును జేయును. అతడు ప్రమాణముగాగొను ప్రమాణమును లోకమనువర్తించును. ఇది కారణముగా గైకొని ప్రాకృతుడట్లు పాదుర్భావములు సేయును. అవతారము లెత్తును.

దేవేభ్యశ్చ ఋషిభ్యశ్చ వరాన్‌ ప్రార్థయతే సదా | వరాంశ్చ వరదస్తేషాం మానయత్యపి పాండవ! || 22

ప్రాదుర్బావ రతస్తస్మాత్‌ పరోయమితి మానవాః | పురుషం నాధిగచ్ఛన్తి మోహితా స్తస్య మాయయా || 23

ప్రాదుర్భావం గతోప్యేవం సంహత్యేస చరాచరమ్‌ | నిమేషాంతర మాత్రేణ శక్తిమాన్‌ జగతః ప్రభుః || 24

ప్రాదుర్భావ గతస్యాపి తస్య సర్వగతా స్మృతా | స్వతంత్రతాచ సర్వత్ర నాత్ర కార్యా విచారణా || 25

మహ ద్విశేష మేతత్తే ప్రాణిభిః ప్రాణినాం పతేః | మయోక్తం తస్య దేవస్య సర్వగస్య స్వయం భువః || 26

అంతియగాదు తానును దేవతలనుండి ఋషులనుండియు వరము లడిగికొనును. పరదుడయ్యుంతాను వారిచ్చిన వరములను గౌరవించును అవతారములెత్త వేడుకపడువాడీతడు వేరిని ప్రాకృతుడని (సామాన్యమానవుడని) మానవులా ప్రభువు యొక్క మాయచే మోహితులగుచుందురు. ఇటు తాననతారమెత్తియు చరాచరమైన యీ జగత్తును రెప్పపాటులో నుపసంహరించుట కాప్రభువు శక్తిబంతుడై యున్నాడు. అవతార మందుండియు నతడక్కడ యొకచోటనేయున్నాడు. ఆయన సర్వగుడగుట స్మృత మైనది. ఆయన స్వతంత్రతగూడ యెల్లయెడల స్మృతమైనది ఇక్కడ మరి విమర్శచేయరాదు. సామాన్యప్రాణులకంటె నీమహా విశేషము సర్వప్రాణి పరిపాలకుడు దేవదేవుడు సర్వగతుడు స్వయంభువుడు నైన యాతనిది. నేను నీకు దెల్పితిని.

అక్షిప్తాః కర్మభిః పుణ్యౖః కైశ్చిద్యదు వరోత్తమ! | తేషామా విశ##తే దేవ స్తేజసాతేన సర్వశః || 27

అవిష్ఠాస్తేజసా తేన దేవేన పరమేష్ఠినా | తద్వత్కర్మాణి కుర్వన్తి పూజ్యమానా మహర్షిభిః || 28

తథాతుకాలే సంస్యస్తా స్తేన వైష్ణవ తేజసా | దిష్టాంత వశ మాయాన్తి తసై#్మత దుచితం యథా || 29

యేచకేచన లోకేస్మిన్‌ దృశ్యన్తే తేజసాన్వితాః ! | తేషాం తద్వైష్ణవం తేజస్త్వయా జ్ఞేయం మహీవతే! || 30

యచ్చంద్రమసి యచ్చాగ్నౌ యచ్చసూర్యే జగత్పతౌ | తేజః పశ్యతి తత్సర్వం వైష్ణవం విద్ధి పార్థివః || 31

అగస్త్య ప్రముఖానాంచ యాచశక్తి రతీంద్రియా | తత్థ్సస్య రాజన్‌ ! సాజ్ఞేయా త్వయా వైష్ణవ తేజసా || 32

యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జిత మేవవా! | తత్తదేవావగచ్ఛ త్వం యుక్తం వైష్ణవ తేజసా || 33

యదువంశభూషణా! కొందరనేక పుణ్యకర్మములందు నిమగ్నులై యుందురు. అట్టి మహానుభావులకు తేజస్సుచే నా విష్ణువు సర్వత్ర యావేశించును. అనగా పుణ్యశీలురుచేసిన తపస్సునకు ఫలముగా వారి భావనననుసరించి యాయా యావేశావతారము లెత్తుచుందురని భావము. అవిష్ణువు పరమేష్ఠి తేజస్సుచే నావేశింపబడినవారు-వరాహాద్యవతారమూర్తులు మహర్షులచే పూజింపబడుచున్న వారై యాయవతార ప్రయోజన నిర్వహణమున కాయాపనులు సేయుచుందురు. అట్లే కాలక్రమమున నావైష్ణవ తేజస్సు నా విష్ణువుపసంహరించినపుడు, దైవవశులై అవతారోప సంహారము పొందుదురు. అదికూడపరాత్పరుని కభిమతముగానే జరుగును. రాజా! ఈలోకమందే కొందరు తేజస్సంపన్నులుగా గానవత్తురో వారి తేజస్సు (వారియందున్న యావిశిష్ట ప్రభావ వైభవము.

విభూతి) అది వైష్ణవ తేజస్సేయని నీవెరుంగవలసినది. రాజా! చంద్రునందు జగతత్పియగు సూర్యునందుగల తేజస్సు వైష్ణవతేజమని యెరుంగుము. ఆగస్త్యప్రముఖులగు మహర్షులందుగల ఆతీంద్రియశక్తియు విష్ణువుయొక్క తేజస్సుతోడిదిగా నీ వెరుంగదగినది. విభూతి (ఐశ్వర్య) యుతము శ్రీమంతమునగు ప్రాణిజాతమెల్ల వైష్ణవతేజస్సుతో గూడినదని నీవవగాహన సేసి కొనుము.

బ్రాహ్మణానాం సురాణాంచ సాధ్వీనాంచ తథా గవామ్‌ | జగతీం ధారిణీం శక్తిం విద్ధి తాం వైష్ణవీం విభోః || 34

రాజానస్తేజసా యుక్తా వైష్ణవేన వసుంధరామ్‌! | పాలయన్తి మహీపాలా! వీర్యోదగ్రాః యశస్వినః || 35

ఋషయశ్చతథా విప్రాః వేద వేదాంగ పారగాః! | పాలయన్తి జగత్‌ కృత్స్నం యుక్తా వైష్ణవ తేజసా || 36

త్రేతాయుగాదౌ యే కాచి జ్జాయన్తే చక్రవర్తినః | గురుణా విద్ధి తాన్సర్‌వాన్‌ సంయుక్తా న్విష్ణుతేజసా || 37

ఆజాను బాహవ స్సర్వే న్యగ్రోధ పరి మండలాః | జిహ్వయా సకలం వక్త్రం పరిమార్జన్తి తేతథా || 38

షష్ట్యా దంతైశ్చ సంయుక్తా దంష్ట్రాభిశ్చ తథాష్టభిః | ఔర్ణేయంచ శుభం తేషావ భవ త్యన్తర్ర్భువోర్నృపః || 39

చక్రాంకితైః పాదతలైః కరైశ్చాపి శరాంకితైః | జాలపాద కరాశ్చైవ తథా తురగ మేహనాః || 40

రూపవన్తః ప్రభావన్తో వపుష్మన్తశ్చ యాదవ! | అతీంద్రియ జ్ఞాన బలాః పృథివ్యాం చక్రవర్తినః || 41

తేషాంతుసప్తరత్నాని భవన్తీహ మహీతలే | హస్త్యశ్వరథ రత్నాని భార్యా రత్నం తథైవచ || 42

తథైవాయుధ రత్నంచ మణి రత్ననిధిస్తథా | చతస్ర శ్చాప్రతిహతాః తేషాం తు గతయస్తథా || 43

పాతాలే గగనే శైలే సముద్రేచ మహీపతే! | సముద్రః స్తంభితజలః ప్రయాణ చక్రవర్తినామ్‌ || 44

భూసమాశ్చ తథా శైలాః మార్గేతేషాం భవన్తితు! | భూమిర్దదాతి వివరం పాతాళ ముపయాస్యతామ్‌ || 45

నవిషీదన్తి గగనే తథా తేషాం తురంగమాః! | శ్రుతేన తపసా యజ్ఞై ర్వీర్యేణాస్త్రబలేన చ || 46

సర్వేభ్యస్తేతిరిచ్యన్తే ప్రాణిభ్యో మనుజేశ్వర! | ఆరాధిత జగన్నాధాః ప్రాప్నున న్తీహ తత్పదమ్‌ || 47

వర్షాయుతాని జీవన్తి షడష్టసప్త వా నృప! | తేషాంచ తేజసా విష్ణుః కరోత్యాప్యాయనం సదా || 48

యేన తే కథితం సర్వం ప్రాప్నువన్తి గుణోదయమ్‌ | స్థానా న్తర గతేనాపి తేపి వైష్ణవ తేజసా || 49

సంహార ముపగచ్ఛన్తి క్షయకాల ఉపస్థితే | క్షయకాలేచ మాంధాతు స్తేజ స్తదతిదుస్సహమ్‌ || 50

వైష్ణవం శూలి శూలాగ్ర మాశ్రయామాస యాదవ! | అర్జునస్య నరేంద్రస్య యుక్తస్య హరి తేజసా || 51

హరిరేవాంత కృచ్చాసీ ద్రామోభృగుకులోద్వహః | భార్గవస్యచ రామస్య తేజ స్తదతిదుస్సహమ్‌ || 52

అదత్తే వైష్ణవం ఘోరం రామో దశరథాత్మజః | కాంచిత్తను మధిష్ఠాయ తేన ఘోరేణ తేజసా || 53

కరోతి దేవకార్యాణి కృతకర్మా తతః ప్రభుః | ఆదానం తేజస స్తస్య విధత్తే స స్వతేజసా || 54

నాన్యః శమయితాలోకే నృప! వైష్ణవ తేజసః |

తస్యావ తేరేషు మయా స్వరూప మేత త్తవోక్తం భువనస్య పత్యుః |

రహస్య మేత త్పరమం మునీనాం జ్ఞానా మృతం కల్మషనాశకారి || 56

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే

ప్రాదుర్భావ స్వరూప వర్ణనం నామ ద్విస ప్తత్యధిక శతతమోధ్యాయః.

బ్రాహ్మణులు దేవతలు సాధ్వులు (వతివ్రతలు) గోవులు అనువానిలోగల జగద్ధారిణియైన శక్తిని ఆవైష్ణవీ శక్తి యని ఎఱుంగుము. వైష్ణవతేజః సంపన్నులై సరాజులే వీర్యోదగ్రులై యశస్వులై వసుంధరం బాలింతురు. ఋషులు వేదవేదాంగపారగులైన విప్రులు వైష్ణవతేజ స్సుతోగూడియుండియే సర్వజగద్రక్షణము చేయుచున్నారు త్రేతాయుగము మొదట నేచక్రవర్తులుదయించిరో వారినందరసు గొప్ప విష్ణు తేజస్సుతో గూడినవారింగా నెరుంగుము. అజానుబాహువులు ఊడలువారిన పెను మఱ్ఱివృక్షమువలె విస్తరించిన కేశబంధముగల యా ప్రభువులు నాలుకతో నెల్లవదనమును (ముఖమును) పరిమార్జింతురు. అరువదిదంతములతో నెనిమిది కోరలతో గూడినవారికి కనుబొమలనడుమ శుభలక్షణమై ఔర్ణేయము (సాలీడు వంటిరేఖ గుర్తు) కనిపించును. పాదములలో చక్రరేఖలు, కరములలో బాణరేఖలు గానవచ్చును. జాలపాదము (హంస) గుర్తుచేతులందుండు (రహస్యులు) వారు తురగమేహనులు (అశ్వమేఢ్రులు) రూపవంతులు ప్రభావంతులు కండ పుష్టిగల విగ్రహములు (శరీరము) గలవారు అతీంద్రియాజ్ఞానమే బలముగ గలవారునగు చక్రవర్తులకీ మహీతలమందు సప్తరత్నములు గల్గును. అవి హస్తి అశ్వరథరత్నములు, భార్యారత్నము, అయుధరత్నము మణినిధి రత్ననిధి. వారు పాతాళము, పర్వతము, సముద్రములందు అప్రతిహతగతులు ( అడ్డులేని సంచారములు) అట్టి చక్రవర్తుల ప్రయాణమందు సముద్ర బలము స్తంభితమగును. మార్గమున పర్వతములు నేలతోసమానమగును. పాతాళమునకేగుచో వారికి భూమి వివరమొసంగెను (దారియిచ్చును) వారి గుఱ్ఱమలాకాశమందు విషాదమునందవు. ఆకాశయానము సేయునన్నమాట. శ్రుతము (పాండిత్యము) తపస్సు యజ్ఞములు వీర్యము అస్త్రబలము అనువానిచే వారందరు ప్రాణులనతిశయింతురు . జగన్నాథుని (విష్ణుని) ఆరాధించుచు వారు వైష్ణవ పదమధిష్ఠింతురు. వారు ఆరువదివేలు డెబ్బదివేలు ఎనుబదివేల సంవత్సరమలు జీవింతురు. విష్ణువు తనతేజస్సుచే నిత్యము వారి కాప్యాయనము సేయుచుండును. నావిష్ణుః పృథివీ పతిః అన్నమాట. దానివలననే వారీచెప్పిన గుణోదయమునందు (లక్షణ సంపద) పొందుదురు-వారుక్షయకాలమురాగా వారిలోని వైష్ణవ తేజస్సు మరొక స్థానమునకుపోగా వారు సంహారమందుదురు. (పరమ పదింతురన్నమాట) క్షయకాలమందుగూడ మాంధాత తేజస్సు అతి దుస్సహయైయుండెను. అవైష్ణవ తేజస్సాసమీపములందు శూలి (శివుని) మొక్క శూలము చివరనిలిచెను. విష్ణుతేజస్సుతో గూడిన చక్రవర్తి (కార్తవీర్యార్జునుని తుదముట్టించినవాడు భృగుకుల సంభవుడును పరశురామరూపమున హరియే అయ్యెను. భార్గవరాముని తేజస్సతిదుస్సహము. దశరథకుమారుడు పరశురాముని ఘోర వైష్ణవ తేజస్సును స్వీకరించెను. ఒకానొక మానవతనువు నధిష్ఠించి యా ప్రభువు వైష్ణవ తేజస్సుతో దేవకార్యములు చక్కబెట్టినాడు. దాననా ప్రభువు కృతార్థుడునయ్యెను. ఆయన తన తేజస్సుచే నావిష్ణు తేజస్సును గ్రహించినాడు (లోననిమిడించుకొన్నాడు) లోకమందు మరియెవ్వడును వైష్ణవతేజస్సు నుపశమించి జేయగలవాడులేడు. భువన ప్రభువగు ఆవిష్ణువుయొక్క యవతారములందలి యీ పరమరహస్య స్వరూపమును మునులకు జ్ఞానామృతమైన దానిని కల్మషనాశకారియైన దానిని నీకే నానతిచ్చితిని.

ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున ప్రాదుర్భావ స్వరూపవర్ణనమను నూటడెబ్బది రెండవయధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters