Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటడెబ్బదియేడవ అధ్యాయము - ద్వితీయమన్వంతర కథ శాంబరాణ్యువాచ : మనుః స్వరోచిషోనామ బభూవ తదనంతరమ్ |
యస్యాసన్ సుమహాభాగాః పుత్రాః భూమండలేశ్వరాః ||
1 చైత్రః కవిరుత శ్చైవ కృతాన్తో విద్యుతో రవిః | బృహద్రథో సభ##శ్చైవ మహాబల పరాక్రమః ||
2 ఊర్జస్తస్య తధా ప్రాణ ఋషభో నిశ్చలస్తథా | దన్తోభిః శాక్తరీవాంశ్చ ఋషయస్యప్త కీర్తితాః |
3 భూషితా ద్వాదశ ప్రోక్తాఃతథా పారవతాశ్చయే | తేషామింద్రో విపశ్చిచ్చ మహాత్మా లోకవిశ్రుతః ||
4 అసంస్తస్యాసురా ఘోరా స్తదా దాయాదబాంధవాః | తేషా మాసీత్తదా రాజా పురుణిత్సో బలాధికః ||
5 శక్రస్య విప్రియాసక్తో మృగయాయై వనంగతః | వ్యధమ త్కుంజరాన్ మత్తాన్ బహువీర్య సమాశ్రయః ||
6 హస్తీభూపాల సచివః సజఘాన హరీన్ వనే | బఘూన సఃశైల ఇవాతి వర్ష్మా నీలాంజనాభో రచితోగ్రహ సః | జఘాన తం దైత్యవరం ప్రసహ్య దేవా೭సురాణాం సమరేష్వవధ్యమ్ || 7 ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్ర సంవాదే శక్రం ప్రతి శాంబరాయిణ్యుపాఖ్యానే ద్వితీయ మన్వంతరకథా వర్ణనం నామ సప్త సప్తత్యధిక శతతమో೭ధ్యయః. శాంబరాయణి యింద్రుని కిట్లనియె. అటుపై స్వారోచిషమనువు (స్వరోచికుమారుడు) వచ్చెను. అతని కొడుకులు భూదుండలేశ్వరులు. చైత్రుడు, కవిరుతుడు, కృతాంతుడు, విద్యుతుడు, రవి, బృహద్గ్రహుడు సభుడు ననువారు అతనికాలములో ఊర్జుడు ప్రాణుడు ఋషభుడు నిశ్చలుడు దంతుడు అభి శక్వరీవంతుడు ననువారు సప్తర్షులు (భాడుమో) పండ్రెండుగురు పారావతులను వారు భూషితులైరి. వారికింద్రుడు ''విపశ్చిత్తు'' అను పేరలోక ప్రసిద్ధుడు. అతనికిల ఘోరులైన అసురులు దాయాదులు బంధులునై యుండిరి. వారికప్పుడు బలవంతుడగు పురుకుత్సుడు రాజయియుండెను. అతడు ఇంద్రునికి కీడుసేయగోరి వేటకై యడవి కేగెను. వీర్యాతిశయమున ననేక మదపుటేనుగులను గూల్చెను. వాని మంత్రిహస్తియనువాడు గూల్చెను. అతడు పెద్దపర్వతమట్లుండి కారునలుపు శరీరముగల్గి యరచేతనేకొట్టి సింహములం గూల్చెను. వాని మంత్రిహస్తియనువాడు గూల్చెను. అతడు పెద్దపర్వమట్లుండి కారునలుపు శరీరముగల్గి యురచేతనేకొట్టి సింహములం గూల్చెను. ఆ ధైత్యనాయకు నింద్రుడు సంహరించెను. ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణమునందు ప్రథమఖండమున ద్వితీయమన్వంతరకథయను నూట డెబ్బది ఏడవయధ్యాయము