Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటడెబ్బదితొమ్మిదవ అధ్యాయము - చతుర్థమన్వంతరకథ

శాంబరాయణీ : తామసస్యమనోః పుత్రాం శ్చతుర్థస్యనిబోధమే | జానుజంఘః శాన్తభయోనయః ఖ్యాతిర్నర స్తథా ||

ప్రియభృత్యో హ్యవిక్షిచ్చ ప్రస్థిలశ్చ దృఢేషుధిః | కృతశ్చకృతగంధశ్చ తామసస్య మనోఃసుతాః || 2

ఋషిర్వనః కఠీయా న్వైగాత్ర శ్చైత్రోగ్నిరేవచ | జ్యోతిర్వాసాః పృథుఃకార్యః ఋషయః సప్తకీర్తితాః || 3

సత్యాః సుపాదాః సురిహా హరశ్చేతి ప్రకీర్తితాః | దేవతానాం గణాఏతే చత్వారః పంచవిశకాః || 4

సత్యానామపిభేదౌద్వౌ సత్యా విశ్వాశ్చ కీర్తితాః | సత్వాద్వాదశ నిర్దిష్టాః విశ్వాః ప్రోక్త స్త్రయోదశ || 5

తేషామాసీ న్మహాతేజాః శిబిరింద్రః ప్రతాపవాన్‌ | అసం స్తస్యాసురా ఘోరాః తదా దాయాద బాంధవాః || 6

యేషా మాసీ న్మహాతేజా రాజా భీమరథః ప్రభుః | ప్రసాద్య యేన బ్రహ్మాణ మవధ్యత్వంస్థలే వృతమ్‌ || 7

జలం స వర్జయామాస తతః ప్రభృతి దుర్మతిః | స దదర్శ మరౌ కూర్వం పర్వతాకార దర్శనమ్‌ || 8

తామారురోహ దుర్బుద్ధిః కౌతూహల సమన్వితః | సమారూఢం మహాకాయ మాదాయ భగవాన్‌ హరిః || 9

కూర్మరూపధరో వేగాత్పాతాళ జల మావిశత్‌ | పాతాళజల మానీయ మజ్జయిత్వా జగామ తమ్‌ ||

అక్రమ్య తం మహాకాయం మమతా కూర్మవర్ష్మణా || 10

ఏవం స కూర్మేణ జలే ప్రసహ్య దేవేశ్వర స్యా ప్రతిమస్య శత్రుః |

నిపాతితః సర్వసుర ప్రధానః సర్వేశ్వరేణాప్రతిమేన తేన || 11

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే చతుర్థతామస మన్వంతర వర్ణనం నామ ఏకోనాశీత్యధిక శతతమోధ్యాయః.

శాంబరాయణి యిట్లనియె. తామసమనువు కొడుకులు జానుజంఘుడు, శాంతభయుడు, నయుడు, ఖ్యాతి, నరుడు, ప్రియ భృత్యుడు అవిక్షిత్తు ప్రస్థిలుడు దృఢేషుధి కృతుడు కృతగంధుడు అనువారు. ఈతని మన్వంతరమందు సప్తర్షులు ఋషియగు వనుడు కఠీయన్‌ గాత్రుడు చైత్రుడు అగ్ని జ్యోతిర్వాసుడైన పృథువు కార్యుడు ననువారు. సత్యులు సుపాదులుసురిహులు హరులుననునీనాల్గు దేవతాగణములు ఇందొక్కక్కదానియందు ఇరువది యైదుమంది దేవతులున్నారు సత్యులనువారిలోగూడ సత్యులు విశ్శులు నను రెండు భేదములు గలవు; సత్యులు పండ్రెండుగురు. విశ్వులు పదుముగ్గురు! వారికి ప్రతాపవంతుడు మహాతేజస్వియగు శిబి యింద్రుడై యుండెను; అతనికి జ్ఞాతులు బాంధవులు ఘోరులయిన యసురులున్నారు. వారికి రాజు భీమరథుడను ప్రభువు; అతడు బ్రహ్మను ప్రసన్నునిం జేసికొని నేలయందు మథింప బడకుండునట్లు పరమ బొందెను. అది మొదలా దుష్టుడు నీటిలో నివాస మొనరించెను. అతడు ఒక మరుభూమిలో నిర్జల ప్రదేశములో) నొక పర్వతాకారమగు తాబేలుం జూచెను. అదుర్మతి వేడుక పడి యా కూర్మము మీదికెక్కెను. భగవంతుడు హరి యా కూర్మావతార మూర్తి వాని నెత్తికొని వేగముగ పాతాళ జలములం బ్రవేశించెను. వాని నా నీటిలో ముంచి గొప్ప కూర్మ శరీరముతో నా మహాకాయుని నాక్రమించి చంపి వేసెను. సాటిలేని దేవదేవుడగు నా విష్ణుని శత్రువైన యా భీమరథుడు నీటిలో నా సర్వదేవప్రధానుడైన కూర్మముచే గూల్పబడెను.

ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున నాల్గవ తామస మన్వంతర వర్ణనమను నూటడెబ్బదితొమ్మిదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters