Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటెఎనుబదినాల్గవ అధ్యాయము - నవమబ్రహ్మపుత్రమన్వంతరవర్ణనము శాంబరాయణీ - బ్రహ్మపుత్రస్యతుమనోర్నమనుస్య వమస్య సుతాన్ శృణు | ధృతికేతుర్దీ ప్తికేతుః పంచహస్తోనిరావృతిః ||
1 పృథుశ్రవా బృహద్యుమ్నబుచీకో బృహతాంగణః | బ్రహ్మపుత్రస్య తే పుత్రాః ఋషయశ్చ నిబోధమే ||
2 మేధాతిథిర్ద్యుతిశ్చైవ నవనో వసురేవచ | జ్యోతిష్మాన్హవ్యసత్యౌచ ఋషయః పరికీర్తితాః ||
3 పారామరీచి గర్భాశ్చ స్వధార్మాణశ్చ తేత్రయః | గణాద్వాదశకాః ప్రోక్తా యేషామింద్రో భవిష్యతి ||
4 విభుర్నామ మహాతేజాః సర్వ దేవేశ్వరో బలీ | దాయాదా బాంధవాస్తస్యయే భవిష్యన్తి ధార్మికాః ||
5 కాలకక్ష ఇతిఖ్యాత స్తేషాం రాజాభవిష్యతి | తస్మిన్ మన్వంతరే రాజా వసునాభో భవిష్యతి ||
6 పుత్రస్తు భవితా తస్య వాసుదేవో మహీపతిః | చక్రవర్తీ మహాతేజాః పద్మనాభ ఇతి శ్రుతః ||
7 దేవాసురే తు సంగ్రామే కాలకక్షం రణోత్కటమ్ | నరవధ్యం మహాతేజాః పద్మనాభో హనిష్యతి ||
8 శ##రేణ జాంబూనద భూషితేన బ్రహ్మస్త్ర యుక్తేన రణ ప్రచండమ్ | హత్వా೭సురం కాల సమ ప్రభావం రాజా స లోకస్య భయం నిహన్తా ||
9 ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శక్రశాంబరాయణీ సంవాదే నవమ బ్రహ్మపుత్ర మన్వంతర వర్ణనం నామ చతురశీత్యధిక శతతమో೭ధ్యాయంః. శాంబరాయణి యిట్లనియె : బ్రహ్మపుత్రుడగు నవమ మనువు యొక్క కొడుకులు - ధృతికేతువు దీప్తి కేతువు పంచహస్తుడు నిరాకృతి పృథుశ్రవుడు బృహద్ద్యుమ్నుడు బుచీకుడు బృహద్గణుడు ననువారు. ఇక సప్తర్షులు - మేధాతిథి ద్యుతి నవనుడు వసువు జ్యతిష్మంతుడు హవ్యుడు సత్యుడు ననువారు. పారులు మరీచి గర్భులు స్వధర్ములు ననువారు పన్నిద్దరుగల మూడు దేవగణములు. వారికింద్రుడు విభువనునాతడు కాగలడు. మహాతేజస్వి సర్వదేవేశ్వరుడు బలశాలియునగు ఆయన దాయాదులు బాంధవులు ధార్మికులు కాలకక్షుడు వారికి రాజగును. ఆ మన్వంతరాధినాధుడు వసులాభుదగును. అతనికి కుమారుడు వసుదేవుడను వాడు. చక్రవర్తి మహాతేజస్వి పద్మనాభుడను పేరొందును. దేవాసురయుద్ధమందు రణప్రచండుడై కాలకక్షుని నరునిచేత వధ్యుడగు వానిని పద్మనాభుడు చంపెను. బంగారముచే భూషితము బ్రహ్మాస్త్రాను సంధితమునైన బాణముచే రణప్రచండుడైన కాలునితో సమమైన ప్రభావముగల యా యసురుని జంపి యా రాజు లోకముయొక్క భయమును హరించును. ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున నవమబ్రహ్మపుత్ర మన్వంతర వర్ణనమను నూటయెనుబదినాల్గవ యధ్యాయము.